గులాబి
స్వరూపం
గులాబీ అనేది రోసా జాతికి చెందినది. పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. [1]చెట్టు కొమ్మలు నిటారుగా పదునైన ముళ్ళను కలిగి ఉంటాయి. గులాబీ సువాసన కలిగిన అందమైన పువ్వు. పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. [2] గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
Upayogalu
[మార్చు]తెగుళ్ళు, వ్యాధులు
[మార్చు]జాగ్రత్తలు
[మార్చు]- వేసవిలో గులాబీమొక్కలను ఎండ నుంచి కాపాడుకోవాలి.
- వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ లోకుండా చూసుకోవాలి.
- 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.
యునైటెడ్ స్టేట్స్ చిహ్నం
[మార్చు]1986లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ గులాబీని యునైటెడ్ స్టేట్స్ పూల చిహ్నంగా చేయడానికి చట్టంపై సంతకం చేశారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "rose | Description & Major Species". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-02-21.
- ↑ Stewart, David (2005). The Chemistry of Essential Oils Made Simple: God's Love Manifest in Molecules (in ఇంగ్లీష్). Care Publications. ISBN 978-0-934426-99-2.
- ↑ "National Flower | The Rose". statesymbolsusa.org. Archived from the original on 2020-03-16. Retrieved 2020-02-21.
- ↑ "Flowers & Gifts". www.growerflowers.com. Archived from the original on 2019-03-25. Retrieved 2020-02-21.