Jump to content

వికీపీడియా చర్చ:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
10వ వార్షికోత్సవ సంబరాలు
10th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee


1. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల మొదటి సమావేశం (05.11.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, కశ్యప్, ప్రణయ్‌రాజ్

తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్ధేశ్యం

  • తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  • తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  • తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  • తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  • తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  • గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం

స్థలం

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం నిర్వహించడానికి స్థల నిర్ణయంకు మరికొన్ని రోజుల సమయం అవసరం. వార్షికోత్సవ తేదీలు - జనవరి మూడు లేదా నాలగో వారం.
  • వార్షికోత్సవానికి ముందుగా నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడక్కడ (విజయవాడ, వైజాగ్, నూజివీడు మొ.) తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరాలను నిర్వహించాలి. దీనిద్వారా అక్కడి పరిస్థితులు, పరిసరాలు, పరికరాలు మొదలైనవాటిగురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.

చేయవలసిన పనులు

  • కశ్యప్ గారు, మల్లాది గారు కేబీఎన్ కాలేజీ వారితో మాట్లాడి వార్షికోత్సవానికి స్థల నిర్ధారణ చేసి, శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి అనుమతి తీసుకోవాలి.
  • కార్యవర్గ సభ్యులందరూ కలిసి వార్షికోత్సవ ప్రణాళిక సిద్ధం చేయాలి.
  • ప్రెస్ నోట్ సమిష్టి కృషితో రూపొందించాలి.

జరిగిన పనులు

  • కశ్యప్ గారు కేబీఎన్ కాలేజీ వారితో మాట్లాడారు. వారు త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.
  • కార్యవర్గ సభ్యులందరూ కలిసి వార్షికోత్సవ ప్రణాళికను 20వ తేదీ లోపున తయారుచేస్తామని చెప్పారు. ఈ బాధ్యతను రాజశేఖర్ గారు స్వీకరించారు.
  • ప్రెస్ నోట్ విషయమై మరింత చర్చ జరగాలి.

2. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల రెండవ సమావేశం (13.11.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రాజశేఖర్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, ప్రణయ్‌రాజ్,

ఈ రెండవ సమావేశంలో కార్యవర్గ సభ్యులకు ఈ క్రింది బాధ్యతలు అప్పగించబడ్డాయి

  • సమావేశంలో చర్చించుకున్న అంశాలు, కార్యవర్గ సభ్యులకు అప్పగించిన బాధ్యతలు, జరిగిన పనుల గురించిన పూర్తి సమాచార సేకరణ ప్రణయ్‌రాజ్
  • నూజివీడు కళాశాలలో శిక్షణా శిబిరానికి రహ్మనుద్దీన్ గారు, విష్ణు కళాశాలతో శిక్షణా శిబిరానికి విశ్వనాథ్ గారు అనుమతి తీసుకుంటామన్నారు. చుట్టుప్రక్కల ఉన్న వికీపీడియన్లను ఈ శిబిరాలలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు.
  • AP Tourism, Residential Schools వాళ్ళకి శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి అనుమతి తీసుకొనడం విష్ణువర్ధన్
  • డిసెంబర్ 7 నుండి 17 వరకు ఎన్.టి.ఆర్ స్టేడియం, హైదరాబాద్ లో జరిగే బుక్ ఫెయిర్ కి E-Telugu వారు ఏర్పాటు చేసే ఒక స్టాల్ లో తెవికీ ప్రెసెంటేషన్, వాడుకరుల ఫోటోలు, ప్రొఫైల్స్ స్క్రీనింగ్ చేయడం. దీనికి సంబంధించిన PPT ని విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్ లు తయారుచేస్తారు. దానిని మిగతా సభ్యులు చూసి, conform చేసాక presentationకి ఇవ్వడం జరుగుతుంది. మాటామంతిలో వాడుకరుల వివరాలు ఉంటాయి. తెవికీ తరపున రొజుకొకరు ఆ స్టాల్ లో పాల్గొనాలి. రోజువారి సమీక్షను రాజశేఖర్ గారు నిర్వహిస్తారు.
  • గోల్డెన్ త్రెషోల్డ్ లో శిక్షణా శిబిరం నిర్వహించాలని కశ్యప్ గారి సూచన. పెద్ది రామారావుగారితో మాట్లాడి, అనుమతి తీసుకునే బాధ్యతను ప్రణయ్‌రాజ్ కు అప్పగించడం జరిగింది.
  • Times of India city edition లో, FM లలో తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం గురించిన ప్రకటనలు వచ్చేలా చూడడం విష్ణువర్ధన్
  • వచ్చే సమావేశంలోపు కార్యవర్గ సభ్యలందరూ కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలి. దీనికి రాజశేఖర్ గారు బాధ్యత వహిస్తారు.

తెలుగు వికీపీడియాలో

జరిగిన పనులు

  • విష్ణు కళాశాలలో వైఫై లేదు, అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి త్వరలో శిక్షణా శిబిరానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని విశ్వనాథ్ గారు చెప్పారు.
  • నూజివీడు కళాశాలలో శిక్షణా శిబిరానికి సంబంధించిన వివరాలు 25వ తేదిన తెలియజేస్తానని రహ్మనుద్దీన్ గారు చెప్పారు.
  • AP Tourism, Residential Schools వాళ్ళకి శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి అనుమతి ప్రక్రియ ప్రారంభమైందని డిసెంబర్ 7వ తేదిలోపు హైదరాబాద్ లో శిక్షణా శిబిరం నిర్వహిస్తామని విష్ణువర్ధన్ గారు చెప్పారు.
  • బుక్ ఫెయిర్ కి E-Telugu వారు స్టాల్ ఏర్పాటు చేసేది లేనిది ఇంకా నిర్ధారణ కాలేదని రహ్మనుద్దీన్ గారు చెప్పారు.
  • గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏ రకమైన శిక్షణా శిబిరం నిర్వహించదలచామో తెలిస్తే అనుమతికి అనుకూలంగా ఉంటుందని ప్రణయ్‌రాజ్ గారు చెప్పారు.
  • Times of India city edition లో, FM లలో తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవం గురించిన ప్రకటనల ప్రక్రియ ప్రారంభమైందని విష్ణువర్ధన్ గారు చెప్పారు.
  • కార్యక్రమ ప్రణాళిక రహ్మనుద్దీన్ గారు Google Docs లో అందరికి పంపించారు. అందరి అభిప్రాయాలు కావాలి.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు వ్యాసాల రచన గురించి ఇతర వికీపీడియన్లకు చెప్పామనీ, తాము కూడా రాస్తున్నామని విశ్వనాథ్, ప్రణయ్‌రాజ్ లు చెప్పారు.

3. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల మూడవ సమావేశం (20.11.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, అర్జునరావు, రాజశేఖర్, టి. సుజాత, రహ్మనుద్దీన్, కశ్యప్, విశ్వనాథ్, ప్రణయ్‌రాజ్.

ముందుగా గతవారం అనుకున్న పనులపై సమీక్ష జరిగింది. కార్యవర్గ సభ్యులు తమతమ బాధ్యతలు ఎంతవరకు వచ్చాయో తెలియజేశారు. అనంతరం మిగతా విషయాలపై చర్చ జరిగింది.

చేయవలసిన పనులు

  • ప్రెస్ నోట్ తయారి
  • కార్యక్రమ ప్రణాళిక (ఇది Table రూపంలో ఉంటే బాగుంటుంది. Table తయారి విశ్వనాథ్, ప్రణయ్‌రాజ్)
  • వికీపీడియాలోని సమాచారాన్నంతటిని CDs రూపంలో అందరికి అందుబాటులోకి తేవడం. (దీనికి అర్జునరావు గారు బాధ్యత వహించగా సహాయం అందిస్తానని చెప్పారు. ఇంతకు ముందు సిడితయారీలో అనుభవమున్న కశ్యప్ లాంటి వారు నాయకత్వం తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన్ సముచిత వినియోగ హక్కుల గురించి సిఐఎస్ లో న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారు. ముఖచిత్రాన్ని విశ్వనాథ్ గారు తయారు చేయటానికి ముందుకువచ్చారు,
  • వికీపీడియాలో చురుగ్గా పనిచేస్తున్న వికీపీడియన్లను ఎంపికచేసి, వారి గురించిన వివరాలతో ప్రెస్ నోట్ ఇవ్వడం. అంతేకాకుండా నగదు పురస్కారం, సర్టిఫికేట్స్ అందించడం మంచిదని అర్జున సలహా ఇచ్చారు. (ఎంపికకు వైజాసత్యగారు న్యాయనిర్ణేతగా ఉంటారు. అర్జునరావు, రాజశేఖర్, టి. సుజాత గారుల సహకరిస్తారు. ఈ ఎంపిక విషయాలు రచ్చబండలో చర్చించవలసి ఉంటుంది). దీనిని వేగవంతంగా చేయటానికి దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వహాకవర్గం నగదు పురస్కారానికి కేటాయింపుని రెండు రోజులలో ఖరారు చేయాలని కోరారు.


  • వికీపీడియాతో పరిచయం ఎలా ఏర్పడింది, వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు రాశారు అనే అంశంపై ప్రతి వికీపీడియన్ తో 5 ని.ల పరిచయం. ఇతర భాషా వికీపీడియన్లను దశమ వార్షికోత్సవానికి ఆహ్వానించడం.

4. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల నాల్గవ సమావేశం (03.12.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, అర్జునరావు, రాజశేఖర్, టి. సుజాత, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్,

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథుల వివరాలు, ఏ రోజున ఎవరిని ఆహ్వానించాలి అన్నదానిపై స్పష్టత.
  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ ఉత్సవాలకు విచ్చేస్తున్న సభ్యులకు ఇన్సురెస్ తదితర అంశాలపై చర్చ.
  • తెలుగు శైలుల గురించి వికీపీడియన్లతో అవగాహన.
  • సాంకేతికాలు తదితర అంశాలపై సాంకేతిక నిపుణులతో అవగాహన.
  • తెలుగు వికీడియన్ల అభిప్రాయ సేకరణ.
  • పురస్కార గ్రహీతల సందేశం.
  • active wikipedians గురించి, వారు రాస్తున్న Topics గురించి వివిధ బ్లాగులలో రాయడం, తెవికీలో Update చేయడం, వార్తా పత్రికలల్లో ప్రచురించడం.

5. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల ఐదవ సమావేశం (12.12.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ ఉత్సవాల పేజీని తయారుచేయడం.
  • ఉత్సవ వేదికను, తేదీని ఖరారుచేయడం.
  • వికీమీడియా ఫౌండేషన్ కి, CIS కి బడ్జెట్ ప్రపోజల్ పంపించడం

6. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల ఆరవ సమావేశం (20.12.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

7. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల ఏడవ సమావేశం (28.12.2013)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, ప్రణయ్‌రాజ్

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ ఉత్సవాల పేజీ సమీక్ష, సవరణలు
  • ఉత్సవ వేదికను, తేదీని ఖరారుచేయడం పై చర్చ
  • వికీమీడియా ఫౌండేషన్ కి, CIS కి బడ్జెట్ ప్రపోజల్ పంపించడం

8. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల ఎనమిదవ సమావేశం (02.01.2014)

ఇందులో పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్.

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

  • తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ ఉత్సవాల పేజీ సమీక్ష, సవరణలు
  • ఉత్సవ వేదికగా కె.బి.ఎన్. కళాశాల (విజయవాడ), తేదీ 15 & 16 ఫిబ్రవరి 2014గా ఖరారుచేయడం జరిగింది.
  • వికీమీడియా ఫౌండేషన్ కి, CIS కి బడ్జెట్ ప్రపోజల్, Item Wise Clarity తో పంపించడం

9. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల తొమ్మిదవ సమావేశం (17.01.2014)

ముందుగా కార్యనిర్వాహకవర్గం సమావేశమయింది. పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్. ఇందులో సహాయమండలితో చర్చించాల్సిన అంశాల గురించి ఒక అవగాహనకు రావడం జరిగింది. అవి,

  • బడ్జెట్ కి సంబంధించి సమగ్ర సమీక్ష : వికీమీడియా ఫౌండేషన్ నుండి మెయిల్ రాలేదు. కనుక ఇంకా నిర్థారణ చేయలేదు.
  • ఉత్సవ కార్యక్రమ ప్రణాళిక : ఫిబ్రవరి 15, 16 తేదీలలో జరిగే కార్యక్రమాల అవగాహన.
  • ముఖ్య అతిధులు : ముఖ్య అతిధులుగా ఎవరిని ఆహ్వానించాలి.

అనంతరం సహాయక మండలితో సమావేశం జరిగింది. సహాయక మండలి నుంచి అర్జున, రాజశేఖర్, టి. సుజాత, మల్లాది కామేశ్వరరావు, రాధాక్రిష్ణ లు పాల్గొన్నారు.

సమావేశంలో చర్చించుకున్న అంశాలు బడ్జెట్

  • బడ్జెట్ గురించి వికీమిడియా ఇండియా చాప్టర్ వారికి, CIS వారికి బడ్జెట్ రిక్వెస్ట్ పంపించడం జరిగిందని..వికీమీడియా ఫౌండేషన్ కు బడ్జెట్ రిక్వెస్ట్ పంపించాల్సివుందని అందులో CIS వారు 1,50,000/- మరియు T-Shirts (సుమారు 1,00,000/-) ఇస్తున్నారని, వికీమిడియా ఇండియా చాప్టర్ వారి నుండి ఇంకా సమాధానం రాలేదని, రాగానే అందరికి తెలియజేస్తామని, వికీమిడియా ఇండియా చాప్టర్ బడ్జెట్ విషయంలో అర్జునరావు గారు సహాయం చేయాలని రహ్మనుద్దీన్, విశ్వనాథ్ లు చెప్పారు.
  • బడ్జెట్ రిక్వెస్ట్ ను సమీక్షించి తెలియజేస్తానని... ముందుగా బడ్జెట్ రిక్వెస్ట్ ల గురించి సభ్యులందరికి తెలిసేలా రచ్చబండలో రాయాలని అర్జున గారు సూచించారు.
  • రచ్చబండలో చేర్చే బాధ్యతను ప్రణయ్‌రాజ్ స్వీకరించారు.
  • వీలైనంత త్వరగా బడ్జెట్ విషయంలో స్పష్టత ఉండాలని విష్ణువర్ధన్ గారు అన్నారు.

కార్యక్రమ ప్రణాళిక

  • కార్యక్రమ ప్రణాళిక గురించి కశ్యప్ గారు క్లుప్తంగా వివరించారు.
  • ఉత్సవం 2 రోజులా ? 3 రోజులా అన్నదానిపై స్పష్టత కావాలనీ, వికీపీడియన్లే కాకుండా ఇతరులు కూడా ఉత్సవంలో పాల్గొనేలా చేయాలనీ, ఉగాది మహోత్సవంలో చేసిన విధంగా ఒక సందర్శన ఉండాలనీ, తెలుగేతర వికీపీడియన్లు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా అర్థమయ్యేవిధంగా ఒక కార్యక్రమం ఉండాలని అర్జున గారు సూచించారు.
  • ఉత్సవంలో ముఖ్యభాగం 2 రోజులు ఉంటుందని, 3వ రోజు ఇష్టమైనవారు ఉండొచ్చనీ...వివిఐటి, కెబిఎన్, తిరువూరు కళాశాలల విద్యార్థులు ఉత్సవంలో పాల్గొంటున్నారనీ... సందర్శన కోసం 3వ రోజును ఏర్పాటుచేశామనీ...తెలుగేతర వికీపీడియన్లకు, తెలుగు వికీపీడియన్లకు అర్థమయ్యేవిధంగా Wiki Data/DIY Digitization వంటి కార్యక్రమాలు ఉన్నాయని విష్ణువర్ధన్ గారు అన్నారు.
  • కొత్తవాడుకరులను చేర్చడం ఎంత ముఖ్యమో, ఉన్న వాడుకరులను ఒక దారిపై తేవడం అంతకన్న ముఖ్యం. వాడుకరులు తమ సమస్యను చెప్పుకోవడానికి, పరిష్కారం పొందడానికి కొంత సమయం కేటాయిస్తే బాగుంటుందని మల్లాది కామేశ్వరరావు గారు సూచించారు.
  • అందుకోసం మొదటిరోజున మాటా మంతీ, రెండవ రోజున చర్చా గోష్టి వంటి కార్యక్రమాలు ఏర్పాటుచేశామని విష్ణువర్ధన్ గారు పేర్కొన్నారు.

ముఖ్య అతిధులు

  • ఈ విషయంలో కార్యవర్గ సభ్యులు కొంతమంది పేర్లను సూచించారు. వీరిలో కొంతమందిని ఆహ్మానించవచ్చు. వారు.
  • వికీమీడియా ఫౌండేషన్ నుండి ఒకరు, వికీమీడియా ఇండియా ఛాప్టర్ నుండి ఒకరు, కెబిఎన్ కళాశాల నుండి ఒకరు, మండలి బుద్ధప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపలతి, జెఎన్టియుకె ఉపకులపలతి, రామోజీరావు, తెలుగు అకాడమి డైరెక్టర్, కారా మాస్టార్, తుర్లపాటి కుటుంబరావు, గాజుల సత్యనారాయణ, కొమర్రాజు తెలుగు కేంద్రం నుండి ఒకరు, జొన్నవిత్తుల మొ.వారు.

దీనిపై మరింత చర్చ జరగాలి.

10 తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల పదవ సమావేశం (25.01.2014)

ఉదయం 10.30నిలకు కార్యవర్గ సభ్యులు అత్యవసర సమావేశం జరిగింది. పాల్గొన్నవారు, విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్.

ఇందులో గ్రాంట్ విషయమై చర్చలు జరిగాయి. అవి,

  1. చాప్టర్ బడ్జెట్ రిక్వెస్ట్ కి ఎటువంటి సమాధానం రాలేదు. కనుక, 48 గంటల్లో వారి సమాధానం ఇవ్వాలని మెయిల్ చేయడం.
  2. చాప్టర్ నుండి వచ్చిన సమాధానం ను బట్టి, వికీమీడియా ఫౌండేషన్ ని సంప్రదించడం.
  3. CIS నుండి అడ్వాన్స్ త్వరగా వచ్చేలా చూడడం.

అనంతరం రేపు సహాయక మండలితో జరిగే సమావేశం ఎజెండాపై చర్చ జరిగింది.

11 తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల పదకొండవ సమావేశం (26.01.2014)

ముందుగా కార్యనిర్వాహకవర్గం సమావేశమయింది. పాల్గొన్నవారు విష్ణువర్ధన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్.

ఇందులో సహాయమండలితో చర్చించాల్సిన అంశాల గురించి ఒక అవగాహనకు రావడం జరిగింది. అవి,
గ్రాంట్ కి సంబంధించి సమగ్ర సమీక్ష : వికీమీడియా ఇండియా చాప్టర్ నుండి గ్రాంట్ ఇవ్వలేమని మెయిల్ వచ్చింది. మళ్లీ మెయిల్ చేయడం.
క్యూ.ఆర్ కోడ్ విధానం : కె.బి.ఎన్ కళాశాలలో విద్యార్థులచే క్యూ.ఆర్ కోడ్ విధానంలో 25 వ్యాసాలు తయారుచేయడం.
వికీపీడియన్ల సమీకరణ : తెలుగు వికీపీడియన్లను, ఇతర భాషల వికీపీడియన్లను ఆహ్వానించడం
ముఖ్య అతిధులు : ముఖ్య అతిధుల నిర్ధారణ.
ఉత్సవ వేదిక అనుకూలత : దశమ వార్షికోత్సవం జరిగే స్థలం గురించి వివరణ.
భోజన మరియు వసతి : వికీపీడియన్ల వసతి, భోజన సదుపాయాల వివరణ.
మీడియా పార్టనర్స్ : హెచ్.ఎం టివి, హన్స్ ఇండియా పేపర్, కంప్యూటర్స్ ఫర్ యు మాసపత్రిక లపై చర్చ.

అనంతరం సహాయక మండలితో సమావేశం జరిగింది. సహాయక మండలి నుంచి రాజశేఖర్, టి. సుజాత, రాధాక్రిష్ణ మరియు వికీపీడియన్ రాజచంద్ర పాల్గొన్నారు.

గ్రాంట్ కి సంబంధించి సమగ్ర సమీక్ష
వికీమీడియా ఇండియా చాప్టర్ నుండి గ్రాంట్ ఇవ్వలేమని మెయిల్ వచ్చిందనీ, చాప్టర్ ఇంత ఆలస్యంగా స్పందించి, గ్రాంట్ ఇవ్వలేమని చెప్పడం బాలేదని, గ్రాంట్ కోసం మళ్లీ మెయిల్ చేస్తామని విశ్వనాథ్ గారు అన్నారు.

క్యూ. ఆర్ కోడ్ విధానం
కె.బి.ఎన్ కళాశాలలోని 25 మంది విద్యార్ధులను ఎన్నిక చేసి వారిని వికీకాంపస్ అంబాసిడర్స్‌ గా తయారుచేయడం జరుగుతున్నది. వారి ద్వారా క్యూ.ఆర్ కోడ్ విధానంలో 25 వ్యాసాలు (టెలిస్కోప్, 21 గణపతి పత్రి వనం, జూవాలజీ మ్యూజియం, వాల్వు రేడియో, లైబ్రరీ మొ.నవి) తయారుచేయదలిచామని, వాటికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తామనీ, ఆ విద్యార్థులు వ్యాసాలు తయారుచేసే క్రమంలో సభ్యుల సహకారాలు అవసరమని, త్వరలోనే రచ్చబండలో తెలియజేస్తామని విష్ణువర్ధన్ గారు అన్నారు. దానికి రాజశేఖర్ గారు, టి. సుజాత గారు అంగీకరించారు. క్యూ.ఆర్ కోడ్ విధానం అంటే ఏమిటి? దాని అవసరం ఏంటి అనేదానిపై రాధాక్రిష్ణ గారు వివరణ ఇచ్చారు.

వికీపీడియన్ల సమీకరణ
దశాబ్ధి ఉత్సవాలకి ఇప్పటికే 35 మంది తెలుగు వికీపీడియన్లను, 36 మంది ఇతర భాషల వికీపీడియన్లను ధరఖాస్తు చేసుకున్నారని, మొత్తం ధరఖాస్తులలో 40 మంది తెలుగు వికీపీడియన్లను, ఒక్కో ఇతర భాష వికీపీడియన్ల నుండి ఇద్దరిని ఎంపికచేస్తామని విశ్వనాథ్ గారు తెలిపారు. తెలుగు వికీపీడియన్ల వాడుకరి చర్చ పేజీలలో, ఇతర భాష వికీపీడియా రచ్చబండలలో ఆహ్వానాలు పంపించాలని విష్ణువర్ధన్ గారు సూచించగా, తెలుగు వికీపీడియన్ల వాడుకరి చర్చ పేజీలలో రాసే బాధ్యతను టి. సుజాత గారు, ఇతర భాష వికీపీడియా రచ్చబండలలో రాసే బాధ్యతను ప్రణయ్‌రాజ్స్వీకరించారు. రెండు రోజులలో ఈ పని పూర్తికావాలని విష్ణు గారు అన్నారు.

ముఖ్య అతిధులు
మండలి బుద్ధప్రసాద్ గారు ఫిబ్రవరి 15, 16 తేదీలలో విజయవాడలో ఉంటున్నందున ఆయన్ను ఉత్సవానికి ఆహ్వానించామని విష్ణువర్ధన్ గారు తెలుపగా, మండలి బుద్ధప్రసాద్ గారిని 15వ తేదీన ముఖ్య అతిధిగా, 16వ తేదీన విశిష్ట అతిధిగా ఆహ్వానించాల్సిందిగా కశ్యప్ గారు సూచించారు. అంతేకాకుండా 16వ తేదీన ముఖ్య అతిధిగా హెచ్.ఎం టివి నుంచి రామచంద్రమూర్తి గారు, ఐలాపురం వెంకయ్య గారు (ఎమ్. ఎల్. సి. విజయవాడ), తూర్లపాటి కుటుంబరావు గారు, 10000వేల గుండె ఆపరేషన్లు చేసిన డా.రమేష్ గారు వంటివారు వస్తున్నారని, ముఖ్య అతిధులు దాదాపుగా ఖరారైనట్లు విశ్వనాథ్గారు చెప్పారు.

ఉత్సవ వేదిక అనుకూలత
కె.బి.ఎన్ కళాశాలలో ఉన్న వివిధ సదుపాయాల గురించి విశ్వనాథ్ గారు వివరించారు.

భోజన మరియు వసతి
విజయవాడలోనే పెద్ద హోటల్ అయిన ఐలాపురం హోటల్ లో వసతి ఏర్పాటుచేశామని, దానిలో ఒక అంతస్తు (20 గదులు) మొత్తం మనమే తీసుకున్నామని, హోటల్ వారికి వికీపీడియాపై ఉన్నగౌరవంతో 45% డిస్కౌంట్ కూడా ఇచ్చారని, వీరు హాస్పిటాలిటీ పార్టనర్‌గా వ్యవహరిస్తారని విష్ణువర్ధన్ గారు తెలిపారు.

మీడియా పార్టనర్స్
ఇప్పటికే కంప్యూటర్స్ ఫర్ యు మాసపత్రిక వాళ్ళు వ్యాసం ఇవ్వడానికి ఒప్పుకున్నారనీ, హెచ్.ఎం టివి, హన్స్ ఇండియా పేపర్ వాళ్లని సంప్రదించగా వారుకూడా మీడియా పార్టనర్స్ గా ఉండడానికి అంగీకరించారని, కంప్యూటర్ ఫర్ యు పత్రికవారు తెలుగులో వ్రాయడం ఎలా ? అనే పుస్తకాన్ని ప్రింట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని, పూర్తి వివరాలు త్వరలో తెలుపుతానని విష్ణువర్ధన్ గారు తెలిపారు. మీడియా పార్టనర్ లను అందరు ఏకగ్రీవంగా ఆమోదించారు.

కె.బి.ఎన్ కళాశాలలో ఉత్సవం జరగడానికి, ఐలాపురం హోటల్ లో వసతి ఏర్పాటు, ముఖ్య అతిధుల ఆహ్వానం, హెచ్.ఎం టివి, హన్స్ ఇండియా పేపర్ మీడియా పార్టనర్స్ వంటి అంశాలలో మల్లాది కామేశ్వరరావు గారు నిర్వహించిన పాత్ర గననీయమైనదని విష్ణు గారు కొనియాడారు.

12 తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల పన్నెండవ సమావేశం (29.01.2014)

పాల్గొన్నవారు విష్ణువర్ధన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్.

  1. వికీమీడియా ఫౌండేషన్ కి పెట్టిన బడ్జెట్ రిక్వెస్ట్ కి వికీమీడియా ఫౌండేషన్ లోని ఏడుగురు అనుకూలంగా స్పందించారనీ, ఆలస్యంగా గ్రాంట్ కి అప్లై చేయడం, వికీమీడియా చాప్టర్ ఇవ్వలేని గ్రాంట్ ఫౌండేషన్ వారిని అడగడం వంటి విషయాలలో ఫౌండేషన్ వారు వేసిన ప్రశ్నలను సమీక్షించి, సరైన సమాధానాలు ఇవ్వడం జరిగిందనీ, ఓటింగ్ పూర్తయిన తర్వాత GAC నుండి అప్రూవల్ రాగానే, గ్రాంట్ పంపడంపై అభ్యర్ధన పంపించాలని విష్ణువర్ధన్ గారు తెలిపారు. దీనిద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇకపై ఏ కార్యక్రమానికైనా 2 నెలల ముందుగా గ్రాంట్ కి అభ్యర్ధన పంపించాలి.
  2. వసతికోసం మాట్లాడిన ఐలాపురం హోటల్ కి విష్ణువర్ధన్ గారు conformation Letter పంపించాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి ఐలాపురం హోటల్ వచ్చే మార్గాలను విశ్వనాథ్ గారు తయారుచేసి, ఉత్సవ పేజీలో పొందుపరచాలి.
  3. బ్యానర్లు, పోస్టర్స్ లలో ఉపయోగించుటకు మీడియా, ఇతర సంస్థల లోగోలు కావాలి. వారికి అభ్యర్ధన Letter పంపించాలి. ఈ బాధ్యతను కశ్యప్ గారు, అర్జున గారి సూచనలతో నిర్వర్తించాలి.
  4. రెండు రోజుల కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికోసం Google Docs లో ఒక పేజీని share చేయాలి. ఈ బాధ్యతను కశ్యప్ గారు నిర్వర్తించాలి.
  5. టీషర్ట్ డిజైన్, ఆర్డర్ పనులు పూర్తయ్యాయి. ఉత్సవ సమయానికి అందుబాటులో ఉంటాయని విష్ణువర్ధన్ గారు తెలిపారు.
  6. ఉత్సవానికి హజరయ్యే తెలుగు, ఇతర వికీపీడియన్ల ఎంపిక రెండు రోజులలో పూర్తికావాలి. ఈ బాధ్యతను విష్ణువర్ధన్ గారు, ప్రణయ్‌రాజ్. గారు, ప్రణయ్‌రాజ్ గారు నిర్వర్తించాలి.
  7. బ్యానర్లు, పోస్టర్స్, సర్టిఫికేట్స్, మెమోంటో మొదలైన అంశాలపై రహ్మన్ గారు, విశ్వనాథ్ గారు, కశ్యప్ గారు, ప్రణయ్‌రాజ్ గారు త్వరగా ఒక నిర్ధారణకి రావాలి.

13. తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల పదమాడవ సమావేశం (03.02.2014)

పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్

  1. 14-17 వరకి చేయవలసిన కార్యక్రమాల (minutes, travel, Chief guest, press and publicity) విషయంలో చాలా స్పష్టంగా ఉండాలని, ఎవరెవరు ఏఏ పనులు చేయాలో ఒక నిర్ధారణకి రావాలని, దానికోసం ఒక list తయారుచేసుకోవాలని విష్ణువర్ధన్ గారు తెలిపారు.
  2. QR coding project కోసం కెబిఎన్ కళాశాలలోని ambassadors list తయారుచేసి, వారికి ఇవ్వవలసిన వ్యాసాలు, సహకార వికీపీడియన్ గురించి ఒక నిర్థారణకి రావాలని, వ్యాసాల రచన త్వరగా ప్రారంభమవ్వాలని విష్ణువర్ధన్ గారు చెప్పారు. జాన్సన్ గారు ఈరోజు సెలవులో ఉండండంతో రేపు ఇస్తానన్నారని రహ్మనుద్దీన్ గారు తెలిపారు.
  3. Offline CD విషయంలో మరింత చురుగ్గా చేయాలని విష్ణువర్ధన్ గారు తెలిపారు.
  4. ఈవెంట్ కి సంబంధించిన Logistics, Properties లను విశ్వనాథ్గారు సరిచూసుకొని.. జాన్సన్ గారికి తెలియజేయాలి.
  5. 10-13 తేదీల మధ్యలో విజయవాడలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటుచేయాలని దానికోసం మల్లాది కామేశ్వరరావు, హైదారాబాద్ లో చేసే విషయమై కశ్యప్ గారు నిర్ణయం తీసుకోవాలని విష్ణువర్ధన్ గారు తెలిపారు.
  6. ఎంపికైన ఇతర భాషల వికీపీడియన్లకు ప్రణయ్‌రాజ్ ఫోన్స్, మెయిల్స్ ద్వారా సమాచారం అందించాలి.
  7. ముఖ్య అతిథులకు సమాచారం అందించి, వారు మాట్లాడవలసిన అంశాలపై వివరించాలి.
  8. చాలామంది తెవికీ సభ్యులు ధరఖాస్తు చేసుకోలేదు కనుక, అందరికి తెలిసేవిధంగా సైట్ నోటీసులు ఇవ్వడం, ఫోన్ ద్వారా సమాచారం అందించడం చెయ్యాలి.

తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల పద్నాల్గవ సమావేశం (05.02.2014)

పాల్గొన్నవారు విష్ణువర్ధన్, రాధాక్రిష్ణ, రహ్మనుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్‌రాజ్

సమావేశంలో చర్చించుకున్న అంశాలు

  1. ఐలవరం హోటల్ బుకింగ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ గా రూ 50,000/- ఇవ్వడం జరిగింది.
  2. స్కాలర్ షిప్ కి ఎంపికైన 8 మంది నాన్ తెలుగు వికీపీడయన్లుకు ఫోన్, మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఇంకా ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే వారిని కూడా ఆహ్వానిస్తాం.
  3. వికీమీడియా ఫౌండేషన్ నుండి గ్రాంట్ అప్రూవల్ అయింది. అయితే ఆ డబ్బు రావడానికి 30 రోజుల సమయం పడుతుంది. కాబట్టి CIS A2K వారిని అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతాం. ఫౌండేషన్ నుండి డబ్బు రాగానే వారికి ఇచ్చేస్తాం.
  4. ముఖ్య అతిధులు ఖరారు అయ్యారు.
  5. సర్టిఫికేట్ల డిజైన్ పూర్తయింది. Travel Vouchers కూడా ప్రింట్ చేయిస్తున్నాం.
  6. టిషర్టులు కూడా ఉత్సవం నాటికి అందుబాటులో ఉంటాయి.
  7. కె.బి.ఎన్. కళాశాలలో ఏర్పాట్ల గురించి జాన్సన్ గారికి మెయిల్ చెయాలి.
  8. కంప్యూటర్ ఫర్ యూ వారు 14వ తేదిన ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.
  9. QR Code కొరకు విద్యార్థులకు మెటీరియల్ అందించి, వారితో వ్యాసాలు రాయించాలి. దీని బాధ్యత రహ్మనుద్దీన్, విశ్వనాథ్ లు వహించాలి.


పదవవార్షికోత్సవ వేడుకలకు మీడియా పార్టనర్‌

కంప్యూటర్స్‌ ఫర్‌ యు పత్రిక వారు మన తెవికీ పదవవార్షికోత్సవ వేడుకలకు మీడియా పార్టనర్‌ గా ఉండడానికి సంప్రదించారు.
వారు చేసిన ప్రపోజల్

  1. త్వరలో విజయవాడలో జరిగే పదవవార్షికోత్సవ వేడుకలలో మీడియా పార్టనర్‌గా ఉండాలని. మీడియా పార్టనర్‌గా వారు తెలుగు వికీపీడియా గురించి కంప్యూటర్స్‌ ఫర్‌ యు పాఠకులకు తెలిసేలా, అలాగే విజయవాడలో పాల్గొనే వారికి తెలిసేలా ఒక వ్యాసాన్ని (రెండు పేజీలు) ప్రచురిస్తారు. దీనికి ఎటువంటి చార్జీలు లేవు. అలాగే అక్కడ పాల్గొనే ప్రతి సభ్యుడికి ఒక్కరికి ఒక్క కాపీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి మ్యాగజైన్‌ జనవరి 28 కల్లా మార్కెట్లో ఉంటుంది.
  2. వికీపీడియా ఆప్‌లైన్‌లో చూసుకునేలా ఏదేని సిడిని రూపొందిస్తే, దాన్ని వారి పత్రిక చందాదారులకు ఉచితంగా అందచేస్తామని చెప్పారు. (దీనికి చందాదారులకు ఎటువంటి చార్జీలు ఉండవు)
  3. మున్ముందు కూడా వికీపీడియా గురించిన ఎటువంటి అప్‌డేట్స్‌ ఉన్నా వాటిని తెలియచేస్తే వారి పత్రికలో ప్రచురిస్తామన్నారు.

ఈ ప్రపోజల్ పై మీ సలహాలు, సూచనలు అభ్యర్థనలు ఏమైనా ఉంటే తెలిపగలరు. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)14:53, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 13 కల్లా తెలియజేస్తే పత్రిక యాజమాన్యంతో సంప్రదింపులకు వీలుగా ఉంటుంది. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)15:05, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • విష్ణు గారి వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇతర పత్రికలు మాధ్యమాలకు భాగస్వామ్యవకాశాన్ని తెలియపరచినది తెలియలేదు. అలా తెలియపరచి వచ్చిన స్పందనలుబట్టి ఒకటి లేక అంతకంటే ఎక్కువ మాధ్యమాలను భాగస్వామ్యం చేస్తే మంచిది. దశాబ్ది ఉత్సవాలు చర్చా పేజిలో చివరి సారి కార్యనిర్వాహక వర్గం సమావేశ నివేదిక 20.11.2013 గా కనబడుతున్నది. కార్యనిర్వాహకవర్గం తమ చర్చలు, చర్యలు గురించి మరింత కాలబద్దంగా సముదాయానికి తెలిపితే సముదాయం పాలుపంచుకోటానికి వీలుంటుంది. ఇంతకు ముందు సంబంధిత చర్చాపేజీలలో వ్యాఖ్యలకు స్పందనలు కనబడలేదు లేక స్పష్టత రాలేదు (ఉదా1,ఉదా2) --అర్జున (చర్చ) 06:07, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారు మీ సూచనకు ధన్యవాదాలు. ఇతర పత్రికలు మాధ్యమాలకు భాగస్వామ్యవకాశాన్ని మనం ఇంతవరకు తెలియపరచలేదు. పైన చెప్పిన విధంగా కంప్యూటర్స్‌ ఫర్‌ యు మాస పత్రిక వారు మన తెవికీ దశాబ్ది కార్యక్రమం గురించి విని తమంతట తాముగా సంప్రదించడం జరిగింది. కార్యవర్గం దీనిని సముదాయం దృష్టికి తీసుకువచ్చింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపగలరు.
  • "ఎక్కువ మాధ్యమాలను భాగస్వామ్యం చేస్తే మంచిది" అని మీరిచ్చిన సలహాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాము.
  • ఇకపోతే ఇతర పత్రికలకు మరియు మీడియా సంస్థలను సంప్రదించండి అని మీరు మంచి సలహా ఇచ్చారు. దీనిని ఎలా చేయాలో సూచించగలరు. దశాబ్ది కార్యవర్గం మీ అమూల్యమైన సూచనలను పరిగణలోకి తీసుకొని వీలున్నంతలో తప్పక అమలు పరచడానికి చొరవ తీసుకుంటుంది. మల్లాది గారు ఈ విషయంలో మనకు సహాయపడతారని ఆశిస్తున్నాము.
  • కార్యనిర్వాహకవర్గం చర్చలు మరింత కాలబద్దంగా తెలియజేయడానికి తప్పక కృషి చేస్తాము.
దశాబ్ది ఉత్సవాలకు సంబందించిన చర్చలు దశాబ్ది ఉత్సవాలు చర్చా పేజిలో చర్చిస్తే బాగుంటుంది. సభ్యులు గమనించగలరు. ఈ చర్చను అక్కడ కూడా పోస్ట్ చేయగలము. కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు. --విష్ణు (చర్చ)08:26, 13 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ దశాబ్ది ఉత్సవాలు ముందస్తు ప్రచారం

విజయవాడలోని కొన్ని ప్రముఖ ప్రాంతాలలో తెవికీ దశాబ్ది ఉత్సవాలకు వారం ముందు లైబ్రరీ ,పార్క్ లలో వివరాలతో కూడిన బానర్ లు ఏర్పాటు చేయటం వల వికీ పైన కొంచెం అవగాహన కలుగుతుంది అన్న ఆలోచన వున్నది . ఇంకా ముందస్తు ప్రచారాలు ఏమి చేయవచ్చు ?

Ten Wiki సందర్భంలో వచ్చిన కొన్ని బొమ్మలకు రూపాంతరాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.