జానంపల్లి కుముదినీ దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానంపల్లి కుముదినీ దేవి
Kumudini devi.jpg
జానంపల్లి కుముదినీ దేవి
జననంజానంపల్లి కుముదినీ దేవి
జనవరి 23, 1911
వరంగల్లు జిల్లా, వాడపల్లి
మరణం2009
ఇతర పేర్లుజానంపల్లి కుముదినీ దేవి
ప్రసిద్ధివనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు,
మతంహిందూ మతము
భార్య / భర్తరామ దేవ రావు
తండ్రిపింగళి వెంకటరమణారెడ్డి

రాణీ కుముదినీ దేవి (జనవరి 23, 1911 - 2009) గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.

జననం[మార్చు]

వరంగల్లు జిల్లా, వాడపల్లికి (వడ్డెపల్లి) చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి 1911 జనవరి 23న వాడపల్లిలో(వడ్డెపల్లి) జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు. కుముదినీ దేవికి 1928 లో వనపర్తి రాజా రామదేవరావుతో వివాహమైంది.[1]

కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై హైదరాబాదు కూకట్‍పల్లిలో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “ సేవాసమాజ బాలికా నిలయం ” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.

మరణం[మార్చు]

ఈమె 2009లో తన 98 వ ఏట మరణించింది.

మూలాలు[మార్చు]