Jump to content

పుట్ట గొడుగు

వికీపీడియా నుండి
(పుట్టగొడుగులు నుండి దారిమార్పు చెందింది)
The mushroom Amanita muscaria, commonly known as "fly agaric"

పుట్టగొడుగు ను ఇంగ్లీషులో Mushroom ( మష్రూమ్స్)అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీటిలోని సిద్ధబీజాలపై, ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.

పుటకొక్కు , పుట్ట గొడుగులు

[మార్చు]

కుళ్ళి పోతున్న పదార్ధాలున్న చోట పెరుగుతుంటాయి కాబట్టి మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఏహ్యభావం ఉండటం సహజం . అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి . పుట్టగొడుగులలో " ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి . శరీరములో యధేచ్చగా సంచరిస్తూ డి.ఎన్‌.ఎ.ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు, కార్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఇవి ఎదుర్కొంటాయి పోర్టొబెల్లో, క్రెమిని ... రకాల పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్‌ 'D' ఉత్పత్తికి సహకరించేవిగా పనిచేస్తాయి . పుట్టగొడుగుల్లో 90 శాతము నీరే ఉంటుంది . సోడియం ఉండదు . పొటాసియం లభిస్తుంది, కొవ్వుపదార్ధము తక్కువ .. ఫలితంగా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు . రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్‌ ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి.

తిన దగిన పుట్ట గొడుగులు

[మార్చు]
  • పుట్ట గొడుగులను మామూలు కూరలాగానే వండుకుని తినే అలవాటు చాలాకాలం నుంచే జరుగుతున్నది.
  • ఈ కూర రుచికి శాఖాహారానికి, మాంసాహారానికి మధ్యస్తంగా ఉంటుంది. ఇవి తెలుపు రంగులో ఉంటాయి.
  • వీటిలో బటన్ మాష్రూం, ట్రఫుల్, జపాను,చైనాలోని షీతాకే కొన్ని.
  • పోర్టొబెల్లో,చాంటరెల్ ముఖ్యమైనవి.

కృత్రిమంగా పండించే పుట్ట గొడుగులు

[మార్చు]

పుట్ట గొడుగులు పెరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి.

ఉపయోగాలు

[మార్చు]

యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది ." ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్‌ 'D' పుస్కలముగా లభిస్తుంచి నందువల్ల ... ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది . మామూలుగా ఆహారములో వి్టమిన్‌'D' లభించదు . పు్ట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ 'D' అందుతుంది ..అయితే దీనివలన సన్‌ట్యాన్‌కి గురి అయ్యె ప్రమాధముంది . వీటిలో మొక్కలు, జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి . జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు . భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి . మాంస్కృత్తులు లభిస్తాయి . శరీర సౌష్టవం, కండర పుష్టికి దోహదపడతాయి . పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి, కండరాలకు, ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది . గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి . డయబిటీస్ ను తగ్గిస్తుంది. పుట్టగొడుగు ఫైబర్, పొటాషియం, విటమిన్ సి కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పుట్ట పూత

[మార్చు]

పుట్టలపై చాలా అరుదుగా పూస్తుంది. పుట్టలపై చాలా చిన్నవిగా అనేకం పూస్తాయి, ఇవి నేలపై చల్లిన మల్లెపూవు పూరేకుల వలె తెలుపు రంగులో ఉంటాయి. పుట్ట పూతను కూర వండుకొని తింటారు, చాలా రుచిగా ఉంటుంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]