మేజా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కలపతో చేసిన మేజా మరియు కుర్చీలు.

మేజా అంటే ఆంగ్ల భాషలో టేబులు (ఆంగ్లం Table). మనం పనిచేసుకోవడం కోసం వెడల్పయిన ఉపరితలం కలిగి, సాధారణంగా నాలుగు కాళ్ళుంటాయి. ఇది ఎక్కువగా కుర్చీలతో కలిపి జతగా వాడతారు. ఇవి కూర్చుంటే పనిచేసుకోవడానికి అనుకూలమైన ఎత్తులో ఉంటాయి. ఇవి ముఖ్యంగా చదువుకోవడానికి, ఆఫీసు పనికోసం, భోజనం చేయడానికి ఉపయోగపడతాయి.

మేజా బల్లలు వివిధ ఆకారాలలో, విభిన్న ఎత్తులలో ఉంటాయి. ఇవి కలపతో గాని, లోహాలతో తయారుచేస్తారు. అన్నింటి ఉపరితలం చదునుగా భూమికి సమాంతరంగా ఉంటుంది. ఇవి ఒకటి అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కాళ్ళు లేదా కోళ్ళుతో భూమిమీద స్థిరంగా నిలబడుతుంది. వీటి ఉపరితలం గుండ్రంగాగాని, చతురస్త్రాకారంగాని, కోడిగుడ్డు ఆకారంలోగాని ఉంటాయి.

ఉపయోగాలు[మార్చు]

  • మేజా ముఖ్యంగా వివిధ ఆహారపదార్ధాలను భోజనం చేసేటప్పుడు పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
  • విద్యార్థులు వారి పుస్తకాలు, వ్రాత సామగ్రి మొదలైన వాటిని మేజా మీద ఉంచి చదువుకోడానికి, వ్రాతపని కోసం వాడుకుంటారు.
  • చిన్న చిన్న మేజాలను తేనీరు, పలహారాలు అతిథులకు పెట్టడానికి వాడతారు.
  • దూరదర్శిని, కంప్యూటరు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందంగా అమర్చడానికి మేజా చాలా ఉపయోగపడుతుంది.
  • కొన్ని పెద్దమేజా బల్లలను ఒకదగ్గర పెట్టి నాటక ప్రదర్శనల కోసం ఉపయోగిస్తారు.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మేజా&oldid=2284355" నుండి వెలికితీశారు