Jump to content

వాడుకరి చర్చ:Rajasekhar1961/పాత చర్చ 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Rajasekhar1961/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీ సభ్య పేజీలో [[వర్గం:వికీపీడియనులు]]ను చేర్చి వికీపీడియాలో మీ రచనలు మొదలు పెట్టండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

--మాటలబాబు 06:28, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

సాంప్రదాయక తిధులు

[మార్చు]

చైత్ర శుద్ధ అష్ఠమి‎ మొదలైన సాంప్రదాయక తిధులకు ఆంగ్ల రోజులగా పేజీలు సృష్టించాలన్న మీ ఆలోచన బాగుంది. కాకపోతే ఇవి ఎంతవరకు అర్ధవంతమైన పేజీలుగా మనగలుగుతాయోనని నా అనుమానం. అన్ని పేజీలు సృష్టించేముందు మిగిలిన సభ్యుల అభిప్రాయము కూడా తీసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడ ఏదైనా రాయటానికి ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు కానీ ఇది సలహా మాత్రమే. తెలుగు వికీ ఇలాగే మరిన్ని మంచి ఆలోచనలతో తోడ్పతారని ఆశిస్తున్నా --వైజాసత్య 06:10, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదములు,

మనలో చాలామందికి తెలుగు సాంప్రదాయ తిథులు తెలుసు. కానీ దీనిని ఇంగ్లీష్ లో లాగ సర్వసాధారణం అవాలి అని నా అభిప్రాయము. దానికి ఇది చిన్న ప్రారంభం. మీకు నా అభిప్రాయం నచ్చిందా. అయితే వీలయినంత సహాయం చెయ్యండి.Rajasekhar1961 06:22, 25 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

ఇవన్నీ కేవలం ఫ్రేంవర్కు వ్యాసాలే కాబట్టి ఒక బాటును ఉపయోగించి 10 నిమిషాల్లో సృష్టించవచ్చు కానీ ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు అర్ధం కావటం లేదు. మచ్చుకు ఒక వ్యాసాన్ని సమాచారంతో పూరించి చూపించండి --వైజాసత్య 06:43, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీలను placeholdersలాగా ఉంచేయవచ్చనుకుంటా, ప్రతీ పేజీలోనూ ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాల జాబితాలో ఎన్నో సంవత్సరంగా వస్తుందో రాయవచ్చు. తరువాత పురాణాలలో ఈ సంవత్సరంలో జరిగిన విశేషాలుంటే రాయవచ్చు. అలాగే ఆ సంవత్సరానికి అదే పేరును ఎందుకు పెట్టారో కూడా రాయవచ్చు. ఇక్కడి నుండి ఆంగ్ల సంవత్సరాలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. కృష్ణుడు మొదలయిన వారి పుట్టుక వివరాలు ఈ సంవత్సరాలలోనే పేరంటారు, వాటిని ఆంగ్ల సంవత్సరాలలో రాయలేము, అవికూడా ఇక్కడ చేర్చవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:19, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చను రచ్చబండకు మార్చాను. మీ అభిప్రాయాలను అక్కడ తెలుపండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:21, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండ లొ ఒక చర్చ వాక్యాన్ని రాసాను చూడండి--మాటలబాబు 16:22, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ చూశారా. చెప్పండి--మాటలబాబు 16:42, 25 జూన్ 2007 (UTC)--మాటలబాబు 16:42, 25 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు

[మార్చు]

నేను వ్రాసిన వాటిని సరియైన క్రమములో పెడుతున్నందుకు మీకు నా Thanks. నా నర్సింగ్ హోం పని భారమువలన నేను కొన్ని తప్పుగా వ్రాస్తున్నాను , వీలుంటే సరి చేయవలెను. Seshagirirao 16:27, 19 డిసెంబర్ 2007 (UTC)

వ్యాసాల కాపీ

[మార్చు]

ఆంగ్ల వికీలోనుండి వ్యాసాలు కాపీ చేసేటప్పుడు ఎడిట్ మోడ్ లోని వ్యాసాన్ని కాపీ చెయ్యండి. ఆ విధంగా కాపీ లోని మూలాలు, లింకులు పరిరక్షింపబడతాయి --వైజాసత్య 07:19, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిట్ మోడ్ లో కాపీ చెయ్యడము ఎలాగో చెప్పండి.Rajasekhar1961 07:29, 30 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

ఆ కాపీ చేసే ఆంగ్ల వ్యాసంలో Edit మీద నొక్కి అక్కడి టెక్స్టు సెలెక్టు చేసుకోండి. మీరు వ్యాసం పై నుండే కాపీ చేస్తున్నట్టున్నారు --వైజాసత్య 07:39, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు ఇలా రాస్తున్నందికు ఏమి అనికోవద్దు ఇప్పటికే చాలా వ్యాసాలు అనువదించడానికి పేరుకు పోయాయి. అవి అనువదించాక కొత్త వ్యాసాలు తెచ్చుకొంటే బాగుంటుందని నా అభిప్రాయాము--మాటలబాబు 11:03, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, అనువాదము కోరబడిన పేజీలు ఇప్పటికే 127 ఉన్నాయి. తగినంత మంది అనువాదకులు లేరు. కొన్ని వ్యాసాలు 2 సంవత్సరాల నుండి ఇంకా అనువాదం కాలేదు. మీరు ఇలా ఆంగ్లములోవి అంటిస్తే అవి ఇప్పుడప్పుడే అనువాదమము కావు. 10 కిలోబైట్లకు పైన ఉన్న వ్యాసాలలో ఇంకా చాలామటుకు ఇంగ్లీషు వ్యాసాలే ఉండటం తెలుగు వికీకి మచ్చలాగుంది. ఒకటి రెండు వారాలలో మీరు అనువదించ గలరు అని అనుకున్నవి మాత్రమే ఇక్కడ తెచ్చుకోవాలని మనవి --వైజాసత్య 14:32, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాదానికి పేజిలు తెచ్చారు కదా... వాటిని అనువదించండి. వాటిని వదిలి పెట్టకండి, అలా వదిలి వేస్తే అవి సంవత్సరాల తరబడి ఉండి పోతాతాయి. కాబట్టి తెచ్చిన పేజిల పని పట్టండి.--మాటలబాబు 13:27, 2 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]


telugu typing problem

[మార్చు]

నాకు ఒక సమస్య వచ్చింది.మీరు సహాయం చేయగలరా?

వికిపీడియాలో, వికిమూలములో నేను రాయగలుగుతున్నాను. కాని విక్షనరీలో మాత్రం తెలుగులో రావడములేదు. ఏదైనా మార్పులు చెయ్యాలంటే చెప్పండి. ధన్యవాదాలు.

ఇంగ్లీష్ - తెలుగు అనువాదం కోసం ఏదైనా డిక్షనరీ దొరుకుతుందా.రాజశేఖర్1961

మీ సమస్యని త్వరలొ పరిష్కరించగలమని ఆశిస్తున్నాను. ఇక్కడ మరియు తెలుగు మూలములు, వికీ సోర్సు లొ జావ ఏన్స్క్రెప్ట్ చేశాము కాని విక్షనరి ఇంకా చేయ లేదు కాబట్టి తెలుగు లొ రాయలేక పోతున్నారు, ఆ సదుపాయం త్వరలొ కల్పిస్తాము.

మీ కృషి బాగుంది అలానే కానివ్వండీ సుమా సాహితి నిఘంటువు ఉందికదా గొప్పగా ఉండదు కాని ఏదో ఉంటుంది ఇది ఇక్కడ చూడ వచ్చు --మాటలబాబు 08:35, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

2 రోజుల క్రితమే విక్షనరీలో కూడా ఈ స్క్రిప్టు అమలుపరిచాను. ఇప్పడు అక్కడ కూడా ఇలాగే సులువుగా తెలుగు రాయవచ్చు --వైజాసత్య 13:25, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పుట్టిన రోజు

[మార్చు]

రాజశేఖర్ గారు ఏలా ఉన్నారు, మరచి పోయాను మీ పుట్టిన రోజుకి శుభాకాంక్షలు అందించాలి అందించాలి అనే అనుకొంటూనే మరచి పోయాను, ఇంతకి నిన్న నా తెలుగు పుట్టిన రోజు, వెదవది రాత్రిళ్ళు పని చేయడం వల్ల పుట్టిన రోజు కుడా ఒక విశేషం కూడా లేకుండా పోయింది. వైజాసత్యాగారు నాకు పుట్టిన రోజు కి బహుమతిగా శ్రవణ తెవికి విశేషపతాకం ఇచ్చారు--మాటలబాబు 06:28, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షనరీ పదాలు

[మార్చు]
  1. వీక్షనరీలో మనం అన్ని భాషల పదాలకు తెలుగులో అర్ధాలు వివరించాలి. మీరు ఆంగ్ల వీక్షనరీని గానీ, ఫ్రెంచి వీక్షనరీని గానీ అమ్మ అనే పేజీని చేస్తే అర్ధమవుతుంది. అంటే ఆంగ్ల వికీలో అమ్మ అనే పదాన్ని ఆంగ్లంలో వివరిస్తారు, ఫ్రెంచి వికీలో అదే పదానికి అర్ధం ఫ్రెంచి భాషలో వివరిస్తారు. కాబట్టి ఆంగ్ల పదాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో వందల భాషల పదాలు తెలుగు వికీపీడియాలోకి చెరవచ్చు :). మరిన్ని వివరాలకు వీక్షనరీలో ఉన్న నా సభ్యపేజీని చూడండి. కాకపోతే ఇక్కడ నేను బాటుతో చేయించవలసిన పని ఇంకోటి ఉంది. ఈ పదాలన్నిటినీ ఆంగ్లపదాలు అనే వర్గంలోకి చేర్చటం.
  2. పదప్రయోగాలను బులెట్లతో వేరు చేయడం అనే ఆలోచన బాగుంది. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ డిక్షనరీలో పదప్రయోగాలను ఎలా వేరు చేస్తున్నారు అనే దానిని పరిశీలించటమే అన్నిటికన్నా పెద్ద పని నాకు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 11:51, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వ్యాసాలు

[మార్చు]

రాజశేఖర్ గారు, ఇలా ఆంగ్ల వికీనుండి వ్యాసాలను తీసుకుని రావద్దు. తరువాత అనువదించటానికి ఎవరూ ఉండరు. మీరు ఆ వ్యాసాలను సృష్టించాలని అనుకుంటే 5-6 వాక్యాల ఒక మొలకను సృష్టించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:17, 30 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఇంతకు ముందు తీసుకువచ్చిన రొమ్ము వ్యాసాన్ని ఇంకా అనువదించలేదు. మరి కొత్తగా తెచ్చినవాటిని ఎప్పుడు అనువదిస్తారు? అందుకనే 4-5 వాక్యాల మొలకను ప్రారంభించి, ఆంగ్లవికీ వ్యాసానికి interwiki లింకును ఇవ్వండి. అప్పుడు గుర్తుపెట్టుకుని అనువదించాల్సిన పని ఉండదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:36, 30 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక వేసేటప్పుడు ఆంగ్ల వికీ అంతర్వికి లింకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.--మాటలబాబు 13:23, 2 ఆగష్టు 2007 (UTC)

తరలింపులు

[మార్చు]

రాజశేఖర్ గారూ, శక్తి లాంటి వ్యాసాలు శక్తి (సినిమా) కు మార్చాలంటే కట్ పేస్ట్ చేయకుండా పైన ఉన్న తరలింపు ఉపయోగించండి. ఉదాహరణకు శక్తి వ్యాసంపైన చర్చ, మార్పు తరలించు వగైరా ఉన్నాయి కదా. అక్కడ తరలించు అని నొక్కి. ఎక్కడికి తరలించాలి అని అడిగితే శక్తి (సినిమా)అని రాయండి. వీలైతే సంబంధిత చర్చా పేజీని తరలించు అన్న దానికి టిక్కు పెట్టి తరలించెయ్యవచ్చు. వీలైనంత వరకు ఈ విధముగానే ఎందుకు చెయ్యాలంటే పేజీ యొక్క చరిత్రను, మార్పులను పరిరక్షించటానికి. ఇప్పుడు కాపీ, పేస్ట్ చెయ్యటం వలన శక్తి (సినిమా)లోని సమాచారం మీరు ఈ రోజు రాశారన్నట్టుగా ఉంది. దానిలోని సమాచారాన్ని ఎవరు ఎప్పుడు చేర్చారన్న సమాచారాన్ని కోల్పోయింది. --వైజాసత్య 06:10, 3 ఆగష్టు 2007 (UTC)

మీ వృత్తి

[మార్చు]

మీకు వైద్యానికి సంబంధం ఉన్నదా??--మాటలబాబు 16:32, 3 ఆగష్టు 2007 (UTC)

నేనొక వైద్యున్ని, వ్యాధినిర్ధారణలో నా ప్రత్యేక నైపుణ్యం.Rajasekhar1961 09:26, 4 ఆగష్టు 2007 (UTC)

అభిప్రాయాలు తెలుపండి

[మార్చు]

ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.

  1. వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట--మాటలబాబు 20:10, 4 ఆగష్టు 2007 (UTC)

వర్గాలు

[మార్చు]

రాజశేఖర్ గారూ, ఇప్పుడున్న వర్గాల స్వరూపము తెవికీ భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సృష్టించినవి. తేనెటీగను, ముక్కును కలిపి ఒకే పెద్ద వర్గములో చేర్చితే ప్రస్తుతము ఉన్న జీవశాస్త్రపు వ్యాసాలన్నీ ఒకే వర్గంలో చేరతాయి. ఇది సౌలభ్యం కోసం బాగుంటుందేమో కానీ ఇది తర్కబద్ధమైన వర్గీకరణ కాదు. జీవశాస్త్రము వర్గములో వ్యాసాలు పెరుగుతున్న కొద్ది మళ్ళీ మళ్ళీ వ్యాసాలును పునర్ వర్గీకరిస్తూ ఉండాలి (ఇది పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారం..చాలా తికమక అయ్యే పరిస్థితి రావచ్చు).

మీరు అన్ని ఒక దగ్గర చేర్చి అభివృద్ధి చేయాలంటే జీవశాస్త్రానికి ఒక ప్రాజెక్టును ప్రారంభిద్దాం మరియు సౌలభ్యం కొరకు ఇప్పటి వరకు ఉన్న జీవశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలన్నీ ఒక బాబితా పేజీ తయారుచేసుకుందాం. ఏమంటారు? మీ ఆలోచనలూ ఇక్కడ పంచుకోండి. మానవ శరీర భాగాల వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి చాలాబాగుంది --వైజాసత్య 11:47, 10 ఆగష్టు 2007 (UTC)

    • జీవ శాస్త్రము ప్రోజెక్టు ప్రారంబించడము మంచి పని. వెంటనే మొదలుపెట్టండి. దానికి సంబంధించిన వ్యాసాలన్నింటిని ఓక్కదగ్గర చేర్చండి. నేను తప్పకుండా కష్టపడి పనిచేస్తాను. ఒక మంచి మూసను కాడా తయారు చెయ్యాలి. దీనిలోని అన్ని విభాగాల్ని ముందు గుర్తంచాలి. ముఖ్యమైన అంశాలకు పేజీలు తయారుచెయ్యాలి. నేను తయ్యారుగా ఉన్నను.Rajasekhar1961 13:02, 10 ఆగష్టు 2007 (UTC)
జీవ శాస్త్రం ప్రాజెక్టు కు నేను రెడీ... (లేచిన లేడికి పరుగే పరుగు లా నేను రెడి)--మాటలబాబు 13:40, 10 ఆగష్టు 2007 (UTC)

is it true that TB does not spread to thyroid,hair and pancreas, in your experience did u see any biopsies that s/o TB of these organs.--మాటలబాబు 16:52, 10 ఆగష్టు 2007 (UTC)

మీరు వ్రాసిన భాగాలలో టి.బి. చాలా అరుదుగా వస్తుంది. నేను అలాంటి కేసులేమీ చూడలేదు.Rajasekhar1961 16:57, 10 ఆగష్టు 2007 (UTC)
నేనెప్పుడో బైయిలి అండ్ లవ్ లొ ఈ భాగాలలొ టి.బి. రాదని చదివి నట్లు గుర్తు , చదివి చాలా రోజులైయ్యింది కదా.. అసలేౙఞాపక శక్తి అంతంత మాత్రం--మాటలబాబు 17:08, 10 ఆగష్టు 2007 (UTC)

బైలీ లవ్ రెఫెరెన్స్ పుస్తకం కాదు. జుత్తు జీవంలేనిది. చర్మంకి టి.బి.వస్తుంది. థైరాయిడ్ కి ఇది రాకపోవడానికి కారణము రక్తసరఫరా దానిద్వారా ఆక్సిజన్ ఎక్కువగా ఉండడమే.Rajasekhar1961 17:16, 10 ఆగష్టు 2007 (UTC)

నేను అదే కారణం వల్ల ( రక్తసరఫరా దానిద్వారా ఆక్సిజన్ ఎక్కువగా) క్లోమము కి, థైరాయిడ్ కి రాదని చదివినట్లు గుర్తు.చర్మానికి వస్తుంది. లూపస్ వల్గారిస్ అని పిలుస్తారు కదా..--మాటలబాబు 17:19, 10 ఆగష్టు 2007 (UTC)

ఈ వారం వ్యాసము

[మార్చు]

ఒక వైద్యశాస్త్ర వ్యాస శీర్షికని ఆలోచించండి ఇద్దరం కలిసి ఈ వారం వ్యాసము క్రింద రూపొందేటట్లు చేద్దాం ఏమంటారు--మాటలబాబు 14:09, 27 ఆగష్టు 2007 (UTC)

    • జీవ శాస్త్రము ఇప్పుడే మొదలుపెట్టాం కదా కొంత పనిచేసిన తర్వాత ఆలోచిద్దాం.Rajasekhar1961 14:17, 27 ఆగష్టు 2007 (UTC)
    • ఈ వారం వ్యాసం గురించి ఆలోచించాను. జీవ శాస్త్రములో అన్నింటికన్నా ముఖ్యమైనవి జంతువులు, వృక్షాలు వీటిని పూర్తి వ్యాసాలుగా మారిస్తే మనపనికి మంఛి పునాది అవుతుంది.Rajasekhar1961 09:31, 28 ఆగష్టు 2007 (UTC)

మొలకలు

[మార్చు]

రాజశేఖర్ గారూ! జీవ శాస్త్రం వ్యాసాలకు ఊపిరి పోస్తున్నందుకు అభినందనలు. నావి కొన్ని సూచనలు. (1) కాస్త ఆలస్యమైనా మీరు మొదలు పెట్టిన వ్యాసం 10 కిలోబైట్లకు తగ్గకుండా ఉండేలా ప్రయత్నించండి. ఇప్పటికే చిన్న వ్యాసాలు చాలా మనకు నామోషీగా ఉన్నాయి. (2) ఇంతకు ముందు చర్చించినట్లుగా ఏవైనా 2,3 వ్యాసాలను ఈవారం వ్యాసాలుగా చేయడానికి ఎన్నుకొనండి. వాటిని అందరం కలిసి అభివృద్ధి చేద్దాము. - --కాసుబాబు 08:12, 28 ఆగష్టు 2007 (UTC)

రాజ శేఖర్! జీవ శాస్త్రం వ్యాసాలను దాదాపు ఒక్కచేతితో లాగిస్తున్నారు. మీ దీక్షకు మరోసారి నా అభినందనలు. జంతువు వ్యాసాన్ని తరువాతి 44వ వారం వ్యాసంగా పెడతాను. ఒక పోతే చెట్టు అనే ఒక వ్యాసం ఇప్పటికే ఉంది. వృక్షము అంటే మీ వుద్దేశ్యంలో Plant Kingdom కు సంబంధించిన వ్యాసమా! --కాసుబాబు 13:07, 12 సెప్టెంబర్ 2007 (UTC)

ఆవర్తన పట్టిక

[మార్చు]

మూలకము వ్యాసంలో ఆవర్తన పట్టికను సరిచేశాను. ఆవర్తన పట్టికకు మార్పులుచేర్పులు విస్తృత ఆవర్తన పట్టిక వ్యాసంలో చెయ్యాలి. --వైజాసత్య 09:45, 31 ఆగష్టు 2007 (UTC)

వైద్యశాస్త్రములోని వ్యాధులు, శరీరభాగాలకు సంబంధించిన ICD codes చాలా ముఖ్యం. వీటి తెలుగు పేర్లు, లింకులు, సమాచారము నెమ్మదిగా మనం చేర్చవచ్చును. అలాగే Gray's Anatomy నుండి శరీర నిర్మాణ శాస్త్రము సంబంధించిన మంచి బొమ్మలు చేర్చినచో సమాచారం పూర్తిగా ఉంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 15:23, 6 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు en:ICD-10 గురించేకదా చెబుతున్నది. 10 ఒకటి చేర్చితే సరిపోతుందనుకుంటా ఆంగ్లవికీలో 9, 9-CM కూడా ఉన్నాయి కానీ అవి అనవసరం అనుకుంటా. ఏమంటారు? గ్రేస్ అనాటమీ బొమ్మలన్నీ కామన్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని నేరుగా ఇక్కడ అప్లోడ్ చేసుకోకుండా వినియోగించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చెయ్యటమెందుకు..దీని గురించి నాకు అంత స్పష్టంగా అర్ధం కాలేదు..కాస్త వివరించండి. అన్ని అవయవాలకు సమాచారపెట్టెలు చేర్చుదామనా మీ ఉద్దేశ్యం? --వైజాసత్య 15:36, 6 సెప్టెంబర్ 2007 (UTC)
రాజశేఖర్ గారూ, దీనికి మీరు ఇంకా జవాబివ్వలేదు. సరిగా అర్ధం చేసుకున్నానో లేదో తెలిస్తే పని ప్రారంభించవచ్చని నా అభిప్రాయం. --వైజాసత్య 04:37, 17 సెప్టెంబర్ 2007 (UTC)
  • క్షమించండి. నేను మీ సమాధానం గమనించలేదు. en:ICD-10 సరిపోతుంది. దీనిలో చాలావరకు వ్యాధులు, లక్షణాలు, అవయవభాగాలు అన్నీ ఉన్నాయి. సరిపోకపోతే తరువాత ఆలోచిద్దాం. గ్రేస్ అనాటమీ బొమ్మలు తెవికీలోకి మార్చనవసరంలేదు. అన్ని అవయవాలకు బాగాలకు సమాచారపెట్టెలు ఇస్తే బాగుంటుందని నాఅబిప్రాయం. వ్యాధులపేర్లు మీకు తెలిసినవి ఉంటే కోడ్లు మార్చిన తర్వాత మెల్లిగా అనువాదం చెయ్యవచ్చును కదా. Thanks for the ICD codes help.Rajasekhar1961 04:52, 17 సెప్టెంబర్ 2007 (UTC)
ICD-10 ఇక్కడికి తీసుకొచ్చాను. ఇందులోని వివిధ అధ్యాయాల పేర్లు తెలుగులో అనువదించిన తర్వాత మిగిలిన పేజీలు ఆ లింకుల్లోకి తీసుకునివస్తాను --వైజాసత్య 18:25, 17 సెప్టెంబర్ 2007 (UTC)
వైద్య శాస్త్రం ప్రాజెక్ట్ నిర్వహించవలసిందే ఏమంటారు--మాటలబాబు 09:50, 21 సెప్టెంబర్ 2007 (UTC)

నిర్వాహక హోదా

[మార్చు]

రాజశేఖర్ గారు, నేను మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. ఇక్కడ అంగీకారము తెలుపగలరు --వైజాసత్య 20:34, 10 అక్టోబర్ 2007 (UTC)

రాజశేఖర్ గారు, తెవికీలో నిర్వాహకులైన సందర్భంగా అభినందనలు --వైజాసత్య 21:18, 17 అక్టోబర్ 2007 (UTC)
రాజశేఖర్ గారికి నిర్వాహకులైన సందర్భంగా శుభాకాంక్షలు--బ్లాగేశ్వరుడు 22:59, 17 అక్టోబర్ 2007 (UTC)
రాజశేఖర్ గారూ, అభినందనలు! వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు పేజీలో నిర్వాహకత్వ విధి విధానాల గురించిన సమాచారమూ కొన్ని లింకులూ ఉన్నాయి. అవి మీకు ఉపయోగపడవచ్చు. _చదువరి (చర్చరచనలు) 02:48, 18 అక్టోబర్ 2007 (UTC)

గుడి

[మార్చు]

రాజశేఖర్ గారు;నేను గర్భ గుడి గురించి రాసిన సందర్బం వేరు,అది తప్పుగా వుంటే సరిదిద్ది రాసాను.'దాని కంటే ముందు వేరే వి లేవు అవి రాయండి 'అనటం లో మీ ఆంతర్యం నాకు అర్దం కాలేదు.Ramyageethika 16:38, 25 అక్టోబర్ 2007 (UTC)

రంగు

[మార్చు]

మీరు రంగును రంగుల పట్టికగా మార్చాలనుకుంటే మార్చండి.దేవా 10:18, 6 నవంబర్ 2007 (UTC)

తెవికీ అభివృద్ధి

[మార్చు]

తెవికీ అభివృద్ధి మనందరి బాధ్యత. నన్ను, బి.కె.విశ్వనాథ్ లను నిర్వాహకులు చేయడం మాకిద్దరికి నచ్చింది. కానీ మాకున్న నిర్వహక అనుభవం తక్కువ. మీలాంటి అనుభవజ్ఞులు మాకు తోడ్పడారని నా ఆకాంక్ష. మీరు ఈ మధ్యన తెవికీలొ కనిపించడం లేదు. మీరులేకుండా కష్టం అనిపిస్తుంది.Rajasekhar1961 06:10, 21 నవంబర్ 2007 (UTC)

మీ అభిమానానికి కృతజ్ఞతలు. నిర్వహణ వ్యవహారాలు చూసుకోవటానికి కాసుబాబు, ప్రదీపు, చదువరి గార్లు ఉన్నారుగా. నేను వికీనుండి తప్పుకోవట్లేదు. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు గట్రాతో కాస్త బిజీగా ఉన్నాను అంతే. రోజూ కనీసం ఒకసారైనా వికీని సందర్శించి ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాను. మీ కోరిక మేరకు రోజులో కొంత సమయాన్నైనా వికీకి కేటాయిస్తాను. --వైజాసత్య 17:17, 21 నవంబర్ 2007 (UTC)
రాజశేఖర్ గారు {{వారం రోజులు}} తయారయ్యింది. దేవా/DeVచర్చ 05:56, 24 నవంబర్ 2007 (UTC)


Please, could you translate this article onto the language of this Wikipedia? Thanks for your help. If you wanna translate your city onto Aragonese, Spanish, Catalonian, Galician o Asturian language, tell it to me, please. --85.54.141.142 15:32, 12 డిసెంబర్ 2007 (UTC)

సినిమా పాటలు

[మార్చు]

రాజ శేఖర్! చాలా కాలంగా బూజుపట్టిన సినిమా వ్యాసాలకు పాటల వివరాలు జోడిస్తున్నావు. అభినందనలు. నీ చేతికి ఒక పుస్తకం దొరికితే తెలుగు వికీలో ఒక వంద వ్యాసాలు తయారైనట్లే! --కాసుబాబు 09:04, 2 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చేస్తున్న పనిని గుర్తించినందుకు ధన్యవాదాలు. వికీపీడియా నిబంధనల ప్రకారం పూర్తిపాట వ్రాయవచ్చునా అనేది నా సందేహం. దయచేసి నా సందేహ నివృత్తి గావించండి.Rajasekhar1961 09:13, 2 జనవరి 2008 (UTC)
పూర్తి పాటలు వ్రాయవద్దు. (కాపీ హక్కుల ప్రకారం అది తగదు) అయితే ఒకటి టెండు చరణాల వరకూ సముచితమే. వీలుంటే గాయకులు, రచయితల పేర్లు వ్రాయొచ్చు. అంతులేని కధ ఒకమారు చూడుము. --కాసుబాబు 10:30, 2 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

త్రినాథ వ్రత కల్పం గురించి.

[మార్చు]

రాజశేఖర్ గారూ,

మీరు త్రినాథ వ్రతకల్పం గురించి వ్రాసే వ్యాసం అసలీ వ్రతమేమిటి? ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? ఏ సమయంలో చేస్తారు? చరిత్ర ఏమిటి?

మొన్నగు విషయాలు ఉంటే విజ్ఞాన సర్వస్వమునకు తగిన వ్యాసముగా ఉంటుంది. వ్రత కథ వంటివి మనము వికీ సోర్స్ లో వ్రాయాలి. గమనించగలరు. Chavakiran 09:09, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

[మార్చు]

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 08:57, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా దిద్దుబాట్లు

[మార్చు]

రాజశేఖర్ గారూ! నేను ఎన్ని దిద్దుబాట్లు చేశానో చెప్పగలరా! నిర్వాహక హోదాకై విజ్ఞప్తి పేజీలో ఏదో ఒక లింకు ఇచ్చారు గానీ అది పని చేయడం లేదు. రవిచంద్ర 12:04, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి కొంచెం సహాయం చేయండి. రవిచంద్ర 13:26, 19 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు. మీరు సినిమా వ్యాసాలు వ్రాసేటప్పుడు, ఒక లైన్ introduction వ్రాస్తే బావుంటుంది. నేను నాదీ ఆడజన్మే కి వ్రాసాను చూడండి. సాయీ(చర్చ) 11:32, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్ల సారాంశము వ్రాయండి

[మార్చు]

రాజశేఖర్! మీ దిద్దుబాట్లలో నేను గమనించిందేమంటే మీరు దిద్దుబాటు సారాంశం వ్రాయడానికి అలవాటు పడలేదు. దిద్దు బాటు చేసిన తరవాత భద్రపరిచే ముందు పెట్టె క్రింది భాగంలో "సారాంశము" ప్రక్క డైలాగ్ బాక్స్ లో సారాంశం క్లుప్తంగా వ్రాస్తే ఉపయోగ కరంగా ఉంటుంది. మీరు చేసిన పని ఏమిటో ఆ వ్యాసం తెరవకుండానే ఇతరులకు అవగాహన వస్తుంది. ఇది నిర్వహణలో చాలా ఉపయోగం. ఉదా: "ఆంగ్ల భాగం తొలగింపు", "అక్షర దోషాల సవరణ", "విస్తరణ", "అనువాదం", "మూస తొలగింపు", "అంతర్వికీ లింకులు" ఇలా.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:44, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటి పేర్లు, చిన్న వ్యాసాలు

[మార్చు]

రాజ శేఖర్, ఇలా ఇంటి పేర్లతో వ్యాసాలు మొదలు పెడితే ముందు ముందు సమస్యలు రావచ్చును. అంతే గాకుండా ఇందులో పెద్దగా విషయం ఏమీ ఉండదనుకొంటాను. ప్రతి ఒకరూ వారి ఇంటిపేరు, వారి కుటుంబ సభ్యుల పేర్లు వ్రాయడం మొదలు పెడితే అది టెలిఫోన్ డైరెక్టరీలాగా అవుతుంది. "ప్రముఖులు" అన్న మాటకు ఎలా కట్టుబడి ఉండగలం? ఉదాహరణకు ఒకరు "ప్రముఖులు" అనే సెక్షన్ బదులు "ఈ ఇంటి పేరుగల వోటర్లు" అని సెక్షన్ మొదలు పెడితే? అసలే చిన్న వ్యాసాల సమస్య మనకు అతిగా ఉంది. అందుకే నేను ఇలాంటి వ్యాసాలు మొదలుపెట్టవద్దని తెలుగునాట ఇంటిపేర్ల జాబితా అనే వ్యాసం మొదట్లో ఒక సూచన వ్రాశాను.

ఇప్పటికే సృష్టించిన వ్యాసాలు కూడా తొలగించడమే మంచిదని నా అభిప్రాయం.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:54, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని ఇంటి పేర్లకు పేజీలు తయారుచెయ్యడం నా ఉద్దేశం కాదు. కొందరు ప్రముఖుల పేర్లు మాత్రమే, అయోమయ నివృత్తి పేజీలలో మాదిరిగా పేజీలు తయారు చేసి, వాటి ఉత్పత్తి మొదలైన విషయాలు వీనిలో చేర్చడమే మంచిదని నా అభిప్రాయం. ఇక కొత్తపేజీలో చాలా అవసరం అయితేనే తయారుచేస్తాను.Rajasekhar1961 09:53, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్! గ్రంధి (అయోమయ నివృత్తి) వంటి పేజీలగురించి ఈ విషయం గమనించగలవు - రెండు పేజీలే ఉంటే అయోమయనినృత్తి పేజీ అంత అభిలషణీయం కాదు. en:Wikipedia:Manual of Style (disambiguation pages) లో ఇలా ఉన్నది - some disambiguation pages with "(disambiguation)" in the title list only two meanings, one of them being the primary meaning. In such cases, the disambiguation page is not strictly necessary, but is harmless. The recommended practice is to use a hatnote on the article for the primary meaning to link directly to the secondary meaning. -

ఇందుకు మెరుగైన విధానం ఏమంటే

  • గ్రంధి ప్రధాన వ్యాసం. ఆ వ్యాసంలో తెలుగువారి ఇంటిపేరు కోసం గ్రంధి (ఇంటి పేరు) చూడండి అని ఒక పైనోటు పెట్టవచ్చును. కావాలంటే ఉల్టాగా కూడాను.
  • ఇందుకు {{ఇతరవాడుకలు}} అనే మూస వాడవచ్చును. అది గ్రంధి వ్యాసం పైన ఇలా వ్రాయొచ్చును.

{{ఇతరవాడుకలు|శరీరంలో స్రవించే భాగాలు|ఇదే విధమైన ఇంటిపేరు|గ్రంధి (ఇంటి పేరు)}}


ఇలా చేస్తే గ్రంధి (అయోమయ నివృత్తి) పేజీ అవుసరం ఉండదు. ఎందుకంటే ఎవరూ "గ్రంధి (అయోమయ నివృత్తి)" అనే పేజీకోసం వెతుకరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:49, 22 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

[మార్చు]

రాజశేఖర్ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:30, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న వ్యాసాలు వద్దండీ

[మార్చు]

రాజశేఖర్ గారు, మీరు చాలా వరకు చిన్న వ్యాసాలు సృష్టిస్తున్నారు. అలా చేయకండి. ఇప్పటికే తెవికీలో ఉన్న చిన్న వ్యాసాలు తగ్గించడానికి ఒక వైపు కృషి జరుగుతోందనేది మీకు తెలుసు. ఇటీవల మీరు సృష్టించిన పడగ, సంచి, కుండ, పాట లాంటి వ్యాసాలు, వ్యాసాలు అనదగ్గ స్థాయిలో కాకుండా నిఘంటువులో అర్థం చెప్పే స్థాయిలో ఉన్నాయి. నలుగురు చూసి నవ్వుకొనే విధంగా కాకుండా గర్వపడే విధంగా వ్యాసాలు తయారుచేద్దాం. వ్యాసాల సంఖ్య మనకు ముఖ్యం కాదు నాణ్యతే ముఖ్యమని నమ్ముదాం. కొత్తగా సృష్టించే వ్యాసం కనీసం 2 కె.బి.లు ఉండేటట్లు చేస్తే బాగుంటుంది. నా ప్రతిపాదనను మన్నిస్తారని భావిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:28, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

జీవ శాస్త్రం వ్యాసాల జాబితా

[మార్చు]

రాజశేఖర్!, (1)అనతికాలంలోనే పది వేల దిద్దుబాట్లు చేసినందుకు అభినందనలు. నేను బహూకరించిన గండపెండేరం మీకు నచ్చిందనుకొంటాను (2) జీవ శాస్త్రం వ్యాసాల జాబితా అనేది ఏదైనా ఇప్పటికే ఉందా? లేకుంటే మీరు చేయడం మంచిది. ఆ వ్యాసాలలో తెలుగు వ్యాసం పేరు ప్రక్కనే ఆంగ్లం పేరు కూడా ఉంటే (నాలాంటి వారికి) బాగుంటుందనుకొంటున్నాను. (3)మీ చర్చా పేజీ బాగా పొడవయ్యింది. పాత చర్చలను నిక్షిప్తం చేస్తే మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:36, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


గండపెండేరము

[మార్చు]

రాజశేఖర్ గారూ నమస్తే! అలుపెరుగకుండా వ్రాస్తున్నారు, పదివేల కూర్పులనూ దాటారు, కాసుబాబుగారు బహూకరించిన 'గండపెండేరము' మీకు ముబారక్ హో, మీ సంతోషంలో నేనూ పాలు పంచుకుంటున్నాను, మిత్రుడు, nisar 14:00, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చల నిక్షిప్తం

[మార్చు]

రాజ శేఖర్ గారూ మీ పాత చర్చలను నన్ను నిక్షిప్తం చేయమంటారా? మీ అనుమతితోనే సుమా! రవిచంద్ర(చర్చ) 14:08, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]