విజయచిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయచిత్ర ప్రచురణకు సారధ్యం వహించినవారిలో ఒకరు రావికొండలరావు

తెలుగు పత్రికారంగంలో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర అనే సినిమా మాసపత్రిక.[1] 1966 సంవత్సరంలో విడుదలైనది. దీనికి రావి కొండలరావు సారధ్యం వహించారు[2]. ఇది చందమామ పత్రికను ప్రచురించే డాల్టన్ పబ్లికేషన్స్ వారిది. ఇది సుమారు 40-50 సంవత్సరాలు నడిచింది.

ఇది తెలుగులో సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్ విశేషాల వంటి సాధారణ విషయాలతో పాటు ప్రముఖ దర్శకుల, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సినిమాల వివరాలు, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు మొదలైన వాటిని గురించి విజ్ఞానభరిత సమాచారం అందిస్తుండేది. కొన్ని ఉత్తమమైన పాత సినిమా కథను వివరంగా మాటలతో సహా అంచెలంచెలుగా ప్రచురించేవారు.

మూలాలు[మార్చు]

  1. "సినిమా రంగం, విజ‌య‌చిత్ర అల‌నాటి ప‌త్రిక‌లు - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-12.
  2. "Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation". www.teluguvelugu.in. Retrieved 2020-05-12.