తవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తవుడు

వరిధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతో పాటుపొట్టు/ ఊక (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%, తౌడు లేదా తవుడు (Bran) ఉప ఉత్పత్తులుగా (By Products) ఏర్పడును. బియ్యపు గింజ (Endosperm) పై సన్నని పొరలా (Thin membrane), బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును.వరిధాన్యంలో తవుడు 6-8% వరకు వుండును.పొట్టు25-30% వరకు వుండును. తవుడు మంచి ఫోషక విలువలున్న పదార్థాలను కలిగి ఉంది. తవుడులో 15-24% వరకు నూనె, 14-16% వరకు మాంసకృత్తులను (Proteins) ఉన్నాయి. ఇంకను55-60%వరకు పాలిసాక్రైడ్స్‌,6-12%వరకు ఫైబరు ఉన్నాయి. తవుడులో ఇంత పోషక విలువలుండటం వలననే డాక్టరులు దంపుడు బియాన్ని (hand pounded rice) ఆహారంగా తీసుకొమని చెప్తారు. కొన్ని దేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో 140 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తికాగా, మిల్లింగ్‌ చెయ్యగా 100 మిలియన్‌ టన్నుల బియ్యం, 80 లక్షల టన్నుల తవుడు ఊత్పత్తి అయ్యింది. అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా, 45 లక్షల టన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకట్ పచ్చి బియ్యం (Raw Rice), రెండు ఉప్పుడు బియ్యం (Boiled Rice). ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్‌ మిల్‌లో మిల్లింగ్‌ చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు (Raw Rice Bran) అంటారు. ధాన్యాన్ని స్టీమ్‌ ద్వారా ఉడికించి (steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం (Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు (Boiled Bran) అంటారు.

తవుడులో వుండు పోషక పదార్థముల పట్టిక

[మార్చు]
పోషక పదార్థాలు హల్లరు తవుడు పచ్చితవుడు బాయిల్డ్‌తవుడు
తేమ % 9-10 8-9 8-9
నూనె% 5-8 16-20 20-24
ప్రోటిను% 7-8 13-14 14-15
సాండ్/సిలికా% 12-14 5-8-7 6-7
పీచు పదార్థం% 18-20 9-10 9-11

తవుడు వినియోగం

[మార్చు]
  • తవుడును నేరుగా కుడితిలో కలిపి పశువులదాణాగా వాడెదరు.
  • నూనెతీసిన తవుడును పశువులమేత (live stock feed) లో మిశ్రమంగా కలిపి దాణాలో వాడెదరు.
  • కోళ్లమిశ్రమ మేతగా కోళ్లఫారం లలో వుపయోగిస్తారు.
  • చేపల మేతగా కూడా వినియోగిస్తారు.
  • నూనెతీసిన తవుడును విదేశాలకు దాణాగా ఎగుమతి చేస్తున్నారు.
A: వరిగింజ పొట్టుతో
B: తవుడుపొరవున్నబియ్యపుగింజ
C:బియ్యపుగింజబీజాంకురంతో
D: బియ్యపుగింజ with bran పాలిష్‌తవుడుతో
E:Musenmai (Japanese:無洗米), "Polished and ready to boil rice", literally, non-wash rice
(1) :పొట్టు
(2) :తవుడు
(3) :పాలిష్‌తవుడు
(4) :బీజాంకురం
(5) :బియ్యం

1990-2008 వరకు నూనెతీయుటకై వుపయోగించిన తవుడు, ఎగుమతిచేసిన నూనెతీసిన తవుడు వివరాలు

సంవత్సరం తవుడు, M.T ఎగుమతి, D.O.B.M.T సంవత్సరం తవుడుM.T. ఎగుమతిD.O.BM.T
1990 24,91,100 5,81,295 1991 25,72,450 4,60,180
1992 26,30,216 4,06,328 1993 27,96,743 4,81,342
1994 27,46,571 3,91,806 1995 29,23,979 2,61,634
1996 29,43,240 3,93,373 1997 28,09,705 1,08,700
1998 30,10,573 18,167 1999 28,38,612 612
2000 26,67,269 -- 2001 26,95,531 267
2002 30,23,260 150 2003 27,83,543 1,121
2004 32,14,703 48,991 2005 29,59,021 60,450
2006 31,23,359 2,22,025 2007 31,64,332 2,31,091
2008 32,37,062 1,77,303

D.O.B:నూనెతీసినతవుడు M.T. :మెట్రిక్‌టన్నులు

"https://te.wikipedia.org/w/index.php?title=తవుడు&oldid=3398749" నుండి వెలికితీశారు