వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఆగష్టు 16, 2015 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు[మార్చు]

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

ఈనెల అతిథి[మార్చు]

  • సిద్ధారెడ్డి వెంకట్: ప్రముఖ సినీ విమర్శకుడు, నవతరంగం.కాం వ్యవస్థాపకుడు-నిర్వాహకుడు, సినీ దర్శకుడు, రచయిత.

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు[మార్చు]

  1. డా.రాజశేఖర్
  2. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

  1. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 06:08, 8 ఆగష్టు 2015 (UTC)
  2. Vmakumar (చర్చ) 21:04, 11 ఆగష్టు 2015 (UTC)
  3. పవన్ సంతోష్ (చర్చ) 16:51, 12 ఆగష్టు 2015 (UTC).
  4. కశ్యప్ (చర్చ) 06:14, 16 ఆగష్టు 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
--t.sujatha (చర్చ) 16:41, 8 ఆగష్టు 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

చర్చించిన అంశాలు[మార్చు]

  1. తెలుగు వికీపీడియాలో సినిమా వ్యాసాల అభివృద్ధి జరుగుతున్న విధానం గురించి, మూలాల విషయంలో ఎదురవుతున్న సవాళ్ళ గురించి పవన్ సంతోష్ వివరించారు. సినీ విమర్శకులు, తెలుగు సినీ రచయిత, నవతరంగం.కాం వ్యవస్థాపకులు వెంకట్ సిద్దారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ తెలుగు సినిమాలకు సంబంధించిన పత్రికలు, పుస్తకాల గురించి వివరించారు. తనవద్ద ఉన్న విజయచిత్ర వగైరా సినిమా పత్రికలు, తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర వంటి పుస్తకాలు స్కాన్ చేసుకుందుకు ఇస్తానని చెప్పారు. తెలుగు సినిమాల పోస్టర్లు సేకరిస్తున్నవారిని గురించి, తెలుగు సినిమా చరిత్రను పలు విధాలుగా సేకరిస్తున్న వారిని గురించి ఆయన తెలిపారు. తెవికీ అవసరాల మేరకు వారితో సంప్రదిస్తానని, వారేమి ఇవ్వగలరో చూద్దామని అన్నారు.
  2. సినిమా వ్యాసాల అభివృద్ధిలో పాత పత్రికల్లో వచ్చిన కొన్ని తెరవెనుక విషయాల్లో వేటిని వికీలో చేర్చాలన్న అంశాన్ని కూడా ఆయన చర్చించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్, స్టైల్, బడ్జెట్ తదితర అంశాలను తప్ప అందుకు సంబంధం లేని గాసిప్స్, వివాదాలు చేర్చనవసరం లేదన్నారు. అవి వాస్తవాలా కాదా అన్నది విషయం కాదని విజ్ఞాన సర్వస్వ పరంగా వాటికేమీ విలువ ఉండదనేదే ముఖ్యాంశమని చెప్పారు.
  3. ఔత్సాహిక సభ్యుడు మహేష్ కుమార్ వికీ మార్కప్ కోడ్, వికీశైలి వంటి విషయాలపై తన సందేహాలను వ్యక్తం చేశారు. భాస్కరనాయుడు, విశ్వనాధ్.బి.కె., పవన్ సంతోష్ మార్కప్ కోడ్ కు సంబంధించిన తేలికైన మార్గాలను, వాడుక విధానాన్ని వివరించారు. పవన్ సంతోష్ వికీశైలికి సంబంధించిన మౌలికాంశాలను వివరించి, మూలాల ప్రధాన్యతను తెలిపారు.
  4. గత సమావేశంలో చేసిన చర్చలు ఎంతవరకూ ఫలించాయో చర్చించారు. పవన్ సంతోష్ , ప్రణయ్‌రాజ్ వంగరి గతనెల సమావేశపు చర్చల వివరాలను ఒక్కొక్కటిగా వివరించగా, వాటి ఫలితాలపై సభ్యులంతా చర్చించారు.
  5. ముఖ్యంగా భాస్కరనాయుడు గతంలో ప్రొఫెసర్ మాదిరెడ్డి అండమ్మను అతిథిగా తీసుకువచ్చామని, కానీ ఆమెతో జరిగిన చర్చల మేరకు చేయాల్సిన కార్యకలాపాలు చేపట్టలేదని అన్నారు. తద్వారా ఆమె తెవికీకి దూరమయ్యే స్థితి ఏర్పడిందని విమర్శించారు. దానికి సమాధానంగా ఆమె కోరిన సాంకేతికాంశాలపై అవగాహన హైదరాబాదులో అప్పటి సమావేశానికి వచ్చిన వికీపీడియన్లకు లేదని, దాంతో స్కైప్ ద్వారా విదేశాల్లో ఉన్న వైజాసత్య, బెంగళూరులో ఉన్న రహ్చానుద్దీన్ ఆమెకు సూచనలు చేశారని తెలిపారు. వారిరువురూ హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోవడంతో ఆమెకు ప్రత్యక్షంగా సహకరించలేకపోయారని వివరించారు. పవన్ మాట్లాడుతూ తెవికీ సముదాయం చిన్నది కనుక ఒకే ఆసక్తి కలవారు ఎక్కువమంది ఉండరని, అతిథుల ద్వారా తెవికీకి చేయించుకోవాల్సిన పనులు ఆయా ఆసక్తులు ఉన్నవారే చొరవతీసుకుని చేస్తే నచ్చినపని చేస్తున్న సంతృప్తి కూడా దక్కుతుందని అన్నారు.
  6. తెవికీ పుష్కరోత్సవాలు: వైజాసత్య, అర్జున తెవికీ పుష్కరోత్సవాలు జరపడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏంటో నిర్ధారించుకుంటే, తర్వాతి అవి జరపడం గురించి ఆలోచించవచ్చని ప్రశ్నించినట్టు పవన్ సంతోష్, విశ్వనాథ్ సమావేశంలో వెల్లడించారు. అలాంటి ప్రయోజనం ఏదైనా ఉందా అన్న విషయాన్ని చర్చకుపెట్టారు. దానికి కొంత ఆలోచన తర్వాత సభ్యులు సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా భాస్కర నాయుడు తెవికీ గురించి పదిమందికీ తెలియడమే ప్రయోజనం అన్నారు. తెవికీకి రెండు రాష్ట్రాలలోనూ విస్తృతమైన ప్రాచుర్యం తీసుకురావడం అన్న లక్ష్యం బానేవుంటుందని పవన్ ఏకీభవించారు.
  7. ఐతే గతంలోనూ కార్యక్రమాలు జరిగాయి, మరి వాటికీ ప్రచారం లభించింది తద్వారా తెవికీకి ఒనగూడిన మేలేమిటి? అన్న ప్రశ్నకు, పవన్ జవాబిస్తూ ఉగాది మహోత్సవం, దశాబ్ది ఉత్సవం, పదకొండవ వార్షికోత్సవం కార్యక్రమాల్లో కొన్ని మీడియా కవరేజిలు జరిగినా ఆ కార్యక్రమాల దృష్టి వాటిపై కాదన్నారు. తాను వ్యక్తిగతంగా పాల్గొన్న దశాబ్ది ఉత్సవంలో మీడియా విషయాన్నే ఎవరూ పట్టించుకోకపోవడం, అప్పటికప్పుడు తాను, కశ్యప్ హడావుడిగా పత్రికాప్రకటన విడుదల రాయించి పంపడం, చివరి నిమిషయంలో కేవలం కళాశాల ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా నిర్వహణ మొత్తం కెబిఎన్ కళాశాలదేనని రాయడం వంటివి గుర్తుచేసున్నారు. ఇక 11వ వార్షికోత్సవాల్లో భాస్కరనాయుడు చొరవతో స్థానిక ఎమ్మెల్యే వచ్చివుండకపోతే మీడియాకు ఈ కార్యక్రమం జరుగుతున్న విషయమే తెలిసివుండేది కాదన్నారు. ఇలా అవేవీ సరైన కవరేజిలు కావన్నారు.
  8. కశ్యప్, విశ్వనాథ్ మాట్లాడుతూ 2006లో ఈనాడు ఆదివారం సంచికలో కవర్ స్టోరీలో తెవికీ గురించి వివరించినప్పుడు వచ్చిన స్పందన గుర్తుచేశారు. అటువంటి స్పందన మళ్ళీ రావడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు.

ఫలితాలు[మార్చు]

  1. అతిథిగా విచ్చేసిన సిద్దారెడ్డి వెంకట్ తాను ఇస్తానన్న మూలాల విషయంపై పవన్ సంతోష్ ఫాలో అప్ చేయగా కార్యక్రమం జరిగిన తర్వాతి ఆదివారమే వాటిలో కొన్నిటిని తిరిగి ఇచ్చే పద్ధతిపై అందజేశారు. కాట్రగడ్డ మురారి రాసిన తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర, పాటిబండ్ల దక్షిణామూర్తి రాసిన కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి, విజయచిత్ర 1970 సంవత్సరపు సంచికల సంకలనం అలా తిరిగి ఇవ్వాల్సిన వాటిలో ఉండగా, కౌముది.నెట్ వారి మొదటి సినిమా శీర్షికలోని కొన్ని వ్యాసాల ప్రింటవుట్లు తిరిగి ఇవ్వక్కరలేని విధంగా ఇచ్చారు. అలానే తెలుగు సినిమా చరిత్రలోని వివిధ అంశాలవారీ సేకర్తలతో ఆయన తెవికీకి ఉపయోగపడే సమాచారం తీసుకునేందుకు సంప్రదిస్తున్నారు.

పాల్గొన్నవారు[మార్చు]

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. భాస్కరనాయుడు
  2. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  3. విశ్వనాధ్.బి.కె.
  4. కశ్యప్
  5. మహేష్ కుమార్
  6. పవన్ సంతోష్
  7. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక[మార్చు]