వాడుకరి చర్చ:Sridhar1000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పూర్తి విరమణ


ఈ వాడుకరి ఇక నుంచి తెలుగు వికీపీడియా కోసం పని చేయటం లేదు..

స్వాగతం

Sridhar1000 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sridhar1000 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  

ఓటింగ్[మార్చు]

Sridhar1000 గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున t.sujatha 17:43, 12 జనవరి 2012 (UTC)

ధన్యవాదాలు శ్రీధర్, మీకు పరిచయమున్న వారికి కూడా ఈ విషయం గురించి తెలియచేస్తున్నందులకు ధన్యవాదాలు. --అర్జున 08:08, 13 జనవరి 2012 (UTC)
శ్రీధర్ గారూ ! నేను ఒంగోలు తరచూ వస్తుంటాను. మీకు ఆసక్తి ఉంటే నన్ను కలసి మాట్లాడ వచ్చు.t.sujatha 18:02, 10 ఫిబ్రవరి 2012 (UTC)

బొమ్మ పేర్లు[మార్చు]

మీరు అప్లోడ్ చేసిన బొమ్మలు బొమ్మకు సంబంధించిన పేర్లతో కాకుండా అంకెలతో ఉంటున్నాయి. ఉదా:కు బొమ్మ:DP153185.jpg, బొమ్మ:DP153162.jpg, బొమ్మ:DP153189.jpg, బొమ్మ:SL 16 2010 1 3.JPG, బొమ్మ:DP153189.jpg, బొమ్మ:DP153154.jpg, బొమ్మ:AN01028835 001 l.jpg, బొమ్మ:2006AJ6330.jpg, బొమ్మ:AN00135338 001 l.jpg, బొమ్మ:2006AJ6361.jpg, బొమ్మ:F1907.271.194.jpg, బొమ్మ:F1907.271.270.jpg, అలాగే కొన్ని బొమ్మలకు చాలా పెద్ద పేర్లు ఇస్తున్నారు. ఉదా:కు

ఇక ముందు అప్లోడ్ చేసే ముందు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది. పై బొమ్మల పేర్లను మార్చడానికి తరలింపు ఉమయోగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:32, 3 మార్చి 2012 (UTC)

నిర్వాహకహోదా - స్వయంగా సభ్యుల చర్చాపేజీలు ఉపయోగించడం[మార్చు]

మీరు నిర్వాహకహోదాకై ప్రతిపాదించిన తర్వాత స్వయంగా సభ్యుల చర్చాపేజీలలో ఈ విషయం గురించి చర్చ జరిపే అవసరం లేదండి. అంతగా అవసరమైతే రచ్చబండను ఉపయోగించవచ్చు సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:45, 12 ఏప్రిల్ 2012 (UTC)

తొలిగించాల్సిన బొమ్మలు[మార్చు]

మీరు బొమ్మలను ట్రాన్స్‌ఫర్ చేసిననూ తొలిగించలేదని వ్రాశారు. కామన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడ తొలిగించాల్సిన బొమ్మలకు సంబంధించిన ఫైలు పేర్లు తెలియజేస్తే వాటిని తొలిగించగలము. లేదా ఆ బొమ్మలకు సంబంధించిన పేజీలలో తొలిగించు మూసను ఉంచండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:12, 18 ఏప్రిల్ 2012 (UTC)

సమాచారాన్ని తొలగించడం[మార్చు]

మీరు కొన్ని వికీపేజీల నుండి సమాచారాన్ని తొలగిస్తున్నారు. మల్లీ ఇలాంటి చర్యలకు పాల్గొంటే మీ చర్యల్ని వికీలో నిషేధించాల్సి వస్తుంది.Rajasekhar1961 (చర్చ) 16:43, 24 ఏప్రిల్ 2012 (UTC)

చాలా వికీలలో వాండలిజంకు పాల్బడుతున్నందున కామన్స్ వికీ చర్చాపేజీలో వారు హెచ్చరిక కూడా తెలియజేశారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:35, 24 ఏప్రిల్ 2012 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.