విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ దశాబ్ది మహోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
Telugu Wikipedia
Wikimedia movement that started 13 years ago was indeed successful in fulfilling its motto of summing up all human knowledge. With 285+ languages and 2.6 crore article count, Wikipedia is the biggest such online encyclopedia available that comes with all the 4 freedoms of free software! Telugu Wikipedia that started with the same spirit 10 years ago on December 10, 2003. The ten years of journey saw 54,000 articles, contributed by hundreds of Volunteers. Today it stands among the top 3 Wikipedias in Indian languages. To recognise, appreciate and felicitate those who have been part of this Bigger Mahayajna is a great privilege that the organising committee of the Tewiki10 celebrations holds. We hope that this event would bring together the whole community and enable more collaborative projects at Tewiki.
దశాబ్ధి ఉత్సవాలు ఎందుకు
తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు
Why celebrate?
To popularise Telugu Wikipedia's growth and collaborative projects
To bring together all the contributors of Wikipedia onto one platform
To get to know what the end users of Tewiki expect from the free encyclopedia
కార్యక్రమ లక్ష్యాలు
తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం
Aims of the program
To increase Tewiki both in terms of Quality and Quantity
To increase Tewiki contributor userbase
To bring vital information pertaining to Telugu language through Tewiki
To encourage existing contributors to bring in more new contributors
To bring awareness about Tewiki among masses
To create a global visibility to Tewiki
To enable offline usage of Tewikipedia
కార్యక్రమ ముఖ్యాంశాలు
సీనియర్ వికీపీడియనులకు ఆహ్వానం, సన్మానం
వికీపీడియనులకు ప్రవేశ స్థాయి మరియు ఉన్నత స్థాయిలో శిక్షణ
సీనియర్ వికీ సభ్యుల అనుభవాలు, సలహాలు
వికీపీడియాలో రాబోయే రోజుల్లో చేయాల్సిన కృషిపై చర్చలు
Highlights of the program
Inviting and felicitating Senior Wikimedians
To train Wikipedians at a basic and at an advanced level
To take suggestions and guidance from senior wikimedians
Discuss on future projects
ముఖ్య తేదీలు
హైదరాబాదులో వికీపీడియా శిక్షణ శిబిరాలు
విజయవాడ-పరిసర ప్రాంతాల్లో వికీపీడియా శిక్షణ శిబిరాలు