Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 43

వికీపీడియా నుండి

పాత చర్చ 42 | పాత చర్చ 43 | పాత చర్చ 44

alt text=2015 మే 1 - 2015 ఆగస్టు 29 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 మే 1 - 2015 ఆగస్టు 29

వచ్చే ఐదేళ్లలో తెలుగు వికీ భవిష్యత్ దర్శనం పై చర్చ

[మార్చు]

భారతీయ భాషల ప్రస్తావనలేదుగాని, ఆసక్తికరమైన గార్డియన్ పత్రిక డిజిటల్ భాషా అగాధం గురించిన ఆంగ్ల వ్యాసం చదివి మన తెలుగు వికీపీడియా భవిష్యత్తుపై చర్చించండి. --అర్జున (చర్చ) 09:43, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా మార్చి 2015 లో 17 మంది అతిక్రియాశీలక సభ్యులను(నెలకు 100మార్పులు ఆపై చేసేవారు) కలిగివుంది. గత ఐదేళ్లపైగా పరిశీలుస్తున్న నాకు, తెలుగు వికీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. వికీపీడియాకొరకై జట్టుగా చేసే పనులకు, మొదటిపేజీ తీర్చిదిద్దడానికి లేక సహాయపడడానికి కూడా ఎక్కువమంది ముందుకు రావటం లేదు. వికీపీడియా వెలుపలి తెలుగులో సమాచారం పెరుగుతున్నా , మొబైల్ తో వికీపీడియా చూడగలిగే అవకాశం వున్నా. వీక్షణలు ఇంకా మూడు మిలియన్లలోపే వుంటున్నాయి. అందుకని ఇంకో ఐదు సంవత్సరాలలో తెలుగు వికీ ఇప్పటికన్నా బలహీనమవుతుంది. రెండు మూడేళ్లలో మొదటిపేజీశీర్షికల నిర్వహణ ఆగిపోయే అవకాశముంది. --అర్జున (చర్చ) 09:43, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  • @అర్జున నేను ఆశావాదిని. నా పిచ్చికి కొన్ని హేతువులు కూడా ఉన్నాయి. కేవలం ఒకే ఒక క్రియాశీలక సభ్యుడి నుండి ఇరవైమంది క్రియాశీలక సభ్యులు (సి.ఐ.ఎస్ సహకారం లేకుండానే సుమీ) ఒకే లక్ష్యంతో పనిచెయ్యటం చూసినవాడిని కనుక నాకీ పిచ్చి అనుకుంటా. మిగిలిన వాళ్ళు ఉన్నా, లేకున్నా మరో ఐదేళ్ళ తర్వాత కూడా నేను తప్పకుండా తెలుగు వికీలో పనిచేస్తానని నా నమ్మకం. ఒక్కో వ్యాసం కొద్దికొద్దిగా వ్రాస్తూనే ఉంటాను. నా సోత్కర్ష ఆపి, అసలు విషయానికొస్తే, గత పదేళ్ళలో కంప్యూటర్లో తెలుగులో వ్రాయగలిగే అవకాశాలు చాలా మెరుగయ్యాయి, యూనీకోడు బాగా విస్తరించింది, తదనుగుణంగానే అంతర్జాలంలో తెలుగు కంటెంట్ పెరిగింది. మొబైల్లో వికీపీడియా అందుబాటులో ఉంది. ఒక్క ఓసీయారు తప్ప మిగిలిన ప్రధాన సాంకేతికపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయాయి. మొరుగుపడడానికి ఇంకా చాలా అవకాశం ఉందని అంగీకరిస్తూనే, తెలుగు వికీ అవేర్‌నెస్ (సోయి) పెరిగిందని మాత్రం చక్కగా చెప్పుకోవచ్చు (నిదర్శనంగా కొత్త సభ్యులు ఎంతమంది చేరుతున్నారు, పేజీ హిట్స్ చూడవచ్చు). చేరిన వాళ్లందరూ తెవికీలో వ్రాయరు. విజ్ఞానసర్వస్వానికి అనుగుణంగా నిష్పాక్షికంగా వ్యాసాలు వ్రాయగలిగే వాళ్ళ సంఖ్యను స్కేలప్ చేయలేకపోయామన్నది ఒప్పుకోక తప్పదు. సముదాయేతర సంస్థల "చొరవ" లేకుంటే, పదేళ్ళ తర్వాత కూడా తెలుగు వికీ ఇప్పటికంటే నాణ్యంగానే ఉంటుందని నా నమ్మకం. అయితే అభివృద్ధి గణనీయంగా ఉంటుందా, సాధారణంగా ఉంటుందా అనేది వికీ ఇంటా, బయటా ఉద్యమంగా నడిపించగల నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. --వైజాసత్య (చర్చ) 05:53, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
*దీనిపై నా అభిప్రాయం - వికీ అభివృద్ది మునుపున్నట్టు లేకపోయినా అవగాహన పెరగటం ఎక్కువగా చూస్తున్నాం. తెలుగు టైపింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. వీక్షకుల సంఖ్య పెరుగుతుంటే మార్పుల సంఖ్య కూడా పెరిగే అవకాసాలు తప్పక ఉంటాయి. దీనికి మనం చేయవాల్సినవి కొన్ని ఉన్నాయి-
  • కొత్త వాడుకరులను కొన్ని నిర్వహణ విషయాలలో పాలుపంచుకొనేలా చేయాలి. ఎవరైనా ప్రయోగాలు చేసినా, చేస్తున్నా మనం వెంటనే ఆ మార్పులను చెరిపేస్తున్నాం. అది వాళ్ళకు తెలుస్తున్నది. వారికి చిరాకు తెస్తున్నది. కాని దానిపై వారితో ఎవరూ చర్చించి ఎలా చేయాలో చెప్పకపోవడం ప్రధాన లోపం
  • ఎవరికి వారు తాము దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవాలనే దందాపనే తప్ప కొత్త వాళ్లతో కొన్ని విషయాలపై, వ్యాసాలు రాయడానికి వనరులు సృష్టించడం, సమాచారం కొంత అందించడం, రాసే విధంగా ప్రోత్సహించడం, చెప్పి చేయించడం కరువౌతున్నది.
  • చిన్న మార్పుల విషయంలో మనకు ఉన్న నిర్లక్ష్యం - తప్పులను సరి దిద్దటం, స్పేసులు ఇవ్వడం, పుల్‌స్టాపులు ఇవ్వడం వంటివి కూడా వారికి చెప్పడం, చేయించడం చేయడం లేదు. కొత్తవాడుకరులు కాని పాతవారు కాని చిన్న మార్పులపై ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి
  • కొత్తగా వ్యాసం మొదలు పెట్టేవారికి, లేదా ఉన్న వ్యాసం అభివృద్దిపరచే వాటిపై కొన్ని మూసలు పెట్టడం మానేయాలి - ఇప్పటికే ఉన్న వ్యాసం అయితే వెంటనే తెలియచేయడం తప్ప -(దీనికి కారణం చెపుతాను - ఎక్కడొ ఉన్న వ్యాసం వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఎదైనా చేయడం మొదలెట్టగానే మనకు కనిపిస్తుంది. దానిపై అర్జెంటుగా స్పందిస్తుంటాం- అలా కాక కొద్ది కాలం వాళ్ళేం చేస్తారో చూసిన తరువాత మూసలు చేరుస్తుంటే బావుంటుంది)-----విశ్వనాధ్ (చర్చ) 06:16, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • స్పందించిన వైజాసత్య, విశ్వనాధ్ గార్లకు ధన్యవాదాలు. మనం ఐదేళ్ల తరువాత ఎలా వుంటుందో చర్చిస్తున్నాము కాబట్టి, గత ఐదేళ్ల సమాచారాన్ని గణాంకాలను కనీస పరిగణనలోకి తీసుకొంటే మంచిది. వికీపీడియా (టైటానిక్?) అనే నౌక కేప్టెన్ గా వైజాసత్య గారి ఆశావాదం మెచ్చుకోదగినదే. నేను సాధారణంగా ఆశావాదినే కాకపోతే గణాంకాలు, అనుభవం వల్ల వాస్తవికవాదిగా (Pragmatist) తయారయ్యాను. మీరు పేర్కొన్న వాడుకరులు పెరగటం ప్రధానంగా 2014లోనే కనిపించింది. దీనికి కారణాలలో నా దృష్టిలో చాకలిపద్దులాగా కొన్ని ఎమిటంటే, 2014 లో తెవికీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం. పవన్ సంతోష్ తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు, నేను నడిపిన వికీట్రెండ్స్, చంద్రకాంతరావు గారు నడిపిన తెలంగాణ ప్రాజెక్టు సిఐఎస్-ఎ2కె తరపున చేబట్టిన అకాడమీలు, ప్రాజెక్టులుఒప్పందపు పనులు, వికీపీడియా జీరో లాంటి మొబైల్ వాడుకరులకు ఉచితంగా వికీపీడియా అందచేసే సేవలు, చాల సభ్యుల చిన్న చిన్న అధికమార్పులు అని అనిపిస్తుంది. అయితే వీటి ఫలితంగా మనం చూస్తున్నది వాపే గాని బలుపు గాదని అనిపిస్తుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లతో మొబైల్ వినియోగం పెరుగుతున్నా తెవికీ మొబైల్ వీక్షణలు పెరుగుదల కొనసాగటంలేదు. ఇక తెలుగు వికీఅభివృద్ధికి రకరకాల పద్ధతులు (ఆన్లైన్, ఆఫ్లైన్ అకాడమీలు, సమావేశాలు, గూగుల్ అనువాదాల వ్యాసాల ద్వారా లోతు పెంచడం. గ్రామాల వ్యాసాల విస్తరణల ద్వారా వ్యాప్తి పెంచడం, తెవికీ వార్త, టీవీ ద్వారా ప్రచారం. సంస్థల ద్వారా ఒప్పందాలు లాంటివి, విశ్వనాధా గారన్న కొత్త వాడుకరులకు స్వాగతాలు, గుర్తింపులు) ఇప్పటికే ప్రయోగించడం జరిగింది. వీటి ఫలితాలు అంతంత మాత్రమే. సామాజికంగా తెలుగు మరియు ఇతర భారతీయభాషలు దిగజారడం మన ఇంతవరకు చూస్తున్నాం, ఇకముందు అది కొనసాగటం తథ్యం. కనుక ఈచర్చ తెవికీ అభివృద్ధి కావాలంటే కొత్త వి ఎంచేయాలి అనే దిశగా ముందుకు నడిపితే మంచిది. విశ్వనాధ్ గారి సలహాలకు నా ప్రతి స్పందన కొత్త వాడుకరుల చర్యలకు త్వరితంగా స్పందన లేకపోవడం కంటే ఎంటంటే ఎదో విధంగా త్వరిత స్పందనే మేలు. ఎందుకంటే కొత్త వాడుకరి నకలుహక్కుల ఉల్లంఘించి సమాచారం చేరుస్తానడనుకుంటే , దానిని గురించి చర్య త్వరితంగా తీసుకోకపోతే ఆవాడుకరి ఆలాంటివే కొనసాగించి, చివరికి చర్య తీసుకున్నప్పుడు మరింత బాధపడతారు. నేను ఇటీవలి వికీసోర్స్ లో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి సభ్యులకు పరిచయం చేస్తే, బొమ్మలు చేర్చడం నేర్చుకోవటానికి సభ్యులు ముందుకొచ్చారు కాని, పుస్తకాల అధ్యాయాల విరుపులు సరిచేయడానికి(పెద్ద కష్టమైనది కాదు) నేను వ్యాఖ్యల ద్వారా, ఫోన్ సంభాషణల ద్వారా కోరి, వివరించినా , అనుభవజ్ఞులైన మరియు కొలరావిపు విజేతలైన సభ్యులు కూడా ముందుకురాలేదు. గుఱ్ఱాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లవచ్చు కాని అది నీటిని తాగనంటే మనం చేసేదేముంది అనే సామెత లాగా ,తెవికీలో మార్పులు తేవడం చాలా క్లిష్టమని నేను అనుభవంద్వారా నేర్చుకున్నది. సభ్యులు తక్కువగా వుండి సొంత ఆసక్తులే ప్రధానంగా వుండడం మరియు తెవికీ అభివృద్ధికి ప్రాధాన్యాలపై ఆసక్తి తక్కువగావున్నప్పుడు ఇలా జరగడంలో పెద్ద విశేషంలేదు. ప్రపంచం మొత్తంమీద వికీపీడియా ఆదరణ తగ్గుతుందని గత ఐదేళ్లుగా చర్చలలో వున్న సందర్భంలో ఈ చర్చలో మరింత మంది సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. --అర్జున (చర్చ) 03:34, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికిలొ ఇంకా ఎడిటర్లు పెరగవసిన అవసరం వున్నది, వీటికి గ్రామాలలొ పట్టణాలలొ ఆన్లైన్, ఆఫ్లైన్ అకాడమీలు, సమావేశాలు నిర్వహించటం చాలా అవసరం అనిపిస్థోంది ఎ కారణం వలనలొ విద్యార్ధులతొ చెసే అకాడమీలు ల ద్వారా పుర్థి స్థాయి ఫలితాలు పోందలేకపొయ్యాము . గుఱ్ఱాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళితే అంది నీరు తాగవచ్చుతాగక పొనూవచ్చు కానీ ఒక వంద గుఱ్ఱాలను చెరువు దగ్గరకు తీసుకు వెళ్ళితె ఎదోఒకటి నీరు తాగుతుందని నా నమ్మకం :) --కశ్యప్ (చర్చ) 05:02, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కశ్యప్ గారికి. ఇప్పటివరకు చేసిన అకాడమీలతో ఫలితాలు తగినంత స్థాయిలో ఎందుకు రాలేదోవిశ్లేషించి ముందు కార్యక్రమాలు చేపట్టితే మంచిదే. ఇప్పటిదాకా చేసినవన్నీ ఒక్కరి నుద్దేశించి చేసినవి కావు. సమూహాన్నుందేశించి చేసినవే. నమ్మకాలు, ఊహలతోటే ఇప్పటిదాకా నడిచిన కార్యక్రమాలన్నీ. ఇప్పటివరకు జరిపిన వాటి దత్తాంశాన్ని విశ్లేషించి అవసరమైన సర్వేలు మొదలగునవి జరిపి ముందుకు వెలితే మెరుగైన ఫలితాలు కనబడవచ్చు. --అర్జున (చర్చ) 03:05, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
డేటా అంటే నాకు ఇష్టమే. మనమడిగే ప్రశ్నను బట్టి వివిధ రకాలుగా అర్ధంచేసుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు సగటు కొత్తవాడుకరులు ఒక కథ చెబితే, సంవత్సరంలో కొత్త వాడుకరులు చేరిన రోజులు మరో కథ చెబుతుంది. నాకు తెలిసీ మొదటి ఐదారేళ్ళు, ఏదో ప్రచారం జరుగుతేనో లేక న్యూస్ ఐటం వస్తేనో కానీ కొత్త వాడుకరులు చేరేవారు కాదు. కానీ ఇటీవల సంవత్సరాల్లో తరచూ క్రమబద్ధంగా చేరుతూనే ఉన్నారు. వికీపీడియాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి తగ్గిపోయిందన్నది నిజమే, కానీ ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్ పెరుగుతున్న తెవికీకి అది వర్తించదేమో? --వైజాసత్య (చర్చ) 04:04, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారికి, సర్వే ప్రశ్నావళి సరిగా తయారు చేసుకుంటే డేటా లోని పరిమితులను అధిగమించి విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే అలా చేయగల సామర్ధ్యం తెవికీ సభ్యులలో చాలా కొద్దిమందికే వుంటుంది. సంస్థా పరంగా ఇటువంటి ది చేపట్టితే అటువంటి సమస్యని అధిగమించవచ్చని ఆశవుండేది కాని, అది ప్రస్తుతానికి నిరాశ యైంది. మీకు మరియు సహ సభ్యులకు డేటా గురించి ప్రశ్నలు, పటాల రూపంలో వివరాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. వీలైనంతగా సహాయం చేస్తాను. --అర్జున (చర్చ) 13:42, 9 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పుట్టినరోజు శుభాకాంక్షలు

[మార్చు]

వాడుకరి:Nrgullapalli గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు పాదాభివందనాలు. జీవిత పయనములో మీరు మాలాంటి వారికి స్ఫూర్తి. మీరు సంతోషముగా ముందుకు సాగండి మరియు జీవితాన్ని సాగించండి. JVRKPRASAD (చర్చ) 05:37, 4 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఇండియా చాప్టర్ నుండి లాప్‌టాప్ స్వీకరణ

[మార్చు]

అందరికి నమస్కారం... వికీమీడియా ఇండియా చాప్టర్ వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కాలర్షిప్ లో నేను లాప్ టాప్ కొరకు అభ్యర్ధించిన విషయం అందరకి తెలిసిందే. ఆ లాప్ టాప్ నిన్న (03.06.2015) కొరియర్ లో నాకు అందింది. ఇక మరింత చురుగ్గా వికీపీడియాకు పని చేయగలను. నా అభ్యర్థనను బలపరచిన సహసభ్యులకు ధన్యవాదాలు. --Pranayraj1985 (చర్చ) 09:43, 4 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

t.sujatha గారికి, JVRKPRASAD గారికి, అర్జున గారికి, Rajasekhar1961 గారికి, వైజాసత్య గారికి, విశ్వనాధ్ అన్నయ్యకి నా ధన్యవాదాలు ... ఇక విశ్వనాధ్ అన్నయ్య చెప్పినవిధంగా.. పార్టీ ఇవ్వడానికి నేను రెడీ.... --Pranayraj1985 (చర్చ) 13:49, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పార్టీ కొరకన్నా అందరం ఒకచోట కలవడం చలా బాగుంటుంది. మళ్ళీ ఆ సదవకాశం ఎప్పుడో చూదాం ! --t.sujatha (చర్చ) 16:31, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లతే అయితే నాకూ ఓకే --వైజాసత్య (చర్చ) 03:49, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా వైజాసత్య గారు... --Pranayraj1985 (చర్చ) 10:56, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Content Translation beta feature is now available

[మార్చు]

Hello, Content Translation has now been enabled as an opt-in beta feature on the Telugu Wikipedia. To start translating:

  1. Please enable the Beta feature in your preferences and check the box for Content Translation.
  2. Visit the page Special:ContentTranslation or to your contributions page to open the tool.
  3. Click on the blue button to create a new translation.
  4. A dialog will be displayed. In the From section select the language of the original article and the article name, and the language you would like to translate to. Also add the title of the new article (or the original title will be inserted) and click on Translate to begin. Your language preferences will be remembered for the next time.
  5. You will see a screen consisting of three columns. The left column contains the text of the source language and the middle column is for the translated text. Using the right column you can perform several actions such as insert source text, remove the inserted text source text, add or remove links etc.
  6. After you translate the article, you can publish it directly as a new page on the Telugu Wikipedia by using the publish button that appears. In case the article gets created by another user while you were translating, you will see an option to save the newly published translation under your user namespace.
  7. The number of published pages can be seen on the Content Translation stats page.

Since, this is the first time we have installed the tool on this Wikipedia, there are chances that there may be some problems or service disruptions which we are not yet aware of. We will be monitoring the usage to check for any failures or issues, but please do let us know on the Content Translation talk page or through Phabricator if you spot any problems that prevent you from using the tool. For more information, please read the information available in the User Guide. You can also view a short screencast on how to use Content Translation. Our announcement is written only in English, and we would really appreciate if this message can be translated to reach more users of this Wikipedia. Thank you. --Runab WMF (చర్చ) 17:37, 4 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదాలకు తెవికీలో ఒక కొత్త ఉపకరణం వచ్చింది. తెవికీలోకి లాగిన్ అయ్యాకా అదే అడుగుతోంది అనువాదం చేస్తారానని, ఆపైన మనం అంగీకరించి పని ప్రారంభించాకా, ఆంగ్ల వ్యాసం పేరు పైన.. తెలుగులో తయారుచేయదలుచుకున్న పేజీ పేరు కింద ఇస్తే అనువాదం ప్రారంభించవచ్చు. మెటా-వికీ వంటివాటిల్లో మనలో కొందరు ఇప్పటికే చూసిన ఉపకరణం అది. తెర రెండుగా విభజించబడి ఒక పక్క ఆంగ్ల పాఠ్యం, మరోపక్క మనం చేయదలుచుకున్న అనువాదపాఠ్యం కనిపిస్తూంటాయి. తద్వారా మనం చూసుకుంటూ నేరుగా చేయవచ్చు. ఇదివరకు ఆంగ్లపాఠ్యం తెచ్చి ఇక్కడ ప్రచురించి, మళ్ళీ దాన్ని hide చేసుకుని అనువదిస్తూండే ఇబ్బందులు ఇక తొలగిపోయినట్టే. తెవికీలో ఎక్కువ అనువాదాలు చేస్తూండే సుజాత గారి వంటివారు చూశారో లేదోనని ఇక్కడ పెడుతున్నాను. Happy translation experience to wikimedians.--పవన్ సంతోష్ (చర్చ) 16:58, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Pywikibot compat will no longer be supported - Please migrate to pywikibot core

[మార్చు]

Sorry for English, I hope someone translates this.
Pywikibot (then "Pywikipediabot") was started back in 2002. In 2007 a new branch (formerly known as "rewrite", now called "core") was started from scratch using the MediaWiki API. The developers of Pywikibot have decided to stop supporting the compat version of Pywikibot due to bad performance and architectural errors that make it hard to update, compared to core. If you are using pywikibot compat it is likely your code will break due to upcoming MediaWiki API changes (e.g. T101524). It is highly recommended you migrate to the core framework. There is a migration guide, and please contact us if you have any problem.

There is an upcoming MediaWiki API breaking change that compat will not be updated for. If your bot's name is in this list, your bot will most likely break.

Thank you,
The Pywikibot development team, 19:30, 5 June 2015 (UTC)

Nidadavolu Malathi గారి టపా

[మార్చు]

Nidadavolu Malathi గారి టపా [1] ఈ క్రింద సూచిస్తున్నాను. స్పందించగలవారు స్పందించగలరు.

"తెలుగు తూలికలో నా టపా చూసేరో లేదో, ఈ తగువు దయచేసి ఎవరైనా తీర్చగలరు.

monetary denominations of British colonial India were:

3 Pies = 1 Pice = 1 Paisa
4 Pice = 1 Anna
16 Annas = 1 Rupee
15 Rupees = 1 Mohur

కార్డుమీద pies అని ఉండడంవల్ల రూపాయిలో ఈ పైస 64వ వంతు అని నేను అనుకున్నాను. కానీ మరొక పాఠకుడు అది తప్పు అంటున్నాడు. వికిపీడియా యీ వివరాలు సరిగా లేవు. ఈ నాణేలగురించి ఎవరికైనా తెలుసా."[2] JVRKPRASAD (చర్చ) 02:48, 6 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASADగారూ, పై వివరములు ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసం Coins of British India లో వివరంగా ఉన్నవి.ఆ వ్యాసాన్ని అనువాదం చేసి తెవికీలోకి తెస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:02, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తిరుగు రాక

[మార్చు]

రెండు సంవత్సరముల తరువాత వికీ ప్రవేశము చేశాను. అసంపూర్తిగా వదిలివేసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఆ పని కొనసాగిస్తాను. వికీ సమావేశములకు రాలేక పోయాను. కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారము ఇచ్చినందులకు తెలుగు వికీ నిర్వాహకులకు ధన్యవాదములు.Kumarrao (చర్చ) 09:25, 6 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Kumarrao గారికి. మీ తిరుగురాక సంతోషాన్నిచ్చింది. వ్యాసాల అభివృద్ధితో పాటు, తెవికీ ప్రాధాన్యత అంశాలపై కూడా కొంత సమయం కేటాయించవలసిందిగా మనవి.--అర్జున (చర్చ) 03:18, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Kumarrao గారికి వికీ పునస్వాగతం, మీలాంటి సీనియర్ వాడుకరుల సేవలు తెవికీకి ఎంతో అవసరం..--విశ్వనాధ్ (చర్చ) 05:47, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Kumarraoగార్కి పునర్స్వాగతం. మీలాంటి సీనియర్ మార్గదర్శకుల సేవలు మాకీ కీలక సమయంలో చాలా అవసరం. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 09:14, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కీబోర్డు లేఔట్‌ అచేతన సమస్య

[మార్చు]

సభ్యులకు నమస్కారం. నేను తెవికీలో లాగిన్‌ అవకముందు వెతుకు బాక్స్ లో కీబోర్డు లేఔట్‌ వస్తుంది. లాగిన్‌ అవగానే కీబోర్డు రావడంలేదు. ఇలా ఎన్ని మిషన్స్ లో చూసినా అదే సమస్య ఎదురవుతుంది. అలాగే వికీమీడియా ఇండియా చాప్టర్ వారు ఇచ్చిన లాప్ టాప్ లో ఉబంటు (అపరేటింగ్‌ సిస్టం) ఉంది. నేను ఇంతకాలంవరకు విండోస్‌ వాడుతుండడం వల్ల ఉబంటు కొత్తగా ఉంది. దాని గురించిన సరైన అవగాహన కూడా కావాలి. పరిష్కారం చూపగలరు... --Pranayraj1985 (చర్చ) 11:58, 6 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు ప్రవేశపెట్టు పద్ధతి ఎంపికలు
Pranayraj1985 గారికిప్రక్కన బొమ్మలో చూపినపద్ధతిలో ప్రయత్నించండి. అన్నట్లు వ్యక్తిగత సమస్యలకి మీ చర్చాపేజీ మరియు {{సహాయం కావాలి}} వాడడం మంచిది. --అర్జున (చర్చ) 03:16, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు, మీరు చెప్పినవిధంగా భాష అమరికలలో మార్చాను. ఇప్పుడు కీబోర్డు లేఔట్‌ వస్తుంది. వ్యక్తిగత సమస్యలకి మీ చర్చాపేజీని ఉపయోగిస్తాను.... --Pranayraj1985 (చర్చ) 06:08, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj1985 గారికి, మీ సమస్య పరిష్కారమైనందులకు సంతోషం. మీ సమస్యలకు 'మీ చర్చాపేజీ' వాడండి. అప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారు.--అర్జున (చర్చ) 09:16, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సిఐఎస్ ప్రాజెక్టు గురించి FDC సిఫారస్ పై సభ్యుల ప్రతిస్పందన

[మార్చు]

సిఐఎస్ ప్రాజెక్టు గురించి FDC సిఫారస్ పై ప్రతిస్పందన కోరబడింది. వాడుకరి:వైజాసత్య, పవన్ సంతోష్ మరియు నేను దీనిపై స్పందించాము (స్వతంత్ర న్యాయాధికారి కి పద్ధతి పై ఫిర్యాదు మరియు WMF బోర్డ్ కి ఫిర్యాదు). సభ్యులు తమ ప్రతిస్పందనలను ఆయా పేజీలు లేక చర్చాపేజీలలో ఆంగ్లంలో చేర్చవలసినదిగా కోరడమైనది. --అర్జున (చర్చ) 08:27, 8 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ప్రతిస్పందన అనేకన్నా ఆరోపణ అనవచ్చునేమో
ఇక్కడ వాడుకరి:వైజాసత్య, పవన్ సంతోష్ మరియు అర్జున ఇచ్చిన ఫిర్యాదు తర్జుమా, ఇతర సభ్యుల సూచన కొరకు ఇస్తున్నాను (అక్కడ ఆంగ్లంలో వ్రాసినది ఇక్కడ తెలుగులో తర్జుమా చెయ్యటం సదరు సభ్యుల కనీస బాధ్యత) :
వాడుకరి:వైజాసత్య ఫిర్యాదు : ఈయన ప్రకారం సీఐఎస్-ఏ౨కే చేసిన కార్యక్రమాలు విఫలమయ్యాయి. సీఐఎస్-ఏ౨కే వికీపీడియాపై, వికీసోర్స్ పై ఇచ్చిన ముసాయిదాను తెవికీ సభ్యులలో చాలా మంది సరాసరి తిరస్కరించారని వ్రాసారు. ఐనా ఎఫ్డీసీ ఆ చాలా మంది తిరస్కరణను పరిగణనలోకి తీసుకోకుండా కొందరు సభ్యులు మాత్రమే సమ్మతమని చెప్పింది పరిగణనలోకి తీసుకున్నట్టు వ్యాఖ్యానించారు. సముదాయ సలహాలను వర్క్-ప్లాన్ లో చేర్చలేదనీ పరిగణనలోకి తీసుకోలేదనీ ఫిర్యాదు చేసారు. ఐదుగురు తెవికీ సభ్యులు ఈ పూర్తి వర్క్-ప్లాన్ కి విరుద్ధమని పదే పదే చెపుతూ, వీరి విరుద్ధ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్డీసీ వారు నిర్ణయం ప్రకటించి సీఐఎస్ కు ఫండింగ్ అంగీకరించారని వైజాసత్య గారు ఫిర్యాదు చేసారు.
అర్జున గారి ఫిర్యాదు ప్రకారం వేరే చాప్టర్లలా ఒక దేశంలో ఒకే భాషలో కాకుండా సీఐఎస్ వారు భారతదేశంలో పలు భాషలలో పని చేస్తూ 17 వేరు వేరు ప్లాన్లను ముసాయిదాగా ఇచ్చారానీ, ఇవి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పారు. అన్ని పేజీలు చదవడానికి చాలా పొడవుగా, గందరగోళంగా ఉన్నాయని ఫిర్యాదు చేసారు. ఆంగ్లంలో ఇచ్చిన వర్కుప్లానుల ముసాయిదా ప్రతులు ప్రత్యేక భాషలలోకి తర్జుమా చేయలేదని అన్నారు. తెవికీ, తెవికీసోర్స్ లో విస్తారంగా ప్లాన్ చర్చ జరిగిందని చెప్పారు. ఇవి ఆంగ్లంలో తర్జుమా చేసి సదరు మెటా పేజీలో చేర్చినట్టు కూడా తెలిపారు.
పవన్ సంతోష్ ప్రకారం మొత్తం ప్లానుని తెవికీ సభ్యులు తిరస్కరించినట్టు తెలిపారు.
  • అయితే ఫండింగ్ వచ్చిన నేపధ్యంలో తెవికీ, తెవికీసోర్స్ ప్లానులను సీఐఎస్-ఏ2కే మళ్ళీ సముదాయ సలహాతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో కోరుతోంది. ప్రస్తుతం ఉన్న ముసాయిదా ప్లాన్ నుండి ఏ విషయాలు తొలగించాలో, ఏవి చేర్చాలో సభ్యులు తెలుపగలరు. సముదాయం తానంతట తాను చేసుకోగల పనులను సీఐఎస్-ఏ2కే చేపట్టదు. అలానే సముదాయం అభ్యర్థన చేసిన తరువాతనే ఏదయినా పని తెవికీ,తెవికీసోర్స్ లో చేపట్టబడతాయి. సభ్యులు కింద విధంగా తెలుపగలరు.
ప్రస్తుత వర్క్ ప్లాన్ నుండి తొలగించాల్సినవి
  • <పైన చేర్చగలరు>
ప్రస్తుత వర్క్ ప్లాన్ లో కొనసాగదగినవి
  • <పైన చేర్చగలరు>
సీఐఎస్ చేపట్టే పనులు
  • లొయోల కళాశాల మొదలు సంస్థాగత భాగస్వామ్యాలు
  • అమ్మనుడి పత్రిక వికీసోర్స్ లో

--రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 12:09, 7 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియావికీ ట్రెయిన్ ది ట్రెయినర్

[మార్చు]

తెలుగు వికీమీడియన్లకు,

వికీమీడియా భారతదేశ చాప్టర్, సీఐఎస్-ఏ2కే సంయుక్త నిర్వహణలో మీడియావికీ ట్రెయిన్ ది ట్రెయినర్ కార్యక్రమం చేపట్టనున్నాము. భారతీయ భాషా వికీపీడియాలలో మాట్లాడే జనాభాకనుగుణంగా వికీపీడియన్లు లేరన్నది వాస్తవం. అయితే ఉన్న అతి కొద్ది వికీపీడియన్లకు కూడా సాంకేతికాంశల పై పూర్తి అవగాహన లేకపోవటం చూస్తూ వచ్చాము. మీడియావికీ, తత్సంబంధిత ఉపకరణాల వాడుకపై అవగాహన - వాటి అభివృద్ధిలో పాలుపంచుకోవటంలో సున్న భాగస్వామ్యం ప్రస్ఫుటం.

ఈ సాంకేతికాంశలపై అవగాహనను పెంపొందించి భారతీయ భాషా వికీపీడియన్లు కూడా చురుగ్గా మీడియావికీ, తత్సంబంధిత ప్రాజెక్టుల్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. 4 రోజులపాటూ జూన్ ఆఖరి వారంలో (తేదీలు ఖరారు కాలేదు) జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సాంకేతిక నాయకత్వపు గుణాలు పెంపొందడమే కాక వికీపీడియాలో పనితనం మరింత మెరుగవుతుంది.

అయితే ఈ కార్యక్రమంలో తెలుగు వికీపీడియా, తెలుగు సోదర ప్రాజెక్టులలోని సాంకేతిక సమస్యలను గుర్తించి సభ్యులు ఇక్కడ తెలుపగలరు.

అలానే కార్యక్రమంలో పాల్గొనదలచిన సభ్యులు వారి పేర్లను ప్రతిపాదించగలరు.

--రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 11:02, 8 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  • మూసలలోని స్టైల్ షీట్ల గురించి మరింత అవగాహన కావాలి, తెవికీ సోదర ప్రాజెక్టులలోని ఇంకా చేయవలసిన, ప్రాధాన్యత కలిగిన మూసలను జాబితాగా చేయాలి.
  • వికీబాట్ల నిర్వహణ

ప్రతిపాదనలు

[మార్చు]
  1. కార్యక్రమములోపాల్గొనగలను, సాంకేతిక సమస్యలు తెలుసుకోవాల్సినవి చాలావున్నవి. వాడుకరి:Nrgullapalli]] --గుళ్ళపల్లి 11:16, 8 జూన్ 2015 (UTC)
  2. నేను కూడా పాల్గొంటాను --Pranayraj1985 (చర్చ) 06:44, 9 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Gokulellanki (చర్చ) 02:18, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. పై (PI) (చర్చ)
  5. భాస్కరనాయుడు భాస్కరనాయుడు (చర్చ) 01:16, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ట్రైనింగు ఎక్కడ ఇస్తున్నారు?Palagiri (చర్చ) 03:48, 9 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
జూన్ లోఅయితే దూరప్రాంతాలనుఒడి వచ్చేవారిక్ టైము సరిపోదు. అందువల్ల జూలైలో తేదిలు, ప్రదేశము ఖరారు చేసి జూలైలొ పెడితే అందరికీ వీలుగా వుంటుందిగుళ్ళపల్లి నాగేశ్వరరావు--గుళ్ళపల్లి 02:51, 11 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈకార్యకమం నిర్వహణ సాధ్యం కానప్పుడు వివరణ ఇస్తే అందరి మనస్సు ప్రశాంతంగా వుంటుంది వాడుకరి:Nrgullapalli--గుళ్ళపల్లి 02:51, 26 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నామినేట్ చేసినవారు, మరియు కొత్తవారికి మాత్రమేనని కార్యక్రమము ప్రతిపాతించినపుడే వివరించివుంటే విషయం తెలుసుకోవటానికె ఇంత సమయం వృధా అయ్యెదికాదు. ఏమైనా తెలుగు వికీపీడియన్ లను ఇంతకాలం సందిగ్దంలోవుంచుట ఉచితం కాదు. వాదుకరి చర్చ:Nrgullapalli--గుళ్ళపల్లి 02:30, 27 జూన్ 2015 (UTC)

రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే), మీరు ఇలాంటి ప్రతిపాదనలు పెట్టేటప్పుడు కనీసం ఏ ఊరులో పెడతారు అనే అవగాహాన లేనప్పుడు జూన్, 2వ తారీఖున ఎందుకు పోస్టింగ్ వేసినట్లు ? ఇంతకాలం వివరాలు ఎందుకు తెలియజేయలేదు ? నాతో అనవసరంగా ఎవరూ చర్చ చేయవద్దు. అనవసరముగా అందరూ పిచ్చి ఎక్కించోకోవద్దు. ఇంక నుండి జాగత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి పనులతో జనాలను పిచ్చోళ్ళను ఛేయవద్దు. ఇది సలహా కాదు. JVRKPRASAD (చర్చ) 02:44, 27 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డాక్టర్ అన్న ప్రిఫిక్స్ గురించి

[మార్చు]

డాక్టర్ అన్న ప్రీఫిక్స్ తో వ్యాసం పేర్లు ఉండకూడదన్న విషయం తెలిసినదే.(ఉదాహరణకు డాక్టర్ రామకృష్ణ అని వ్యాసం పేరు ఉండకూడదు) అయితే ఓ రీడైరెక్ట్ గా డాక్టర్ రామకృష్ణ అన్న పేరుతో వ్యాసం ఉండవచ్చా? ఈ విషయం తెలిస్తే ఒక రీడైరెక్ట్ వ్యాసాన్ని పున:ప్రచురించాల్సివుంది. అలాగే మెడికల్ డాక్టర్లకు పేరు ముందు డాక్టర్ అన్న ప్రీఫిక్స్ ఉండొచ్చా, లేక వాటినీ మార్చాలా?--పవన్ సంతోష్ (చర్చ) 06:03, 11 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ వుండకూడదు. అలా వున్నవాటిని తొలగించాలి. పురస్కారం పేరులో వుంటే ఆ పురస్కారం వ్యాసంలో ఆలాంటివి వుండవచ్చు. --అర్జున (చర్చ) 11:24, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, డాక్టర్ అన్న పేరుతో ఉన్న దారిమార్పు పేజీలను కూడా తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:33, 21 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimania 2015 - India Booth

[మార్చు]

Hi Wikimedians,

Apologies for posting this text in English.

As you people might be aware, Wikimania 2015 which is going to be held in Mexico from July 14th to 19th. We, the Indian attendees at Wikimania, would like to represent Wiki Indic Community booth in the same. We are creating Leaflets and Posters for the community village at Wikimania 2015 to display in Wikimania 2015. We would like to invite you to gather the content and design(optional) for posters (Sample) and leaflets (Sample) about the Indic language project of your choice. We will take care of printing and displaying the posters/leaflets.

The maximum dimensions for your poster are 36 x 48 in (91.44 x 121.92 cm). We suggest using the A0 paper size, which is 33.11 x 46.81 in (~84 x 118 cm). The contents of the poster has to be in English. Posters and leaflets based on all Indic language Wikimedia projects are welcome. The design should be a media file uploaded to Wikimedia Commons. Please post the link to your content/design file on http://wiki.wikimedia.in/Wikimania_2015/Booth/Posters_Leaflets before 25th of June. In case if you face any issues please reachout to Dineshkumar Ponnusamy or Netha Hussain.

For guidelines regarding creating posters, please have a look at this link : https://meta.wikimedia.org/wiki/Grants:Learning_patterns/Posters_that_work

We look forward to receiving your posters/leaflets and displaying them while at Wikimania 2015!
Note: This is not a competition or contest, we expect at most 1 poster and 1 leaflet from each Community.

Thanks,
Indian Wikimania 2015 Participants

New Wikipedia Library Accounts Available Now (June 2015)

[మార్చు]

Hello Wikimedians!

The TWL OWL says sign up today!

Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

  • Taylor & Francis — academic publisher of journals. The pilot includes two subject collections: Arts & Humanities and Biological, Environment & Earth Sciences. (30 accounts)
  • World Bank eLibrary — digital platform containing all books, working papers, and journal articles published by the World Bank from the 1990s to the present. (100 accounts)
  • AAAS — general interest science publisher, who publishes the journal Science among other sources (50 accounts)

New French-Language Branch!

  • Érudit (en Francais) — Érudit is a French-Canadian scholarly aggregator primarily, humanities and social sciences, and contains sources in both English and French. Signups on both English and French Wikipedia (50 accounts).
  • Cairn.info (en Francais) — Cairn.info is a Switzerland based online web portal of scholarly materials in the humanities and social sciences. Most sources are in French, but some also in English. Signups on both English and French Wikipedia (100 accounts).
  • L'Harmattan — French language publisher across a wide range of non-fiction and fiction, with a strong selection of francophone African materials (1000 accounts).

Many other partnerships with accounts available are listed on our partners page, including an expansion of accounts for Royal Society journals and remaining accounts on Project MUSE, JSTOR, DeGruyter, Highbeam Newspapers.com and British Newspaper Archive. If you have suggestions for journals or databases we should seek access to make a request! Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 22:08, 15 June 2015 (UTC)

We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List

22:01, 19 జూన్ 2015 (UTC)

ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్ర వ్యాసరచన శిబిరం

[మార్చు]

సీఐఎస్-ఏ2కే ఆధ్వర్యంలో ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్ర వ్యాసరచన శిబిరం జరగనుంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు. వృక్షశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు తెవికీ వాడుకరులైన విద్యార్థులు వ్రాయనున్నారు. ఆసక్తి గల సముదాయ సభ్యులు పాల్గొనగలరు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 06:12, 26 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ శిబిరం జులై 27 నుండి 30 తేదీలలో ఉంటుందని గమనించగలరు. తేదీలలో మార్పు ఉంటే ఇక్కడ తెలపగలను. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 06:05, 11 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజమండ్రి పుష్కరాలు, 2015

[మార్చు]

గోదావరి పుష్కరాలు, 2015 అని వ్యాసము పేరు ఉండాలనుకుంటాను. JVRKPRASAD (చర్చ) 07:32, 28 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ ఇప్పటికే 2015 గోదావరి పుష్కరాలు వ్యాసం ఉన్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 11:46, 28 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
గోదావరి పుష్కరాలు వేరు. రాజమండ్రిలో మాత్రమే జరుగుతున్న పుష్కర కార్యక్రమ వ్యాసం ఇది. దీనిని కేవలం రాజమండ్రి విషయాలతో తయారుచేయాలని నా ప్రయత్నం. దీనితో పాటు గోదావరి పుష్కరాల పేజీ కూడా చేయవచ్చు..--విశ్వనాధ్ (చర్చ) 12:07, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు వికీపీడీయాకు తగినవి కావు

[మార్చు]

ఈ వ్యాసంలోని ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు వికీపీడియా:ఏది_వికీపీడియా_కాదు#వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు అనే నియమాన్ని వుల్లంఘిస్తున్నాయి . పరిశీలించి సరిచేయండి. --అర్జున (చర్చ) 04:30, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, మీరు వ్రాసినది వివరముగా వ్రాయండి. ప్రభుత్వం వారి ఫోను నంబర్లు, బస్సు రూటు నంబర్లు, రైల్వే వారి రైలుబండ్లు నంబర్లు, ఏరోజు, ఏ సమయము, లాంటివి [3] వికీపీడియా నియమాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయి ? సరి చేయాలంటే ఏమి చేయాలో చర్చించండి. చర్చ ఒక కొలిక్కి వచ్చేవరకు నాతో చర్చించండి. ఈ రాజమండ్రి పుష్కరాలు 2015 అనే విషయము వ్యాసము కొరకా లేదా కరపత్రమా లేదా మరొక దాని వాడుతారో అది కూడా వెనువెంటనే తెలియజేయండి. వ్రాయవలసినది చాలా ఉంది, సమయము చాలా తక్కువగా ఉంది. గ్రహించగలరు. అసలు మీ మనసులో ఈ వ్యాసము గురించి ఎలా ఉండాలని అనుకుంటున్నారు. సరి అయిన సమయము కేటాయించండి. JVRKPRASAD (చర్చ) 07:38, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు పై చర్చ మొదలు పెట్టారు

[మార్చు]

రాజమండ్రి పుష్కరాలు, 2015 సంగ్రహ విషయము నందు వికీపీడియా నియమాలకు ఉల్లంఘన అంటూ అర్జున గారు చర్చ మొదలు పెట్టారు. పుష్కరాలు అయ్యేవరకు ఎవరూ ఈ చర్చ పూర్తిచేయరు మరియు అందుబాటులో ఉండరు. ఈలోగా ఎవరైనా దీని గురించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయగలరు. వికీ నియమము ప్రకారం

  • చనిపోయిన వారికి రిప్పులు, బ్రతికి ఉన్నవారికి శుభాకాంక్షలు చెప్పకూడదు. (చెబుతునే ఉన్నాముగా )
  • సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటిని ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
  • ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు. (తమిళనాడు తీర్థాల దర్శనాలకు బస్సు నంబరులు వ్రాయలేదా ?)
  • వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు. (ఎవరు పోయినా, ఏం జరిగినా వేడివేడిగా వార్తలు వస్తున్నాయి)

అసలు నియమాలన్నీ పాటిస్తున్నారంటారా ? ఇప్పుడు అర్జున గారికి ఏం సమాధానము చెప్పాలి ? అసలు నియమ నిబంధనలు అనేవి రూపుదిద్ది ఎంతకాలం అయ్యింది ? చర్చలు చేద్దాము. రండి. JVRKPRASAD (చర్చ) 08:13, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పై నియమాలన్నీ ప్రధాన పేరుబరిలో ఉన్న వ్యాసాలను దృష్టిలో పెట్టుకుని తయారుచేసుకున్నవని భావిస్తున్నాను. RIP, శుభాకాంక్షలు చెప్పకూడదు అన్న నిబంధన ప్రధాన పేరుబరికి సంబంధించిందే తప్ప వికీపీడియా పేరుబరికి వర్తించదు. ప్రధాన పేరుబరిలో అలాంటి వివరాలు ఉంటే నిర్దాక్షణ్యంగా తొలిగించేయవచ్చని నా లెక్క. తమిళనాడు తీర్థాల దర్శనాలకు బస్సు నంబరులు వ్రాయలేదా ? అన్న మరో ప్రశ్న సంధించారు. తమిళనాడు తీర్థాల్లో ఉంటే తొలగించాల్సిందే తప్ప అక్కడ ఉంది కదాని మరోచోట రాయకూడదనుకుంటున్నాను. వేడివేడిగా వార్తలు వస్తున్నాయి అంటే ఏ రూపంలోననేది చూడాల్సిన విషయం. మన వికీలో వ్యక్తి గురించి వివరం ఉందనుకోండి, ఆ వ్యక్తి చనిపోయారు. అప్పుడు ఆ విషయం వ్యాసంలో ఉండాల్సిన చోట, ఉండాల్సిన విధంగా లేకపోవడం లోటు. అందుకనే వీలైనంత త్వరగా ఆ వివరం రాయాలి. అది వివరం తప్ప వార్త కాదు. మీకు అలా వార్తాశైలిలో కనిపిస్తే సరిజేయవచ్చు, లేదా అభ్యంతరకరమైతే చర్చించి తొలగించవచ్చు. ఈ నియమాలన్నీ పాటిస్తున్నారా? అంటే పాటించేలా చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. నియమాలకు వ్యతిరేకంగా రాసిన వివరాలను తొలగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నియమాలకు వ్యతిరేకంగా ఉన్న వివరాలు తొలగిస్తే, రాసిన వ్యక్తికి అవమానకరమని భావించే ధోరణులు తగ్గాల్సివుంది. ఇదంతా నా అభిప్రాయం మాత్రమే. ఇక చర్చలు సమయానుసారం జరగట్లేదన్నదీ, కొంత స్తబ్దత నెలకొన్నదన్నదీ నిజమే. కొద్దిరోజుల్లో బాగా చైతన్యవంతంగా, ఫలప్రదమైన చర్చలు జరిపే సముదాయంగా మారుతుందని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:39, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ , మీరు అర్జునగారి వ్యాఖ్యలకు స్పందించండి. బస్సుల నంబర్లు, రైళ్ళ నంబరులు కూడా తొలగించాలంటారా ? అసలు వికీ నియమాలు సరికొత్తవి ఎవరైనా సరిచేశారా ? అసలు నియమాలు అనేవి అన్ని వికీలకు ఒకటిగా ఉంటాయా ? ఎప్పటికప్పుడు నియమాలు మార్చుకోవాల్సిన అవసరము లేదా ? ఇప్పుడు ఎవరింట్లోనో పేడ అలుక్కుని, ముగ్గులు పెట్టుకోవడం లేదు కదా ! మరి వికీ పాత నియమాలు అలాగే కొనసాగించాలా ? అసలు ప్రభుత్వ నంబర్లు తొలగించడం అనటములో ఉద్దేశ్యము ఏమిటి ? అన్ని దేశాలలో ప్రభుత్వ సర్వీసులు ఉండవు కదా ! ఇప్పుడు నేను రైల్వే, బస్సు మరియు ఇతర నంబరులు, సమయములు ఉన్న పట్టికలన్నీ తొలగించనా ? సరి అయిన సలహాలు నిర్ధిష్ట ప్రాతిపదికన ఇవ్వండి. ఊహాలు వల్ల సమయం వృధా అని గ్రహించగలరు. ముందు రాజమండ్రి పుష్కరాలు,2015 అనే దాంట్లో ఏవి ఉండాలి, ఏవి ఉండ కూడదు ? దానికి మీ ప్రాతిపదికతో సూచనలు ఇవ్వండి. ఇంకా సందేహాలు ఉన్నాయి. (నాకు సరి అయిన సమాధానములతో నన్ను ఎవరూ సరి సమయములో వీలయినంత త్వరలో సంతృపి పరచకపోతే వెనువెంటనే నేను వ్రాశిన విషయములన్నీ మళ్ళీ మళ్ళీ తొలగిస్తునే ఉంటాను. గ్రహించగలరు) JVRKPRASAD (చర్చ) 09:01, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చాపేజీలో నా స్పందన చూడండి.--అర్జున (చర్చ) 04:48, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా ప్రసాద్ గారూ, వికీపీడియా:ఏది వికీపీడియా కాదు అనేది దాదాపు 2007 నుండి తెలుగులో ఉన్న నిబంధనా వ్యాసం. నియమాలు ఎక్కడ ఎక్కడ అని అడిగేముందు, ఉన్న నియమాలను చదివితే బాగుంటుంది. లేదా ఇతరులు చెప్పినప్పుడు విన్నా కూడా ధన్యం. నియమాలు లేవంటారు, అమలు చేయాలంటారు, తీరా నియమాలు చూపించినప్పుడు నచ్చలేదంటారు. ప్రతిదానికి కొత్తగా తెవికీలో కనుగొననవసరం లేదు. వికీపీడియా విజ్ఞానసర్వస్వం, అంటే అన్ని వ్రాయవచ్చు అని ఎవరైనా చెబితే, అది సరికాదు. విజ్ఞానసర్వస్వం అన్నపదం విశ్వవిద్యాలయం అన్న పదం లాంటిదే. విశ్వవిద్యాలయంలో ఎంత విశ్వముందో మనందరికి తెలిసిందే. ట్రావెలాగుకు చెందాల్సిన సమాచారం ఇక్కడ కుదరదండి. మీకు ఈ విషయాన్ని తీరిగ్గా నేను వనవిహారంనుండి తిరిగిరాగానే మీకు ఫోన్లో వివరిస్తాను. ఈ నిబంధనలు మనం మార్చకూడదని లేదు కానీ, అవి ఉండటానికి చక్కని హేతుబద్ధత ఉంది. అంతకంటే ఘనమైన హేతువు మీకు తోచితే తప్పకుండా చర్చించి నియమాలు మారుద్దాం. ప్రసాద్ గారికి ఇలా అనిపించింది, వైజాసత్యకు అలా అనిపించింది అన్నది సరైన హేతువు కాదు. గౌరవాభిమానములతో భవదీయుడు --వైజాసత్య (చర్చ) 16:27, 3 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ నియమాలు

[మార్చు]

వికీ నియమాలు వ్రాసి ఎంతకాలం అయ్యింది ? అసలు ఈ నియమాలు ప్రాతిపదిక ఏమిటి ? ఆంగ్లము అయితే అర్థవంతముగా అసలు అనువాదము ఏ మాత్రమైన చేశారా ? తెలుగుకి నియమాలు వేరేగా ఉంటాయా ? అన్ని దేశాలు, ప్రాంతాలకు ఒకే నియమము వర్తిస్తుందా ? JVRKPRASAD (చర్చ) 09:28, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సమయ పట్టికలు

[మార్చు]

వికీలో ఉన్న రైలు, బస్సు, విమాన సమయ పట్టికలు, రైలుబండ్ల నంబర్లు ఉన్న పట్టికలు అన్నీ తొలగించాలనుకుంటున్నాను. వికీ నియమాలకు విరుద్ధమైన ఆ చెత్త తొలగించమంటారా ? JVRKPRASAD (చర్చ) 09:31, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రధానమైన వివరాలు తప్పించి మిగతావి తొలగించండి. ఉదా: పోలీస్ , ఫైర్ లాంటి ఫోన్ నంబర్లు వుంచవచ్చు. వికీకి విలువ పెంచిన వారవుతారు.--అర్జున (చర్చ) 04:40, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, మీకు ప్రధానమైనవి మరొకరికి అప్రధానము కావచ్చు. మీకు అప్రధానమైనవి ఇంకొకరికి ప్రధానమైనవి కావచ్చు. నాకు మాత్రము అన్నీ ప్రధానమైనవే అనుకుంటాను. JVRKPRASAD (చర్చ) 05:39, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, మీరు చెప్పేది నిజమే. అందుకనే వికీలో చర్చాపేజీలున్నది. బేధాభిప్రాయాలున్నప్పుడు కొన్నాళ్లు చర్చలలో పాల్గొంటే పాల్గొన్న వారికి అవగాహన పెరిగి కొంతవరకు సమిష్టిగా కృషి చేయడం మెరుగవుతుంది. --అర్జున (చర్చ) 00:30, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీవాయేజ్

[మార్చు]

తెలుగు వికీవాయేజ్ నందు తెలుగు వ్యాసములు వ్రాయుటకు దాని లింకు తెలిసిన వారు పొందుపరచ గలరు. తెలుగు వికీవాయేజ్ అనేది లేనపుడు తెలుగు వికీపీడియాలో కాక మరెక్కడ వ్రాసుకొని పెట్టుకోవాలి.JVRKPRASAD (చర్చ) 11:38, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ వాయేజ్ ఇంకా లేదనే నాకు తెలిసిన విషయం. దాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఆసక్తివున్నవారే దానికి పూనుకోవాలి. అది లేదు కనుక వికీపీడియాలో రాయవచ్చు అన్నది సరికాదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:58, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మరి ఏది సరి అయినది ? JVRKPRASAD (చర్చ) 16:37, 29 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, ఎవరికైనా అవసరమయ్యే ప్రతి ఒక్క సమాచారం అంతా విజ్ఞాన సర్వస్వంలో వుండవలసిన అవసరం లేదు. ఆయా సమాచార అవసరాలను సంబంధిత సంస్థలు, వ్యాపార సంస్థలు తీర్చే అవకాశం వుందా కాబట్టి, అవసరమనుకుంటే మరియు వాటికి ఉచిత ప్రచారం కాదనుకుంటే అలాంటి వాటి లింకులు వ్యాసాలలో వుంచవచ్చు. విజ్ఞానసర్వస్వం అంటే నిర్దిష్ట అభిప్రాయం ఏర్పరచుకోవడానికి విజ్ఞాన_సర్వస్వము వ్యాసం మరియు దాని ఆంగ్ల వికీలోని రూపం మరియు వాటిలో వుదహరించినవి ఉపయోగపడతాయి. వికీవాయేజి తెలుగులో లేదుకాబట్టి మీరే ఆయా పేజీలో తెలిపినట్లు ప్రారంభించవచ్చు . ఇక ఇతరత్రా అంశాలపై ఆసక్తి గలవారు ప్రయోగాత్మకంగా బ్లాగ్ ప్రారంభించి సమాచారం చేర్చుకోవొచ్చు. లేక ఉచితంగా వికీ సదుపాయాన్ని కలుగుచేసే en:Wikia లాంటి వాటిలో ఇష్టమైన అంశాలపై వికీలాగా సమాచారం చేర్చుకోవడానికి వీలుంది. --అర్జున (చర్చ) 04:58, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, తెలుగు వికీవాయేజ్ వ్యాసాలు ఏ విధంగా వ్రాయాలంటారు ? ఏదయినా తెలుగు వ్యాసము ఉంటే లింకు ఇవ్వండి. ఆ విధంగా ఇక్కడ అనవసరమయిన వికీవాయేజ్ వ్యాసాలు అక్కడ పొందు పరచుతాను.JVRKPRASAD (చర్చ) 05:35, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారికి, నాకు తెలుగు వికీవాయేజీ కాని మరియు కొత్త వికీమీడియా ప్రాజెక్టులు ప్రారంభించడంలో అనుభవంలేదు. మీరు ప్రయత్నించటంలో సమస్యలు ఎదురైతే ఆయా ప్రాజెక్టుల రచ్చబండలో చర్చించండి. ఫలితం వుండవచ్చు. --అర్జున (చర్చ) 00:33, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో వికీవాయేజ్ లేదనదే సరైన కారణం కాదు. తెలుగులో వికీన్యూస్ లేదని ఇక్కడ వార్తలు వ్రాయలేము. --వైజాసత్య (చర్చ) 16:30, 3 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నియమాలు - ఆచరణ - తొలగింపు

[మార్చు]

వికీపీడియా:ఏది వికీపీడియా కాదు [4] అనే నియమాలు ప్రకారం అనేక వ్యాసములలోని సమాచారము లేదా వ్యాసములను తొలగించ వలసి ఉన్నది., ఉన్న నియమాలు ప్రకారం కూడా ఆచరించకుండా, కొత్త నియమాలు ఎవరికి వారు పాటిస్తున్నారు. దీని మీద చర్చ కావాలి. JVRKPRASAD (చర్చ) 01:31, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, మరింత వివరముగా వ్రాయగలరు. --వైజాసత్య (చర్చ) 16:38, 3 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పేడ పొయ్యి - విద్యుత్తు వోవెన్ (వికీ నియమాలు మార్చటం ఎలా?)

[మార్చు]

పేడ పొయ్యి నుండి విద్యుత్తు వోవెన్ వరకు మనిషి తన అవసరాలకు తగ్గట్టు వంట చేయటంలో అనేక మార్పులు చేసుకున్నాడు. పేడ పిసికి పిడకలు తయారు చేసి పొయ్యిలో పెట్టి వంట, పొట్టు పొయ్యి, బొగ్గుల కుంపటి, కిరసనాయిలు పొయ్యి, గ్యాసు పొయ్యి, విద్యుత్తు పొయ్యి................ఇలా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలలో చేతివ్రాత, టైపు, కంప్యూటరు..................మార్పులు సమయాలలో అనేక సమస్యలు ఉద్యోగులలో చోటు చేసుకున్నాయి. ఇలా నిత్యజీవితంలో అనేక విషయాలలొ మార్పులు జరిగాయి, జరుగుతున్నాయి. అదేవిధముగా వికీపీడియాలో వికీపీడియనులు కూడా ఇన్ని అనేక రకాల ఆలోచనలు, ధోరణులు కలవారు కూడా ప్రవర్తిస్తూన్నవారు ఉన్నారు. ప్రస్తుత కాల అవసరాలను బట్టి అందుకు అనుగుణంగా నియమాలు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఆంగ్ల వికీ నందు అనేక విభాగాలు ఉన్నాయి. అన్నీ మనకు లేవు. అవి తయారు చేసుకోవాలి. ఎలా తయారుచేయాలో చెప్పండి. నేను కూడా చేస్తాను. ఆయా తెలుగు విభాగాలు లేవు (వికీ వాయేజ్, వికీ విశ్వవిద్యాలయం, వికీవార్త లాంటివి) కనుక కొంతకాలము అయినా వికీపీడియాలో వచ్చిన, చేర్చుతున్న సమాచారాన్ని దాచుకోక తప్పదు. తదుపరి ఆయా విభాగాలకు తరలించుకోవచ్చును. వికీపీడియా నియమాలకు విరుద్ధం అంటూ ఎవరినీ సమాచారాన్ని చేర్చవద్దు అనడం, ఉన్నదాన్ని తొలగించడం చేయడం అనేది ఎంత సమంజసం ? సరి అయిన పరిష్కారము చూపండి. JVRKPRASAD (చర్చ) 01:56, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారికి, తెలుగులో విధానాలు మరియు వాటి మార్పుల గురించి వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు మరియు వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి చూడండి. ఇప్పటికే వున్న వికీప్రాజెక్టు గురించి అయితే ఆయా ప్రాజెక్టు పేజీలో కొత్త భాష చేర్చడం గురించి వివరాలు వుంటాయి. వాటి ప్రకారం ముందుకు వెళ్లడం మంచిది --అర్జున (చర్చ) 04:45, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, మీరిచ్చిన సమాధానము సంతృప్తికరంగా సంపూర్ణముగాలేదు. మరొకసారి వివరంగా మీరు వ్రాస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 05:33, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, నా శక్తికొలది అనుభవం మేరకు సమాధానం రాశాను. మీకు సంతృప్తికలగనందుకు మన్నించండి. ఇతర అనుభవజ్ఞులైన వికీపీడియన్లని సంప్రదించండి. --అర్జున (చర్చ) 00:37, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీగుడి - మాల్

[మార్చు]

ఇది ఒక గుడిలాంటిది. ఇందులోని విజ్ఞానం దైవం. భక్తులు గుడికి సమర్పించేవి ఏవైనా భక్తిభావంతో ఉండాలి. అలా ఉంటేనే జ్ఞానానికి ప్రాణశక్తి వస్తుంది. గుడికి లభించినవి తిరిగి భక్తులకే పంచడం జరుగుతుంది. అటువంటి గుడిలోని దైవానికి ప్రాణశక్తి చాలాలోపించింది. అందుకే గుడి అభివృద్ధి పథంలో ముందుకు సాగడము లేదు. కట్టుకోవడము, తొలగించుకోవడము, అనవసర చర్చలు, ఇలాంటి అనేక లోపాలతో కాలం గడుస్తూ సాగుతోంది. ఇంట్లో తయారు చేసుకునే పులిహార సరాసరి తింటే అది ఫలహారం, అదే ముందుగా దైవానికి చూపించి తీసుకుంటే అది ప్రసాదం. మనము సమర్పించే విజ్ఞానం ప్రసాదరూపంలో ఉండాలి అని భావన. మనిషికి ప్రాణం ఎలానో విజ్ఞాన దైవానికి ప్రాణశక్తి ఉండాలి. దైవానికి ఇబ్బంది అనుకున్నప్పుడు పరుషంగానే నా పదాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న అధికారులు, నిర్వాహకులు, ఇతరులు కేవలం గుడి పూజారులు మాత్రమే. వీరిలో వీరికి అనేక భేదభావలు ఎలాగూ ఉంటాయి. దైవానికి సేవ చేసుకునే పద్ధతిలో ఎవరి ధోరణి వారిది. మరి, ఇతర వికీపీడియనులకు వికీపీడియా అనేది ఒక మల్టీప్లెక్స్ మాల్ అని అనుకోవచ్చు. ఎవరి భావన వారిది. బయట నుండి భక్తులు ఈ గుడి నుండి అందుకునే విజ్ఞాన సమాచారము కేవలం భక్తితో కూడినటువంటి ప్రసాదంగానే పొందాలని నా భావన. JVRKPRASAD (చర్చ) 02:55, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు ఇది రచ్చబండ. ఇందులో చర్చలు అర్ధవంతంగా ఉండాలి. వికీలో అడుగు పెట్టే ప్రతి వారు ముందుగా దీన్నే చూస్తారు. ఇక్కడ ఏం చర్చించుకొంటున్నారు అనేవి. మీరు ఇలాంటి మంచి విషయాలను, లేదా అందరికీ మంచిచేసేవిగా ఉంటాయనుకొనే విషయాలను మీ వాడుకరి పేజీకి ఉపపేజీగా రాస్తూ ఉంటే వాటిని కొత్త వాడుకరులకు, ముఖ్యంగా మంచి విషయాలను తెలుసుకోవాలనే వాడుకరులకు చదవమని చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాత చర్చలు దాచేస్తూ ఉంటాము. మీరు రాసే వీటిని మళ్ళీ ఎవరైనా చూడగలరా, లేదుగా? - కనుక మీరు ఇలాంటి విషయాలను, చర్చలకు ఆస్కార్ం లేని పెజీలో భద్రపరచగలరని నా మనవి. మీరు అనుమతిస్తే అలాంటి మీ ద్వారా రాయబడిన, రాయబడుతున్న మంచి విషయాలను ఒక చోట చేర్చవచ్చు. భవిష్యత్లో వాటిని ఒక పుస్తకంగా కూడా తీసుకురావచ్చేమో ఏమంటారు?..--విశ్వనాధ్ (చర్చ) 03:01, 4 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారు, మీరు ఏమి చేసినా నాకు సంతోషమే. నాకుగా నేను ఆ పని చేస్తే అంతగా బావుండదు. సహించలేరు, భరించలేరు కొందరు. ప్రస్తుతము గుడిలో చాలా చెత్త పేరుకొని పోయింది. నా వంతుగా శుభ్రం చేస్తున్నాను. అందుకే దైవానికి సమర్పించే నా జ్ఞాన అభిషేకాలు, నిత్యపూజలు లాంటి కొత్తవాటికి కాస్త విశ్రాంతి ఇచ్చాను. విజ్ఞాన దైవానికి ప్రాణశక్తి మనమందరం అందించాలి. అప్పుడే వికీ వెలుగులోకి వచ్చి అభివృద్ధి చెందుతుంది అని నా భావన. దయచేసి మీరు సూచించిన విషయాలలో మీరే తగు శ్రద్ధ తీసుకోగలరని ఆశిస్తున్నాను. ఏదైనా మంచి కార్యమే కదండి. శుభం భవతు: JVRKPRASAD (చర్చ) 03:08, 4 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు. మీ ద్వారా రాయబడిన ఇలాంటివి ఇక నుండి ఒకచొటకు తీసుకొస్తాము. అయితే అలాంటివి కొన్ని చర్చల మద్యలో ఉండొచ్చు. వాటిని కూడా ఒకచోటకు తరలించి ఒక అందమైన పేజీగా మార్చుదాము. మీ వాడుకరి పేజీకి ఉపపేజీగా మార్చి దాన్లో ఇలాంటివి రాద్దురు గాని--విశ్వనాధ్ (చర్చ) 03:17, 4 జూలై 2015 (UTC)...[ప్రత్యుత్తరం]
మీకు ముందుగా ధన్యవాదములు. మీరందరూ ఎలా చేసినా సంతోషమే. JVRKPRASAD (చర్చ) 04:40, 4 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఫైల్ ఎక్కింపు విజార్డ్ పనిచేయుట లేదు

[మార్చు]

ఈ లింకు వద్ద గల వికీపీడియా ఫైల్ ఎక్కింపు విజార్డ్ పనిచేయుట లేదు. క్రోం మరియు ఫైర్‌ఫాక్స్ అధునాతన విహరిణిలో ప్రయత్నించినా పనిచేయుట లేదు. దయచేసి పరిష్కారం తెలియజేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:59, 11 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సాదా ఫార్ము వాడండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:50, 11 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండీ రహ్మానుద్దీన్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:52, 11 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@సుల్తాన్ ఖాదర్ గారికి, స్క్రిప్ట్ ఆంగ్ల వికీలో మార్పులకు అనుగుణంగా మార్చబడింది. ఇప్పుడు పనిచేస్తున్నది. ప్రయత్నించి చూడండి. --అర్జున (చర్చ) 04:33, 13 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ... లింకు పనిచేస్తున్నదండి . సరిచేసినందుకు ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:48, 13 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Please join the 2nd edition of the VisualEditor Translathon

[మార్చు]

Hello!

I'm pleased to announce the 2nd edition of the VisualEditor Translathon.

It is a translation rally, focused on interface messages and help pages related to VisualEditor. In order to participate, you need to sign up on the Translathon page on TranslateWiki.

The top 3 contributors will each win a Wikipedia t-shirt of their choice from the Wikipedia store[1]. Translations made between July 15th and July 19th (CDT time zone) qualify[2].

If you are at Wikimania Mexico this year, you are also welcome to join a related sprint during the hackathon in Workplace 1 - Don Américo, Thursday 16 July at 4pm (CDT) at the conference venue, so you can meet other fellow translators and get support if you need some.

Interface messages have the priority. You will need to create an account at translatewiki.net in order to work on them, if you don't have one. It is recommended to create the account ASAP, so that it can be confirmed in time.

You can also help translate documentation pages about VisualEditor on mediawiki.org. You can use your Wikipedia account to work there.

You will find instructions, links and other details on the Translathon page.

Thanks for your attention, and happy translating!
Elitre (WMF) 20:59, 13 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. You can choose between any short-sleeve shirt, or other items for the same value.
  2. This means both new translations, and updates for messages in the "Outdated" tab of the translation interface.

వికీమేనియా 2015 హాజరుఅవుతున్న వారికి అభినందనలు

[మార్చు]

మిక్సికొ సిటీలొ జులై 15–19, 2015 న జరిగే వికీమేనియా 2015 కు హాజరు అవుతున్న తెలుగు వికీపీడియన్లు అహ్మద్ నిసార్వాడుకరి:అహ్మద్_నిసార్ (చర్చ) గారికి, ఇతర భారత వికీపీడియన్లకు మనొజ్ , సందీప్ , దినేష్ కుమర్, నీతాహాసన్, రొహిణి, బోధిసత్వ కు అభినందనలు.

వికీమానియా 2015కు హాజరౌతున్న తెలుగు వికీపీడియను వాడుకరి:అహ్మద్_నిసార్ గారికి హార్థిక శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 06:36, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారికి వికీమేనియా 2015 కు హాజరు అవుతున్న సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:27, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీమేనియా 2015 కు హాజరౌతున్న వికీపీడియను నిసార్ అహ్మద్ సయీద్ గారికి హార్దిక శుభాకాంక్షలు.--రహ్మానుద్దీన్ (చర్చ) 06:08, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

సర్,
నా పేరు వుక్కుం మహేష్ కుమార్ (vmakumar) డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా మండపేట (తూర్పు గోదావరి జిల్లా) లో పనిచేస్తున్నాను. నెను కొత్తగా వికిపీడియా లొ వ్యాసాలు రాసే ప్రయత్నం ప్ర్రారంభించాను.
ఈ విషయంలో నేను నాకు తెలిసిన, అవగాహన వున్న అంశాలపై తెలుగు వికిలో వ్యాసాలూ తీర్చి దిద్దే ప్రయత్నాలు చేయదలుచుకోన్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఎదురయ్యే సందేహాలను సందేహనివృత్తికై వికీ సీనియర్ ల ముందు ఉంచుతున్నాను. నా ఈ మెసేజ్ మీకు చేరే కరెక్ట్ వేదిక ఈ చర్చా పేజీ అని భావించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సర్, తొలి ప్రయత్నంగా “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే వ్యాసాన్ని రాసాను. ఇది గత కొన్ని రోజులనుండి రూట్ మారి “పూర్ణమ్మ” అనే వ్యాసంలో వేలీన మైనది. అసలు “పూర్ణమ్మ” అనే పేజీని ఎవరి ఖాతాలో సృష్టించబడినదో నాకు తెలియదు. ఆ పేజీలోకి నేను రాసిన వ్యాసం (“పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” పేరు మీద వున్నది) దారి మళ్ళించబడింది. వ్యాస విషయం ఒక్కటే కాబట్టి మళ్ళించాలని ఇతరులు చేసిన సూచనలు చదివాను. అయితే కొత్త కాబట్టి ఎలా స్పందించాలి. ఎక్కడ, ఎవరితో నా వాదన చెప్పాల్సి వుంటుంది తెలియడం లేదు. తెలుగు వికీ పరిచయ పేజీలు సూచనల పేజీలలోని కనిపించే తెలుగుపదాల మాలాంటి కొత్తవారికి ఒక పట్టాన్న అర్ధం కాకపోవడంతోను, ఇంకా వికీ రచన అలవాటు పడకపోవడం వలన ఏమి చేయాలో తెలియక మిన్నకుండడం జరిగింది. ఈ లోపులో పూర్ణమ్మ పేరు గల వ్యాసం లొకి మార్చబడింది. (వ్యాస విషయం మార్చనందుకు థాంక్స్) (మార్చినది లోహిత్ గారు కావచ్చు. వెంకర రమణ గారు కావచ్చు లేదా ఇతర వికీ సీనియర్లు ఎవరైనా కావచ్చు) ఈ సందర్భంలో నాకు వచ్చిన సందేహాలను మీకు తెలియ చేసుకొంటున్నాను. ఇది మీకు (నా మెసేజీ) కనిపిస్తుందో, లేదో, కనిపించాలంటే తెలుగు వికిలో ఎలా ప్రయత్నించాలో తెలియకుండానే ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందేహాలనే ఇంకో ఇద్దరు ముగ్గురు మన తెలుగు వికీ సీనియర్ లకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకరైనా చూసి స్పందించగలరని ఆశిస్తాను. ఇక్కడ కొత్త వికీ ప్రవేశకుడిగా వాకు నాలుగు విషయాలకు సంబంధించి సందేహాలున్నాయి. మీకు వీలయితే సందేహ నివృత్తి చేయగలరు.

  1. మొదటిది :
    ఎవరైనా ఒకరు రాసిన వ్యాసాన్ని (వ్యాస విషయం మార్చనప్పటికి) వ్యాసాన్ని వేరే పేజీలోనికి మార్చవలేనని వేరే ఎవరైనా సూచన పంపిస్తే ఆ సూచనను ఆధారం చేసుకొని మరెవరైనా మార్చవచ్చా? ఇలా ఇంకో పేజీలోకి మార్చడానికి ఎవరికీ సాధికారత వుంది. సూచన చేయబడినప్పుడు, దానికి జవాబు రానపుడు, ఆ సూచన వున్నది అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ఎవరికి వారు నిర్ణేతలుగా మారి దారి మళ్ళింపు చేయవచ్చా ? ఈ విధంగా థర్డ్ పార్టీ నిర్ణేతగా ఎవరికీ వారు తమ వివేకానుసారం నిర్ణయాలు తీసుకోనవచ్చా ? వికీపీడియా “అందరిది, మార్పులు చేర్పులు ఎవరైనా చేయవచ్చు” అంటున్నారు. కాని మన “తెలుగు వికి”లో మార్పులు చేర్పులు చేసే సాధికారత నిజంగా ఎవరికున్నది? డెమొక్రసి లో అధికారం ప్రజలదే అన్నప్పటికీ, వారి తరుపున ఎన్నికైన ఏ కొద్ది మంది ప్రభుత్వవర్గాలే నిజమైన అధికారం చెలాయించడం చూస్తున్నాము. ఇక్కడ తెలుగు వికిలో మార్పులు చేర్పులును పర్యవేక్షించే అధికారం గాని సాధికారత గాని ఎవరికైనా/ఎన్నికైన ప్రతినిధివర్గం కైనా వున్నదా? సర్, నిజంగా ఇటువంటి వ్యవస్థాగతమైన పద్దతి లేకపోతే అది చెడు సంప్రదాయాలకు దారి తీసే ప్రమాదం వుంది. ఒకరు రాసిన వ్యాసాల్ని వేరొక పేజీలోకి మళ్ళించదానికి ఆకతాయిలు సిద్ధంగా వుంటారు. వ్యవస్థాగతమైన పర్యవేక్షణ లేకపోతే అటువంటి వారి IP అడ్రస్ ను బ్లాక్ చేయదమే మనం చేయగలం కాని వేరే సైట్స్ నుండి నెట్ అడ్రస్ ల నుండి అడ్రస్ లు మారుస్తూ ద్వంసo చేయడమే పనిగా పెట్టుకోనేవారిని ఏ విధంగా నిరోధించగలం? ఈ సందేహం నాకు చాల రోజుల నుండి తొలుస్తుంది. కాస్త వివరించగలరు. ఇది పైన పేర్కొన్న వ్యాసాన్ని విలీనం చేసినందుకని కాదు. జనరల్ గా అడుగుతున్నాను.
  2. రెండవదిబొద్దు పాఠ్యం
    మన తెలుగు వికీలోని తెలుగు పద ప్రయోగాలు కొత్తగా వికీ లో ప్రవేశించేవారికి చాలా కొత్తగాను కొరుకుడు పడనట్లుగా ఉంటున్నాయి. తెలుగు మీడియం లో చదువుకొన్న వారికి కూడా అసలు అర్ధం కాకుండా ఉన్నంతగా వున్నాయి. ఉదాహరణకు ” వాడుకరి “ పద ప్రయోగం. USER అనే పదానికి సరిపడ చక్కని తెలుగు పదం అని తెలిసీ చాలా ఆనందించాను. కాని ఈ కొత్త తెలుగు పదం ఎంతమంది తెలుగు నెటిజన్లకు తెలుసంటారు. ఇటువంటి పదాలే మరికొన్ని ‘సముదాయ పందిరి’, ‘మొలకలు’, ’పరికరాల పెట్టె’,'మునుజూపు చూపు'బొద్దు పాఠ్యం. సర్ ఇటువంటి కొత్త పదాలని వికీ లో ఉంచేటప్పుడు సామాన్యులకు కూడా తెలిసేటట్లు బ్రాకెట్ లో ఇంగ్లీష్ పదాన్ని వుంచడం ఒక ప్రామాణిక పద్దతి. ఉన్నత ప్రమాణాలతో తెలుగు వికీ పరిచయ పేజీలను ఆశించే మాలాంటి వారికి, కొత్త వికీ రచయితలకు ఇది ఎంతో సహకారిగా వుంటుంది. మరో పద్దతిలో తెలుగు వికీ పరిచయ, సూచనల పేజీలలో (ఆర్టికల్స్, వ్యాసాలలోని తెలుగు పదాలకు ఇంగ్లీష్ సమానార్ధకాలవసరం లేదు) లో కనిపించే కొత్తగా వున్న తెలుగు పదాలకి సమానార్ధకాలుగా వున్న ఇంగ్లీష్ పదాలతో ఒక గ్లోసరీ ని ఏర్పాటు చేసి ఒక పేజీలో విడిగా ఇస్తే ఎంతో సహకారి గా వుంటుంది. ముఖ్యంగా తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో కొత్త కొత్త పోకడలతో సంకరణం పొందుతున్న కంప్యూటర్ రోజులలో తెలుగు భాషను రక్షించుకోవడం కోసం తెలుగు వారి విజ్ఞాన సర్వస్వం గా తెలుగు వికీ రూపుదిద్దు కోవడానికి చేసే బృహత్ ప్రయత్నంలో వికీ పరిచయ, సూచనల పేజీలలో ఇంగ్లీష్ భాషకు కూడా కాస్త చోటివ్వవలిసినదిగా కోరుతున్నాము. ఒక భాషను పైకెత్తడానికి ఆ భాషలోని నూతన పద ప్రయోగాలను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఇంగ్లీష్ భాషను అంటరాని భాషగా చూడవద్దని మా కోరిక. తెలుగు భాషను ప్రాచుర్యం చేసే ప్రయత్నం లో ఇంగ్లీష్ భాషను కూడా కాస్త కలుపుకు పోవలిసినదిగా కోరుతున్నాము.
  3. మూడవది
    వికీపీడియా లో వ్యాసాల విలీనానికి సంభందించినంతవరకు “హెడ్డింగ్” కు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంది. ఉదాహరణకు ఒకే ఇతివృత్తంతో, ఒకే రకమైన హెడ్డింగ్ తో, రెండు ఆర్టికల్స్ వేర్వేరు కాలాలలో రాయబడినప్పుడు ఏ ఆర్టికల్ ని - ఏ ఆర్టికల్ లో విలీనమవ్వాలని ప్రతిపాదనలు చేయవచ్చు(ఎందుకంటే ఇతివృత్తం ఒకటేకాబట్టి) .
    అంటే ఒకే హెడ్డింగ్ ఒకే ఇతివృత్తాంతం రెండు ఆర్టికల్స్ రాయబడి వున్నప్పుడు ఎక్కువ content వున్న వ్యాసంలో తక్కువ content వున్న వ్యాసాన్ని విలీనమవ్వాలని సూచన చేయాలా ? లేదా తక్కువ content వున్న వ్యాసం లో ఎక్కువ content వున్న వ్యాసాన్ని విలీనం చేయాలని సూచించాలా? .
    సర్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే “పూర్ణమ్మ” హెడ్డింగ్ తో ఒక వ్యాసం చాల కొద్ది మేటర్ తో చాలా కాలం నుంచి తెలుగు వికిలో కొనసాగుతూ వుంది. అయితే నేను 2,3 నెలల క్రితం “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే వ్యాసాన్ని తోలి ప్రయత్నం గా వికిలో రాయగలిగాను. అయితే రెండింటి ఇతివృత్తాంతం ఒకటే (కన్యాశుల్కం) అయినప్పటికీ ఈ రెండవ వ్యాసంలోనే మేటర్ ఎక్కువగా వున్నది. ఇప్పుడు రెండు వ్యాసాలకు ఒకటే ఇతివృత్తాంతం కాబట్టి తోలి వ్యాసంలో (మేటర్ తక్కువున్నదానిలో) మలి వ్యాసం(మేటర్ ఎక్కువ వున్నదానిని) విలీనం చేయాలా? లేక ఒకటే హెడ్డింగ్ , ఇతివృత్తాంతం అయినప్పటికీ మలి వ్యాసం లో మేటర్ ఎక్కువ వున్నది కాబట్టి ఈ ఎక్కువ మేటర్ వున్న వ్యాసంలోనికి తక్కువ మేటర్ వున్న వ్యాసం విలీనం కావలెనా? ఇక్కడ నేను రాసిన వ్యాసాన్ని నాకన్నా ముందుగానే వున్న వారు రాసిన తొలి చిన్ని వ్యాసంలో కలిపివేశారు.(అయితే పేరు మారిందే కాని నేను రాసిన మేటర్ ని మార్చలేనందుకు కృతజ్ఞతలు)
    సర్ ఈ సందర్భంలో మన తెలుగు వారికి తెలుగులో విజ్ఞాన సర్వస్వం అందచేసే బృహత్ ప్రయత్నంలో ‘నేను’ రాసినది, ‘వేరేవారు’ రాసినది అంటూ చేసే వాదనలకన్నా, పేరు కోసం ప్రాకులాడడం కన్నా అది రీడర్స్ కు ఉపయోగంగా ఉందా లేదా వారిని కొత్త కొత్త విషయాలు తెలియచేసి విజ్ఞాన ఆధారితంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం అని తెలుసు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయమేమిటంటే ఏదైనా ఒక వ్యాసం (అది ఒక సాహిత్య వ్యాసం కావచ్చు లేదా ఒక చరిత్ర అంశం కావచ్చు, ఒక సామాజిక అంశం కావచ్చు) గురించి రాసే రచయితలకు, వేర్వేరు పరిశీలక దృక్పధాలు వుంటాయి. (ఒక్క మాథ్స్ తప్ప మిగిలిన సబ్జెక్టు లన్నింటికి సైన్సు తో సహా - సైన్సు కు సంబంధించిన అంశాలను వివరించడంలో కూడా వేర్వేరు శాస్త్రవేత్తలు విభిన్న ప్రతిపాదనలతో వేర్వేరుగా ఆలోచించడం సహజం). అలా వేర్వేరు దృక్పదాలతో ఇద్దరు రచయితలు ఒక ఫాక్ట్ అంశం పై తెలుగు వికిలో ఒకే హెడ్డింగ్ తో ఆర్టికల్స్ వేర్వేరు కాలాలలో రాసినప్పుడు ఆ ఆర్టికల్స్ లు అనివార్యంగా రెండు వేర్వేరు దృక్పధాలను ప్రతిబింబిస్తాయి. (సామాన్యంగా చూసేవారికి రెండు వ్యాసాలలోను ఒకటే హెడ్డింగ్, ఒకటే ఇతివృత్తాంతం కనిపించడం వలన ఒక దానిలో వేరొకటి విలీనం చేయవచ్చు అనే సూచనలు చేసే అవకాశం వుంది.) అటువంటి రెండు వ్యాసాలను విలీనాల పేరిట కలగాపులగం చేస్తే ఆ ఆర్టికల్ లో పరస్పర విరుద్ధతలు కనబడుతూ తెలుగు వికీ readers లను ఆ ఫాక్ట్ ని అర్ధం చేసుకోవడంలో తికమకకు గురిచేస్తాయి. ఈ విషయం కాస్త గమనించగలరు.
  4. నాల్గవది.
    పూర్ణమ్మ” పేరు గల వ్యాసం లొకి మార్చబడిన నా అసలు వ్యాసాన్ని తిరిగి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ క్రిందకు తీసుకురావడం గురించి.
    1. ఒక కవి రాసిన కృతికి సరైన హెడ్డింగ్ ఆ రచయితే తెలియ చేస్తాడు. మహాకవి గురజాడ రాసిన కృతి(గేయకావ్యం) పేరు “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అంతేకాని “పూర్ణమ్మ” కాదు. అంటే గేయానికి సరైన హెడ్డింగ్ “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” మాత్రమే కాని “పూర్ణమ్మ” కాదు. గేయం కూడా సుప్రసిద్ధమైనది ఆ ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ పేరు తోనే . ఆ విధంగా చూస్తే ‘పూర్ణమ్మ’ అంటే ఎవరైనా కావచ్చు కాని ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అంటే గురజాడ వారి గేయమే కళ్ళకు గుర్తుకొస్తుంది.
    2. నేను రాసిన వ్యాసం గేయానికి ఉద్దేశించినది కాబట్టే గేయ నామమైన ” పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” వ్యాసానికి పేరుగా తగినది. ఒకవేళ పూర్ణమ్మ యొక్క వ్యక్తిత్వం, శీలం , జీవితం ప్రాదాన్యంగా విశ్లేషించే వ్యాసానికి “పూర్ణమ్మ” అనే పేరు సమంజసంగా ఉండవచ్చు.
    3. ఒక కవి రాసిన కావ్యాన్ని స్మరించేటప్పుడు ఆ కవి తన కావ్యానికి వాడిన పేరునే స్మరించడం సత్సంప్రదాయం. షార్ట్ కట్ పేర్లు మన సౌలభ్యం కోసం పెట్టుకొన్నవే. వాటిని మౌఖికంగా స్వీకరించవచ్చు గాని లిఖిత రూపంలో పేర్కొనేటప్పుడు మాత్రం అసలు పేరును వాడాల్సివుంటుంది అని భావిస్తున్నాను..

అందువల్ల “పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ కన్నా “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అన్న హెడ్డింగ్ పేరే సమంజసంగా వుంటున్నదనేది నా అభిప్రాయం. ముందు రాయబడ్డ వ్యాసం అనే ఏకైక కారణం చేత సరైన హెడ్డింగ్ కూడా కానటువంటి “పూర్ణమ్మ” వ్యాసంలో, సరైన హెడ్డింగ్ తో రాయబడిన తరువాయి వ్యాసాలు విలీనం కావాలనడం ఫలితంగా ఆ విలీన వ్యాసానికి సరైన హెడ్డింగ్ కుదరకపోవడం అంత సమంజసం కాదేమో వికి సీనియర్లు ఆలోచించాలి. ఉదాహరణకు “గురజాడ అప్పారావు” అనే వ్యాసాన్ని “అప్పారావు” అనే వ్యాసంలో (తొలుత రాయబడినడనే కారణం మీద) విలీనం చేసి ఆ విలీన వ్యాసానికి “అప్పారావు” అనే పేరు పెడితే ఎలా వుంటుంది.

అందుకే content ప్రాధాన్యతని పక్కన బెట్టి ముందు రాయబడ్డ వ్యాసంలోనే, తదుపరి వచ్చే వ్యాసాలన్నీ విలీనం కావాలంటే అది కేవలం ఒక హెడ్డింగ్, ఒకటి రెండు లైన్లు రాసి పక్కన పడేసే సంప్రదాయానికి తెర తీసినట్లవ్వవచ్చు. ఫలితంగా ఒక డిక్షనరీ ముందేసుకొని ‘పేజీ క్రియేటర్’ లు చేసే విన్యాసాలకు గాను, సమాచారం కోసం వెదికే తెలుగు వికీ రీడర్లకు లకు ‘పేర్లు’ తప్ప అసలు ‘సమాచారం’ దొరకని విచిత్రస్థితి ఎదురవ్వవచ్చేమో - వికీ సీనియర్లు కాస్త ఆలోచించాలీ. పై కారణాల చేత “పూర్ణమ్మ” పేరు గల వ్యాసం లొకి మార్చబడిన నా అసలు వ్యాసాన్ని తిరిగి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ క్రిందకు తీసుకు రాగలరని కోరుతున్నాను. నా వరకు హెడ్డింగ్ ను “పూర్ణమ్మ” నుండి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కు మార్చడం నాకింకా తెలియదు. అందుకే మిమ్మలను కోరుతున్నాను. తోటి వికీ సీనియర్ గా ఈ విషయంలో నాకు (కొత్త వికీ ప్రవేశకుడికి) సరైన అవగాహన కల్పించగలరని ఆశిస్తున్నాను.

ఇట్లు
(vmakumar)
వుక్కుం మహేష్ కుమార్, B.Tech,
డి.సి.టి.ఒ, మండపేట
7702204915

--Vmakumar (చర్చ) 19:06, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం గురించి

[మార్చు]

గురజాడ వ్రాసిన పుత్తడి బొమ్మా పూర్ణమ్మ గూర్చి తెవికీ లో మూడు పేర్లతో వ్యాసాలున్నాయి. పూర్ణమ్మ పేరుతో వాడుకరి:Rajasekhar1961 గారు 29.10.2009 లో వ్రాసారు. రెండవది పుత్తడి బొమ్మా పూర్ణమ్మా పేరుతో వాడుకరి:Rajasekhar1961 గారు 7.10.2011 న సృష్టించి పూర్ణమ్మ కు దారిమార్పు చేసారు. తరువాత వాడుకరి:Vmakumar గారు 25.4.2015 న పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పేరుతో వ్యాసం వ్రాసి చక్కగా విస్తరించారు. అందులో చర్చా పేజీలో విలీనం గూర్చి చర్చ జరిగింది.చర్చ:పూర్ణమ్మ లో విలీనం గూర్చి తెలియజేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి కనుక 12.7.2015 న విలీనం చేసితిని. విలీనం అనేది ముందుగా ఉన్న వ్యాసంలోనికి చేయాలని సంప్రదాయం ఉన్నది. అందువలన విలీనం చేసితిని. ఈ విలీనం విషయాల నిబంధనల గురించి అనుభవజ్ఞులు తెలియజేయగలరు. ఒకవేళ విలీనం తప్పు అనిపిస్తే మార్చవచ్చు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 03:13, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar అడిగిన విషయాల గూర్చి అనుభవజ్ఞులు తెలియజేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 03:13, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పూర్ణమ్మ వ్యాసంలో కూర్పులు 11 ఉన్నాయి. తరువాత Vmakumar గారు వ్రాసినది చాలా ఎక్కువ కూర్పులు, ఎక్కువ బైట్లతో కలిగి ఉన్నది. సాధారణంగా ఎవరైనా కూర్పుల చరితాన్ని చూస్తే ఇక్కడ వ్రాసిన వ్యాసంలో ఇద్దరే పాలుపంచుకొన్నట్టుగా ఉంటుంది. Vmakumar గారి మార్పులు వ్యాస చర్చాపేజీకి వెళ్ళి చూసేవాళ్లెవరు. తద్వారా ఎంతగా అనుకొన్నా రాసిన వ్యాసంలో కృషి ఎవరు చేసారో కూడా తెలియకుండా చేయడం అసంభద్దం. కనుక ముందు రాసిన వ్యాసం అనుకొన్నా లేదా మరొకటైనా మొలక వ్యాసాల్లో పెద్ద వ్యాసాలను విలీనం చేయడం ఏమంత మంచి ప్రక్రియ కాదు. ఏది పెద్దగా, పూర్తి వ్యాసంగా ఉంటుందో అందులోనే చిన్న వ్యాసాలను విలీనం చేయాలి. దీని గురించి హైదరాబాద్‌లో సహ సభ్యులకు వివరించాను. అయితే అనుకొన్న ప్రతి స్పందన రాలేదు. కె.వెంకటరమణ గారు చేసే నిర్వహణాపరమైన మార్పుల విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆయన తన పనిని క్రమ పద్దతిలో చేసుకు వెళుతున్నారు. వికీలో విలీనం ప్రక్రియకు సంభందించి ప్రస్తుతం ఉన్న పద్దతులకు మాత్రమే నేను పూర్తిగా వ్యతిరేకం, వీటి వలన చాలా మంది సభ్యులు ఇబ్బ్ంది పడుతారు, వికీకి దూరంగా జరుగుతారు. కనుక సభ్యులు చర్చించుకొని కొన్ని పద్దతులను, మార్పులను, సవరణలను చేయవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. విలీన ప్రక్రియ గురించి మార్పులు కావాలనే తిరుమల సంభందిత వ్యాసలలో అనేక విలీన, మొలక, విస్తరణ మూసలు ఇటీవల చేర్చడం జరిగింది.. ఇక పైన Vmakumar గారు తెలిపినట్టు పూర్ణమ్మ అనేది ఎవరైనా కావచ్చు. పుత్తడి బొమ్మా పూర్ణమ్మ అనేది సరియైన వ్యాసం పేరుగా, ఎవరైనా వెతికితే దొరికే విదంగా ఉంది కనుక తిరిగి రీ డైరెక్ట్ చేస్తే బావుంటుంది... --విశ్వనాధ్ (చర్చ) 05:29, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి సంబంధించి వికీసోర్స్ లో కూడా వ్యాసం ఉంది. అందులో పూర్ణమ్మ అని ఉన్నది. గురజాడ పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా "పూర్ణమ్మ కథ" అనే పేరుతో ఈ రచన చేసినట్లు ఉన్నది. అదే విధంగా Gurajada Apparao 150th Jayanthi celebrations లింకులో కూడా "ఫూర్ణమ్మ కథ" అని ఉన్నది. కినిగె.కాం లింకు లో కూడా పుస్తక ముఖచిత్రం పూర్ణమ్మ అని ఉన్నది. నవ్యధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ అనే లింకులొ సాక్షి వ్యాసంలో కూడా "పూర్ణమ కథ" అని ఉన్నది. మరికొన్ని వెబ్‌సైట్లలో "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" అని ఉన్నది. కనుక రెండు వ్యాసములు విలీనం చేయవచ్చు. విలీనం చేయునపుడు పూర్వపు వ్యాసంలో కొత్తగా వ్రాసిన వ్యాసాన్ని విలీనం చేయాలి. దీనిపై వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17#రెడ్డి గారికి వినతి విభాగంలో చర్చ జరిగింది అందులో చంద్రకాంతరావు గారు "తెవికీ సంప్రదాయం ప్రకారం ఏదేని వ్యాసం మొదట ప్రారంభించినదే ఉంచి తర్వాత చేర్చిన వ్యాసాలను తొలిగించడం కాని దారిమార్పులు చేర్చడం కాని చేయడం జరుగుతుంది. చాలా వ్యాసాలు తెవికీలో ఇదివరకే ఉన్ననూ కొందరు ఆ విషయం గ్రహించక మళీ కొద్దిపేరుమార్పుతో ఇదివరకే ఉన్న వ్యాసం కన్నా పెద్దగా, నాణ్యతతో రచించిననూ తర్వాత చేర్చబడిన వ్యాస సమాచారాన్ని మొదటగా సృష్టించిన వ్యాసంలోకి విలీనం చేయడం జరుగుతుంది." అని తెలియజేసారు. అదే సాంప్రదాయంతో అనేక వందల వ్యాసాలను విలీనం చేయడం జరుగుతుంది. అలా చేయనిచో తెవికీలో చిన్న వ్యాసాలు అనేకం ఉన్నాయి. వాటిని విస్తరణ చేయకుండా అక్షర భేదాలతో వ్యాసం సృష్టించి అంతకంటే ఎక్కువ సమాచారాన్ని చేర్చితే పాత వ్యాసాన్ని ఇప్పటి వ్యాసంలో విలీనం చేస్తే ఎంతో కష్టపడి వ్యాసాలు వ్రాస్తున్న వాడుకరుల కృషికి భంగ వాటిల్లినట్లు కాదా! పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:03, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రెండు వ్యాసాల వ్యాస చరిత్రలకు భంగం వాటిల్లకుండా విలీనం చేసితిని.Vmakumar గారు కోరినట్లు వ్యాస శీర్షిక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గా మార్చితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:23, 16 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్స్

[మార్చు]

థాంక్స్ --Vmakumar (చర్చ) 00:05, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా వెంకటరమణ గారూ...--విశ్వనాధ్ (చర్చ) 05:50, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర భాషా సినిమాల నోటబిలిటీ

[మార్చు]

తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమాలన్నీ నోటబుల్ అన్న ఓ సూత్రీకరణ చేశారని తెలుసు. పైగా తెలుగు పత్రికల్లో, ప్రసారమాధ్యమాల్లో సినిమాకిచ్చే అత్యున్నత ప్రాధాన్యత, తెలుగు వారి సంస్కృతిలో సినిమా ఏర్పరుచుకున్న స్థానం దృష్ట్యా అది సబబైనదేనని నా అభిప్రాయం. అయితే ఆంగ్ల, హిందీ, తమిళం వంటి ఇతర భాషా సినిమాలకు వ్యాసాలను సృష్టించే విషయంలో నోటబిలిటీ ఎలా పరిగణించాలన్నది తెలియట్లేదు. ఇటీవల గూగుల్ అనువాద వ్యాసాలను చూస్తూండగా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఆంగ్లంలో ఉన్న వ్యాసాలను అనువదించారు, ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అవి వుండవచ్చునా లేదా అన్నది తేలుతుంది. ఇక కొన్ని హిందీ సినిమాల గురించీ రాద్దామనుకున్నప్పుడు వాటి ప్రాధాన్యత ఏమాత్రం ఉందనేది కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయంలో స్పష్టత ఇస్తే రాద్దామనుకుంటున్న కొన్ని వ్యాసాల విషయంలో నాకు ఎటూ తేలుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 11:08, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు నా వద్ద నుండి నాలుగు దశకాలకు సంబంధించిన పాటలపుస్తకాలను తీసుకున్నారు, వాటిని వాడి వ్యాసాల అభివృద్ధి చేస్తానన్నారు. ఇంకా ఆ వైపు ఎలాంటి కృషి జరగటం నాకు కనిపించలేదు. చేయలేని పక్షంలో ఇక్కడ తెలపగలరు. నేను ఆ పనిని చేయగలను. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:43, 21 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మాన్ సరిగా గుర్తుచేసుకోండి. మీరు నాకు మెకంజీ కైఫీయత్తులు, ఈనాడు ఆదివారాలు ఇచ్చారు. మీరంటున్న పాటల పుస్తకాలను నేను తీసుకోలేదు. ఎవరికైనా ఆసక్తివుందా అని అడిగినప్పుడు సినిమా పాటల పుస్తకాలు కావాలని నేను ముందుకురాలేదు, వేరే వారు ముందుకొచ్చారు. ఐతే వారికీ అప్పుడు ఇవ్వలేకపోయారు. ఇక తెలుగు సినిమా వ్యాసాలను అభివృద్ధి చేస్తానని నేను ప్రకటించింది 11 వార్షికోత్సవంలోనే తప్ప అంతకుముందు ఆ ఆలోచన లేదు నాకు. ఇంతకీ నేనడిగిన ప్రశ్నకు సంబంధించి మీకేదైనా తెలుసా? --పవన్ సంతోష్ (చర్చ) 09:27, 21 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • మీకు అన్ని తెలుగు సినిమా పాటల పుస్తకాలు ఇవ్వలేదు. ౩౦, ౪౦, ౫౦ ఇంకా ౬౦ దశకంవి మాత్రమే ఇచ్చాను. మీరు ఆ ఆసక్తి సంగతి ఆ సినిమా పాటల పుస్తకాలు చూసాకే చెప్పారు. పోనీలెండి కనీసం కైఫీయత్తుల సంగతైనా గుర్తుంది. వాటి సంగతి ఏమయింది? ఆసక్తి లెని సందర్భంలో ఆ విషయాన్ని తెలుపగలరు. వేరే ఎవరైనా ఆసక్తి ఉంటే చేయగలరు. దాదాపు రెండు వేల పై చిల్లర తెలుగు సినిమా వ్యాసాలు చాలా చిన్నవి, ఒక్క లైను కూడా లేకుండా ఉన్నవీ ఎన్నో ఉన్నాయి. http://paste.ubuntu.com/11913630/ వద్ద దాదాపు 4009 ఇలాంటి వ్యాసాలున్నట్టు తెలుస్తోంది. అవి పూర్తి చేసేలోపు కొత్తవి తీసుకోవడం సబబు కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:13, 21 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మానుద్దీన్ నిరాధారంగా కాదు నేను చెక్ చేసుకునే రాస్తున్నాను, అందుకే మిమ్మల్ని గుర్తుచేసుకొమ్మన్నాను. మీ వద్ద సినిమా పాటల పుస్తకాలు కాక కైఫీయత్తులు, ఈనాడు పుస్తకాలే పుచ్చుకున్నాను. ఇక చిన్న చిన్న స్టబ్స్ గా వదిలేసిన తెలుగు సినిమా వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నది నేనే. నా వరకూ నేను తెలుగు సినిమా వ్యాసాలు మొలకలుగా పడివుండి ఇబ్బందిగా ఉన్నాయి కదాని దానిపైనే దృష్టిపెట్టాను. మీరు వ్యాఖ్య చేసే ముందు నా కంట్రిబ్యూషన్లు చూసివుంటే తెలిసేది. చివరగా చెప్పొచ్చేదేంటంటే రాయాల్సినవేవో ఉన్నాయి కదాని కొత్త వ్యాసాలు రాయకపోవడం సబబు అనుకోరాదు. అలా అనుకునేట్టయితే ఇన్ని వేల వ్యాసాలూ అభివృద్ధి కాలేదు కాబట్టి అసలు కొత్త పేజీలే ఉండవు. ఇంతకీ నేనడిగింది వాటి పాలసీ సంగతేంటని మాత్రమే. ఉంటే చెప్పండి.--పవన్ సంతోష్ (చర్చ) 12:07, 21 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వేలల్లో సినిమా వ్యాసాలు మొలకలుగా ఉన్నా అవ్ అభివృద్ధి చేయకుండా కొత్త వ్యాసాల సృష్టికి మొగ్గు చూపడం వేరే అపార్ధాలకు దారి తీస్తుంది. 4000+ వరకూ ఉన్న వ్యాసాల సంఖ్య 3600 కు చేరిందంటే మీరొక్కరి కృషే అని భావించి మీకు జోహార్లు పలకొచ్చు. ఇక నేనడిగింది, సినిమా పాటల పుస్తకాలు మీరు ఏం చేయదలచారో చెప్పలేదు, కైఫీయత్తులు తీసుకొని ఆరునెలలలో ఏం అభివృద్ధి జరుగలేదు. మీకు ఆసక్తి లేక పోతే వేరే వ్యక్తులు ఆసక్తి ఉన్నవారు ఆ పని చేపడతారు. కొత్త వ్యాసాలు సృష్టించాలనే అనుకుంటే మిమ్మల్ని ఎవరూ ఆపటంలేదు. అయితే మీకు ఆసక్తి సినిమా అయితే అందులో మూడున్నరవేల పైచిలుకు వ్యాసాలపై ముందు దృష్టి పెట్టగలరన్నదే నా విన్నపం. అది కాదని ఆంగ్ల హిందీ, ఇతర భాషల సినిమాలు వ్రాస్తానంటే చేసేదేమీ లేదు. ఇక మీరడిగిన విషయమై ఇప్పటి దాకా ఎలాంటి పాలిసీ లేదు, కాకపోతే ఇది వరకే మీలాగే తమిళ సినిమాల వ్యాసాలు వ్రాస్తున్న ఒక వాడుకరి పేజీలో తెలుగు సినిమా వ్యాసాలు అభివృద్ధి చేయాల్సిందిగా రవిచంద్ర వ్రాసారు. వికీపీడియా:వికీపీడియాలో_తప్పకుండా_ఉండవలసిన_వ్యాసాలు పేజీలో కొన్ని సినిమా సంబంధిత వ్యాసాలు ఉన్నాయి, వాటిని సృష్టించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:46, 21 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మానుద్దీన్ గారి వాదనకో నమస్కారం. ఇప్పుడే కాదు వెయ్యినొకటో సారైనా చెప్పేదేమంటే తెలుగు సినిమా పాటల పుస్తకాలు మీరివ్వనూ లేదు, నేను పుచ్చుకోనూ లేదు. నాదేమైనా పొరపాటేమోనని నా డాటా మొత్తం సరిజూసుకున్నా వాటి దాఖలాలు లేవు. ఇక కైఫీయత్తుల నుంచి నేను రాశాను. మీరు నా తెవికీ వ్యాసాలు సరిగా ఫాలో అయితే కూచిపూడి భాగవతుల గురించి, సంబెట గురవరాజు గురించి రాసిన వ్యాసాలూ అవీ చూసుకోవచ్చు. వేరే వ్యక్తులకు ఆసక్తి వుంటే తప్పకుండా చేపట్టమనండి, నేనూ చేస్తాను-వారినీ చేయమనండి. నేను చేస్తున్నాను కదా అనో, చేస్తానన్నాను కదా అనో వారు ఊరుకోనక్కరలేదు. ఇక సినిమా వ్యాసాలు నేను ఏం అభివృద్ది చేస్తున్నానో అంతా తేటతెల్లంగా ఉన్న తెవికీలో సంజాయిషీలు చెప్పుకునేదేమీ లేదు. మీరే నా కంట్రిబ్యూషన్లు చూసుకోండి. వేలల్లో వ్యాసాలు మొలకలుగా ఉంటే కొత్త వ్యాసాలు సృష్టించడం వేరే అపార్థాలకు దారితీస్తుందా? ఏం అపార్థాలు చెప్పగలరా? అయితే ఓ పనిచేయండి, మొత్తం వ్యాసాలన్నీ అభివృద్ధి అయ్యేదాకా కొత్తవి తయారుకారాదని ఓ నియమం పెట్టి అందుకు వ్యతిరేకంగా చేసేవారిని నిరోధించేలాంటి సైనిక చట్టాలు చేయండి. ఇక చివరాఖరికి మీరిచ్చిన సమాచారానికి సంతోషం. వికీలో నియమాలన్నీ పాటించవచ్చు కానీ ఇవి చెయ్యి, ఇవి చెయ్యొద్దు అన్నవి సాఫ్ట్ పవర్ వాడి నిబంధించాలనుకుంటే మాత్రం కష్టం. మరోమారు నమస్కారం. --పవన్ సంతోష్ (చర్చ) 14:22, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన

[మార్చు]

సర్, వికీపీడియా లో ఈ “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” వ్యాసాన్ని “పేజీ సమాచారం“ లో కెళ్ళి “మార్పుల చరిత్ర “ లో చూసాను. అక్కడ పేజీ సృష్టికర్త గా Rajasekhar1961 గారి పేరు, ఇట్టీవలి మార్పుచేర్పుల కర్తగా Kvr.lohith గారి పేరు నమోదయ్యింది. మరి మొత్తం 48,009 బైట్స్ గల ఆర్టికల్ రూపొందడంలో, నా వంతు చేసిన కృషి కూడా తెలిసేటట్టు ఏ పేజీ లోనైనా సమాచారం దొరుకుతుందా? vmakumar 17.07.15_17.24 PM

అదే వ్యాసం చర్చపేజీలో చరితాన్ని నాకు తెలిసినంతో చేర్చాను చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 13:00, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ వ్యాసము యొక్క చరిత్రలో మీరు చేసిన మార్పులు ఉన్నవి. చూడండి. మీరు చేర్చినవిషయాలు వ్యాస చరిత్రలో గల మార్పుల తేదీలలో (ప్రస్తు • గత) లో గతంలో చేసిన దిద్దుబాటుకు,తర్వాత చేసిన దిద్దుబాటులను పరిశీలిస్తే మీరు చేర్చిన అంశాలన్నీ అర్థమవుతాయి. ఈ వ్యాసంలో చేసిన మార్పుల సంఖ్యను చూసేందుకు ఈ ఉపకరణం లో చూడండి.ఆ పేజీలో project విభాగంలో te.wikipedia అని,page విభాగంలో "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" అని చేర్చి search చేయండి.అపుడు ఆ పేజీ గణాంకాలు కనబడతాయి. దాని ప్రకారం మీరు 50 దిద్దుబాట్లు చేసి అగ్రస్థానంలో ఉన్నట్లున్నది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:18, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీరు చెప్పినట్లు వ్యాసం చర్చ పేజీ లో చూసాను. ఒక చిన్న మనవి. అది ఎవరు ఎప్పుడు ఎలా ఎన్ని బైట్స్ దిద్దుబాట్లు చేసారు అన్న కాల చరిత్ర వివరంగా చెపుతుంది. ఒక వ్యాసంలో ఎవరి కృషి, ఎంత % అన్నది సింపుల్ గా చెప్పగలిగితే బాగుంటుంది కదా. “పేజీ సమాచారo’లో వున్నా దానికి, వ్యాస ‘చర్చ’ పేజీలో వున్నా దానికి వున్న తేడా అదే కదా. ఒక artcicle యొక్క వ్యాస ‘చర్చ’ పేజీలోకి వెళ్లి దిద్దుబాట్లు అయిన chronological history ని చూసి ఆ articleని రూపొందించిన కృషిలో ఎవరు ప్రధానంగా వున్నారో తెలుసుకొనడం ఒక సాధారణ వ్యక్తికీ కష్టమే అనుకుంటున్నాను.

వ్యాసాలు రూపొందడంలో 1.పేజీ సృష్టికర్త, 2.ఇట్టీవలి మార్పుచేర్పుల కర్త - ఈ ఇద్దరికే ప్రాధాన్యత ఉన్నట్లు “పేజీ సమాచారం“ లో కెళ్ళి “మార్పుల చరిత్ర “ను చూస్తే కనిపిస్తుంది. ఒక వ్యాసాన్ని రూపొందించడంలో ఆ వ్యాసాన్ని ‘అభివృద్ధి’ చేసినవారు కూడా భాగస్వాములుగా వుంటారు కదా. ముఖ్యంగా ఒక చిన్న వ్యాసాన్ని పెద్ద వ్యాసంగా మలిచిన సందర్భంలో నైనా, వ్యాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేసిన వారికి గుర్తింపు “మార్పుల చరిత్ర”లో కూడా కనిపించడం సమంజసంగా వుంటుంది కదా! ఉదాహరణకు మొత్తం 48,009 బైట్స్ లు గల “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” వ్యాసంలో ప్రధాన మార్పులు చేసినవారిలో కనీసం ముగ్గురు, నలుగురు ప్రధాన ఎడిటర్స్ ల నైనా పేర్కొని – మొత్తం ఆర్టికల్ లో వారు కూర్చిన బైట్స్ వారీగా లేదా % బైట్స్ వారీగా తెలియచేస్తే, అది ఆ వ్యాసాభివృద్ధికి కృషి చేసినవారినే కాక ముఖ్యంగా తెలుగు వికీ బృహత్తర యజ్ఞంలో నూతనంగా ప్రవేశించాలనుకొనే, పాలు పంచుకొనే ఔత్సాహికులకు (అనగా అల్ రెడీ సృష్టించదడిన పేజీలను ఇంకా విసృతo చేయాలనుకొనే ఔత్సాహికులను) గుర్తింపు ఇచ్చి మరింతగా ప్రోత్సాహించినట్లవుతుంది కదా. అప్పుడే కదా మన తెలుగు వికీలోకి వివిధ రంగాల సబ్జెక్టు లలో చక్కని ప్రావీణ్యం వున్న నూతన Aspirants స్వచ్చందంగా వ్యాసాలను అభివృద్ధి చేయడంలో తమ వంతు ప్రయత్నంతో తరలి రావడానికి అవకాశం వుంటుంది.

వ్యాసంలోని “మార్పుల చరిత్ర” పేజీలో first creator, end editor లకు తమ వాడుకరి పేరులను చూసుకొనే వీలు కల్పించిన అవకాశం లాగనే , వ్యాసాభివృద్ధికి కృషి చేసిన developer కి తమ ‘వాడుకరి’ పేరును కూడా చూసుకోవాలనే కోరిక ముఖ్యంగా ఔత్సాహికులకు అందులోను స్వచ్చందంగా వచ్చేవారికి సహజమైనది, న్యాయమైనది కూడా. ఈ మానవ సహజమైన స్వభావాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్లు “పేజీ సమాచారం” కు చెందిన సాఫ్ట్ వేర్ ని modify చేసుకొంటే తెలుగు వికీలోకి వ్యాసాల “అభివృద్ధి” లో పాలు పంచుకోవడానికి నాణ్యమైన రచనలు, ప్రామాణిక మైన రచనలు చేయగల విభిన్న రంగాల నుండి ఔత్సాహికులు స్వచ్చందంగా తరలి వస్తారు. అదే కదా మనకు కావలిసింది. అయితే అలా వచ్చిన ఔత్సాహికులకు తెలుగు వ్యాస అభివృద్ధి లో వారి చేసిన కృషిని మాత్రం స్వీకరిచి, “పేజీ సమాచారం“ పేజీలో వ్యాసభివృద్ధికి తోడ్పడినవారిగా వారి ‘వాడుకరి’ పేరును చూసుకునే చిన్న అవకాశం కల్పించడానికి తెలుగు వికీ ఇష్టపడకపోతే, వారు గుర్తింపు త్వరగా వచ్చే ‘షార్ట్ కట్’ మార్గాలను ఆశ్రయించే అవకాశం వుంది. మొదటిది వ్యాస అభివృద్ధి లో మొక్కుబడిగా తూతుమంత్రంగా వాక్యాలను జతచేస్తూ “మార్పులు చేసే వ్యాసాల సంఖ్య”ను అత్యధికంగా పెంచుకొనే అవకాశం వుంది. రెండవది అంత ఓపికా లేని మరింత ‘సులభగాములు (షార్ట్ కట్టర్స్) పేరు గుర్తింపు కోసం అతి చిన్న చిన్న “మొలక”ల రూపంలో వందలాది ‘కలుపు మొక్క’లను వికీ వనంలో నాటుకొంటూ పోయే ప్రమాదముంది. పలితంగా ఎంతకాలమైనా ‘మొక్కలు’గా ఎదగలేని ఈ ‘మొలక’లను ఏరివేయకపోతే అడుగడుగునా కనిపించే ఈ కలుపు ‘మొలక’లకు విసుగెత్తి మన రీడర్స్ తెలుగువికిని చూడాలంటెనే చికాగెత్తి ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకొనే ప్రమాదముంది.

అందువలన సింపుల్ గా పేజీ చరిత్ర లోని “మార్పుల చరిత్ర “ లోనే ఇటువంటి అవకాశం (ఆ వ్యాసంలో ఎవరి కృషి, ఎంత % అన్నది సింపుల్ గా చెప్పగలిగే అవకాశం) కల్పిస్తే బాగుంటుంది

కనుక నూతన aspirants లను ప్రోత్సాహించడానికి “మార్పుల చరిత్ర“ లో ‘పేజీ సృష్టికర్త’కి ‘ఇట్టీవలి మార్పుచేర్పుల కర్త’కి ఇచ్చిన గుర్తింపువాలనే, ఎక్కువ బైట్స్ లతో అభివృద్ధి చేసినవారికి సైతం కనీసం తొలి ముగ్గురు, నలుగురు లకైనా తమ ‘వాడుకరి’ పేరు చూసుకొనే అవకాశాలు వికీ నిర్వాహకులు పరిశీలించగలరని, అది పరోక్షంగా వికీ వ్యాస అభివృద్దికే కాకుండా నాణ్యతను కూడా మెరుగు పరుస్తుందని తెలియచేసుకొంటున్నాను.

--Vmakumar (చర్చ) 14:21, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ పేజీ చరిత్రలో మీరు ఏసమయంలో ఎంత సమాచారం(బైట్లలో) చేరుస్తున్నారో వివరంగా ఉంది కదా! ఆ పేజీలో మీరు యిప్పటికి 50 మార్పులుచేసారు. 50 మార్పుల సమయం,చేర్చిన సమాచారం,చేర్చిన సమాచార మొత్తం బైట్లు వంటి అంశాలు వివరంగా ఉన్నవి కదా. ఒక వ్యాసం అనేకమంది కృషి ఫలితం కదా. సమాచారం చేర్చడమే కాదు మూలాలు చేర్చడం, వికీకరణ చేయడం, శుద్ధి చేయడం , లింకులు చేర్చడం వంటివి కూడా వికీపీడియా కృషిలో భాగాలు. ఒక వ్యక్తి లక్ష బైట్లను వికీలో చేర్చినా దానికి సరైన మూలాలు,లింకులు చేర్చకపోతే దాని విలువేముంటుంది. కనుక పేజీలో చేర్చిన సమాచార శాతం వలన ఏ విధమైన లాభం లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు "A" అనే వ్యక్తి గూగుల్ అనువాద పరికరం ఉపయోగించి ఒక వ్యాసాన్ని 5 నిమిషాలలో లక్ష బైట్లతో సృష్టించాడనుకుందాం. అందులో అనేక దోషాలు ఉంటాయి. దానిని శుద్ధి చేయాలంటే "B" అనే వ్యక్తి అనేక గంటలు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఎంత సమయం వెచ్చించినా "B" వ్యక్తి శుద్ధి చేయడంలో,వికీకరణ చేయడంలో చేర్చిన సమాచారం కొన్ని బైట్లు ఉండవచ్చు. లేదా కొంత అనవసర సమాచారం తొలగించవచ్చు. ఇద్దరిలో ఎవరికీ ఉపయోగపడని శుద్ధి చేయని సమాచారం చేర్చిన వ్యక్తికి ఎందుకు గుర్తింపు యివ్వాలి. సమాచారం అధికంగా చేర్చినందుకా? శుద్ధి ,వికీకరణ,లింకులు,మూలాలు అన్నీ చేర్చి పేజీని ఆకర్షణీయంగా చేర్చిన వ్యక్తికి సమాచారం కొద్దిగా చేర్చితే ఆయనకు గుర్తింపు ఉండక్కర్లేదా? అనవసర విషయాన్ని 20000 వేల బైట్లను తొలగించారనుకుందాం. అదికూడా తెవికీప్రయోజనం కొరకే కదా! దాని మూలంగా వ్యాసం మెరుగవుతుంది కదా. సమాచారం తొలగించారని (ఏవిధమైన సమాచారం చేర్చలేదు కనుక) ఆయనకు ఎలాంటి సమాచార శాతం యివ్వాలి.(ఋణాత్మకంగా యివ్వాలా!). అందువలన వ్యాస చరిత్రలో ఏయే అంశాల పట్ల కృషి చేశారో వివరంగా ఉన్నది కనుక శాతాలతో పనిలేదని నా అభిప్రాయం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 03:09, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కుమార్ గారూ పైన వెంకట రమణ గారు చెప్పిన విషయాన్ని ఓ ఉదాహరణతో చెప్తాను. ఈ వ్యాసం చరిత్ర చూడండి. అందులో ఈ అజ్ఞాత వాడుకరి ఎన్నో వేల బైట్లు కలుపుతున్నట్టు, నేను వేలాది బైట్లు తీసేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే పాయింటేంటంటే వాళ్ళు యాంత్రికానువాదం చేసి ఓ సమస్యను సృష్టిస్తే, నేను దాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాను. బైట్లు చేర్చడం, తీర్చడం వల్ల ఇదేమీ అర్థం కాదు. మీరు కూడా ఆలోచించి చూడండి. ఐనా క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసేవాళ్ళందరికీ అర్థమౌతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 13:08, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సర్,
వెంకట రమణ గారు, మీరు 14:18, 17 జూలై 2015 (UTC) చెప్పిన వివరణ నాకు అప్పటికే చేరలేదు కాబట్టే పవన్ సంతోష్ గారు 13:00, 17 జూలై 2015 (UTC) లో తెలియ చేసిన వివరణ కు ప్రతి స్పందనగా మాత్రమె , పవన్ గారిని ఉద్దేశిస్తూ నేను రాసాను. తీరా upload చేసిన తరువాత మీ వివరణ ( 14:18, 17 జూలై 2015 (UTC)) కనిపిoచింది. ఇది కేవలం ఇంటర్నెట్ సర్వర్ సమస్య వల్ల (చాల చిన్న ఊరు మండపేట అందులోను remote distance లో నేనుంటున్నoదువల్ల ,ప్రైవేటు ఇంటర్నెట్ తరుచు ఇబ్బంది పెడుతుంది.) మీ reply చూడకుండానే నా వాదన పోస్టింగ్ చేసాను. అంతకు మించినది ఏమిలేదు. పైగా మీరు చెప్పిన 14:18, 17 జూలై 2015 (UTC) reply తోనే నేను పూర్తిగా సంతృప్తి చెందాను. కాని అప్పటికే నా పాత పోస్టింగ్ already కనిపించడం వాళ్ళ నేను స్పందించలేదు. అలాగే 03:09, 18 జూలై 2015 (UTC) నాటి reply కూడా సమంజసంగాను మరింత లోతుగా ఆలోచింపచేసేదిగా వుంది. కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడే పవన్ గారి మెసేజ్ కూడా చూసాను. కొత్త సభ్యుడిగా నా సందేహం తీరింది. కృతజ్ఞతలు--Vmakumar (చర్చ) 14:04, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహంతీరినందుకు,సమాధానానికి సంతృప్తి పడినందుకు ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించండి. ఏదైనా సహాయం కావల్సి వస్తే అభ్యర్థించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:20, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన

[మార్చు]

వెంకట రమణ గారికి, పవన్ సంతోష్ గారికి
సర్,

  1. నేను మాలపల్లి నవల మీదవ్యాసం రాయబోయేముందు అనేక corrections ,editing లు చేయడానికి Microsoft “word” షీట్ లో రోజూ నాకు తోచిన మార్పులు చేసికొంటూ ప్రిపేర్ చేసుకొన్నాను. చివరగా ఆ వ్యాసాన్ని కాపీ చేసి మన వికిలో paste చేసాను. (దీనికి కారణం ఒక వ్యాసం పిల్ల దశలో వున్నప్పుడు వికిలో చేరిస్తే ఆపై ప్రతి రోజు మార్పులు చేర్పులు చేస్తూ పోతూ వుంటే చూసే వారినుండి ‘ immatured ఆర్టికల్స్ లను వికిలో ఉంచా’రన్న విమర్శ వస్తుందనే) అయితే ఇలా కాకుండా డైరెక్ట్ గా ” ప్రయోగశాల” లో చేయవచ్చు అని విన్నాను. ప్రయోగశాల లో ఒక వ్యాసానికి చేసే ఎడిటింగ్ లు అందరికి కనిపిస్తాయా? లేదా? నేను ప్రయోగశాల లో ఒక వ్యాసానికి చేసే మార్పులు చేర్పులు (ఉదాహరణకు ఒక వ్యాసానికి ఫోటోలు upload చేస్తూ సక్సెస్ కాలేకపోతున్నాను ) మీ వంటి సీనియర్ లు చూస్తూ పర్యవేక్షించడం, మార్పులు సూచించడం వీలవుతుందా? లేదా నేను ప్రయోగశాలలో చేసే editings వేరే ఎవరికీ కనిపించే అవకాశం లేనట్లయితే విడివిడిగా సీనియర్ లను సలహాలు అభ్యర్దిస్తూ rectify చేసుకోనాల్సి ఉంటుందా?
  2. సర్ ఇంకొకటి రచ్చబండ అనేది ఒక విషయంపై ఎక్కువమందికి ఉపయోగపడే విసృతమైన చర్చకు వేదిక అనుకొoటున్నాను. కొత్తగా సభ్యులమైన మాకు రాసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు తదితరలతో సవాలక్ష సందేహాలు instant గా వస్తుంటాయి. అనుభవం లేనివాడిగా నేను అడిగే చిన్న చిన్న సందేహాలు రచ్చబండలో పాల్గొనే మిగిలిన సీనియర్ సభ్యులకు సాగుతున్న సీరియస్ చర్చలకు అంతరాయంగా వుండి ఇబ్బంది పడవచ్చు అనుకొoటున్నాను. మేము అడిగే చిన్న చిన్న సందేహాలు (అడిగే కొత్త సభ్యుడికి మరియు ఆ సందేహ నివృత్తి చేసే expert సభ్యుడికి మాత్రమె పరిమితంగా ఉండాలంటే) ఎవరిని ప్రత్యేకంగా మెసేజ్ పోస్టింగ్ చేయాలి. తెలుపగలరు.
  3. అలాగే వికిలో రచనలను పోస్టింగ్స్ చేయడం మార్పులు చేయడం మీద కొత్త సభ్యులకు training లాంటి విషయాలతో ప్రత్యెక తరగతులు వంటివి ఏమైనా ఎవరైనా ఎక్కడైనా (Hyderabad లో నైనా) నిర్వహిస్తున్నారా . నిజానికి మీకు సిల్లీగా వుండవచ్చు. నా first వ్యాసంలో ఒక హెడ్డింగ్ పెట్టడానికి ఎలా చేయాలో తెలియక చివరకు పాత వ్యాసాలను చూసి “సవరించు” బటన్ నొక్కితే ==xyz== అని ఉంచాలని తెలిసింది. రెండవ వ్యాసానికి సైడ్ హెడ్డింగ్ (ఉప శీర్షిక) కోసం ===xyz=== ఉంచాలని ,అలాగే గేయానికి చేయాల్సిన మార్పులు కోసం గరిమెళ్ళ సత్యనారాయణ ఆర్టికల్ లోకి వెళ్లి “సవరించు” బటన్ నొక్కితే ప్రతి గేయ పాదానికి
    ఉంచాలని తెలిసింది. ఈ విధంగా చూస్తే ఎప్పటికి మాలాంటి కొత్త సభ్యులు pickup అవుతామో తెలియదు. వికీలో వ్యాసం రాయడం కన్నా ఈ సెట్టింగ్స్ తెలిసికోవడం కష్టంగా వుంది. ఈ సెట్టింగ్స్ మీద ఎవరికీ వారు స్వాను భావం మీద ట్రయల్ & ఎర్రర్ పద్దతిలో చేసుకోవడమేనా వేరే alternative వుంటే చెప్పగలరని ఆశిష్టున్నాను. ముఖ్యంగా ఇలాంటి సందేహాలు నివృత్తి కోసం ఎవరిని సంప్రదించాలో (ఎవరికీ మెసేజ్ పోస్టింగ్ చేయాలో) చెప్పగలరని ఆశిస్తున్నాను. లేదా ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా రచ్చబండలో పెట్టి సహాయాన్ని అభ్యర్ధించవచ్చా? --Vmakumar (చర్చ) 14:40, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సమాధానం

[మార్చు]

మీరు వ్రాయవలసిన వ్యాసం ఒకేసారి అధిక బైట్లు చేర్చనవసరంలేదు. కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ వ్యాసాన్న్ అభివృద్ధి చేయవచ్చు. మీరు మీయొక్క ప్రయోగశాలలో తయారుచేయవచ్చు. పూర్తిగా తయారుచేసిన తరువాత వికీలో వ్యాసంగా చేర్చవచ్చు. లేదా వికీలో నేరుగా వ్యాసం సృష్తించి వ్యాసం అభివృద్ధి చేయవచ్చు. ఒకవేళ మీరు వ్యాసం అభివృద్ధి చెందిన వరకు వ్యాస మార్పులు యితరులు చేయకూడదనుకుంటే మీరు వ్యాసంలో పై భాగాన {{in use}} మూసను చేర్చండి. మీరు వ్యాసాన్ని పూర్తి చేసిన తదుపరి ఆ మూసను తొలగించండి. మీరు మీ ప్రయోగశాలలో చేసిన మార్పులైనా అందరికీ కనిపిస్తాయి.కానీ మీరు కోరనిదే ఆ ప్రయోగశాల వ్యాసంలో ఎవరూ మార్పులు చేయరు. మీకు ఏదైనా సందేహం వచ్చినట్లయితే ఆ విషయం గూర్చి తెలిసిన నిర్వాహకుల చర్చాపెజీలో సహాయం కోరవచ్చు. లేదా మీరు వ్రాస్తున్న వ్యాసం చర్చా పేజీలో వ్రాసినట్లయితే మరీ మందిది.మీరు మీయొక్క సందేహం వ్రాసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను చేర్చినట్లయితే మీకు ఎవరైనా సహాయం చేస్తారు. రచ్చబండ కూడా చర్చా వేదికే కానీ వ్యాస విషయం పై సందేహాలను ఆ వ్యాస చర్చా పేజీలో వ్రాసినట్లయితే మందిది.

నేనుకూడా మొదట్లో మీలాగే వికీలో వికీకరణ పద్ధతులు తెలియక యిబ్బంది పడ్డాను. కొన్ని సెట్టింగ్స్ యిప్పటికీ గుర్తు ఉండవు. కనుక నేను వాడుకరి:Kvr.lohith/ఇతరములు మరియు వాడుకరి:Kvr.lohith/Tools వంటి పేజీలను సృష్టించుకొని కొన్ని ముఖ్య విషయాలను చేర్చుకున్నాను. ఎప్పుడు ఏవి అవసరమైతే ఆ సెట్టింగ్స్ ను వినియోగిస్తుంటాను. మీరు కూడా నిరంతరం వ్యాసాలను వ్రాస్తుంటే సెట్టింగ్స్ "యత్న దోష పద్ధతి" లో తెలుస్తాయి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:18, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారికి, మీరు సృష్టించుకొన్న పై రెండు టూల్ పేజీలు చూసాను. ఒక పద్దతిగా organised గా వుండి అవి మావంటి కొత్తవారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. bookmarks లో నమోదు చేసుకొన్నాను. తెలుగు వికీకరణకు చేయూత అందించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. --Vmakumar (చర్చ) 17:31, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కుమార్ గారూ మీరే స్వయంగా ట్రైనింగ్ సెషన్ కోరి అడగడం, ఇంత ఆసక్తి చూపడం చాలా ఆనందకరం. ప్రతినెలా జరిగే హైదరాబాద్ వికీ మీటప్ లో మీకు స్వయంగా ఇటువంటి విషయాలపై శిక్షణ ఇవ్వగలం. అయితే మీరు హైదరాబాద్ వాసులు కారు కదా, మరి హైదరాబాద్ ఎలా వస్తారు? మీ వంటి ఆసక్తికలిగిన వ్యక్తులకు ట్రైనింగ్ ఇవ్వడం చాలా సంతోషకరం.--పవన్ సంతోష్ (చర్చ) 07:40, 19 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారికి, సర్, “సమాజం నుండి ఎప్పుడూ తీసుకోవడమే కాదు సమాజానికి మన వంతుగా కొంతైనా ఇవ్వడం నేర్చుకోవాలి” అన్న సూక్తి మీద నాకు నమ్మకం వుంది. దానికి తెలుగు వికీ మంచి సాధనం. దానికి తోడు నేర్చుకోవాలన్న ఆశక్తి నాకు వుంది. అందనంత దూరంలోను హైదరాబాదు లేదు. కాబట్టి హైదరాబాద్ కి వెళ్లి నేర్చుకోవడానికి నాకు సమస్య లేదు. నెల కొకసారే కాబట్టి కనీసం కొన్ని సెషన్ల కైనా చక్కగా అటెండ్ కాగలను. అయితే ఉద్యోగరీత్యా పరిమితులు కొన్ని వుంటాయి కాబట్టి, ముందుగా తగిన ప్లాన్ తో ‘వికీ సెషన్స్ dates’ కి అనుగుణంగా నేను ‘సెలవు పెట్టాల్సిన dates’ ముందుగా adjust చేసుకోవాల్సి వుంటుంది. కాబట్టి హైదరాబాద్ లో జరిగే వికీ సెషన్స్ కు సంబంధించి మీకు తెలిసిన వివరాలు చెప్పగలరు. ఇంకా వివరాలున్నట్లయితే (dates, venue, training period , contact cell నెంబర్, తదితర) నాకు (మెయిల్ అడ్రస్ vmkfin@gmail.com) కు పంపించగలరు. --Vmakumar (చర్చ) 11:03, 19 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా కుమార్ గారూ --పవన్ సంతోష్ (చర్చ) 16:22, 19 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్సు నుండి పుస్తకాల తొలగింపు

[మార్చు]

నేను 2007 నుండి వికీపీడియా, విక్షనరీ, వికీసోర్సులలో పనిచేస్తున్నాను. నా స్వంత ప్రయోగశాలను నడుపుతూ నాకున్న తీరిక సమయంలో చాలా భాగాన్ని వెచ్చించి వికీలో పనిచేస్తున్నాను. ఈ నాపని తెలుగు భాషాభిమానులకు ఉపయోగపడుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. వికీపీడియాలో కొన్ని వేల చిన్న చిన్న వ్యాసాలు కాని మొలకలను చేర్చినప్పుడు కొందరు సభ్యులు అభ్యంతరం తెలియజేస్తే వాటిని ఆపేశాను. కొందరు తెలుగు ప్రముఖుల గురించిన వ్యాసాలను (1000 పైగా) తయారుచేస్తున్నప్పుడు "20వ శతాబ్ది తెలుగు వెలుగులు" పుస్తకం అనే ఒకే మూలం నుండి వ్రాస్తున్నానని (నా వద్ద ఎక్కువ మూలాలు లేవు) కొందరు అభ్యంతరం తెలియజేస్తే వాటిని అక్కడితో ఆపేశాను. అలాగే సంస్కృత పదాలను గురించిన చిన్న వ్యాసాలను తయారుచేస్తుండగా వాటన్నింటిని విక్షనరీలో ఉంచాలి; ఇక్కడ చేర్చవద్దన్నారు. (ఆంగ్ల వికీలో ఇలాంటి సంస్కృత పదాల వ్యాసాలున్నాయి). పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నేను చాలా పుస్తకాల గురించిన పేజీలు తయారుచేసాను. కానీ అవికూడా చిన్నవిగా ప్రాధాన్యత లేనివిగా సభ్యులు భావించడం వలన ఆ ప్రాజెక్టులొ కొత్త పుస్తకాలు చేర్చడం మానేశాను.

వికీసోర్సులో నేను సుమారు ఒక 100 పైగా పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మరియు ఆర్కీవు నుండి చేర్చాను. వాటి కాపీహక్కుల గురించి అర్జునరావు గారిని అడిగితే అవన్నీ కాపీహక్కులు చెల్లినవేనని చెప్పారు. నేనొక్కడినే కాకుండా వికీసోర్సులో కొందరు ఇతర సభ్యులు కూడా ఈ పుస్తకాల గురించి పనిచేస్తున్నారు. వీనిలో ఒక 50 పుస్తకాలు పూర్తిచేయబడ్డాయి. కొంతకాలం క్రితం ఒక అనామక సభ్యుడు (ఐ.పి.అడ్రసు ఉండి) 18 పుస్తకాలకు తొలగింపు మూసను చేర్చాడు. దానికి సమాధానంగా నేను డి.ఎల్.ఐ.లోని పుస్తకాలన్ని కాపీహక్కులు చెల్లినవిగా చెప్పాను. కొన్ని పుస్తకాల వెతుకు పేరులోనే "OUT-OF-COPYWRIGHT" అని ఉన్నాయి. వైజాసత్యగారు ఒక విషయంలో చర్చిస్తున్నాప్పుడు డి.ఎల్.ఐ.వారు ఆ పుస్తకం గురించిన మెటాడాటా లో ముఖ్యమైన సమాచారాన్ని అంతా పుస్తకం యొక్క అడ్రసులోనే ఉంచారని తెలియజేసారు. నాతో బాటు పవన్ సంతోష్, విశ్వనాథ్ గార్లు కామంస్ లో సమాధానాలిచ్చారు. కానీ ఆయా పుస్తకాలను (కామన్స్ మరియు వికీసోర్సుల నుండి) తొలగించడం మొదలుపెట్టారు. ఇందులో ఆ అజ్ఞానవ్యక్తుల పాత్ర చాలానే వుందని తెలుస్తుంది.

నేను ఈ సమాచారాన్ని మీ అందరితో పాలుపంచుకుందామని (నా మనోవేదన కొంతైనా తగ్గుతుందని) ఇక్కడ వ్రాస్తున్నాను. నేను ఏవిభాగంలో పనిచేయాలన్నా భయం భయంగా ఉంటున్నది.

తెలుగు వికీసమాజం ప్రస్తుతం (అంతర్యుద్ధాలతో) గొడవలుగా ఉన్నది. కారణాలు చాలా వున్నాయి. మనం అందరం కలిసి పనిచేస్తేనే ఈ మహా యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుంది.

మీలో ఎవరైనా ఎక్కువగా వారి సమయాన్ని వికీతొ వృధా చేసుకోవద్దని మనవి చేసుకొంటున్నాను. మీ జీవనోపాధిని, కుటుంబాన్ని, సమాజాన్ని చూసుకొంటూ మిగిలిన సమయాన్ని మాత్రమే వికీలో గడపండి. నా పనిలో సహాయం చేసినవారందరికీ ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:25, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, ఈ పుస్తకాల జాబితా ఇక్కడ/తెవికీసోర్స్ లో చేర్చగలరా. కామన్స్ లో తొలగించిన పుస్తకాలను తిరిగి చేర్చవచ్చు. మీరు ఈ విషయమై కంగారు పడక్కరలేదు. సరియయిన సంజాయిషీ ద్వారా అన్ని పుస్తకాలను పునఃస్థాపించవచ్చు. తెలుగు వికీసమాజం ప్రస్తుతం (అంతర్యుద్ధాలతో) గొడవలుగా ఉన్నది. అని చెప్పారు, చర్చలు జరగందే, అందరికీ సరియైన అవగాహన లేనిదే ఇవి కొనసాగుతూనే ఉంటాయి. డీఎల్ఐ లో ఉన్న అన్ని పుస్తకాలు పబ్లిక్ డొమెయిన్ లో ఉన్నాయని అర్జున గారు పలు సార్లు స్పష్టం చేసారు, ఆయన ఓటీఆరెస్ జట్టులో కూడా ఉన్నారు, ఆయన ఈ విషయమై మరింత సహాయం చేయగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:46, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ఇవి ఆ పుస్తకాలు: (5 File:SuprasiddulaJeevithaVisheshalu.djvu; 6 File:ShivaTandavam.djvu; 7 File:Goopa danpatulu.pdf; 8 File:Baarishhtaru paarvatiisham.pdf; 9 File:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf; 10 File:Leakalu.pdf; 11 File:Tatsama Chandrika.pdf; 12 File:Aandruu kaarnegii, Telugu (1955).pdf; 13 File:Aandhrashaasanasabhyulu.pdf; 14 File:Mahaakavi dairiilu.pdf; 15 File:Parishodhana sanputi1 sanchika3 Aug-sep 1954.pdf; 16 File:SaakshiPartIII.djvu; 17 File:TeluguSasanalu.pdf; 18 File:KolachalamSrinivasaRao.djvu; 19 File:JanapadaGayyaalu.djvu; 20 File:SakalathatvaDharpanamu.pdf; 21 File:KaliyugarajaVamshamulu.djvu; 22 File:TeluguVariJanapadaKalarupalu.djvu) [[5]] నుండి మీరు నా చర్చాపేజీకి చేరుకోవచ్చును. రహ్మానుద్దీన్ మీ స్పందనకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:31, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ సభ్యులకు చెప్పేదేమంటే ఆ అనామక సభ్యుడు ఏకంగా స్పష్టమైన ఓ.టి.ఆర్.ఎస్. వివరాలున్న తెలుగు పుస్తకాలకు కూడా దుందుడుకుగా డిలీషన్ టాగ్ లు పెట్టేయడమే ఆయన అవగాహన స్థాయికి యోగ్యతాపత్రం. పానుగంటి వంటి వారి పుస్తకాల కాపీహక్కులు ఏనాడో చెల్లిపోయాయి, గురజాడ అయతే మరణించి వందో సంవత్సరం ఇది. ఇలాంటివారి పుస్తకాలకూ డిలీషన్ ట్యాగులు పెట్టాడని, అవగాహన లేమి తప్ప మరేమీ లేని వాడుకరిని కన్సిడర్ చేయొద్దనీ తెవికీపీడియన్లు అక్కడ రాస్తే బావుంటుంది. ఇలా వదిలితే రేపు మరెన్నో అపురూపమైన గ్రంథాలను, విలువైన పుస్తకాలనూ కూడా కోల్పోవాల్సి వస్తుంది. రాజశేఖర్ గారి వంటి సీనియర్ వికీపీడియన్ ఏం సాధించేందుకు ఇంత కష్టపడడం, వికీపీడియన్ గా డీమోరలైజ్ అవుతున్నానని అనడం చాలా దురదృష్టకరం. ఈ విషయంపై సభ్యులు సత్వరం స్పందించాలని కోరుకుంటున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:11, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన చర్చ లేకుండా అన్నేసి పుస్తకాలను ఎలా తొలగించారు? రాజశేఖర్ గారి ఆవేదనలో వాస్తవం ఉన్నది. ఈ విషయంపై తగిన చర్చ జరగవలసి ఉన్నది. తెవికీలో సరైన చర్చ లేకుండా వికీ నియమ నిబంధనలకు లోబడి రాయబడిన ఏ వ్యాసమునైనా (చెత్త వ్యాసాలు కాకుండా) తొలగించకుండా విధి విధానాలను ఖరారు చేయవలసి ఉన్నది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకుతున్నామేమో అన్న భావన కలుగు తున్నది. ఇదంతా చేసిన ఆ అజ్ఞానవ్యక్తులు తెవికీకి సంబంధిన వారు కాకూడదనే కోరుకుంటున్నాను. ఇతర సభ్యులు కూడా స్పందించాలని కోరుచున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:07, 22 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది దురదృష్టకరమైన సంఘటన. నేనుకూడా ఎన్నోసవత్సరాలనుండి చేయుచున్న అతిముఖ్యమైన పనులువదిలేసి వికీపీడియాకు పనిచేస్తున్నాను. ఈసంఘటన నాకు పనిచేయాలనుపించుటలేదు, త్వరలో పూర్తిగా మానేస్తాను. --గుళ్ళపల్లి 03:46, 23 జూలై 2015 (UTC)
అలాంటి అనామక సభ్యున్ని సభ్యత్వాన్ని నిరోధించవలెను.Palagiri (చర్చ) 04:06, 23 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, తోటి సభ్యులకు నమస్కారము. నాకు కొన్ని సోదర ప్రాజెక్టుల గురించి అంతగా అవగాహన లేదు. ఎవరో అజ్ఞాత, అనామక వ్యక్తులు ఏదో, ఏవేవో వ్రాస్తూ, పనులు చేస్తూ ఉంటారు, నేను కూడా బెంగుళూరు వాళ్ళతో కొంత ఇబ్బంది పడ్డాను. రాజశేఖర్ గారు కూడా బెంగుళూరు వారితోనే ఇబ్బంది పడినట్లుగా ఉంది.

  1. మనము భయపడితే జీవితమంతా బాధపడాలి. ఈ విషయము నాకు కలిగిన ఇబ్బంది నందు చెప్పి ఉన్నాను.
  2. ప్రతి మనిషికి ఒక పద్దతి ఉంటుంది. అలాగే వికీకి కూడా నియమనిబంధలు ఉన్నాయి.
  3. పని చేసే వారిని ఎప్పుడూ విమర్శించుతూ ఉంటారు. ప్రతి వారు వారి చెప్పినట్లు వినాలనుకుంటారు.
  4. ఎన్నోసవత్సరాల నుండి వికీలో అనుభవమున్న వారి దగ్గర కొత్తవారు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది.
  5. క్రియాశీలక సభులు, వికీలో అనుభవమున్న వారు కలసికట్టుగా ఉండాల్సిన అవసరము ఉన్నది. ఎవరికి ఎటువంటి మనసుకు కష్టము వచ్చినా అది అందరిగానే భావించుకుందాము.
  6. వికీ స్వాతంత్ర్యము చెడకుండా ఏ సంస్థలు వారు మనకు చేయూతనిచ్చినా కలసి పని చేసేందుకు ఆహ్వానించవచ్చును.
  7. ఎందుకో ఈ మధ్యన పూర్వము ఉన్న సంతోషము నాకు కూడా పనిలో కలుగట లేదు అని విన్నవించుకునేందుకు కాస్త మనసులో మథన పడుతూ చెప్పుకోవాల్సి వస్తున్నందుకు చాలా బాధ కలుగుతున్నది. చాలా మంది వికీ సభ్యులలో మానసిక ఆనందం కొరవడింది. అందుకు మనము వికీ నందు చూపిస్తున్న నిరుత్సాహము ఒక కారణముగా చెప్పుకోవచ్చును. ఇది వీలయినంత త్వరలో తొలగిపోవాలి.

నాకు ఏ విషయములయిన తెలిసినవి ఉంటే తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతము ఉండబట్టలేక తోటి వికీ సభ్యుల మానసిక బాధకు మనసులోని మాటాలు తెలియజేసాను. JVRKPRASAD (చర్చ) 08:47, 23 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా దురదృష్టకర సంఘటన.సరైన చర్చ లేకుండా అన్నేసి పుస్తకాలను ఎలా తొలగించారో తెలియడం లేదు. వికీ సమాజంలో ఎవరైనా తొలగింపు మూసను చేర్చినట్లయితే దానిపై చర్చ జరగాలి. నియమాలను ఉల్లంఘించి చేర్చినవైతే తోలగించవచ్చు. కానీ కామన్స్ లో ఏ విధమైన చర్చ జరుగకుండా కాపీహక్కులు చెల్లుబాటైన చిత్రాలను చేర్చితే ఒక అజ్ఞాత వాడుకరి డిలీషన్ మూసను ఆధారంగా తొలగించడం బాధాకరం. ఈ విధం గా చూస్తే వికీలో పనిచేయడం వృధా అనిపిస్తుంది. జీవితంలొ చాలా కాలం వికీలో క్రియాశీలకంగా మార్పులు చేస్తూ ఉన్న వారి వ్యాసాలు,దిద్దుబాట్లు తరువాత ఏవో నియమాలతో తొలగింపబడతాయేమో! అలాంటప్పుడు మన సమయం అంతా వృధా అనిపిస్తుంది.ఈ సంఘటనతో క్రియాశీలక సభ్యులు కూడా దిద్దిబాట్లు చేయడానికి నిరుత్సాహపడతారు. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:16, 23 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • రాజశేఖర్ గారూ, ఇక్కడ ఒక పుస్తకాన్ని అన్డిలీట్ చేసి తిరిగి స్థాపించమని కోరాను. మిగితా పుస్తకాలకీ అలా చేయండి. ఇందులో ఒక పుస్తకం వికీసోర్స్ లో మొదటి పేజీలో ప్రదర్శించబడింది కూడా! అలాంటప్పుడు లేని అభ్యంతరం కొత్తగా ఇప్పుడెందుకో? దయచేసి ఇలాంటి విషయాలకు సభ్యులు నిరుత్సాహ పడవద్దు. నేను కామన్స్ లో ఎక్కించిన పలు చిత్రాలకు ఇక్కడి సభ్యులలోనే కొందరు అజ్ఞాతంగా, నేరుగా కూడా డిలీషన్ ట్యాగ్ పెట్టి తొలగించారు, కానీ చాలా వరకు సరియయిన వాదనతో తిరిగి ఫైళ్ళను యథాస్థానే ఉంచగలిగాను. ఇలాంటి విషయాలకు నిరుత్సాహపడి దయచేసి అంతకన్నా ఎంటో బృహత్కార్యమైన తెవికీకి దూరం కావద్దు. --రహ్మానుద్దీన్ (చర్చ) 20:31, 23 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మాన్ గారూ డి.ఎల్.ఐ. వెబ్సైట్లో అవుటాఫ్ కాపీరైట్ అనివున్న విషయాన్ని ఎత్తిచూపుతూ నేను మరో పుస్తకానికి అన్-డిలీషన్ రిక్వెస్ట్ పెట్టాను. మీరు తర్వాత మరో వాదనతో పెట్టారు. కామన్స్ లోని క్రియాశీలక సభ్యులు, నిర్వాహకులూ కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు, రెంటికీ కలిపీ, విడివిడిగానూ. అయితే విషయమేంటంటే వారంతా డి.ఎల్.ఐ. క్లెయిం ఎంతవరకూ నమ్మదగ్గది అనేస్తున్నారు. మనలో ఎవరికైనా డి.ఎల్.ఐ.లో పనిచేసినవారో లేక పనిచేస్తున్నవారో తెలిస్తే కొంత తేలిగ్గా దీన్ని పరిష్కరించగలమనుకుంటాను. దీనిపై కూడా ఓ తీర్పు వచ్చేలోగా ఆ పనిచేస్తే మొత్తంగా పరిష్కారమౌతుంది. కనుక దయచేసి కాంటాక్ట్స్ తిరగేసి ఎవరో ఒక DLI వ్యక్తి కోసం ప్రయత్నించగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 07:48, 24 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, కంగారుపడవద్దు. తొలగించిన పుస్తకాలు ఎక్కడికీపోవు. మళ్ళీ పునస్థాపితం చేసేలా కృషి చేద్దాం. అసలు కామంస్లో తలతిక్కగా వ్యవహరిస్తే, ^వీటి కాపీహక్కుల గొడవ తీరేదాక వాటిని స్థానికంగా అదేపేరుతో తెలుగు వికీసోర్సులో ఎక్కించుకుందాం. --వైజాసత్య (చర్చ) 09:16, 26 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తలతిక్కగా వ్యవహరించడం బహుశా ఇంకా ఎక్కువౌతుంది అని కూడా అనిపిస్తున్నది. వైజాసత్య గారి ఆలోచన ప్రకారం చేయడం ఉత్తమం ...--విశ్వనాధ్ (చర్చ) 11:28, 26 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Proposal to create PNG thumbnails of static GIF images

[మార్చు]
The thumbnail of this gif is of really bad quality.
How a PNG thumb of this GIF would look like

There is a proposal at the Commons Village Pump requesting feedback about the thumbnails of static GIF images: It states that static GIF files should have their thumbnails created in PNG. The advantages of PNG over GIF would be visible especially with GIF images using an alpha channel. (compare the thumbnails on the side)

This change would affect all wikis, so if you support/oppose or want to give general feedback/concerns, please post them to the proposal page. Thank you. --McZusatz (talk) & MediaWiki message delivery (చర్చ) 05:07, 24 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

What does a Healthy Community look like to you?

[మార్చు]

Hi,
The Community Engagement department at the Wikimedia Foundation has launched a new learning campaign. The WMF wants to record community impressions about what makes a healthy online community. Share your views and/or create a drawing and take a chance to win a Wikimania 2016 scholarship! Join the WMF as we begin a conversation about Community Health. Contribute a drawing or answer the questions on the campaign's page.

Why get involved?

[మార్చు]

The world is changing. The way we relate to knowledge is transforming. As the next billion people come online, the Wikimedia movement is working to bring more users on the wiki projects. The way we interact and collaborate online are key to building sustainable projects. How accessible are Wikimedia projects to newcomers today? Are we helping each other learn?
Share your views on this matter that affects us all!
We invite everyone to take part in this learning campaign. Wikimedia Foundation will distribute one Wikimania Scholarship 2016 among those participants who are eligible.

More information

[మార్చు]


Happy editing!

MediaWiki message delivery (చర్చ) 23:43, 31 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీకాన్ఫరెన్స్ భారతదేశం 2016

[మార్చు]

నమస్కారం,

తొలి భారతదేశ వికీసమావేశం 2011లో ముంబై మహానగరంలో జరిగింది. 2001లో మొదలైన 14 ఏళ్ళ వికీపీడియా చరిత్రలో మొట్టమొదటి సారి సమస్త భారతదేశ వికీ సభ్యులు పాల్గొన్న ఏకైక సమావేశం ఇది.

వికీకాన్ఫరెన్స్ భారతదేశం 2016 (WCI 2016) వికీమేనియా 2015 లో జరిగిన భారతీయ వికీల సమావేశం లో జరిగిన చర్చ ఫలితం. 2019లో జరిగే వికీమేనియా సమావేశానికి భారతదేశం వేదిక కావాలన్నది మాన స్వప్నం. అలా జరగాలంటే భారతీయ భాషల వికీమీడియన్లందరూ ఏకమై కలిసికట్టుగా పని చేయాలి. వికీమేనియాను నిర్వహించాలంటే భారతదేశ వికీకాన్ఫరెన్స్ ను నిర్వహించడం ఒక మంచి ముందడుగు. అలా చేయడం ద్వారా మన బలాబలాలు తెలుసుకోవడం, తగిన విధంగా మెరుగు పరుచుకుంటూ పని చేయడం సాధ్యమవుతుంది. మన దేశ ఐక్యతను నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి నిదర్శనమవుతుంది. మన భారతీయ భాషా సముదాయాల సంకల్పం, శక్తి, ఐక్యతలను చాటిచెప్పేందుకు ఔత్సాహికులు ముందుకు రండి.

దయచేసి ఇక్కడ ఉన్న ఫారమును నింపి వాలంటీరుగా నమోదు చేసుకోండి.

శుభాకాంక్షలతో,

WCI 2016 ఔత్సాహికుల బృందం

విజయవాడలో సీఐఎస్-ఏ2కే కార్యక్రమాలు

[మార్చు]

సముదాయ సభ్యులకు,

  • ఈ నెల 6,7,8 మరియు 9 తేదీల్లో విజయవాడ, గుంటూరులలో కొన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి.
  • 6 ఆగస్టు - ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్ర కార్యశాల(workshop)
  • 7 ఆగస్టు - విజయవాడ విక్టోరియా సంగ్రహాలయంలో గ్లాం, ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్ర కార్యశాల(workshop)
  • 8 ఆగస్టు - గుంటూరు అన్నమాచార్య గ్రంథాలయంలో వ్యాసరచన కార్యశాల(workshop), ఆంధ్ర లొయోల కళాశాలలో వృక్షశాస్త్ర కార్యశాల (workshop)
  • 9 ఆగస్టు - ఆంధ్ర లొయోల కళాశాలలో కార్యశాల(workshop) ముగింపు.
  • ఆసక్తి ఉన్న సభ్యులు పాల్గొనగలరు. --రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ2కే) (చర్చ) 06:35, 3 ఆగష్టు 2015 (UTC)
పాల్గొనటానికి ఆసక్తి గలవారు
  1. భాస్కరనాయుడు (చర్చ) 02:45, 5 ఆగష్టు 2015 (UTC)
  2. వాడుకరి:Nrgullapalli--గుళ్ళపల్లి 02:59, 5 ఆగష్టు 2015 (UTC)
  3. Pranayraj1985 (చర్చ) 06:10, 5 ఆగష్టు 2015 (UTC)

<ఇక్కడ సంతకం చేయగలరు>

శుభాకాంక్షలు తెలపండి
  1. ఈ కార్య క్రమాలు జయప్రదముగా జరికి, కొత్త వ్యాసాలకు నాందీ ప్రస్థావన కావాలని, ఇందులో పాల్గొనే పాతవారు..... కొత్తవారికి మార్గదర్శకం కావాలని తద్వారా తెలుగు వికీపీడియా సరికొత్త ఆవిష్కరణ్కరణలకు రూపకల్పన చేయాలని కోరుతూ, ఇందులో పాల్గొంటున్న వారందరికి ఇవే నా శుభాకాంక్షలు. భాస్కరనాయుడు (చర్చ) 02:52, 5 ఆగష్టు 2015 (UTC)
  2. Pranayraj1985 (చర్చ) 06:11, 5 ఆగష్టు 2015 (UTC)
  3. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంచి వ్యాసాలు తెవికీలోనికి రావాలని కోరుకుంటున్నాను. ఇందులో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు. పాల్గొనే సభ్యులు యాంత్రిక అనువాద వ్యాసాలకు ప్రాధాన్యత నివ్వకుండా భాషాదోషాలు లేకుండా స్వంతంగా గానీ, అనువాదం చేసిగానీ వ్రాస్తారని కోరుకుంటున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:30, 5 ఆగష్టు 2015 (UTC)
  4. <ఇక్కడ సంతకం చేయగలరు>


Wikidata: Access to data from arbitrary items is coming

[మార్చు]

(Sorry for writing in English)

When using data from Wikidata on Wikipedia and other sister projects, there is currently a limitation in place that hinders some use cases: data can only be accessed from the corresponding item. So, for example, the Wikipedia article about Berlin can only get data from the Wikidata item about Berlin but not from the item about Germany. This had technical reasons. We are now removing this limitation. It is already done for many projects. Your project is one of the next ones. We will roll out this feature here on August 12.

We invite you to play around with this new feature if you are one of the people who have been waiting for this for a long time. If you have technical issues/questions with this you can come to d:Wikidata:Contact the development team.

A note of caution: Please be careful with how many items you use for a single page. If it is too many pages, loading might get slow. We will have to see how the feature behaves in production to see where we need to tweak and how.

How to use it, once it is enabled:

Cheers Lydia Pintscher MediaWiki message delivery (చర్చ) 17:46, 3 ఆగష్టు 2015 (UTC)

లొయోలా కళాశాల లో వికీల్యాబ్ ఏర్పాటు

[మార్చు]

సీఐఎస్-ఏ౨కే ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్తంగా పరస్పర భాగస్వామ్యంతో స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తో కూడుకున్న వికీల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నాము.ఒక పది కంప్యూటర్లు, ఇంటర్నెట్ తో ఇవి అక్కడి విద్యార్థులకు వికీకి తోడ్పాటు చేయటంలో మరింత సహాయకమవుతాయి.ఇందుకు కావాల్సిన ఖర్చును సరిసమంగా కళాశాల సీఐఎస్-ఏ౨కే సమకూర్చనున్నాము. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:50, 5 ఆగష్టు 2015 (UTC)

ఇందుకు అభ్యంతరం ఉన్న వికీపీడియా సభ్యులు కింద తెలుపగలరు :

అభ్యంతరం ఉంది
  1. <ఇక్కడ పైన సంతకం చేయండి>
సూచనలు
  1. <సూచనలు తెలపగలరు>
  • చాల మంచి కార్య క్రమము. ఒక చారిత్రాత్మక, ప్రతిష్ట గలిగిన విద్యా సంస్థతో తెవికి బాగము పంచుకోవడము ముదావహము. ఈ సందర్భముగా ప్రముఖులను, (పురప్రముఖులు, విద్యావేత్తలు, అధికారులు,) పిలిపించి వారిచే దీన్ని ప్రారంబిస్తే తెవికి మరికొంత ప్రచారము లభించవచ్చు. ఈ సందర్భముగా ప్రసార మాద్యమాల వారిని కూడ అహ్వానించి ఒకింత బారి ఎత్తున ఏర్పాటు చేస్తే బాగుంటుంది..

భాస్కరనాయుడు (చర్చ) 07:58, 6 ఆగష్టు 2015 (UTC)

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశం

[మార్చు]

అందరికి నమస్కారం...

గత కొన్ని నెలలుగా వికీపీడియా నెలవారి సమావేశాల నిర్వహణ జరగడం లేదు. ప్రతి నెల సమావేశం నిర్వహించుకొని వికీపీడియా అభివృద్ధికి చేయవలసిన కృషి గురించి చర్చిస్తే బాగుంటుందన్న కొంతమంది సభ్యుల కోరిక మేరకు ఆగష్టు 16 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో సమావేశం ఏర్పాటుచేయడం జరుగుతుంది.

సభ్యులు హాజరుకాగలరు.

అంతేకాకుండా ప్రతి సమావేశానికి ఒక అతిథిని ఆహ్వానించాలని అనుకున్నాము... కనుక అతిథుల పేర్లు సూచించగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశం లో చూడగలరు.

తెలుగు గ్రంథాలయం, వికీ ఎడిటధాన్ 2, హైదరాబాద్

[మార్చు]

గత కొంత కాలంగా వికీపీడిఅయన్లలో స్థబ్ధత నెలకొన్నట్టుగా అనిపిస్తున్నది. అందుకే ఆగస్ట్ 16న వికీ మీటప్‌తో పాటు వికీ ఎడిటధాన్ కూడా నిర్వహించబడుతున్నది. దీనికి అందరు సభ్యులు హాజరు కావాలనేది మా ఆకాంక్ష. ఉదయం మామూలుగా జరిగే మీటింగ్ విశేషాల అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించబడును. వీలు కల్పించుకొని ఈ కార్యక్రమానికి హాజరై మన ఉల్లాస వికీ వ్యాసంగానికి తిరిగి ఊపు తీసుకు రావలని మన ఆశ, కనుక వికీ మిత్రులంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు..

వికీపీడియా:సమావేశం/తెలుగు గ్రంథాలయం, వికీ ఎడిటధాన్ 2, హైదరాబాద్ వద్ద మీ సంతకం చేయగలరు..--విశ్వనాధ్ (చర్చ) 13:23, 11 ఆగష్టు 2015 (UTC)

Wikidata: Access to data from arbitrary items is here

[మార్చు]

సీఐఎస్-ఏ౨కే వెర్షన్ ౨

[మార్చు]

తెలుగు వికీపీడియాలో సీఐఎస్-ఏ౨కే చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా చేసేందుకు, సముదాయానికి మరింత చేరువగా పనులు జరిపేందుకు సీఐఎస్-ఏ౨కే వెర్షన్ ౨ పై ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ కొత్త రూపాంతరం ద్వారా క్షేత్ర స్థాయిలో సమూహం ద్వారా ప్రతిపాదించబడిన వ్యక్తి ప్రోగ్రామ్ అసోసియేట్ స్థాయిలో పని చేస్తాడు. అతను నిర్వర్తించాల్సిన పనులు కూడా సముదాయమే నిర్ణయిస్తుంది. సీఐఎస్-ఏ౨కే నిర్దేశించిన తప్పనిసరి పనులు ఈ ప్రోగ్రామ్ అసోసియేట్ చేయవలసి ఉంటుంది. సీఐఎస్-ఏ౨కే కి సముదాయం సంపర్కం చేయాల్సిన పద్ధతి ఇంతకు ముందు తెలపబడింది. ఈ కార్యక్రమానికి మీ సలహాలు, సూచనలు తెలపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:46, 13 ఆగష్టు 2015 (UTC)

సూచనలు

ప్రోగ్రామ్ అసోసియేట్ నియామకంవల్ల వికీపీడియన్లు ఇంకా ఉత్సాహంగా పని చేయుటకు తగిన ప్రోత్సాహం లభిస్థుంది. ----గుళ్ళపల్లి 04:55, 15 ఆగష్టు 2015 (UTC)

How can we improve Wikimedia grants to support you better?

[మార్చు]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Hello,

The Wikimedia Foundation would like your feedback about how we can reimagine Wikimedia Foundation grants, to better support people and ideas in your Wikimedia project. Ways to participate:

Feedback is welcome in any language.

With thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation.

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) through MediaWiki message delivery. 23:09, 18 ఆగష్టు 2015 (UTC)

చరిత్రలో ఈరోజు సాంకేతిక సమస్యలు

[మార్చు]

చరిత్రలో ఈరోజులో లాగిన్ కానివారికి నిన్నటి సమాచారం, లాగిన్ అయినవారికే ఈరోజు సమాచారం కనిపిస్తోంది. ఇదేమైనా సాంకేతిక సమస్యా? దీన్నెలా పరిష్కరించాలి?--పవన్ సంతోష్ (చర్చ) 03:51, 19 ఆగష్టు 2015 (UTC)

ఇది టైంజోన్ వలన. అన్ని వికీ ప్రాజెక్టులు యూటీసీకి అలైన్ అయి ఉంటాయి. మీ సంతకం చూసినా ఇది తెలుస్తుంది. అయితే మొత్తం వికీ టైం జోన్ కూడా యూటీసీకి ఉండటం వల్ల ఇది ఇలా ప్రవర్తిస్తోందేమో! మీ అభిరుచులులోకెళ్ళి భారత సమయానుసారం టైంజోన్ సెట్ చేసుకుంటే సరి. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:13, 19 ఆగష్టు 2015 (UTC)
ఏమో మరి. లాగిన్ కానప్పుడే ఇది గతరోజుది చూపిస్తోంది. లాగిన్ అయినప్పుడు ఏ సమస్య చూపడంలేదు. బహుశా మన కంప్యూటర్లు భారత కాలమానాన్ని చూపడం వల్లనా ఏంటనేది మీరు ఈ సమాచారం చెప్పాకా అనిపిస్తోంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:00, 19 ఆగష్టు 2015 (UTC)

ప్రోగ్రామ్ అసోసియేట్ (కన్సల్టెంట్ - యాక్సెస్ టు నాలెడ్జ్ - లాంగ్వేజ్ యాంకర్) ఉద్యోగానికి దరఖాస్తు

[మార్చు]

ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్) బెంగుళూరు, ప్రోగ్రామ్ అసోసియేట్ (కన్సల్టెంట్ - యాక్సెస్ టు నాలెడ్జ్ - లాంగ్వేజ్ యాంకర్) ఉద్యోగానికి కన్నడ, ఒడియా, తెలుగు భాషల్లో అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగం సెప్టెంబర్ ౧, ౨౦౧౫ నుండి జూన్ ౩౦, ౨౦౧౬ వరకు ఉంటుంది.

అభ్యర్థి ముందుగా సీఐఎస్-ఏ౨కే[[ ప్రణాళికలను పరిశీలించాల్సిందిగా మనవి. అభ్యర్థి ఉద్యోగిగా తెలుగు వికీమీడియా సముదాయం, వికీమీడియా భారతదేశ చాప్టర్, వికీమీడియా ఫౌండేషన్, తదితర వికీ అనుబంధ, స్వేచ్ఛా ఉద్యమాలతో దగ్గరగా పని చేయాల్సిన ఉంటుంది. సీఐఎస్-ఏ౨కే తో గల వివిధ సంస్థాగత ఒప్పందాలకనుగుణంగా ఏర్పరిచిన లక్ష్యాలపై పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి ౪-౮ మందిగల ఒక చిన్న జట్టుతో పని చేస్తారు. అభ్యర్థి సీఐఎస్ లో ఉండగా పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం ౯ నెలల పాటు ఉంటుంది (సెప్టెంబర్ ౧ ౨౦౧౫ నుండి జూన్ ౩౦ ౨౦౧౫).

బాధ్యతలు
  • ముఖ్యమైన బాధ్యతలు సముదాయమే నిర్ణయిస్తుంది.
సీఐఎస్-ఏ౨కే
  • సముదాయం-సీఐఎస్-ఏ౨కే కి అనుసంధానంగా ఉండాలి (సముదాయ అభ్యర్థనలని సమకూర్చడం, వివిధ కార్యక్రమాలను, ప్రాజెక్టులను సముదాయం కోసం చేపట్టడం).
  • నెలవారీ ప్రాజెక్టు నివేదిక.
  • నెలవారీ సముదాయంతో ఐఆర్సీ, న్యూస్లెటర్, సమావేశంలో పాల్గొని నివేదిక సమర్పించడం.
  • ఐఈజీకి అభ్యర్థించే వారికి అభ్యర్థన వ్రాయడంలో, ప్రశ్నోత్తరాలలో సహకరించడం.
  • సోషల్ మీడియాలో తెవికీ ప్రాజెక్టులకు మరింత ప్రాప్యత, వీక్షణలు పెంచే విధంగా చర్యలు చేపట్టడం. సముదాయ అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం.
  • ప్రతి మూడు నెలలకు అభ్యర్థి కార్యాచరణపై పరిశీలన ఉంటుంది.
  • సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రాం డైరెక్టర్ సూచించిన మేరకు మరిన్ని విధులు చేపట్టాల్సి రావచ్చు.
స్థలం
  • హైదరాబాద్
జీతం
  • అభ్యర్థి అనుభవం, కుశలత పై జీతం నిర్ణయించబడుతుంది.

ఈ ఉద్యోగానికి అర్జీ పంపేందుకు అభ్యర్థులు తమ తమ రెజ్యూమె, కవరింగ్ లెటర్ మరియు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరెందుకు అర్హులో, మీ ప్రేరణ ఏమిటో తెలపాల్సి ఉంటుంది. దరఖాస్తులను డా॥ పవనజ (pavanaja@cis-india.org) కు పంపాలి. దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు ౨౯, ౨౦౧౫. --రహ్మానుద్దీన్(సీఐఎస్-ఏ౨కే) (చర్చ) 04:11, 19 ఆగష్టు 2015 (UTC)

దరఖాస్తులు

[మార్చు]
Pranayraj1985

అందరికి నమస్కారం.. సీఐఎస్-ఏ౨కే వారి ప్రోగ్రామ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాను.. సభ్యులు సహకరించగలరు.. ఇతర సభ్యులు కూడా దరఖాస్తు చేయోచ్చు... Pranayraj1985 (చర్చ) 09:54, 20 ఆగష్టు 2015 (UTC)

  1. ప్రణయరాజ్ అభ్యర్ధిత్వాన్ని సమర్ధిస్తున్నాను. యితను సమర్ధుడు --Nrgullapalli (చర్చ) 01:57, 29 ఆగష్టు 2015 (UTC)
  2. ప్రణయరాజ్ కు నా మద్దతు ఫూర్తిగా ఇస్తున్నాను . మీ దరఖాస్తును తగు విదముగా తగిన చోట పెట్టగలరు."...............భాస్కర నాయుడు.
  3. ప్రణయరాజ్ కు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:24, 7 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్

సహ సభ్యులందరికీ నమస్కారం. సీఐఎస్-ఏ౨కే ప్రోగ్రామ్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. తెలుగు వికీపీడియన్లకు ప్రత్యక్షంగానూ, జాలపరంగానూ నేను సుపరిచితుణ్ణే. తెవికీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్న విషయం, ఇతర వికీపీడియన్లు చేస్తున్న కృషికి శక్తిమేరకు ఓ వాలంటీరుగా సహకరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వికీమీడియా ఫౌండేషన్ ఐఈజీ పొంది తెవికీకి మేలుచేసే "తెలుగు సమాచారం అందుబాటులోకి" ప్రాజెక్టు మీ అందరి సహకారంతో పూర్తిచేశాను. అందరమూ పలు ప్రణాళికలు పంచుకోవడమూ జరిగినదే. వీటిన్నిటి దృష్ట్యా ఈ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చేందుకు నా అనుభవం, ఆసక్తి వంటివి ఉపకరిస్తాయని భావిస్తున్నాను. ఈ విషయంలో భవిష్యత్తులో కూడా సహ సభ్యుల సహకారం ఎప్పటిలాగానే నాకు అందుతుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 06:13, 26 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. పవన్ సంతోష్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:02, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Viswanadh

సభ్యులకు నమస్కారం. నేనుకూడా ఈ ఉధ్యోగానికి ధరఖాస్తు చేసాను. తగిన అనుభవం తోపాటు. సి.ఐ.ఎస్ నుండి గతంలో జరుగవల్సిన పనులను పూర్తిచేయటకు, కొత్త లోచనలతో ముందుకు వెళ్ళడం ద్వారా తెలుగు వికీపీడియాను బలోపేతం చేసేందుకు ఈ ఉద్యోగం ఉపయోగపడుతుందనే అలోచనతో ధరఖాస్తు పంపినాను. సభ్యులు తమ విలువైన ఆలోచనలకు, సలహాలను తెలియచేస్తూ తమ సహకారాన్ని అందచేయగలరని ఆశిస్తూ..మీ ---Viswanadh (చర్చ) 05:23, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:02, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల అభివృద్ధికి ఓ ప్రయత్నం

[మార్చు]

వేలాదిగా సినిమా వ్యాసాలు అభివృద్ది లేకుండా చాన్నాళ్ళ నుంచి వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దొరికిన మూలాలతో ఉన్నంతలో ఈ వ్యాసాల్లో కొన్నిటిని అభివృద్ధి చేదామన్న ప్రయత్నం చేస్తూండగా ఓ ఆలోచన తట్టింది. సామాన్యంగా ఈ సినిమా వ్యాసాలన్నిటిలోనూ సినిమా మూస ఉంది. వీటిలో చాలా వ్యాసాలకు మూస తప్ప మరేమీ లేదు. మరోవైపు తెవికీ సినిమా వ్యాసాల నిర్మాణం ప్రకారం ఎలానూ ప్రారంభంలో మూసలో ఉన్న సమాచారమే ఓ వాక్యం రూపంలో వస్తుంది. ఉదాహరణకు శివ (1989 తెలుగు సినిమా) దర్శకుడు-రామ్ గోపాల్ వర్మ, నిర్మాణ సంస్థ-అన్నపూర్ణ స్టూడియో, ఎస్.ఎస్.క్రియేషన్స్ అని మూస వల్ల వచ్చిన కుడివైపు బాక్సులో ఉందనుకోండి. దాన్ని అటూఇటుగా "శివ అన్నపూర్ణ స్టూడియో, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 1989 నాటి తెలుగు సినిమా" అని రాయాల్సివుంటుంది. ఇప్పుడు నాకు తోచిన ఆలోచన ఏమిటంటే 4వేలకు పైగా ఉన్న ఈ సినిమా వ్యాసాలు అన్నిటిలో మూసలో ఉన్న సమాచారం మళ్ళీ మాన్యువల్ గా రాయడం కాకుండా మూసలోనే మార్పులు చేసి ఆ వాక్యం వచ్చేలా చేయడం. నా ఆలోచనను ఈ పేజీలో ప్రయోగించి చూసి, ద్వారా రూపుదిద్దిన ఈ ఉదాహరణ చూడండి.
అయితే కొంతవరకూ నేను చేసినా మరికొన్ని సమస్యలు వస్తున్నాయి. నా ప్రయోగశాల పేజీలోనే నేరుగా ఓ సమస్య కనిపిస్తోంది. <br /> అన్న మార్కప్ కోడ్ ఉంటే తర్వాతి లైన్ చూపిస్తుందన్నది తెలిసిందే. పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఉన్న పక్షంలో సినిమా మూసలో నిర్మాతల పేర్లకు మధ్య <br /> గుర్తుపెట్టారు మనవాళ్ళు. ఇన్ఫోబాక్సులో అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను రాసిన కోడ్ లోకి అది జొరబడి ఆ వాక్యాన్ని మధ్యకు విరగ్గొట్టేస్తోంది. అలానే మూసలో if conditions టైపులో ఫలానాది మూసలో రాసివుంటే ఇలా, else if ఇలా రావాలి అంటూ కోడ్ రాయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి ఈ విషయంలో ఆసక్తి కలవారెవరైనా ముందుకు వస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 18:53, 20 ఆగష్టు 2015 (UTC)

మీరు ప్రయత్నం బాగుంది.మీరు సూచించిన ఉదాహరణ చూసాను. బాగుంది. చాలా వ్యాసాలలో వాక్యాలు చేరడం గమనించాను. <br />గుర్తు కొన్ని వ్యాసాలలో వాక్యాలను విరగగొట్టేస్తుంది. దానిని పరిష్కరిస్తే బాగుంటుంది.నాకు అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు.ఎవరైనా పరిష్కరిస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:57, 21 ఆగష్టు 2015 (UTC)

వికీగుడి పూజ శ్రీ- కాళ- హస్తి విధానం

[మార్చు]

తెలంగాణ గ్రామాలు

[మార్చు]

పాలగిరి గారు, నమస్కారము. వర్గం:తెలంగాణ గ్రామాలు అనే వర్గం ఉన్నది. తదుపరి, మూసలలో చేర్చితే గ్రామాలు జాబితా వస్తుంది. మీరు కొత్తగా మరో వర్గం చేశారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకరిని పనిచేయమని కాని లేదా వద్దని కాని చెప్పకూడదు అని నా అభిప్రాయము. మనం చేస్తున్న వికీగుడి పూజ పనులు శ్రీ- కాళ- హస్తి విధానంలో ఉంటున్నాయి. అందుకని ఎవరికీ నేను ఉచిత సలహాలు ఇవ్వడము సముచితము కాదని వారికి తెలియజేయడము లేదు. చేస్తున్న పనిలో ఎవరి సంతోషము వారిది. వారే తెలుసుకుంటారని అనుకుంటున్నాను. గ్రామాలు పని మీరు ఒకసారి ఆలోచించండి. మీ పనికి అడ్డుచెప్పేంత సాహసము మాత్రము చేయను. దయచేసి అర్థం చేసుకోగలరు అని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 14:36, 22 ఆగష్టు 2015 (UTC)

పాలగిరిగారు, నేను మీకు వ్రాసిన విషయానికి మీ నుండి సమాధానము లేదు. మీరు కొత్తగా వర్గం:తెలంగాణా రాష్తంలోని గ్రామాలు అనే వర్గం ఎందుకు సృష్టించారో తెలియజేయండి. దానిని నేను రెండుసార్లు తొలగించాను. ప్రతిసారి అందులోని వందల పేర్లు తొలగించాల్సి వచ్చింది. మరలా మీరు ఆ వర్గంలో హట్‌కేట్ ద్వారా మూడోసారి వందల గ్రామాలను చేర్చుతున్నారు. కారణము ఏమిటో నాకు తెలియదు. వర్గం:తెలంగాణ గ్రామాలు అనే వర్గం ఏనాడో ఉంది. గ్రామాలన్నీ ఆ వర్గములోనికి వస్తాయి. గ్రామవ్యాసాల ప్రక్షాళన అనేది ఒక గంట లేదా ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. దయచేసి మీరు చేస్తున్న పనికి వివరణ ఇస్తూ కొన్నాళ్ళు చేస్తున్న పనిని గమనించండి. ఎవరి పూజ విధానము వారిది అన్నట్లు ఉన్న నలుగురు ఉంటే ఏ పనిని ఒకకొలిక్కి తేవడము ఎవరికైనా చాలా కష్టం అవుతుంది. JVRKPRASAD (చర్చ) 11:24, 23 ఆగష్టు 2015 (UTC)

ఇతర వాడుకరులు

[మార్చు]
మిగతావారి విషయములో కూడా వారు చేస్తున్న పని తప్పు అని చెప్పకుండా (నాకంటే పెద్దవాళ్ళు) అర్థం చేసుకుంటారని, వారి పనిలో భాగమై, వారి పనికి వెనక నుంచి సరి చేసుకొని వస్తూ ఉన్నాను. వారు ఎప్పటికయినా గమనిస్తారని, వారి పని సరి చూసుకుంటారని ఆశతో మాత్రమే. ఏ పని అయినా ఎలాగయినా చేయవచ్చును. కానీ దానిని కాస్త అందంగా ఆ పేజీని (పుటని) చూపించగలగితే చదువుకునే వారికి ఆహ్లాదముగా ఉంటుంది అని నా భావన. వికీ అంటేనే ఎవరు చేసిన పని శాశ్వతం కాదు. ఏ పని ఎవరికీ శాశ్వతం కాదు. ఏదీ ఎవరి సొంతం కాదు. వికీ అంటేనే స్వంతం అనేది ఏదీ లేదు. వికీ అంటేనే క్షణం క్షణం మారిపోయేది. అందువల్ల మనసులో నేను ఏమీ పెట్టుకోను. ఈ పని త్వరగా అయింది కొంతవరకైన అనే సంతృప్తి మిగిలితే, నేను మరికొన్ని మంచి కొత్త విషయములతో కూడిన విద్యావిషయ సంబంధించినవి అందించుటకు సరస్వతిదేవి నా హస్తమునకు స్నేహము అందించగలదని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 01:25, 24 ఆగష్టు 2015 (UTC)
ప్రసాద్ గారూ, ఎక్కడైనా వికీలో లోపం వచ్చినపుడు, వాడుకర్లు తెలియక తప్పులు చేస్తున్నప్పుడు మీ వంటి పెద్దలు సూచనలు యివ్వడంలో తప్పులేదు. వారు సరిచేసుకుంటారు. ఎవరైనా వికీలో నిత్య విద్యార్థులే కదా! అందరికీ అన్ని విషయాలూ తెలియవు కదా. పని సులువుగా అయ్యే మార్గాలను తెలియజేసినట్లయితే ఆయా వాడుకర్లకు సమయం వృధా కాదు కదా. అందువల్ల మీ వంటి వారు సూచనలు అందించాలి. పేజీలు వికీకరణ, శుద్ధి జరిగి అందంగా ఉంటే చదువరులకు కూడా చదవాలనే ఆశక్తి ఉంటుంది. మీరు చాలా కాలం నుండి గ్రామవ్యాసాలను సరిదిద్దుతున్నారు. కొంత సమయం తీసుకొని విజ్ఞాన శాస్త్రవ్యాసాలు, విద్యావిషయక వ్యాసాలు, మీకు ఆశక్తి ఉన్న రైల్వే వ్యాసాలను కూడా కొంతవరకు వృద్ధి చేయాలని నా ఆకాంక్ష.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:07, 24 ఆగష్టు 2015 (UTC)
కె.వెంకటరమణ గారు, నమస్కారము. వికీలో లోపం వచ్చినపుడు, వాడుకర్లు తెలియక తప్పులు చేస్తున్నప్పుడు సూచనలు ఎవరు ఎవరికయిననూ ఇవ్వవచ్చు. కానీ ఆచరణ ఎంతవరకు చేస్తారు, చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. తెలియని వారు నన్ను అడిగితే చెప్పగలను. అన్నీ తెలిసి, కావాలని తప్పులు చేయగలవారికి, చేసేవారికి, ఏమీవినని వారికి ఎవరేమి సలహాలు ఏమని ఇవ్వగలరు. ప్రతి ఒక మూస నందు వారు ముందు, నేను వారివెంట వెనుక పడి ఇద్దరం పనిలో ఒక గమ్యము చేరుకుంటాము. పని విషయములో పూర్తి సహకరించటానికి, నేను చెబితే వింటాము అని వాడుకరులు అయిన మన పెద్దలు ఈ త్రిమూర్తులను (నాగేశ్వరరావుగారు, భాస్కరనాయుడుగారు మరియు పాలగిరిగారు) ఒప్పించండి. ఇక్కడ వారి సమ్మతిని వ్రాయమని చెప్పండి. ఎవరి వ్యక్తిగత వ్యక్తిత్వం వారికుంటుంది. మనము సామరస్యముగా వారితో ఉండటము. నా ఆలోచనలు వారిమీద ఎలా రుద్దగలను. వారు ఎవరూ వికీ విరుద్ధ పనులు చేయడము లేదు. మరో విదముగా, నా సలహాలు మీకు ఇస్తాను, మీరు వారికి తెలియజేయడము మరో మార్గము. నా కంటే ఎన్నో నెలల రెట్లు కాలము నుండి ఈ గ్రామవ్యాసాలు వ్రాసే వారు ఉన్నారు. పనిలో నాణ్యత, పనితనము, ఎక్కువ పని చేయడము, ఇలా ఇలా ఒక మనిషి మరో మనిషి కంటే ఎంతో ఎక్కువ చేయవచ్చు. అలాగే ఒక భవనము కట్టడము స్లాబు వరకు తొందరగా అవుతుంది. ఆ తర్వాత దాని అలంకరణ పనులకు చాలా కాలం పడుతుంది. నేను ప్రతిరోజు చేస్తున్న పని ఏమిటో గమనించి అదేవిధముగా, అదేరీతిలో మరొకరిని చేయమని చెప్పండి. మీరు కూడా చెత్త తొలగింపు స్వచ్చవికీ కార్యక్రమములో పాల్గొంటారా ? నన్ను తప్పుకోమంటే తప్పుకుంటాను. మీరు నాకంటే అందంగా పేజీలను తయారు చేయగలరు. గ్రామవ్యాసాలు చెత్తతో చాలాకాలం వరకు కూడా మరుగున పడి ఉన్నాయి. నేను ఎక్కువగా శుభ్రం చేస్తున్న తర్వాత, తాకిడి ఎక్కువయింది. అంతకు ఎంతో కాలంగా చెత్త తొలగించాలన్నా ప్రతిపాదనలకు ఎవరూ ఎందుకు ముందుకు రాలేదో అర్థం కాదు. గ్రామవ్యాసాలు ఈ విధముగా స్వచ్చవికీ ఎవరయినా చేసినా, చేస్తుంటే మరో పనులు చేసుకొనే వాళ్ళము. అందుకనే వాటిని శుభ్రపరస్తూ ఉన్నాను. కానీ మరల కొత్త పూజల మాలిన్యం పెరుగుతోంది. అందుకే సమయము ఎక్కువ పడుతోంది. ఎవరెవరు పని విధానము ఏవిధముగా ఉన్నదో పని గ్రాఫ్ తెలియజేస్తుంది. ప్రతివిషయము రికార్డు అవుతునే ఉంటుంది. చౌకబారు ఎత్తుగడల పనులు, ఒక దిద్దుబాటు లాంటివి అనవసరముగా నేను చేయను. ఈ పనిని ముందు ఒక కొలిక్కి తీసుకొని రావాలి. తొలగించడము, జనాభా మూలం, గణాంకాల వివరాలు అనే విభాగాలు పొందుపరచడము తప్ప, కొత్త విభాగాలు వ్రాయడము లేదా కొత్తగా వీటిలో ఏవోచేర్చాలన్న ఆసక్తి పెద్దగా ఏమీ లేదు. నా బుర్రనుంచి ఎంతో విజ్ఞాన శాస్త్రవ్యాసాలు, విద్యావిషయక వ్యాసాలు, రైల్వేలు, హిందూ మతము, ఆస్ట్రానమీ ఇంకా ఇంకా అనేకం విభాగాలకు చెందినవి వ్రాయవలసినవి ఉన్నాయి. ఏదో ఈ పని మొదలు పెట్టాను. నెలలు గడుస్తున్నాయి. మరికొంత కాలానికి తప్పకుండా ఒక దారికి రావచ్చును. వీలయినంత త్వరలోనే ఈ పనిని ముగించాలని ఈ నెలలోనే (నా 60వ సంవత్సరము నాడు) అనుకున్నాను. కనీసం నాకు ఒక మంచి బ్లాగు లేదా ఉచిత వెబ్‌సైట్ తయారు చేసుకోవటము రాదు. దానికి ఎవరయినా సాంకేతిక సహాయము అందించమని మన వాడుకరుల దగ్గర ప్రస్తావించాను. ఆ విధమైన ఒక బ్లాగు నాకు ఉంటే అక్కడే ఎక్కువ కాలము గడుపుకుంటాను. ఆ సమయము వీలయినంత త్వరలోనే రావాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ధన్యవాదములు , పెద్దల మనసులు ఏమైనా బాధపడితే దయచేసి పెద్దమనసులతో మన్నించండి. JVRKPRASAD (చర్చ) 03:11, 24 ఆగష్టు 2015 (UTC)

వెంకట్ సిద్ధారెడ్డి గారి సహకారంతో కొన్ని మూలాలు

[మార్చు]

సినీ విమర్శకులు, సినీ రచయిత సిద్దారెడ్డి వెంకట్ గత నెలవారీ సమావేశానికి నా ఆహ్వానం మేరకు అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో నేను తెవికీపీడియాలో ఉన్న తెలుగు సినిమా వ్యాసాల గురించి, వాటిలో ఉన్నవేమిటి(దర్శకుడు, నటులు వగైరా మౌలిక సమాచారం), లేనివేమిటి (మిగిలిన సమాచారం) వంటివి వివరించి మనకున్న మూలాల కొరత తెలియజేశాను. ఆ సమయంలో ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చేట్టు వాగ్దానం చేశారు. ఇటీవలే తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర, 1970 సంవత్సరపు విజయచిత్ర సంచికలు అన్నీ నాకు ఇచ్చారు. అయితే ఇవి మళ్ళీ ఆయనకు తిరిగి ఇచ్చేయాల్సివుంటుంది. వీటిని జిరాక్సు/స్కానింగ్ చేసుకుంటే మన వాడుకకు ఉపకరిస్తుంది. కానీ అందుకు తగ్గ వనరులు నా వద్ద లేవు. మనసు ఫౌండేషన్ వంటి వారిని సంప్రదించాలంటే పుస్తకం పుస్తకం పళంగా ఉంచి వారు స్కాన్ చేయరని ప్రతీతి. కానీ మనం మర్యాదకరమైన స్థితిలో వాటిని తిరిగివ్వాల్సిన వాళ్ళం. ఈ సమస్య అధిగమించేందుకు ఏమైనా సూచనలు చేయగలరా? పి.ఎస్. ఆయనకు తెలిసిన సినీ చరిత్ర సేకర్తలతో సంప్రదించి మనకు మరికొన్ని వనరులు సమకూర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 15:15, 24 ఆగష్టు 2015 (UTC)

పవన్ సంతోష్ గారికి, మనసు ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవగా ఉచితంగా స్కాన్ చేసి అందిస్తున్నారు. అయితే వారు పుస్తకం పుస్తకం పళంగా స్కాన్ చేస్తారో, చెయ్యరో అన్న విషయమై మీరు నిర్ధారణకు ఎలా వచ్చారు? మీకీ విషయమై ఎవరు తప్పుడు సమాచారమిచ్చారో తెలియదు కానీ, మనసు వారు పుస్తకానికి ఎలాంటి హాని జరగకుండా, చ్చెక్కుచెదరకుండా కూడా స్కాన్ చేసిచ్చిన సందర్భాలున్నాయి. దయచేసి ఎవరి మాటలో విని తప్పుడు ఊహాగానాల్లో ఉండవద్దు. మీరు సీఐఎస్-ఏ2కే అభ్యర్థన పేజీలో ఈ విషయాన్ని వ్రాస్తే సీఐఎస్-ఏ2కే వారు మీకు మరింత సహాయం చేయగలరు. అలాగే దయచేసి కొన్ని పుస్తకాలను స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లోనో లేక స్కానింగ్ సెంటర్ లోనో స్కాన్ చేసి, మనసు వారు చేసిన స్కాన్ తో పోల్చి చూడగలరు. --రహ్మానుద్దీన్(సీఐఎస్-ఏ౨కే) (చర్చ) 12:37, 25 ఆగష్టు 2015 (UTC)
మనసు ఫౌండేషన్ వారు చెక్కుచెదరకుండా స్కానింగ్ చేసి అందిస్తారన్న విషయం నాకిప్పటి వరకూ తెలియదు. ఇటీవలే నా స్వంత పుస్తకాలు కొన్ని పాడైనా ఫర్వాలేదు, డిజిటైజ్ చేసి తెవికీపీడియన్లకు పంచుదాం అని తెగించేశానంటే ఆ రూమర్ ఏ రేంజిలో ఉండివుంటుందో ఊహించండి :-) క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సూచనలు వీలున్నంతలో పాటిస్తాను. పి.ఎస్.: నిర్ధారణకు ఎలా వచ్చారు అన్నారు కదా నిర్ధారణకు రాలేదు కనుకే ప్రతీతి అన్న పదాన్ని జాగ్రత్తగా వాడాను, గమనించండి. --పవన్ సంతోష్ (చర్చ) 15:30, 25 ఆగష్టు 2015 (UTC)
పవన్ సంతోష్ - ఇదేం పెద్ద విష్యం కాదు, మన దగ్గర మంచి కెమెరా ఉంది. మనమే మంచిగా పొటోస్ తీసి వాటిని స్కాన్ టెయిలర్ ద్వరా మంచిగా చేసి వాటిని పంచుకోవచ్చు. మహా అయితే 2 గంటల పని. భవిష్యత్‌లో కావాలంతే అప్‌లోడ్ చేసుకోవచ్చు.--విశ్వనాధ్ (చర్చ) 07:06, 27 ఆగష్టు 2015 (UTC)

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశంలో చర్చించిన అంశాలు

[మార్చు]

అందరికి నమస్కారం... ఆగష్టు 16 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో తెలుగు వికీపీడియా సమావేశం ఏర్పాటుచేయబడిన విషయం సభ్యులందరికి తెలిసిందే.. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను సమావేశ నిర్వాహకులైన పవన్ సంతోష్, వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశం పేజిలో రాయడం జరిగింది. చర్చించిన అంశాలకోసం ఇక్కడ చూడగలరు. ధన్యవాదాలు. --Pranayraj1985 (చర్చ) 06:31, 25 ఆగష్టు 2015 (UTC)

విజయవాడలో సీఐఎస్-ఏ2కే కార్యక్రమాలు, ఆగస్టు ౨౮-౩౧, ౨౦౧౫

[మార్చు]

ఈ కింద తెలిపిన విధంగా సీఐఎస్-ఏ౨కే కార్యక్రమాలు గుంటూరు-విజయవాడలలో జరుగనున్నాయి, సభ్యులు పాల్గొనగలరు.

28 ఆగస్టు 2015: తెలుగుజాతి సంస్థతో ఒప్పందం
29 ఆగస్టు 2015 : అన్నమయ్య గ్రంథాలయంలో ఎడిటథాన్
30 ఆగస్టు 2015: సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి పుస్తకాలపై ఎడిటథాన్
31 ఆగస్టు 2015: తెవికీసోర్స్ లో చేరే పుస్తకాలపై విశ్లేషణ

--రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ౨కే) (చర్చ) 12:46, 25 ఆగష్టు 2015 (UTC)

మంచి కార్యక్రమం... అభినందనలు రహ్మానుద్దీన్ (సీఐఎస్-ఏ౨కే) గారు. రాఖీ పండుగకోసం నేను ఇంటికి వెళ్లాల్సివస్తుంది. కనుక నేను పాల్గొనడానికి వీలుపడడంలేదు. --Pranayraj1985 (చర్చ) 07:40, 27 ఆగష్టు 2015 (UTC)

తెలుగు OCR‬ ద్వారా వికీ సోర్సు లొ పుస్తక పాఠ్యము

[మార్చు]

వికీ సొర్సులొని పాత తెలుగుపుస్తకాలను టైపింగు అవసరంలేకుండా నేరుగా ఆ అక్షరాలను మార్చే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభం, మనం యాంత్రికంగా అన్వేషించవచ్చు, మార్చుకోవచ్చు, కట్ , పేస్టు లుచేసుకోవచ్చు .ఇప్పడు ఉన్నవాటిల్లో గూగుల్ డాక్స్ లో సమర్ధవంతంగా పనిచేస్తున్నది https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%3APranayamamu.pdf&page=6 అనే దస్త్రం మును https://drive.google.com లొకి ఎక్కించి దానిని (right click on uploaded document and select open with Google Doc ) తెరిచాను . చాలా వరకు పాఠ్యము విజయవంతం గా అక్షరాలు గా మారినది, ఇది ఒక మంచి పరిమాణం.-- 16:35, 28 ఆగష్టు 2015‎ Kasyap (చర్చ • రచనలు • నిరోధించు)

TeluguOCRwikisource.png
కాశ్యప్ గారు, ఇది మీరు చెప్పినది text లోనికి మారడంలేదు, అది png గా మారుతోంది కదా. ఇది చాలా కాలం క్రితం వచ్చినదే కదండి !. JVRKPRASAD (చర్చ) 16:24, 28 ఆగష్టు 2015 (UTC)
అది టెక్స్త్ లొనికి మారుతోంది ..ఇదిగో ఆ ఉపోద్ఘాతము
నేటి యంత్రయుగంలో ఎచ్చటికైన త్వరగ పోవలె నన్నచో, రైళ్ళు, స్టీమర్ల, వివూనములు మొదలగువానిని ఉపయోగించుచున్నాము. కాని యోKలు యోగసాధనచే శశీరముయొక్క బరువును తగ్గించి, కొద్దిసేపటిలో J-5 దూర మునకైన గాలిలో ఎగిరిపోవచ్చునని చెప్పచున్నారు. వారొక విధమగు తైలమును పాదములకు రాచుకొని ఎంతదూరమున కైనను కొద్దిసేపటిలోనే పోగలిగియున్నారు. చరీ ముక _ே o నభ్యసించుటచే గాలిలో ఎగురగలిగియున్నారు, ఒకవిధమగు మహేమగల మూత్రను నోటిలోవుంచుకొని రేప్పపాటులో ఎంత దూరమునకైన ప్రోగలరు. దూరడేశమందున్న మన బంధు మిత్రుల యోగక్షేమములను ఉత్తరములవల్లను, తంతి,నిస్తత్రి హార్తలవల్లను తెలిసికొనుచున్నాము. కాని,శూగులు థానేయు వల్ల ప్రపంచము దెచ్చట వమి జరుగుచున్నదో, కణము - -oటిలో తెలిసికొనవచ్చునని చెప్పచున్నారు. లాహిరీ యోగి లశాడను పట్టణమున తన పైయుద్యోగి భార్య యొక్క ఆరోగ్య మెటలనున్నదో తెలిసికొనుటకు "శాూxసాధనచే పోశాటన దూరమందున్న మిత్రునితో మాట్లాడుటకు మనము ఒలి ఫోను, వైనుల నుపయోగించుచున్నాము. కాని, యోగులు యోగమహిమలవల్ల, ఎంతదూరమునందలి విషయమునైన విన వచ్చుననిన్నీ, ఇంతేగాదు - ఈశ్వరవాక్కులను, ఆకాశమందు మనకు కనిపించకుండనున్న అనేక వస్తువులయొక్క ధ్వనులను, మనము వినవచ్చునని చెప్పచున్నారు, నేటి భౌతిక ప్రవంచ
ఇది మంచి పరిణామం.సులువుగా టెక్స్ట్ లోనికి మార్చే విధానం. ఈ విధానాన్ని తెలియజేసిన కశ్యప్ గారికి ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 17:25, 28 ఆగష్టు 2015 (UTC)
కశ్యప్ గారికి మరియు కె.వెంకటరమణ' గారికి ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 17:43, 28 ఆగష్టు 2015 (UTC)