సతత హరితం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వృక్షశాస్త్రంలో సతతహరితం అనగా ఒక మొక్క మొత్తం నాలుగు సీజన్లలో (ఆరు రుతువులలో) ఎల్లప్పుడు పచ్చని ఆకులతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి. సతత హరిత మొక్కలు చెట్లు, పొదలగా అనేక రకాలు ఉన్నాయి.
సతతహరితాలు:
- కోనిఫెర్ల యొక్క చాలా జాతులలో (ఉదాహరణకు హెమ్లాక్, బ్లూ స్ప్రూస్, రెడ్ సెడార్, వైట్/స్కాట్స్/జాక్ పైన్)
- లైవ్ ఓక్, హాల్లీ, సైకాడ్స్ వంటి "పురాతన" జిమ్నోస్పెర్మ్లు (వివృతబీజాలు)
- మంచు వాతావరణానికి చెందిన అత్యధిక ఎంజియోస్పెర్మ్‌లు (ఆవృతబీజాలు), యుకలిప్ట్స్ వంటివి, వర్షారణ్య చెట్లు.
లాటిన్ ద్విపద పదం సెంపెర్విరేన్స్ (సాహిత్యపరంగా, "ఎప్పుడూ పచ్చగా") మొక్క యొక్క సతతహరిత స్వభావం సూచిస్తుంది,
ఉదాహరణకు:
- Acer sempervirens (a maple) - యాసెర్ సెంపెర్విరేన్స్
- Cupressus sempervirens (a cypress) - కుప్రేస్సుస్ సెంపెర్విరేన్స్
- Lonicera sempervirens (a honeysuckle) - లోనిసెరా సెంపెర్విరేన్స్
- Sequoia sempervirens (a sequoia) - సీక్వోయా సెంపెర్విరేన్స్
- Ulmus parvifolia 'Sempervirens' (an elm) - ఉల్‌ముస్ పార్విఫోలియా 'సెంపెర్విరేన్స్'
వెల్విట్స్హియా మొక్కలో ఒక అదనపు ప్రత్యేక విషయం ఉంది, ఒక ఆఫ్రికన్ జిమ్నోస్పెర్మ్ మొక్క జీవితాంతం నిరంతరం పెరుగుతూ ఉంటుంది కానీ కేవలం రెండు ఆకులను మాత్రమే శిఖరం వద్ద ధరించి ఉంటుంది. వెల్విట్స్హియా 1,000 సంవత్సరాల పైన జీవించగలదు. సతత హరిత మొక్కలలో ఆకు స్థిరత్వం కొన్ని నెలల నుండి (పాతవి పోయినా కొత్త ఆకులు నిరంతరం వృద్ధి చెందుతూ) అనేక దశాబ్దాల వరకు ఉంటుంది.
సతతహరితం లేక ఆకురాల్చు అనేందుకు కారణాలు
[మార్చు]ఆకురాల్చే చెట్లు చల్లని లేదా పొడి కాలంలో కాలానుగుణంగా వాటి ఆకులను రాల్చుతాయి. సతతహరిత చెట్లు ఆకులు కోల్పోతాయి, కానీ ఆకురాల్చే చెట్లలాగా ఒకే సమయంలో కాదు. వివిధ చెట్లు వివిధ సమయాల్లో వాటి ఆకులు రాల్చుతాయి, కాబట్టి మొత్తం మీద అడవి ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్య మొక్కలను సతతహరితాలుగా పరిగణిస్తారు, ఆకు వయస్సును బట్టి రాలిపోయినా ఏడాది పొడవునా క్రమేపీ వాటి ఆకులు పునఃస్థాపితమవుతాయి, అయితే కాలానుగుణంగా పెరిగుతున్న జాతులు నిర్జల వాతావరణములో సతత హరితాలుగా లేక ఆకురాల్చేవిగా ఉండవచ్చు. అత్యంత ఉష్ణ వాతావరణంలోని మొక్కలు కూడా సతతహరితాలుగా ఉన్నాయి. శీతల వాతావరణంలో చాలా తక్కువ మొక్కలు సతతహరితాలుగా ఉన్నాయి, -30 °C క్రింద తీవ్రమైన చలిని తట్టుకోగలిగిన వాటిలో కోనిఫెర్లు గణనీయంగా, కొన్ని సతతహరిత విశాలపత్ర మొక్కలు గలవు.