Jump to content

గుగ్గిలం కలప చెట్టు

వికీపీడియా నుండి

గుగ్గిలం
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
షో. రొబస్టా
Binomial name
షోరియా రొబస్టా

గుగ్గిలం కలప చెట్టు బెరడు ముదురు బూడిదరంగులో గరుగ్గా ఉంటుంది. లేత నిన్నగా మృదువుగా ఉంటాయి. ఆకులు కోలగా, పెద్దవిగా నున్నగా మెరుస్తూ ఉంటాయి. కొమ్మలు గుగ్గిలం పూలు పసుపు పచ్చగా మధ్యభాగంలో నారింజ పండు రంగులో ఉంటాయి. రేకులు కొంతభాగం బూడిద రంగులో ఉంటాయి. గుగ్గిలం కాయ కోలగా ఉండి ఒకే ఒక గింజ ఉంటుంది.

పేరు కారణాలు

[మార్చు]

కెంటకీ వృక్ష శాస్త్రజ్ఞుడు డాక్టర్ చార్లస్ డబ్ల్యూ. షోర్ పేరుమీద 'షోరియా' అనే పేరు వచ్చింది. రొబస్టా అంటే లావు అని అర్ధం. మరాఠీలో ర్ల అంటే చెట్టునుండి స్రవించే ద్రవం అని అర్ధం.

ఉనికి,వ్యాప్తి.

[మార్చు]

ఆసియా దీని జన్మస్దానం. మయన్మారు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇండియాలో వ్యాపించి ఉన్నాయి. ఇండియాలో అస్సాం, బెంగాల్‌, ఒడిష్సా, జార్ఖండ్‌, హర్యానా, తూర్పు హిమాలయ పాదప్రాంతాలలో వ్యాపించి ఉంది. మధ్యభారతం లోని వింధ్య, సాత్పురా అరణ్యలోయ ప్రాంతాలలో (మధ్య, ఉత్తర ప్రదేశ్), యమున నది తీర ప్రాంతంలలో, తూర్పు కనుమలలో ఉన్నాయి. ఇండియాలో దాదాపు 1.15 లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 37, 700, జార్ఖండ్‌లో 33, 500, ఒడిస్సాలో 28, 750, ఉత్తరప్రదేశ్‌లో 5, 800, బెంగాల్‌లో 5, 250, అస్సాంలో 2, 700 ల చదరపుకిలోమీటర్ల మేర సాల్వ వృక్షాలున్నాయి (ఆధారం:SEA news circular, june'99) . అయితే ఈ మధ్యకాలంలో కలపకై ఈ చెట్లను అక్రమంగా నరకడం వలన, ఆదేస్ధాయిలో మొక్కలను నాటక పొవడంవలన వీటి విస్తీర్ణం కొంతమేర తగ్గినది.

చెట్టు

[మార్చు]

సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును. పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వర్ణము లోవుండి, నిలువుగా చీలికలుండి, 4-5సెం, మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం, మీ, వుండును. ఆకులు అండాకారంగా వుండి, ఆకుతొడిమ వద్ద కొద్దిగా వెడల్పుగా వుండును. వర్షపాతం అధికంగా వున్న ప్రాంతాలలో సతతహరితంగా, లేని ప్రాంతాలలో ఆకురాల్చును. ఆకులను పూర్తిగా రాల్చదు (మోడుగా మారదు) . ఫిబ్రవరి-ఏప్రిల్‌ నెలలలో ఆకురాల్చును. ఏప్రిల్‌-మే నెల మొదటి వారంలో చిగుర్చును. చిగిర్చిన వెంటనే పూలు ఏర్పడం మొదలై, జూలై నెల చివరికల్ల పళ్లు పక్వానికి వచ్చును. పూలు తెల్లగా వుండును. పండిన కాయ 1-1.5 సెం.మీ. వుండును. లోపలి పిక్క ముదురు గోధుమరంగులో (కాఫీ గింజ రంగులో) వుండును. కాయలో గింజశాతం 47% వుండును. గింజలో 13-14% వరకు సాల్‌ కొవ్వు (sal fat/butter) వుండును. ఒక ఎకరం వీస్తీర్ణంలో వున్న చెట్ల నుండి ఎడాదికి 400 కీజిల వరకు నూనెగింజలను సేకరించె వీలున్నది. కాని ఆ స్ధాయిలో సేకరణ జరగడం లేదు. ఆధిక మొత్తంలో విత్తన సేకరణకై చేసిన ప్రణాళికలు, అంచనాలకై పరిమితమై, అచరణలో వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం వున్న విస్తీర్ణాన్ని, ఎకరానికి వచ్చు దిగుబడిని లెక్కించిన దాదాపు 5.5 మిలియను టన్నుల నూనె గింజల సేకరణ జరగాలి. సేకరణ అనుకున్నట్లుగా జరిగినచో, గింజలలోని కొవ్వుశాతం 13%గా లెక్కించిన 7.15 లక్షల టన్నుల సాల్‌ కొవ్వు ఉత్పత్తి కావాలి. కాని 1-1.25లక్షల టన్నుల గింజలను మాత్రమే సేకరించగల్గుతున్నారు. అందువలన ఎడాదికి 10-13 వేల టన్నుల సాల్‌ కొవ్వును ఉత్పత్తి చేయగల్గుచున్నారు.

సంప్రదాయంలో గుగ్గిలం

[మార్చు]

బాగ్డీ, బౌరీలనే బెంగాలీ ఆదివాసులు గుగ్గిలం చెట్టుతో నిర్మించిన పందిట్లో పెళ్ళి చేసుకుంటారు. మరి కొందరు ఆదివాసులు గుగ్గిలం చెట్టు మీద భూతాలు ఉంటాయని విశ్వసిస్తారు. బౌద్ధులు గుగ్గిలం చెట్టుని పూజిస్తారు. బుద్ధుని తల్లి మాయాదేవి బుద్ధుని జనన సమయంలో గుగ్గిలం చెట్టుని ఆసరాగా పట్టుకుందని కథనం. బుద్ధుని నిర్యాణం గుగ్గిలం వనంలో జరిగిందని విశ్వాసం. గ్రామాల్లో పిల్లలు లేని దంపతులు గుగ్గిం చెట్టుని పూజించే ఆచారం ఉంది.గుగ్గిలం చెట్టు గింజలనుండి తీసిన నూనెను సాల్‌సీడ్ నూనె అంటారు.

ఉపయోగాలు

[మార్చు]

గుగ్గిలం కలప చాలా దృఢమైనది కనుక వంతెనలూ, పడవలు, రైల్వే బోగీలు, బండి చక్రాలు, ఇంటికి కావలసిన కొయ్య సామానులు చేస్తారు.

గుగ్గిలం నకు యితర భాషల్లో పేర్లు
భాష పేరు
లాటీన్‌నామం షొరియా రోబస్టా
ఇంగ్లీష్ సాల్‌
బెంగాలీ సాల్
హిందీ సాల్, సెకువా
మరాఠీ రల
పంజాబీ సాల్, సెలియా
ఒరియా సకువా
మలయాళం మరమరం
తెలుగు గుగ్గిలం
సంస్కృతం సాల, దీర్ఘఫల
తమిళం కుంగిలియం
కుటుంబం Diptero Capaceae