వాడుకరి చర్చ:Rajasekhar1961/పాత చర్చ 2
|
నిసార్ అభివందనలు
[మార్చు]- రాజశేఖర్ గారూ నమస్కారం, అలుపెరుగకుండా వ్రాస్తున్నారు, భేష్, పదివేల దిద్దుబాట్లు కూడా పూర్తి చేశారు, ఈ సందర్భాన కాసుబాబు గారిచ్చిన 'గండపెండేరము' మీకు 'ముబారక్ హో'. మిత్రుడు Nisar 14:13, 6 మే 2008 (UTC)
ఆచార్యుడు
[మార్చు]రాజశేఖర్ గారు నమస్కారం..ఉపాధ్యాయుడు , గురువు , అచార్యుడు దగ్గర పొలిక ఉన్న పదాలు ఐనా సమానార్దము గల పదాలు కావు.వీటిలొ తాత్విక భేదము ఉందనుకుంటున్నాను.వివరించడానికి ప్రయత్నిస్తాను.-మీ సహచరుడు రాంమోహన్.
A little help: Ecser (ఎఛఎర్ - if I write it well)
[మార్చు]Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages (now it is already in 40 languages), but I can't speak Telugu. Could you help me? My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile. Or my e-mail is: eino@freemail.hu
Thank you! Norbert
భట్టిప్రోలు స్తూపం
[మార్చు]కాసుబాబు గారికి నాలుగు బొమ్మలు పంపాను. మీ శ్రద్ధ కు ధన్యవాదాలు.Kumarrao 12:23, 10 జూన్ 2008 (UTC)
ఇది నా పెద్దల నుండి తెలుసుకొన్నది.కానీ వీటి మూలాలు తెలియదు.కానీ చోడవరం శివాలయం లో దొరికిన రాజేంద్రచోడుని శిలాశాసనం రామచంద్రపురం(మండల కేంద్రం)లోని వి.ఎస్.ఎమ్.కాలేజ్ లోని చరిత్ర విభాగం లోని నేటికీ మనం చూడవచ్చు.
నియోజక వర్గాలు
[మార్చు]ఈ లింకులో ఇచ్చిన నంబర్లు ఒకసారి చూడండి. ఇవి కరెక్టేనా? కరెక్టయితే ఆ మ్యాప్ ఆధారంగా నియోజకవర్గాలకు నంబర్లు చేర్చవచ్చు. δευ దేవా 09:25, 2 జూలై 2008 (UTC)
- ఈ లింకులోని నంబర్లు కొత్తవా లేదా పాతవా తెలియడము లేదు.Rajasekhar1961 09:37, 2 జూలై 2008 (UTC)
- రాజశేఖర్ గారూ, ఈ లింకును చూడండి, డీలిమిటేషన్ తరువాత గెజిట్ లో ఇవ్వబడిన నెంబర్లు ఇవి. నేను ఇక్కడినుండే సేకరించాను. 22-1-2007 తేదీన ఇవ్వబడిన గెజిట్ నోటిఫికేషన్ ఇది.[1]. నిసార్ అహ్మద్ 12:01, 2 జూలై 2008 (UTC)
- రాజశేఖర్ గారూ! ధన్యవాదాలు. నేను చేసిన విధాన్ని క్రింద వివరిస్తున్నాను.
నేను వాడిన మూస ఈ క్రింద చూపిస్తున్నాను. అందులో చేయవలసిన మార్పులు ఆ మూస క్రింద వ్రాస్తున్నాను.
{{Infobox Settlement |name = కుప్పం |native_name = |nickname = |settlement_type = శాసనసభ నియోజకవర్గం |motto = <!-- images and maps -----------> |image_skyline = |imagesize = |image_caption = |image_flag = |flag_size = |image_seal = |seal_size = |image_shield = |shield_size = |city_logo = |citylogo_size = |image_map = Kuppam assembly constituency.png |mapsize = 200px |map_caption = |image_map1 = |mapsize1 = |map_caption1 = |image_dot_map = |dot_mapsize = |dot_map_caption = |dot_x = |dot_y = |pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ |pushpin_label_position = right |pushpin_map_caption = |pushpin_mapsize = 300 <!-- Location ------------------> |subdivision_type = [[దేశము]] |subdivision_name = [[భారత దేశం]] |subdivision_type1 = [[రాష్ట్రం]] |subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]] |subdivision_type2 = [[జిల్లా]] |subdivision_name2 = [[చిత్తూరు]] <!-- Politics -----------------> |government_foonotes = |government_type = |leader_title = [[శాసనసభ సభ్యులు]] |leader_name = [[నారా చంద్రబాబు నాయుడు]] |leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager --> | = |leader_title2 = |leader_name2 = |established_title = |established_date = |established_title2 = <!-- Incorporated (town) --> |established_date2 = |established_title3 = <!-- Incorporated (city) --> |established_date3 = <!-- Area ---------------------> |area_magnitude = |unit_pref = |area_footnotes = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_total_sq_mi = |area_land_sq_mi = |area_water_sq_mi = |area_water_percent = |area_urban_km2 = |area_urban_sq_mi = |area_metro_km2 = |area_metro_sq_mi = |area_blank1_title = |area_blank1_km2 = |area_blank1_sq_mi = <!-- Population -----------------------> |population_as_of = |population_footnotes = |population_note = |population_total = |population_density_km2 = |population_density_sq_mi = |population_metro = |population_density_metro_km2 = |population_density_metro_sq_mi = |population_urban = |population_density_urban_km2 = |population_density_urban_sq_mi = |population_blank1_title = |population_blank1 = |population_density_blank1_km2 = |population_density_blank1_sq_mi = <!-- General information ---------------> |timezone = |utc_offset = |timezone_DST = |utc_offset_DST = | latd= 12.75 | latm= | lats= | latNS= | longd= 78.37 | longm= | longs= | longEW= |elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags --> |elevation_m = |elevation_ft = <!-- Area/postal codes & others --------> |postal_code_type = <!-- enter ZIP code, Postcode, Post code, Postal code... --> |postal_code = |area_code = |blank_name = |blank_info = |blank1_name = |blank1_info = |website = |footnotes = }}
పై మూసలో చాలా విషయాలు చేర్చవచ్చు అవి మెల్లమెల్లగా దొరికినప్పుడు చేర్చుకుంటూ పోవచ్చు. మీరు ఈ మూసను వేరే నియోజకవర్గానికి వాడడానికి ఈ క్రింద సూచించిన విధంగా చేయండి.
- image_map దగ్గర Kuppam assembly constituency.png కి బదులు ఆ నియోజకవర్గం మ్యాపును ఉంచండి. ఈ మ్యాపు తయారుచేయడానికి, నేను జిల్లామ్యాపును కాపీ చేసుకొని నియోజకవర్గంలోని మండలాలకు మళ్ళీ రంగులేసాను. దీనికి నేను మైక్రోసాఫ్ట్ పెయింట్ వాడాను. అందులో fill colour toolతో ఈ మ్యాప్ తయారుచేయవచ్చు. తెలుపు రంగు వాడి తుడిపివేయడం కావాలసిన రంగు వాడి మండలాలకు రంగులు నింపడం చేయవచ్చు.
- ఇక పుష్‌పిన్ మ్యాప్ కొరకు మన తెవికీలో ఉన్న మూస:Location map ఆంధ్ర ప్రదేశ్ వాడాను. పై మూసలో 'pushpin_map = ఆంధ్ర ప్రదేశ్' అని ఇప్పటికే ఉంది, ఈ మ్యాప్ కొరకు మీరు చేయవసిందల్లా అక్షాంశ రేఖాంశాలు తెలపడమే. ఉదాహరణకు పై మూసలో ఉన్న '| latd= 12.75 | latm= | lats= | latNS=
| longd= 78.37 | longm= | longs= | longEW=' చూడండి.
- మీరు గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మూసను అంటించి ప్రయత్నించండి.
- బొమ్మ:Gangadharanellore assembly costituency.png బొమ్మను వాడండి.
- latd = 13.3, longd= 79.2 అని మార్చండి.
- మిగతా మార్పులు (తెలుగులో ఉన్నవి) ఆ నియోజకవర్గానికి అనుగుణంగా మీరు చేయగలరు.
- మీకేమైనా ఇంకా సందేహాలుంటే అడగండి.
δευ దేవా 08:48, 10 జూలై 2008 (UTC)
నియోజకవర్గాల వ్యాసాలు
[మార్చు]రాజశేఖర్ గారూ, నియోజకవర్గాలు మరియు ఎంపీల వ్యాసాలపై కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మామూలు HTML పట్టికలను వికీపట్టికలుగా మార్చటానికి మీరు ఈ లింకు కొంతవరకు ఉపయోగపడుతుంది. --వైజాసత్య 18:26, 26 జూలై 2008 (UTC)
మీ కృషి అద్వితీయం
[మార్చు]రాజశేఖర్ గారూ నమస్తే, మీ కృషి శ్లాఘనీయమండి. మీ కృషిని చూస్తే, అలనాటి ఋషులు జ్ఞాపకమొస్తారు. సత్యం చెప్పాలంటే, మీకు, చంద్రకాంతరావు గారికి, కాసుబాబు గారికి, వికీ తపస్వి బిరుదు సరిపోతుంది. మీ ముగ్గురి కృషిని చూసి మనసారా ఆనందపడుతున్నాను. మిత్రుడు నిసార్ అహ్మద్ 16:00, 28 జూలై 2008 (UTC)
కామన్స్ లోకి బొమ్మల కాపీ
[మార్చు]Image:Kitchen table.jpg దీనిని కామన్స్ లోకి కాపీ చేయడం తెలపండి. మేజా పేజీలో దీని అవసరం ఉన్నది.Rajasekhar1961 14:47, 14 అక్టోబర్ 2008 (UTC)
- ఇలా చేయవచ్చును. ఆంగ్ల వికీలో ఆ బొమ్మలో {{copy to commons}} అనే మూస ఉంచండి. అప్పుడు "Copy to Commons via CommonsHelper" అనే లింకు వస్తుంది. ఆ లింకును అనుసరిస్తే కామన్స్‌లోకి అప్‌లోడ్ చేయవచ్చును. అయితే మీకు కామన్స్‌లో సభ్యత్వం ఉండాలి. ప్రస్తుతానికి నేను అప్‌లోడ్ చేశాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:45, 14 అక్టోబర్ 2008 (UTC)
లింకు చూడండి
[మార్చు]రాజశేఖర్! మీరు పార్లమెంటు సభ్యుల పేజీలలో ఇస్తున్న Official biographical sketch in Parliament of India website అనే లింకు పని చేయడం లేదు. ఒక మారు చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:33, 2 ఆగష్టు 2008 (UTC)
అనువాదం
[మార్చు]బొమ్మ:Scientific_classification.pngలో ఉన్న పదాలను తెలుగులోకి అనువదిస్తే, నేను ఆ బొమ్మను తెలుగులోకి మార్చగలను. చర్చసాయీరచనలు 09:57, 20 ఆగష్టు 2008 (UTC)
- ధన్యవాదాలు. Species - జాతి ; Genus - ప్రజాతి ; Family - కుటుంబం ; Kingdom - రాజ్యం ; Class - విభాగం ; Order - క్రమం ; Phylum - వర్గం ; ఈ పదాలు జంతుశాస్త్ర నిఘంటువు నుండి సేకరించాను. ఒక్క Domain కి తెలుగులో ఏమంటారో తెలియలేదు. ఈ విధంగా బొమ్మను మార్చండి. సంబంధిత పేజీలను కూడా మార్చండి.Rajasekhar1961 10:28, 20 ఆగష్టు 2008 (UTC)
బొమ్మ:Test_Sci_Classif.png చూడండి. Domain ని కూడా అనువదిస్తే నేను మార్చి కామన్స్ లో కి అప్లోడ్ చేస్తాను. చర్చసాయీరచనలు 13:48, 20 ఆగష్టు 2008 (UTC)
- Domain అంతగా ప్రాముఖ్యమున్నది కాదు. కాబట్టి దానిని తొలగించే వీలుంటే తీసేసి కామన్ లోనికి అప్ లోడ్ చెయ్యండి. బొమ్మ చాలా బాగుంది.Rajasekhar1961 13:53, 20 ఆగష్టు 2008 (UTC)
Image:Scientific classification Telugu.png చూడండి. కృతజ్ఞతలు. చర్చసాయీరచనలు 01:58, 21 ఆగష్టు 2008 (UTC)
- బొమ్మ చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. అన్ని పేజీలలో స్థాపించండి.Rajasekhar1961 08:03, 21 ఆగష్టు 2008 (UTC)
కృతజ్ఞతలు. నాకు జేవ శాస్త్రంలో సున్నా! కాబట్టి మీరే స్థాపించండి. ఇలాంటి బొమ్మలు ఇంకేమైనా ఉంటే చెప్పండి తెలుగులోకి మారుస్తాను. చర్చసాయీరచనలు 12:23, 21 ఆగష్టు 2008 (UTC)
- Image:Leaf anatomy.svg ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. ప్రధానమైన బొమ్మను అలాగే ఉంచి లిపిని మాత్రమే మార్చే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. మీరు చేయగలరేమో చెప్పండి.Rajasekhar1961 12:46, 21 ఆగష్టు 2008 (UTC)
Image:Leaf anatomy.svgలో లిపిని మాత్రం మార్చగలను. కాకపోతే, .pngగా మార్చవలిసి ఉంటుంది. ఎందుకంటే, .svgలో తెలుగు ప్రస్తుతానికి రాదు. చర్చసాయీరచనలు 01:02, 22 ఆగష్టు 2008 (UTC)
- Image:Test leaf anatomy.png లా ఉంటుంది. అనువదిస్తే మార్చేస్తాను. చర్చసాయీరచనలు 01:08, 22 ఆగష్టు 2008 (UTC)
- చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. అనువాదం ఈ విధంగా చెయ్యండి.
- Cuticle - అవభాసిని
- Upper epidermis - ఊర్ధ్వ బాహ్యచర్మం
- Lower epidermis - అథో బాహ్యచర్మం
- Stoma - పత్రరంధ్రం
- Guard cells - రక్షక కణాలు
- Vascular bundle - నాళికా పుంజాలు
- Xylem - దారువు
- Phloem - పోషక కణజాలం
- Palisade Mesophyll - స్థూపాకార కణాలు
- Spongy Mesophyll - హరిత రేణువులు
మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.Rajasekhar1961 07:32, 22 ఆగష్టు 2008 (UTC)
బొమ్మ రెడీ! నేను కూడా మరో సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐనా ఈ ధన్యవాదాలు, కృతజ్ఞతలు అవసరమంటారా? చర్చసాయీరచనలు 11:01, 22 ఆగష్టు 2008 (UTC)
- బొమ్మ చాలా బాగుంది. పత్రం వ్యాసంలో ఉంచుతున్నాను. ఒకసారి చూసి ఆనందించండి.Rajasekhar1961 11:08, 22 ఆగష్టు 2008 (UTC)
అనువాదంతో బొమ్మ చాలా బాగుంది. నా ప్రశంసలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 22 ఆగష్టు 2008 (UTC)
ఇంకా బొమ్మలు సభ్యులు:Sai2020/అనువదించాల్సిన_బొమ్మలు పేజిలో జతపరచండి. నేను అనువదిస్తాను. చర్చసాయీరచనలు 11:35, 26 ఆగష్టు 2008 (UTC)
- సాయి గారూ, నా అనువాదంలో చిన్న పొరపాటు జరిగింది. స్తంభ మృదుకణజాలం - Palisade mesophyll మరియు స్పంజి మృదుకణజాలం - Spongy mesophyll గా మార్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 11:43, 26 ఆగష్టు 2008 (UTC)
సరిచేసాను. చర్చసాయీరచనలు 09:58, 27 ఆగష్టు 2008 (UTC)
బొమ్మ:Mauryan Empire Map Test.gif అనువాదం సరిగా ఉందా? చర్చసాయీరచనలు 12:27, 27 ఆగష్టు 2008 (UTC)
- బుద్ధగయ; పాటలీపుత్ర, ఇంద్రప్రస్థం అని మార్చండి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం కూడా గుర్తించండి.Rajasekhar1961 12:43, 27 ఆగష్టు 2008 (UTC)
- రాజశేఖర్ గారూ! ఒకమారు మొసలి వ్యాసం చూడగలరా? నాకు చేతయినంతలో అనువదించాను. ఏమైనా తప్పులుంటే సరిదిద్దగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:48, 29 ఆగష్టు 2008 (UTC)
కుంటాల
[మార్చు]రాజశేఖర్ గారూ! కుంటాల జలపాతం సరైన పేరని దారిమార్పు చేసాను. కానీ మీరు ఇంతకు ముందు కుంటాలను, కుంతలకు తరలించడం చూసుకోలేదు. నాకు గుర్తుకు ఉన్నంతవరకు కుంటాల పేరే సరైనది. ఒకవేళ కుంతల సరైనదని మీకు తెలిస్తే నేను చేసిన మార్పు రద్దు చేయండి. δευ దేవా 10:30, 31 ఆగష్టు 2008 (UTC)
- నేను ఈ వ్యాసం ప్రారంభించేటప్పుడు కుంతల పేరే ఇచ్చాను. రికార్డుల ప్రకారము కుంటాల, కుంతల రెండూ వాడుతున్ననూ స్థానికులు మాత్రం కుంతలగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే శకుంతల పేరు మీదుగా ఈ పేరు వచ్చినదని ఇక్కడి వారి విశ్వాసం. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:56, 31 ఆగష్టు 2008 (UTC)
పొదుపు వ్యాసం
[మార్చు]రాజశేఖర్ గారు! మీరు కొన్ని వ్యాసాలలో సమాచారం ఊహ ప్రకారం వ్రాస్తున్నారనిపిస్తుంది (లేదా ఆ రంగంలో మీకు అంతగా అవగాహన లేనందున అనువాదంలో వాక్యం కూర్పు మరియు విషయం సరిగా కుదరడం లేదేమో). ఇటీవల మీరు సృష్టించిన పొదుపు వ్యాసంలో పొదుపు ఒక విధమైన ఆలోచనా విధానం. అని ఏక వాక్యంతో వదిలివేశారు. కాని అర్థశాస్త్రం పదమైన పొదుపును ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా వ్యాసంలో చేర్చితే వ్యాసం సమగ్రమౌతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:17, 15 సెప్టెంబర్ 2008 (UTC)
"పొదుపు" వ్యాసం, దానిపై చంద్ర కాంత్ వ్యాఖ్య చూసినాక నాకు అనిపించిన విషయం - నా యీ వ్యాఖ్య ఇరువురినీ నొప్పించదని ఆశిస్తాను. ఇక్కడ "తుల్యత", "విచక్షణ" అనే రెండు ముఖ్య విషయాలను గమనించవలసి ఉంది. వీటిని ప్రస్తుతం తెలుగు వికీకి ఉన్న పరిమితులలో అన్వయించుకోవాలి.
- విషయం గురించి సరిగా అవగహన లేనంత మాత్రాన వ్యాసం మొదలు పెట్టడానికి అభ్యంతరం లేదు. అందులో తప్పులు దిద్దడానికి, విస్తరించడానికి అందరికీ అవకాశం ఉన్నది. ఇది వికీ మౌలిక లక్షణం. వ్యాసం మొదలు పెట్టినవారే దాన్ని సమగ్రంగా తీర్చాలన్న బాధ్యత లేదు.
- అయితే అనుభవజ్ఞులైన, సీనియర్ సభ్యులు చేసే కూర్పులనుండి కొంత ప్రమాణం ఆశించడం సహజం. ఇది వారి కృషి పట్ల ఉన్న గౌరవమే కాని అన్యధా భావింపవలదు. తెలుగు వికీలో చురుకుగా పని చేసేవారు తక్కువ మంది ఉన్నందువలన వారు చేసే కూర్పులపైన ఫోకస్ ఎక్కువ ఉంటున్నదని గమనించాలి.
- నిఘంటువులాగా ఒక పదం, వాక్యంతో ఎన్ని వ్యాసాలు మొదలుపెట్టవచ్చును? - దీనికి నియమాలు లేవు. రెండు విధాలైన దృక్పధాలు ఇక్కడ ప్రబలంగా ఉంటున్నాయి. మొలకలు లేకుండా వృక్షాలు పెరగవు గనుక మొలక వ్యాసాలు మొదలు పెట్టడం అవుసరమే. అయితే మితి మీరిన చిన్న వ్యాసాలు పోగుపడితే అది విజ్ఞాన సర్వస్వం బదులు పొడి పదాల కూడిక అవుతుంది. వికీ పట్ల ఉన్న తపనతో ఒక తపస్విలా రాజశేఖర్ చాలా వ్యాసాలు సృష్టించారు కాని అవి అతి అయినాయని నాకు అనిపిస్తుంది. "సమగ్ర వ్యాసం అయ్యే అవకాశం" అన్న దానిని సభ్యులు తమ దృక్కోణం నుండి అంచనా వేసుకోవాల్సిందే.
నేను వ్రాసింది అస్పష్టంగా గాని, అభ్యంతర కరంగా గాని ఉంటే క్షంతవ్యుడను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:17, 15 సెప్టెంబర్ 2008 (UTC)
- నేను ఈ చర్చను ప్రారంభించడానికి ప్రధాన కారణం విషయ పరిజ్ఞానం మొదటిదైతే చిన్న వ్యాసం కావడం రెండో కారణం. కాసుబాబు గారన్నట్లు విషయ అవగాహన లేకున్ననూ వ్యాసం ప్రారంభించవచ్చు (అందరికీ స్వేచ్ఛ ఉంది) కాని విజ్ఞాన సర్వస్వానికి ఇలాంటి వ్యాసాల వలన మంచి కంటే చెడు ఎక్కువ కలుగుతుందని నా భావన. ఇక రెండో విషయం తెవికీలో ఇప్పటికే చిన్న వ్యాసాలు చాలా ఉన్నాయి. కనీసం 2 KB లకు మించిన వ్యాసాలే ప్రారంభించాలనేది నా అభిప్రాయం. ఒక్క వాక్యం వ్యాసాలను వ్యాసమని ఎలా చెప్పగలం? తెలియని కొత్త సభ్యులు సృష్టించిన ఇలాంటి వ్యాసాలను తొలిగించడం నిర్వాహకులుగా మనం చేయవల్సిన పని, కాని మనమే ఇలా చేస్తే బాగుండదు. ఈ విషయంలో కాసుబాబు గారు అన్నట్లు మొలకలు లేనిదే వృక్షాలు పెరగవు, అది ప్రకృతి సహజం, కాని తెవికీలో మాత్రం ఎందుకో అవి వృక్షాలుగా మారడం లేవు! బహుశా దానికి నారు, నీరు పోసేవారు లేరేమో!. నేను కేవలం ఒక్క వ్యాసానికే లేదా ఒక్క సభ్యునిపై దృష్టి పెట్టి ఇది వ్రాయలేదు. మరీ వెనుకకు పోలేను కాని (అలా చూస్తే చాలా ఉన్నాయి) గత రెండు, మూడు రోజులుగా సభ్యులు సృష్టించిన ప్రాచీన శిలా యుగము, పొట్టేలు, వెనిగళ్ళ సుబ్బారావు, ఆలూరి బైరాగి, ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర (ఈ వ్యాసంలో సమాచారం వ్యాసపు పేరు కంటె తక్కువగా ఉంది!!), హుసేన్ తదితర వ్యాసాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్చ ప్రారంభించాను. ఇప్పటికే నేను చాలా సార్లు చిన్న వ్యాసాలను తొలిగించాను. అలా చేయడం కంటె చిన్న వ్యాసాల సృష్టిని తగ్గించడం మంచిది కదా! -- C.Chandra Kanth Rao(చర్చ) 18:04, 15 సెప్టెంబర్ 2008 (UTC)
- చంద్రకాంత్ అభిప్రాయంతో నేను నూరు శాతం ఏకీభవిస్తాను. కాని ఇంతకు ముందు ఇలాంటి చర్చలో సభ్యుల అభిప్రాయాలు మిళితంగా ఉన్నాయి. en:Wikipedia:Notability ని మనకు అనుగుణంగా, మరింత శ్రద్ధతో అమలు చేయాలి. ఇది రాజశేఖర్ చర్చా పేజీ గనుక త్వరలో వికీపీడియా:వ్యాసం సైజు, వికీపీడియా:వ్యాసం ప్రాముఖ్యత అనే పేజీలని ప్రారంభించి ఆ చర్చా పేజీకి ఈ చర్చను కాపీ చేస్తాను. రాజ శేఖర్! నీ చర్చా పేజీని రచ్చబండగా వాడుకున్నందుకు దయచేసి చిరాకు పడవద్దు! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:37, 15 సెప్టెంబర్ 2008 (UTC)
- చిన్న వ్యాసాల మీద చర్చ జరిగింది, జరుగుతుంది, ఎప్పుడు ఉంటుంది. నాకు వికీపీడియా ఒక వ్యసనంగా మారింది. మంచి వ్యాసాలు రాయాలను కునే మొదలుపెడుతున్నాను. కానీ కొన్ని క్లిష్టమైన అనుమానాలు అడ్డం వచ్చి ముందుకు పోలేకపోతున్నాను. ఈ అనుమానాలలో కొన్ని శాస్త్రీయమైనవి. సాధారణ వ్యక్తులు తీర్చలేనివి. వాటిని వివరంగా తెలియజేసే సాంకేతిక నిపుణులు మన వికీలో లేరు. దానితో కొన్ని వ్యాసాలు ప్రారంభంలోనే ఆగిపోతున్నాయి. ఈ విషయాలు నేను మొదలుపెట్టిన వ్యాసాల గురించి మాత్రమే తెలియజేస్తున్నారు. చంద్రకాంతరావుగార్కి నా మీద ఇందువలన చాలా కోపం వచ్చిందని తెలుస్తున్నది. నేను ఇలా మొదలుపెట్టిన వ్యాసాలను మీలో ఎవరైనా నిరభ్యంతరంగా తొలగించవచ్చును. దీనిలో నన్ను నొప్పిస్తున్నానని భావించవచ్చును.
ఇంక కొన్ని నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఇంటిపేర్లు తెలుగువారికి ప్రత్యేకమైనవి. వీటిని వారు గర్వకారణంగా భావిస్తారు. ఈ వ్యాసాల్ని మొదలుపెట్టి వారి కుటుంబంలో పెద్దల గురించి తెలుసుకొని రాయడానికి మనం తెవికీ ద్వారా అవకాశం కల్పించవచ్చని నా అభిప్రాయం. తప్పైతే క్షమించండి. మనం రాజుల వంశాల గురించి, కురువంశాం, సూర్య మరియు చంద్ర వంశాల గురించి వివరంగా వ్రాస్తున్నాము. అలాగే మన పూర్వీకుల వంశాల గురించి వ్యాసాలుంటే మంచిదని నా అభిప్రాయం. భమిడిపాటి వారిని గురించి ఇలాంటి వ్యాసం తయారయింది. మరెన్నో వ్యాసాలు తయారయే అవకాశం ఉంది.
ఇంక జీవశాస్త్రం, వైద్యశాస్త్రం లో చాలా వ్యాసాలు చిన్నవిగా ఉన్నాయి. వేమూరి వారు చెప్పినట్లుగా ఈ శాస్త్ర జ్ఞానం పెరగాలంటే తెలుగుపదాలు తెలియాలి. కొందరికి ముఖ్యంగా ఇంగ్లీషు మీడియంలో చదివిన వైద్యులకు వ్యాసాలు రాయాలన్నా వీలులేదు. అందుకని నా ఆలోచన ప్రకారం ముందుగా తెలుగు, ఇంగ్లీషు పదాలను కొద్ది సమాచారంతో అయినా ఒక పేజీ రాసి ఉంచితే, ఆ విషయం మీద ఇంకా తెలిసిన వారు అక్కడ చేర్చి అవకాశం ఉంది. మొసలి వ్యాసం ఇలా తయారైనది. ఇంకా ఎన్నో తయారౌతాయి.
చిన్న వ్యాసాలు మన తెలుగు వికీకి సిగ్గుచేటుగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు. చిన్న విత్తనాలే మహా వృక్షాలుగా తయారౌతాయి. నిన్న రాత్రి కంప్యూటర్ మూసే ముందు మొదలుపెట్టిన పొదుపు వ్యాసం మీ అందరి సహకారం ఉంటే మంచి ఆలోచనలు రేపే వ్యాసంగా పెరుగుతుంది.
ఈ అభిప్రాయాలు నా వ్యక్తిగతమైనవి. ఎవరినీ నొప్పించడానికి ఉద్దేసించినవి కావు. నేను మొదలుపెట్టిన వ్యాసాలేవైనా మీరెవరైనా తొలగించవచ్చును. నా అభ్యంతరం ఏమీ లేదు.Rajasekhar1961 06:00, 16 సెప్టెంబర్ 2008 (UTC)
- రాజశేఖర్ గారు, నాకు మీ వ్యక్తిత్వం పైన కోపం లేదు. తెవికీలో వ్యాసాలే ప్రధానం కాని సభ్యులు కారు. చిన్న వ్యాసాలపై కోపం ఉందంటే ఒప్పుకుంటాను ఎందుకంటే చిన్న వ్యాసాల వలన ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. భవిష్యత్తులో అవి పెద్ద వ్యాసాలుగా మారే అవకాశమున్ననూ ఎంతసమయం పడుతుందో చెప్పలేము. ఇప్పటికే చిన్న వ్యాసాల సంఖ్య చాలా పెరిగిపోయింది. ఎవరికైనా కొత్త వ్యాసమే సృష్టించాలని ఉంటుంది కాని ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించడానికి అంతగా ఆసక్తి చూపరు. చిన్న వ్యాసాలను నిరభ్యంతరంగా తొలిగించాలని అంటున్నారు కాని ఇంత అనుభవం ఉన్న సభ్యులు సృష్టించిన వ్యాసాలను తుడిచివేయడానికి నా మనసే ఒప్పుకోవడం లేదు మీరెలా ఒప్పుకుంటున్నారో నాకర్థం కావడం లేదు. అలా ప్రతిసారి చిన్న వ్యాసాలను తుడిచివేయడం వలన మీ శ్రమ, నా శ్రమ వృధాకావడమే కాకుండా ఇతర సభ్యులు కూడా అభ్యంతరం చెప్పవచ్చు . కాబట్టి వ్యాసం ప్రారంభించే ముందు కనీసం రెండు, మూడు పేరాలకు తగిన సమాచారం చేర్చగలిగేది అయితేనే సృష్టించండి. అప్పుడే మన కృషికి సార్థకం ఉంటుంది. మనకు వ్యాసం నాణ్యత ప్రధానం కాని వ్యాసాల సంఖ్య కాదు. రాశి కంటె వాసికే ప్రాధాన్యత ఇచ్చినప్పుడే తెవికీపై జనాదరణ బాగుంటుంది. ఇక ఇంటిపేర్ల వ్యాసాల గురించి చెప్పాలంటే ఆ వ్యాసాలు సమగ్రరూపం దాల్చాలంటే కష్టమే. విజ్ఞాన సర్వస్వంలో మనం చేర్చడానికి లక్షలాది వ్యాసాలున్నాయి. అవన్నీ వదిలి కొందరి కొరకు ఇలాంటి వ్యాసాలు సృష్టించడం బాగుండదు. అవి అజ్ఞాన వ్యాసాలు అని నేను చెప్పను కాని అంతకంటే విజ్ఞానదాయక వ్యాసాలు (శాస్త్ర సాంకేతిక, భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, భౌతిక, రసాయన, జీవ, జంతు తదితర రంగాలకు చెందిన వ్యాసాలు) సమగ్రమైన సమాచారంతో సృష్టిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 07:36, 16 సెప్టెంబర్ 2008 (UTC)
చిన్న సూచన
[మార్చు]రాజశేఖర్! ది గెస్ట్ (నవల) ను ది గెస్ట్(నవల)కు దారి మళ్ళించారు. పద విభజనలో వ్యాకరణపరంగా ఇది సరికాదు. బ్రాకెట్టుకు ముందు స్పేస్ ఉండడం సరైన విధానం. గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:14, 3 డిసెంబర్ 2008 (UTC)
- రాసేందుకు ప్రయత్నిస్తాను.విశ్వనాధ్. 13:30, 3 డిసెంబర్ 2008 (UTC)
- వ్యాస రచయితను నేను కాదు కాబట్టి అలా చేశాను. మీరు చెప్పినది సరైనది. సవరించండి.Rajasekhar1961 13:35, 3 డిసెంబర్ 2008 (UTC)
మూలాలు ఇవ్వడం లేదు
[మార్చు]మీరు మలేసియాలో హిందువుల పై అకృత్యాలు వ్రాస్తున్నారు కొన్ని సలహాలు
- మూలాలు ఇవ్వండి.
- ఒక హిందువు గొంతులోనుండి కాకుండా, తటస్త గొంతులో నుండి చెప్పండి.
- మరింత వివరంగా వ్రాయండి, ఏదో రెండు ముక్కలు వ్రాయకుండా. రెండు వైపుల నుండీ వ్రాయండి. Chavakiran 09:12, 12 డిసెంబర్ 2008 (UTC)
అభినందనలు
[మార్చు]రాజశేఖర్ గారూ, 20 వేల దిదుబాట్ల మైలురాయికి చేరుకున్న సందర్భంలో కృతజ్ఞతా పూర్వక శుభాభినందనలు --వైజాసత్య 21:42, 12 డిసెంబర్ 2008 (UTC)
రంగనాయకమ్మ పేజిలో కూడా ఒక సెక్షన్ ఎడిట్ చేసినట్టు ఉన్నారు. నేను కూడా రంగనాయకమ్మ రచనలు చదివాను. ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలు బయటకి తీసి చదివాను. ఆమె వ్రాసిన కొత్త పుస్తకాలు కూడా కొంటుంటాను.
న్యాయ శాస్త్ర సంబంధిత వ్యాసాలు
[మార్చు]మీ సూచనకు ధన్యవాదాలు రాజశేఖర్ గారూ! దయ చేసి వికీపీడియాలో వ్రాయదగ్గ న్యాయ శాస్త్ర విషయాలను సూచించండి. "సాక్ష్యము", "ఒప్పందము" ఇలా రాసుకుంటూ పోతే చాలా అవుతాయి. మౌలికమయిన విషయాల మీద వ్రాద్దామా లేక కొన్ని కొని న్యాయ సంబంధమయిన మాటలు (legal vocabulary)గురించి వ్రాద్దామా?? అలోచించి ఒకసారి సూచిచండి, ఇతర సభ్యుల అభిప్రాయం కూడ తీసుకుంటే బాగుంటుంది. తప్పకుండా వ్రాయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
తరువాత, మీరు నేను "శీర్షికలు" వర్గం చర్చ పుటలో విషయాలు చూసినట్టున్నారు. ఇక్కడ నేను బొంబాయిలో గ్రంధాలయానికి వెళ్ళి తెలుగు పత్రికలు వెతికి (అందులో పాతవి 1960లు 70లవి-ఇక్కడ దొరుకుతాయా?)అప్పుడు వ్యాసం వ్ర్రాయటం జరిగే పనేనంటారా? చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నవారికి అక్కడ ఉన్న గ్రంధాలయాలు చక్కటి అవకాశం. అందుకనే నా అబ్యర్ధన ఏమిటంటే, మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సభ్యులు కొంత సమయాన్ని వెచ్చించి కొంత రిసెర్చ్ చేసి అప్పటి శీర్షికలగురించి వ్యాసాలను వ్రాయమని. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్గారికి ఈ మైల్ ద్వారా ఒక ఆభ్యర్ధన పంపాను, "ఊమెన్" కార్టూన్ల గురించి వ్యాసాన్ని వ్రాయమని(ఒక్క అరగంట క్రితమే). ఈ విధంగా, కొంతమంది ప్రముఖులను కూడ మనం వికిఇలో సభ్యులుగా చేర్చగలిగితే, వారి కట్రిబ్యూషన్ కూడ ఉంటుందని నా అభిప్రాయం.--SIVA 14:55, 18 డిసెంబర్ 2008 (UTC)
సినిమా మూస
[మార్చు]రాజ శేఖర్ గారూ! మీ సౌలభ్యం కోసం సినిమా మూస ఇక్కడ పెడుతున్నాను.
{{సినిమా |name = |year = |image = |starring = |story = |screenplay = |director = |dialogues = |lyrics = |producer = |distributor = |release_date = |runtime = |language = తెలుగు |music = |playback_singer = |choreography = |cinematography = |editing = |production_company = |awards = |budget = |imdb_id = }}
అభినందనలు
[మార్చు]మీ అవిరామ కృషికి, ముఖ్యముగా నేను మొదలుపెట్టిన వ్యాసాలను అభివృద్ధి చేసినందులకు నా అభినందనలు. --Gurubrahma 17:50, 19 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు
[మార్చు]ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:48, 28 డిసెంబర్ 2008 (UTC)
దారి మార్పులకే దారి మార్పు
[మార్చు]రాజశేఖర్ గారు, మీరు దారి మార్పు పేజీలకే దారి మార్పు ఇచ్చినట్లు గమనించాను. ఎన్ని దారిమార్పులిచ్చిననూ అవి అసలు వ్యాసం పేజీలకే ఇవ్వాల్సి ఉంటుంది. లేనిచో ఆ దారిమార్పు పేర్ల వలన అసలు వ్యాసం రాకుండా కేవలం ఒక లింకు ఉన్న పేజీ మాత్రమే కనిపిస్తుంది. ఉదా:కు మీరు సృష్టించిన సెలకీమార్ఫా, స్ట్రిగిఫార్మిస్ చూడండి. వీటిని సరిదిద్దడం పెద్ద కష్టం కాదు కాని కొత్త వాళ్ళకు దీని వల్ల కొద్దిగా అయోమయం ఏర్పడుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:50, 30 డిసెంబర్ 2008 (UTC)
- తప్పులు సవరించాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 06:29, 31 డిసెంబర్ 2008 (UTC)
- రాజశేఖర్ గారూ మీరు చెప్పిన విధంగా చేస్తాను. కృతజ్ఞతలు.విశ్వనాధ్. 06:03, 9 జనవరి 2009 (UTC)
మేళకర్త రాగాలు
[మార్చు]మేళకర్త రాగాలు మూసలో ఇంకా లింకులు కొన్ని కనిపిస్తున్నాయి. వీటిని మార్చాల్సినదిగా అభ్యర్ధిస్తున్నాను. ఇంగ్లీషు వికీ en:Melakanta రాగాలలోని అన్ని రాగాల ప్రాథమిక లక్షణాలకు స్వరాల స్థితి లక్షణాలను తెలుపుతూ బొమ్మలు ఉన్నాయి. ఇవి తెలుగులోకి తీసుకొని వస్తే చదివేవాళ్ళకు ఇంకా సులభంగా అర్ధం అవుతుంది. ఈ సహాయం మీరు చేయగలరని భావిస్తున్నాను. ఇవి కామన్స్ లో ఉన్నది లేనిదీ తెలియడం లేదు. ధన్యవాదాలు.
ఈ రాగాలకు సంబంధించిన కీర్తనలకు నేను ఇచ్చిన వికీమూలాల లింకులు సరిగా కనిపించడం లేదు. కారణం తెలియదు. ఒక్కసారి చూచి సవరించండి.Rajasekhar1961 06:07, 3 ఫిబ్రవరి 2009 (UTC)
- రాజశేఖర్ గారూ, మూసలో లింకులను సవరించాను. ఇప్పుడు మూస రంగు పోయినట్టుంది. అది సరిచేస్తాను. స్వరాల స్థితి లక్షణాల బొమ్మలన్నీ కామన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ పేరుతోనే ఇక్కడ నేరుగా ఉపయోగించుకోవచ్చు. వీకీమూలాల లింకులు సరిగా కనపోవడకపోవటమంటే కాస్త వెలిసిపోయిన రంగులో కనిపిస్తున్నాయని మీ భావమైతే మామూలు లింకులను ఆ వికీమూలాల లింకులను వేరుగా చూపించడానికి ఇతర ప్రాజెక్టుల లింకులు అలా వెలిసిపోయిన రంగులో సూచిస్తారు. కావాలంటే మనమా రంగును మార్చవచ్చనుకుంటా. నేను మీ ఉద్దేశాన్ని సరిగా అర్ధం చేసుకున్నానా? --వైజాసత్య 09:43, 3 ఫిబ్రవరి 2009 (UTC)
The Fox and the Hound
[మార్చు]What did you say on this and [2] this talk page? 65.0.162.41 23:17, 1 ఏప్రిల్ 2009 (UTC) రాజశేఖర్ గారూ, మీ "మేళకర్త రాగాలు" వ్యాసం చాలా బాగుంది. మీరడిగినట్టు , నేను నాకు తెలిసిన కొన్ని మ్యూజిక్ వెబ్ సైట్ల లింకులు ఇచ్చాను, చూడండి. -----Nagaraju raveender 04:30, 4 ఏప్రిల్ 2009 (UTC)
- రాజశేఖర్ గారూ, నమస్తే. నేను పొరపాటున లాగిన్ అవకుండా, బిర్జూ మహరాజ్ దిద్దుబాటు చేశాను. నా ఐ.పి. అడ్రెస్: 59.96.100.23 - ఇప్పుడెలా? మార్చడాని కేమైనా అవకాశం ఉంటుందా? ----Nagaraju raveender 15:52, 18 ఏప్రిల్ 2009 (UTC)
తెవిలో నాలుగో లక్ష దిద్దుబాటు
[మార్చు]తెవిలో నాలుగో లక్ష దిద్దుబాటును చేసునందుకు మీకు కృతజ్ఞతలు. తెలుగు వికీపీడియా ఇలా మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆశిద్దాము. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 14:46, 23 ఏప్రిల్ 2009 (UTC)
బొమ్మలు అప్‌లోడ్ చేయడం - కాపీ హక్కులు
[మార్చు]- నేను ఆఫీసు గురించి స్కానింగ్ యంతాన్ని తీసుకున్నాను. వికీలో అవసరమైన బొమ్మలకు కొన్ని పత్రికలు, పుస్తకాలు మొదలైన వాటినుండి స్కానింగ్ చేసి బొమ్మలు చేర్చవచ్చునా. ఉదాహరణకు తను రచించిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో శంకరనారాయణ ఫోటో ఉన్నది. దానిని స్కాన్ చేసి వికీలో చేర్చవచ్చునా. అలాగే వివిధ లైబ్రరీ పుస్తకాల ముఖచిత్రాలు లేదా CD కవరుమీద ఉండే సినిమా బొమ్మలు కూడా ఉపయోగించవచ్చునా. కాపీరైటు ఉల్లంఘన క్రిందకి వస్తుందా తెలియడంలేదు. కొంచెం మీసలహా అవసరం. ఎలాంటి బొమ్మలు వికీలో చేర్చవచ్చును. మీ సమాధానం తర్వాతనే ప్రారంభిస్తాను.Rajasekhar1961 09:23, 24 ఏప్రిల్ 2009 (UTC)
రాజశేఖర్ గారూ! సంకోచించకుండా స్కాన్ చేసిన బొమ్మలు చేర్చండి. బొమ్మలు అప్‌లోడ్ చేసేటప్పుడు క్రింది విషయాలను పాటిస్తే సరిపోవచ్చును. మీరు అప్‌లోడ్ చేసే బొమ్మలను నేను పరిశీలిస్తూ ఉంటాను. ఏవయినా సవరణలు అవుసరమైతే తెలియజేస్తాను.
- పుస్తకాల ముఖచిత్రాలు, సిడి, డివిడి ముఖచిత్రాలు, సినిమా సీనులు వంటివాటిని అప్‌లోడ్ చేయడం అప్పకుండా మంచిదే. వాటిని "సముచిత వినియోగం" (FAir Use) క్రింద చేర్చండి. (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
- దివంగతులైనవారి చిత్రాలైతే అ బొమ్మలకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. జీవించి ఉన్నవారి చిత్రాలను మాత్రం అనుమతి లేకుండా వాడవద్దు.
- మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
- మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి: బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:34, 24 ఏప్రిల్ 2009 (UTC)
ధన్యవాదాలు. నిఘంటువు రచయిత శంకర నారాయణ గారి ఫోటో తో మొదలుపెడతాను. మీ సహాయం సవరణలు నిర్బయంగా చేయండి.Rajasekhar1961 09:38, 24 ఏప్రిల్ 2009 (UTC)
బొమ్మ అప్ లోడ్ చేశాను. కానీ అడ్డంగా వచ్చింది. కాపీరైటు సరైనదేనా. బొమ్మను సరిచేయండి వీలైతే.
- బొమ్మను సరి చేసి అప్‌లోడ్ చేశాను. కాపీ హక్కుల టాగ్ మార్పు కూడా గమనించగలరు. MS Office Picture Manager లేదా చాలా ఇమేజ్ సాఫ్ట్‌వేర్‌లలో బొమ్మను 90 డిగ్రీలు తిప్పడం చాలా సులభం. ప్రయత్నించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:18, 24 ఏప్రిల్ 2009 (UTC)
- రంగు మరకలు వచ్చాయి. ఎందువలననో. బొమ్మ సంతృప్తికరంగా లేదు.Rajasekhar1961 12:22, 24 ఏప్రిల్ 2009 (UTC)
- పాత బొమ్మ గనుక నేను కొంచెం కంట్రాస్టు అడ్జస్టు చేయడానికి ప్రత్నించాను. కాని అది బాగా రాలేదు. ఇప్పుడు మీరు అప్‌లోడ్ చేసిన లేటెస్టు బొమ్మ మెరుగ్గా ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:36, 24 ఏప్రిల్ 2009 (UTC)
- రంగు మరకలు వచ్చాయి. ఎందువలననో. బొమ్మ సంతృప్తికరంగా లేదు.Rajasekhar1961 12:22, 24 ఏప్రిల్ 2009 (UTC)
సినిమా వ్యాసాలు
[మార్చు]రాజశేఖర్! మీరు సినిమా వ్యాసాల విస్తరణలో కూర్చుతున్న సమాచారం ఎలా సంపాదిస్తున్నారో ఆశ్చర్యకరంగా ఉంది. అభినందనలు. ఇక్కడ కొంచెం అతి చనువు తీసుకొని ఒక విషయం చెబుతాను. ఇంతకు ముందు జరిగిన ప్రతిపాదనలపై చర్చ కారణంగా నేను తొందరలో కొన్ని సినిమా వ్యాసాలు తొలగిస్తానని భావించి మీరు చాలా శ్రమ తీసుకొని ఈ సమాచారాన్ని కూర్చుతున్నారేమోనని అనిపిస్తుంది (నా అభిప్రాయం తప్పు కావచ్చును). నాకు ఏమీ అలాంటి తొందర లేదు. మీరు అతిగా స్ట్రెయిన్ తీసుకోవద్దు. మీ వీలునుబట్టే కానీయండి. లేదా ఇతర సూచనలు ఏవైనా ఉంటే చేయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:56, 26 ఏప్రిల్ 2009 (UTC)
చిన్న సూచన
[మార్చు]రాజశేఖర్! మీరు అయోమయ నివృత్తి పేజీలు చేసేటపుడు {{అయోమయ నివృత్తి}} మూసను పేజీ అడుగున ఉంచండి. ఆంగ్ల వికీలో en:Wikipedia:Disambiguation లో దీనికి సంబంధించిన సూచన ఇలా ఉంది.
Include the template {{disambig}} (or other disambiguation template, such as {{Geodis}} or {{Hndis}}) at the bottom as an indicator of the page's status.
మరియు en:Wikipedia:Manual of Style (disambiguation pages) కూడా చూడండి.
--కాసుబాబు 12:33, 29 మే 2009 (UTC)
Tamil Language Page
[మార్చు]రాజశేఖర్ గారు, Tamil Language Page ని కావలనే తయ్యరు చేశాను. వికీపీడియా:BABEL ని పూర్తిగా తెనిగీకరించాక అక్కడ వున్న ఆంగ్ల పదాలను తీసివేసి, అప్పుడు ఈ వ్యాసమును కూడా తీసివేయవచ్చు అని. వాడుకరి:Kiranmayee ని చూడండి. ఏమైన సలహాలు వుంటే ఇవ్వండి.
కిరణ్మయీ 13:18, 29 జూన్ 2009 (UTC)
ఓసారి పరికించండి
[మార్చు]రాజశేఖర్ గారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:01, 9 జూలై 2009 (UTC)
ఉపాధి వ్యాసాల కు సహకరం
[మార్చు]ఉపాధి వ్యసాల విస్తరణకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలుఅర్జున 12:31, 5 సెప్టెంబర్ 2009 (UTC)
సీత రాముడికి ఏమవుతుంది
[మార్చు]సీత రాముడికి ఏమవుతుంది మొలక వ్యాసాన్ని తొలగించారు. ఇది ఆరుద్ర గారి విమర్శనాత్మక రచన. దీనిని తొలగించడం భావ్యం కాదని ఆ అభిప్రాయం. మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం ఆలోచించండి.Rajasekhar1961 06:19, 5 అక్టోబర్ 2009 (UTC)
- మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం దీనిని నేనూ అంగీకరిస్తాను. కాని వ్యాసాన్ని మొదలెట్టినవారు కేవలం ఇక్కడితో అగిపోయేవారు కాదు కనుక తొలగించాను. ఒకసారి సందిస్తే మరిన్ని పిచ్చి వ్యాసాలు ఆయన రాసే అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాంటి వాటిని గురించి మీకు తెలిస్తే మీరు మొదలెట్టండి. విస్తరిద్దాం. నేనూ ఒక చెయ్యి వేస్తాను. విశ్వనాధ్.బి.కె. 06:50, 5 అక్టోబర్ 2009 (UTC)
తెవికీ వార్త/మాటామంతీ ఆహ్వానం
[మార్చు]Rajasekhar1961 గారు, తెవికీ వార్త/మాటామంతీ లో మీ అనుభవాలని చదువరులతో పంచుకోటానికి ఆహ్వానం. వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా చూడండి. --తెవికీ వార్త సమన్వయకర్త, అర్జున 04:06, 5 జూన్ 2010 (UTC)
- మీ స్పందనకోసం ఎదురుచూస్తున్నాను.--అర్జున 14:18, 15 అక్టోబర్ 2010 (UTC)
Hello!
[మార్చు]Hello!
I am Jimmy Wales (Jimbo), founder of Wikipedia and the Wikimedia Foundation, and I'm doing a personal investigation into the smaller language Wikipedias. I will be presenting some information about this at the upcoming Wikimania, and I am hoping to conduct a video interview with you (over skype) to learn more about your personal stories about what is going on in your language Wikipedia.
You were chosen through a process of looking at a list of smaller languages and the most active contributors. If you feel that you aren't the best person to speak about your language version, please do share this message widely. I'm looking for the most active volunteers in some of the smaller languages.
Please email me at: jwales@wikia.com and also email my assistant Topher at jwalesassist@gmail.com as soon as possible. Wikimania is less than a week away and I want to get as many interviews done as possible before then!
--Jimbo Wales 08:15, 1 జూలై 2010 (UTC)
బొమ్మల సహాయం
[మార్చు]బెజవాడ రాజరత్నం ఉచిత బొమ్మ ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వెబ్ సైటులో ఉన్నది. దయచేసి తెలుగు వికీలోకి బదిలీ చేయమని మనవి. ఆ లింక్ : http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp మరికొన్ని బొమ్మలు ఇక్కడ లభించవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 08:24, 4 నవంబర్ 2010 (UTC)
- రాజశేఖర్ గారూ, చాలా విలువైన సమాచారమున్న సైటును కనుగొని తెలియజేసినందుకు ధన్యవాదాలు. అయితే మీరిచ్చిన లింకు ద్వారా వెళితే సైటుకు వెళ్ళగలిగాను కానీ రాజరత్నం గారి బొమ్మ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళ లేదు. అంత పెద్ద సముద్రంలో వెతికి పట్టుకోవటం కష్టమనిపించింది. ఆ బొమ్మ ఏ పత్రికలో ఏ సంచికలో ప్రచురితమైందో తెలియజేస్తే అది వికీపీడియాలో చేర్చగలను --వైజాసత్య 23:28, 8 నవంబర్ 2010 (UTC)
యాంత్రిక అనువాదం
[మార్చు]- రాజశేఖర్ గారు,
- నమస్కారములు. యాంత్రిక అనువాదములు గురించి నాకు తెలుసుకోవాలని వుంది. మనము ఆ విధముగా చేయవచ్చునా ? మీకు తెలిస్తే దయచేసి తెలియజేయ గలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:00, 15 నవంబర్ 2010 (UTC)
- తెలుగు వికీని సి డి గా రాసుకొనె వీలు ఉన్నదా?. ఎలా రాసుకొవఛు. నాకు కొంత సమాచరమ్ కావాలి. దానిని నెట్ లెని చోట కూడా ఓపెన్ చేసుకొనే లా డేటా బేశ్ రాసుకోవఛా? ఎలా సిడి లేదా డివిడి ఋఆసుకొవాలి దయచేసి తెలుపగలరు.
Novbox
[మార్చు]- రాజశేఖర్ గారు,
మూస:Novbox లోని కుడి వైపున వున్న మూస:చూపు, మూస:దాచు మూసల గురించి చూసాను. నాకు దొరకటము లేదు. మూసల వివరాలు తెలియజేస్తే, విక్షనరీలోనికి ప్రవేశ పెట్టుటకు వాటి అవసరము వున్నది. మీకు తెలిసినవారి ద్వారా విక్షనరీలో ఆ మూసలను ఉంచటానికి ప్రయత్నించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:12, 20 డిసెంబర్ 2010 (UTC)
భాషాదోషాల పట్టిక
[మార్చు]భాషాదోషాల పట్టిక పేజిలో చాలా వరుకు ఉన్న అక్షర దోషాలుండే పదాలును చేర్చాను. ఇంతవరుకు సరైన బాటును ఎవ్వరు కుడా నడుపలేదు. [[3]] --జయంత్ కుమార్ 10:47, 21 డిసెంబర్ 2010 (UTC)
సినిమా వ్యాసాలు
[మార్చు]నేను సినిమా వ్యాసాలలో సమాచారాన్ని తొలగించినట్టు గుర్తులేదు, నేను వ్యాసాలను ఎక్కువగా విస్తరించానే తప్ప సమాచారాన్ని తొలగించలేదు, కొన్ని చోట్ల తప్పుఉన్నవి తొలగంచాను. ఒక సందేహం, మనము సినిమా పాటల గురించి వ్యాసాలు తయారు చేయవచ్చా? Mukteshvari 07:50, 29 జనవరి 2011 (UTC)
మీ సలహాకు ధన్యవాదాలు. నేను పని మీద బయటకి వెళ్ళడం వలన వ్యాసం సగం పూర్తిచేసి వెళ్ళాను, ఇప్పు దానిని పూర్తి చేస్తాను.
ఐ.ఎం.డి.బి సైట్లో చాలా తప్పులున్నాయి, ఉదాహరణకు గుణసుందరి కథ సినిమాలో నటించని వారి పేర్లూ ఉన్నాయి.Mukteshvari 10:54, 31 జనవరి 2011 (UTC)
ముగ్గురు హేమలతలు ఒకరు కాదు అందుకే వేరు చేశాను, ఐ.ఎమ్.డి.బి.లో తప్పులకు ఉదాహరణ ఇది, అందుకనే ఇంతకుముందు అవన్నీ ఒకే వ్యాసంగా సృష్టించబడ్డాయి. Mukteshvari 11:23, 4 ఫిబ్రవరి 2011 (UTC)
హేమలత
[మార్చు]హేమలతాలవణం పేరు అయోమయ నివృత్తిలో చేర్చినందుకు కృతజ్ఞతలు. హేమలతా లవణం పేరు అయోమయ నివృత్తిలో పెట్టాలన్న విషయం నాకు తర్వాత గుర్తుకు వచ్చింది. సమయం లేక పోవడంతో పెట్టలేకపోయాను. Mukteshvari 11:40, 4 ఫిబ్రవరి 2011 (UTC)
Please, could you translate en:Podolsk into తెలుగు? Naturally if you have available time!
[మార్చు]Good day to you! Could you, please, translate into తెలుగు the article, containing two-three sentences, about this city in Russia? I’d like to thank you in advance :)--Переход Артур 10:57, 15 ఫిబ్రవరి 2011 (UTC)
అన్నమయ్య పాటల గురించి
[మార్చు]ఒకప్పుడు ఇలా టైపే చేసిన వందలాది పాటలు వికీ సోర్స్ కు తరలించాము. కొత్తవి అక్కడే టైప్ చేస్తే బాగుంటుంది. Chavakiran 13:21, 11 ఏప్రిల్ 2011 (UTC)
సంస్కృతపదాలు
[మార్చు]రాజశేఖర్ గారూ తెవీకీలో మీకృషి గుర్తించతగినది. ఇలాంటి పదాలకు పేజీలను ఇదివరకు చూసాను. అవి అలాగే ఉన్నాయి. వీకీలో ఏ పదానికైనా వ్యాసాలు వ్రాయవచ్చన్నది నా అభిప్రాయం. కానీ ఇలాంటి పేజీలు వ్యాసాలు కాలేదు. డిక్షనరీలో కొంత భాగంగా అనిపించింది. ఇలాటివి విక్షనరీలో ఉంటే బాగుంటందని అనుకుని అలా వ్రాసాను. ఆ పేజీలకు సమగ్ర వ్యాసాలు వ్రాస్తే బాంగుంటుంది.--t.sujatha 16:58, 3 జూన్ 2011 (UTC)
మూసలు
[మార్చు]తెవికీలో చాలా ముసలు పనిచేయడం లేదు. మీకు తెలిస్తే సరిచేయండి.Rajasekhar1961 05:57, 21 జూన్ 2011 (UTC)
- నేను సరిచేశా సి. చంద్ర కాంత రావు- చర్చ 19:26, 21 జూన్ 2011 (UTC)
Template namespace initialisation script
[మార్చు]Hello. I did not found the village pump page or the requests for deletions page, so I post it directly on your talk page.
Some years ago, developers used Template namespace initialisation script to move some pages from the MediaWiki to the Template namespace, and left some useless redirects.
Consequently, the following pages should be deleted :
- మీడియావికీ:All system messages
- మీడియావికీ:All messages
- మీడియావికీ:Sitesupportpage
- మీడియావికీ:Gnunote
For more informations, please see this request (meta).
Thanks -- Quentinv57 21:32, 23 జూన్ 2011 (UTC)
- request moved to వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Template namespace initialisation script -- Quentinv57 14:14, 28 జూన్ 2011 (UTC)
స్వాగత వచనములు
[మార్చు]ధన్యవాదములు. సహాయము అవసరమైతె చర్చ పుటము ద్వారా తెలియజెయుదును. Charan s05 15:31, 22 జూలై 2011 (UTC)
వంటలు
[మార్చు]- మనము భారతీయ వంటలు జాబితా లో దేశములోని అన్ని రకముల వంటలు గురించి వ్రాస్తాము. ఉదా: మనము పొంగలి అని అంటాము. తమిళ వంటలు లో పొంగల్ అని అంటారు. అలాగే మనము పూరి అని, పంజాబ్ వారు భటూర అని అంటారు. మరి భారతీయ భాషలలోని వంట ఒకటే అయినా, వంటకముల పేర్లు వేరు కాబట్టి, ఆయా పదములు మాత్రమే ఉంటే బావుంటుంది అని నా అభిప్రాయము. అప్పుడు కొన్నాళ్ళకు రాష్ట్రాల వారీగా వంటలు విడదీయ వచ్చును. ఒకసారి ఆలోచన చేయండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:45, 1 ఆగష్టు 2011 (UTC)
నూనెలు
[మార్చు]రాజశేఖరు గార్కి నమస్కారలతో.
మేరు అడిగిన విధంగానే నా వాడుకరిపుటలో నా వివరాలు పొందు పరచాను.నాకు బొమ్మలను అప్‌లోడ్ చెయ్యడం తెలియదు(కంప్యూటరు ఈ మధ్యనే ఆపరెట్‌చెయ్యడం నేర్చుకున్నాను. నా వ్యాసాలలో తగిన విధంగా దిద్దుపాట్లు చేస్తు,బొమ్మలను అప్‌లోడ్ చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదంలు. - పాలగిరి రామక్రిష్ణారెడ్డ్
పాలగిరి
[మార్చు]రాజశేఖరుగార్కి నమస్కారంలు,లైసెన్సు వివరాలు అనగా ఎమిటొ దయచేసి తెలుపగలరు,ఆ వివరాలను ఎక్కడ పొందుపరచవలెను.వీటిని నేనునెట్ నుండి డవున్‌లోడ్‌చేశాను. భవదీయుడు. పాలగిరి
సాల్
[మార్చు]సాల్ కు మరొక పేరు గుగ్గిలం కలప చెట్టు. సరేనా. నిజమైతే సాల్ నూనెలోని కొంత సమాచారాన్ని ఈ చెట్టు పేజీకి తరలించవచ్చును.Rajasekhar1961 14:24, 6 సెప్టెంబర్ 2011 (UTC)
సందేహం
[మార్చు]రాజశేఖరు గార్కి నమస్కారములతో,మీరు నాకు యిస్తున్న సలహాలకు,తోడ్పాటుకు,సహాకారానికి ధన్యవాదాలు. నేను 'చెట్లగింజలనూనెలు' అనే విషయంపై మామిడిపిక్కలనూనె,ఇప్పనూనె అనే శీర్షీకతో విడిగా రెండు పుటలలో వ్యాసాలు వ్రాసాను.ఇంకను చెట్లగింజలనూనె క్రింద కానుగ,వేప,సాల్,జట్రొఫా నూనెలగురించి వ్రాయ వలసి వుంది.వీటన్నింటిని కలిపి 'చెట్లగింజలనూనె"శీర్షకమీద వ్రాయలా,విడిగా వ్రాయాలా? మీ అమూల్యమైనసలహా కొరకు వేచివున్నాను.రెండవది,నూనె శీర్షిక వున్న పుటలో వంటనూనెల వ్యాసంవున్నది.కాని అండులో వున్న చిత్రం మోటరుఇంజను ఆయిల్‌కు చెందినది.దాని స్దానంలో వంటనూనెలకుసంబంధ్ఇంచిన చిత్రం వున్నచో బాగుంటుందేమో,మీ సలహా ,సహకారంలను సదా ఆశిస్తూ.reddy 09:58, 26 ఆగష్టు 2011 (UTC)
- మీ సమాధానంకు ధవ్యవాదాలు.ఇప్పనూనె శీర్షీకలో ఇప్పనూనె సమాచారాన్ని మాత్రమే పొందుపరచాను.ఇప్పటికే వున్న 'ఇప్ప'శీర్షికలోఇప్పచెట్టును గురించి అదనపు సమాచారాన్ని పొందుపరచ వచ్చునా.నమస్కారంలతో reddy 10:36, 26 ఆగష్టు 2011 (UTC)
- నమస్కారంలతొ,
మీ సందేశం అందినది.ధన్యవాదంలు.చెట్లనూనెలలో కొబ్బరి,ఆయిల్‌పామ్,ఆలివ్‌ఆయిల్,సాల్ మినహా మిహతాచెట్లగింజలనూనెలు వంటకు పనిచెయ్యవు.వాటినూనెలను పారిశ్రామికంగా ఉపయోగిస్తారు.వాటి వ్యాసాలను వంటనూనెలశీర్షీక లో చేర్చివ్రాయవచ్చునా?.తెలుపగలరు.reddy 06:44, 27 ఆగష్టు 2011 (UTC)
- రాజశేఖరుగార్కి నమస్కారాలతో,
మీ సందేశం అందినది.ఇక్కడ ఇక చిన్న సందేహం వుండటంతో నేను గుగ్గిలం అనే పేరును చేర్చలేదు.మేము నూనెతీయుటకు వాడెది(బొటానికల్్‌నేమ్ shorea robustaకు చెందినది.గుగ్గిలంకు చెందినపేరు vatica robusta.అనివుంది రెండు ఒకే కుటుంబానికి చెందినవి.మాకు నూనెగింజలు,వాటిలోని నూనెలగురించి వున్నంతగా,మొక్కల మద్యతేడా గురించి తెయదు.కొందరు గుగ్గిలం,తంబ అనికూడ వివరణయిచ్చారు.నాకు సందేహంవలన చేర్చలేదు.ఈ విషయంలో మీరు తీసుకునే నిర్ణయం అంతిమం.ధన్యవాదంలతో reddy 14:54, 6 సెప్టెంబర్ 2011 (UTC)
- రాజశేఖరం గార్కి నమస్కారాలతో,
నూనెగింజలనుండి నూనెను ఎక్స్‌పెల్లరులనబడు యంత్రాలద్వారా,తవుడు,సోయాబీన్స్,మరియు20% కన్న తకువగా నూనె కలిగివున్న చెట్లగింజలనుండి,ఆయిల్‌కేకులనుండి సాల్వెంట్‌ప్లాంట్‌లద్వారా నూనెను సంగ్రహించెదరు.అందుచే ఆరెండు విధానలగురించి వేరే శీర్షిలతో వ్యాసాలు రాయ వచ్చునంటారా?.అలాగే నూనెల వ్యాసాలలో నూనెల భౌతికగుణాలలో ఐయోడిన్,సపోనిఫికెసనువంటివాటి విలువలపట్టికలను చేర్చడం జరిగినది.అవిలువలను గురించిన అర్థంను పట్టిక దిగువన ప్రత్యేకంగా(అన్ని నూనెల పట్టికలో)చేర్చవచ్చునా?.reddy 05:51, 9 సెప్టెంబర్ 2011 (UTC)
- నమస్తే,
మీ సమాధానికి ధన్యవాదాలు.నూనె తయారు చెయ్యడం అన్నపదమే బాగుంది.అవిధంగా నే మార్చెదం.ధన్యవాదాలతో reddy 06:17, 9 సెప్టెంబర్ 2011 (UTC)
- నమస్తే,మీ సందేశం అందినది.
మీరు కొవ్వు ఆమ్లములతో వ్యాసములు చేర్చండి.మీరుచేర్చినదానికి మించి నావద్దసమాచారం వున్నచో నే చేర్చెదను.ధన్యవాదములతోreddy 09:23, 9 సెప్టెంబర్ 2011 (UTC)
- నమస్తే,
మీ సందేశం అందినది.కాప్రోయిక్‌ఆసిడ్‌కు కొంత సమాచారం చేర్చాను,మిగిలిన వాటికి కూడా చేర్చదను.ధన్యవాదంలతో reddy 05:23, 12 సెప్టెంబర్ 2011 (UTC)
- రాజశేఖరుగారునమస్తే,
మీ అభినందనాలకు ధన్యవాదంలు.నిజంచెప్పాలంటే గత 5సంవత్సరంలుగా మీరు తెల్కిలో చేసిన,చేస్తున్నకృషికి మీమ్మలే నేను అభినందించవలసివున్నది.వైద్యుడుగా వుంటునే మీరు చేస్తున్నకృషికి మిమ్మల్ని శ్లాఘించాలి.ప్రస్తుతం నాకు జీవశాస్తంలో అనుభవమున్న పరిచయస్తులు లేరు.కాని ప్రయత్నిస్తాను.మీ Rama krishna reddy.P 11:48, 13 సెప్టెంబర్ 2011 (UTC)
Invite to WikiConference India 2011
[మార్చు]Hi Rajasekhar1961,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
పరిచయం
[మార్చు]నమస్తే Rajasekhar1961 గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి!శశి 07:59, 4 సెప్టెంబర్ 2011 (UTC)
విజ్ఞప్తి
[మార్చు]నమస్కారము Rajasekhar1961 గారు. అయ్యా నేను కొత్తగా కొన్ని వ్యాసములను ఇంగ్లీషు వికిపీడియా నుండి తీసుకుని వాటిని గూగుల్ అనువాద పరికరం సహాయంతో అనువదింఛితిని. సమయాబావం వలన తప్పులను సరిచేయలేఖపొతిని. దయచేసి వాటిని సరిచేయ ప్రార్థన.
ఇటలీ చరిత్ర గురించి
[మార్చు]నమస్కారము Rajasekhar1961 గారు. మీ సూచనకు కృతజ్ఞతలు. నేను తప్పకుండా ఇటలి వ్యాసాన్ని విస్తరిస్తాను. ఇంగ్లీషు వికీపిడియా నుండి అనువదిస్తాను. మీరు కూడా నాకు సహకరించండి. తగిన సూచనలు ఎప్పటికి అప్పుడు తెలియజేయండి. గారిబాల్డి అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి మన తెలుగు వారు కూడా తెలుసుకొవడం అవసరం అని నా ఉద్దేశం.
తవుడు
[మార్చు]రాజశేఖరుగార్కి నమస్కారములతో, మీ సందేశం చూశాను.తవుడులో కొన్నిమార్పులు చేశాను.వీలున్నచో ఈ వ్యాసంలో బియ్యపు గింజ,దానిభాగాలను(తవుడు,పొట్టు తదితరాలు) చూపించు చిత్రాన్నివ్యాసంకు చేర్చండి.ధన్యవాదంలతో.Rama krishna reddy.P 09:14, 23 సెప్టెంబర్ 2011 (UTC)
ఇటపైలీ వ్యాసాల గురించి
[మార్చు]నమస్కారము Rajasekhar1961 గారు. మీరు రాసినది చదివిన తరువాత గూగుల్ అనువాద పరికరాన్ని గుడ్డిగా నమ్మటం తప్పు అనిపించింది. అందుకని నేను అనువదించిన వ్యాసాలలో చిన్నది అయిన ఈ వ్యాసాన్ని మరోసారి పూర్తిగా నా సొంతంగా అనువదించాను. దీనిని పూర్తిగా చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దీని ఇంగ్లీష్ వర్షన్ కూడ ఇక్కడ ఇస్తున్నాను.
తెవికీ వార్త కు సహాయం
[మార్చు]మీకు అనువాద వ్యాసాల సంస్కరణలో అనుభవం వున్నందునవాడుకరి:T.sujatha/అనువాద వ్యాసాల సంస్కరణ సమీక్షించి మెరుగుకు సహాయం చేయమని కోరుతున్నాను --అర్జున 07:25, 30 సెప్టెంబర్ 2011 (UTC)
నా రాజీనామ
[మార్చు]sir I am retired because I am banned from english wikipedia because of vandalism. I requested them to lift ban. But they refused. I open new accounts. But they also banned my new accounts for socket puppets. So I want leave wikipedia completely. Please forgive me sir.--Sridhar1000 12:46, 9 అక్టోబర్ 2011 (UTC)
Respected sir
I accept your request sir.--Sridhar1000 06:43, 10 అక్టోబర్ 2011 (UTC)
అభివందనలు
[మార్చు]50,000 మార్పులు చేసిన సందర్భంగా శుభాభివందనలు.. -- అర్జున 11:31, 30 అక్టోబర్ 2011 (UTC)
కీర్తనలకు పేజీలు
[మార్చు]రాజశేఖర్ గారూ! ఒక్కో కీర్తనకు ఒక్కో పేజీ ఉండడం సబబుగా నాకు అనిపించడం లేదు. ఆ కీర్తన "గురించి" గణనీయమైన విశేషాలుంటే తప్ప. ఈ విషయం గురించి మీ వ్యాసాలపై పునరాలోచించమని కోరుతున్నాను --కాసుబాబు 18:14, 31 అక్టోబర్ 2011 (UTC)
తెవికీవార్త
[మార్చు]తెవికీవార్త విడుదలైంది. మీ సహకారానికి ధన్యవాదాలు. -- అర్జున 07:32, 9 డిసెంబర్ 2011 (UTC)
వికీపీడియేతర వికీ ప్రాజెక్టులు
[మార్చు]మీరు వికీపీడియా కాక ఇతర తెలుగు వికీప్రాజెక్టులలో కూడా పని చేస్తున్నట్లు గమనించాను. సంపాదకులు పరిమితులున్నప్పటికి, వికీపీడియా 2008 లో అత్యధిక వీక్షణలు పొందితే ఇతర ప్రాజెక్టులు తరవాత పొందినట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఆ ప్రాజెక్టులలో పనిచేస్తున్నవారికి మన వెబ్ ఛాట్ సమావేశం గురించి తెలియచేయండి. -- --అర్జున 14:31, 28 డిసెంబర్ 2011 (UTC)
- రాజశేఖర్ గారూ నమస్కారం. వ్యక్తిగత కారణాల వలన తెవికీకి అంతర్జాలానికి దూరంగా ఉంటున్నాను. తెవికీ అన్నా దానికి పని చేయడమన్నా నాకు చాలా ఇష్టం అవకాశం లేక చేయలేక పోతున్నా. త్వరలోనే చురుగ్గా పని చేస్తాను. ధన్యవాదాలు. విశ్వనాధ్.బి.కె.
వికీపీడియన్ల వర్గీకరణ
[మార్చు]రాజశేఖర్ గారు, నగరాల వారీగా వికీపీడియన్లను గుర్తించడానికి, వారి సభ్యపేజీలో [[వర్గం:వికీపీడియా: <<నగరం పేరు>> లోని వికీపీడియన్లు]] అనే మూస చేర్చండి. ఆ తరువాత వికీపీడియన్ల పేజీలో ఆ వర్గానికి లింకు చేర్చండి. ఉదాహరణకి బెంగుళూరు వరుస చూడండి. --అర్జున 10:17, 30 డిసెంబర్ 2011 (UTC)
- వికీపీడియా ప్రాజెక్టు వర్గాలను వికీపీడియా పేరుబరి లో చేర్చాలి. అందుకని వర్గం: వికీపీడియా: వికీపీడియనులు అనడమే సరి. --అర్జున 13:05, 30 డిసెంబర్ 2011 (UTC)
- పైన నేను చెప్పినది పొరబాటు. వర్గాలు వేరే పేరుబరి కాబట్టి వికీపీడియా ఉపసర్గ అవసరం లేదు. నేను బాట్ ద్వారా తప్పుని సరిదిద్దాను.--అర్జున 12:25, 2 జనవరి 2012 (UTC)
రేపటి వెబ్ ఛాట్
[మార్చు]మీరు రేపటి వెబ్ ఛాట్ లో చేరుతున్నట్లయితే వికీపీడియా: సమావేశం/వెబ్ ఛాట్ లో మీ పేరు చేర్చండి.--అర్జున 13:22, 30 డిసెంబర్ 2011 (UTC)
- ధన్యవాదాలు --అర్జున 15:09, 30 డిసెంబర్ 2011 (UTC)
సభ్యపేజీలో మార్పులు
[మార్చు]మీ సభ్యపేజీని మెరుగు చేయటానికి స్వతంత్రించి మార్పులు చేశాను. మీకు నచ్చకపోతే మన్నించాలి. --అర్జున 15:09, 30 డిసెంబర్ 2011 (UTC)
- మీ సహాయానికి ధన్యవాదాలు.Rajasekhar1961 07:19, 31 డిసెంబర్ 2011 (UTC)
పుస్తకాల ప్రాజెక్టు మూసల సందేహాలు
[మార్చు]మూసలు బాగానే పనిచేస్తున్నాయి. బొమ్మ కొరకు వాడవలసినది image= [[బొమ్మ:<<బొమ్మపేరు>>|200px| బొమ్మ పాఠ్యం]] వాడాలి. --అర్జున 17:28, 30 డిసెంబర్ 2011 (UTC)
- చిన్న సందేహం ఉపయోగించాల్సిన మూస పైదా లేదా క్రిందదా తెలియడం లేదు. పై దాంట్లో అన్నీ ఆంగ్ల కాలంలు ఉన్నాయి. క్రింది మూసలో కొన్ని తెలుగు కాలంలు కూడా ఉన్నాయి.ధన్యవాదాలు.Rajasekhar1961 07:21, 31 డిసెంబర్ 2011 (UTC)
- ఏదైనా వాడవచ్చు అనుకుంటాను. ఇంగ్లీషు కి తెలుగు పదాలు వుంటే అవి చూపబడతాయి. --అర్జున 12:22, 31 డిసెంబర్ 2011 (UTC)
పుస్తకాల గణాంకాలు
[మార్చు]గణాంకాలు ప్రాజెక్టు పేజీలో తాజా పరిచాను. మీరు చర్చించాలనుకుంటే నేను వెబ్ ఛాట్ లో వుంటాను. --అర్జున 12:19, 31 డిసెంబర్ 2011 (UTC)
చర్చాపేజీలో వ్యాఖ్యలు
[మార్చు]మీరు చర్చాపేజీలో కొత్త విషయమై వ్యాఖ్యలు రాస్తే, భద్రపరచే ముందు సారాంశంను తాజా చేయండి. అలాచేస్తే మార్పులు చూసేవారికి ఉపయుక్తంగా వుంటుంది లేకపోతే తేడాలు చూస్తాకాని ఆ పేజీకి వెళ్లితే కాని మీరు రాసిన విషయం బోధపడదు-- అర్జున 13:49, 31 డిసెంబర్ 2011 (UTC)
?
[మార్చు]రాజశేఖర్ గారు, మీరు ఎవరికైనా క్షమాణలు చెప్పండి, నాకెలాంటి ఇబ్బంది లేదు. కాని మొత్తం పరిశీలించే చేస్తున్నారా? మరేదైనా కారణముందా? ఎప్పుడో ఒకప్పుడు తెవికీ నియమాల గురించి చెబితే నాపై నిందలు మోపిన సభ్యునికి తప్పు జరిగిందని ఎలా చెబుతున్నారు? నియమాలను చెబితే పట్టించుకోకుండా ఎగిరిన సభ్యుడికి మీరు ఎలా వంతపాడుతున్నారు? ఇటీవల మీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం పరోక్షంగా చెప్పారు. చర్చాపేజీలనేవి చర్చలు జరుగడానికే, కొందరు సభ్యులు తెవికీ నియమాలను ఉల్లంఘించి, చెప్పిన వారికి ఎదురు తిరిగి వాదానికి దిగితే ఎవరిది తప్పు? 2008, 2009లలో నేను చురుగ్గా ఉన్నప్పుడు ప్రతివారి దిద్దుబాట్లు పరిశీలించి తగిన సూచనలు చేశాను. అదే తప్పా? కేవలం ఒక సభ్యుడు కొరకు తెవికీకి ఇప్పటికే ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. మీరు మాత్రం దీనికి విరుద్ధంగా అర్థం చేసుకుంటున్నారు. మీరు చర్చా పేజీలలోకి రారు, మీ అభిప్రాయం చెప్పరు. చర్చలు జరిపిన వారికి ఇన్నాళ్ళ తర్వాత ఇలా చెప్పడం బాగుంటుందా? దిద్దుబాట్లు కంటే నిర్వాహణ కార్యక్రమాలు మరియు చర్చాపేజీలలో అభిప్రాయం చెప్పడం మంచి పద్దతి. "తప్పు" అనేదానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిసభ్యుడు తమ ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తే ఏమవుతుందో మీకు తెలుసు. దిద్దుబాట్లపై పరిశీలిస్తూ, నిర్వాహణ కార్యక్రమాలు చేపడుతూ తగిన సూచనలు చేయడం తప్పు అయితే ఇక చేసేదేమీ ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:44, 31 డిసెంబర్ 2011 (UTC)
- ఇటీవల గోపాలకృష్ణ అనే సభ్యుడు తెలిసో తెలీకో ఒక పేజీలో సమాచారం తొలిగిస్తే ఎలాంటి చర్చా, ముందస్తు హెచ్చరిక లేకుండా ఏకంగా సభ్యుడిపై నిరోధం విధించారు. దానికి సమాధానం కూడా నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. పైగా హద్దుదాటున్నారని నిందించడం బాగుండదు. ఇలా చేయడం తెవికీ ప్రయోజనాలకై చురుగ్గా ఉండే సభ్యులకు నిరుత్సాహం కలిగించడమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:59, 31 డిసెంబర్ 2011 (UTC)
- రాజశేఖర్ గారు, పాత సభ్యులను ఆహ్వానించాలనే మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కాని మీరు అనుసరించిన పద్దతే నాకు నచ్చలేదు. వికీ నియమాలను పాతాళానికి తొక్కిపడేసి, నియమాలు చెప్పిన సభ్యులపై కోపాన్ని ఆకాశానికి ఎత్తే సభ్యుడికి మీరు ఆహ్వానం పంపే బదులు అంతకు వందరెట్లు నైపుణ్యం ఉన్న ఉద్ధండులను మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే మేలు. వైజాసత్య, చదువరి, ప్రదీప్, అహ్మద్ నిస్సార్, రంగారావు, తలపాగల రాజు, మాటలబాబు, దేవ్, వీరా శశిధర్ లాంటి వారిని ఎందుకు విస్మరిస్తున్నారు? సభ్యుడి మెచ్చుకొరకు తప్పును నా మీదికి దొర్లిస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడనప్ప్పుడు, ఆ తర్వాత కూడా దానికి దూరంగా ఉండడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:40, 2 జనవరి 2012 (UTC)