వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 29
← పాత చర్చ 28 | పాత చర్చ 29 | పాత చర్చ 30 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 డిసెంబరు 1 - 2013 డిసెంబరు 19
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
2013 వికీ పురస్కార ప్రతిపాదన (KLRWP 2013 Nomination)
[మార్చు]కొ.ల.రా.వి.పు.ప్ర. - 2013, ప్రక్రియ జరుగుతున్నది, ఆనందకరమైన విషయము. ఈ పురస్కార ప్రతిపాదన గురించి ఈ [1] పేజీలో వున్నది. మంచిది.
కొన్ని సందేహాలు;
- ఎంతమందికి ఈ పురస్కారం ఇవ్వబోతున్నారు?
- ఒకరికే పురస్కారం ఇచ్చే పక్షంలో ప్రతిపాదిత సభ్యులు ఒకరికంటే ఎక్కువ వుంటే, ఒకే పేజీలో అన్ని ప్రతిపాదనలు చేయవచ్చా?
- ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మందికి ఈ పురస్కారం ఇవ్వబోతుంటే, ఇతర సభ్యులకు ప్రతిపాదించే పేజీ ఏది?
- ఒకరికంటే ఎక్కువమంది సభ్యులకు పురస్కారాలిచ్చేటట్టయితే, ఆప్రతిపాదనలూ అదే పేజీలో ప్రతిపాదిత సభ్యుని విభాగం కూర్పు చేసి అందులో చేయవచ్చా?
దయచేసి తెలుపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:42, 1 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలో అన్ని వివరాలు తెలపబడతాయి. ప్రస్తుత చిత్తు ప్రతులకు వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం మరియు దానిలో వికీలింకులు చూడండి. --అర్జున (చర్చ) 01:17, 2 డిసెంబర్ 2013 (UTC)
ప్రకటన సిద్ధత
[మార్చు]ముఖ్యపేజీలు సైట్ ప్రకటన సిద్ధమైనవి. గారు లాగ్ అయినతరువాత ప్రకటన చేస్తారు మరియు తెలుగు మెయిలింగ్ లిస్టులకు మెయిల్ పంపుతారు. ఆంగ్ల మెయిల్ జాబితాకు చిత్తు ప్రకటన తయారైంది. User:విశ్వనాధ్.బి.కె. రహ్మానుద్దీన్ మరియు దశాబ్ది వుత్సవాల కమిటీ సభ్యులు మరియు ఎంపిక మండలి సభ్యులు ఏమైనా సవరణలుంటే రేపు మధ్యాహ్నం లోగా తెలియచేయవలసింది. ఇప్పటికే ఉత్కంటతో స్పందించిన వారు అధికారిక ప్రకటన కంటే ముందే కొత్త ప్రతిపాదనని వాడాలనుకుంటే వికీపీడియా:దశాబ్ది_ఉత్సవాల_వికీ_పురస్కార_ఎంపిక/ప్రతిపాదనలు ను ఇప్పుడు వాడవచ్చు. --అర్జున (చర్చ) 13:04, 2 డిసెంబర్ 2013 (UTC)
- ప్రకటన వైజాసత్య గారు భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాత విడుదలచేస్తామని ఇప్పుడే చెప్పారు. --అర్జున (చర్చ) 13:15, 2 డిసెంబర్ 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాల ముందు విద్యార్ధులకు వ్యాసరచన పోటీ
[మార్చు]దశాబ్ధి ఉత్సవాల సంధర్భంగా విద్యార్ధుల కొరకు వికీపీడియా గురించిన వ్యాసరచన పోటీ పెట్టాలనీ నిర్ణయించారు. ఏవైనా మూడు విషయాలపై పోటీ ఉంటుంది. కార్యక్రమ వేదిక వద్ద విజేతలకు బహుమతి ప్రదానం జరుగును. కనుక సభ్యులు ఏ విషయాలపై పోటీ పెడితే బావుంటుంది అనేదానిని ఇక్కడ వికీపీడియా:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ సూచనలు ఇవ్వవలసిందిగా మనవి...విశ్వనాధ్ (చర్చ) 10:38, 30 నవంబర్ 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాల కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శి మరియు కోశాధికారి
[మార్చు]కార్యవర్గ సభ్యులనుండి విశ్వనాధ్ గారిని అధ్యక్షులుగా, ప్రణయ్ గారిని కార్యదర్శిగా మరియు కశ్యప్ గారిని కోశాధికారిగానూ ప్రతిపాదించబడింది. ఏకగ్రీవంగా వీరు ఆయా పదవులకు నియముతులయ్యారని తెలియచేస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 09:40, 1 డిసెంబర్ 2013 (UTC)
- విశ్వనాధ్ , ప్రణయ్ మరియు కశ్యప్ లకు అభినందనలు. దశాబ్ది ఉత్సవాలు మీ నాయకత్వంలో దిగ్విజయంగా జరుగుటకు శుభాకాంక్షలు. --అర్జున (చర్చ) 11:05, 1 డిసెంబర్ 2013 (UTC)
- :విశ్వనాధ్ , ప్రణయ్ మరియు కశ్యప్ లకు అభినందనలు. వారు ఈ పదవులు నిర్వహించడానికి సమర్ధులు. వీరి నిర్వహణలో దశాబ్ధి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతాయని విశ్వసిస్తున్నాను.--t.sujatha (చర్చ) 11:47, 1 డిసెంబర్ 2013 (UTC)
విక్షనరీలో వార్తాపత్రికలు
[మార్చు]- వార్తాపత్రికలు అన్నింటికీ విక్షనరీలో వేరు వేరు పేజీలు సృష్టించడం సరి కాదనిపిస్తుంది. సభ్యులు ఒకసారి ఆలొచించండి.Rajasekhar1961 (చర్చ) 13:27, 1 డిసెంబర్ 2013 (UTC)
- Rajasekhar1961గారికి, తొలగించవలసి వస్తే తప్పకుండా తొలగిస్తాను. ఈ లోపున వేరే ఎక్కడయిన వీటి గురించిన వివరములు దొరికిన పొందుపరచ గలను. నా ఈ సమాధానము తాత్కాలిక(ఇంటిరీం) జవాబుగా గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:43, 1 డిసెంబర్ 2013 (UTC)
- Rajasekhar1961గారికి, మీ సందేహానికి తప్పక సభ్యుల దగ్గర చర్చించ దగినది. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని ప్రస్తుతానికి విషయములు పొందుపరచు చున్నాను.
- (1) తెలుగు, ఇతర భాషలు, మతాలు, భారతదేశానికి చెందిన పత్రికలు ఏవైనా కొన్ని తెలుగు పదాలతో ఉన్నాయి. ఉదా: ఉదయం, సాక్షి, వార్త, సితార స్వాతి, ఋషి, గీటురాయి (ఇస్లామిక్ భాష), అన్నదాత, ఆంధ్రప్రదేశ్, బొమ్మరిల్లు, భారతి, యువ, రచన, చిత్ర, నది, పాడిపంటలు, ఇలా ఎన్నెన్నో వివిధ రకములయిన పత్రికలు మనకు లభిస్తున్నాయి. వీటికి మాత్రము మనము ప్రత్యేకంగా పుటలను కేటాయించలేము. ఇటువంటివి వర్గం:విభిన్న అర్థాలు కలిగిన పదాలు జాబితాలోకి వస్తాయి. వీటికి తప్పక అక్కడ అర్థం ఇవ్వవలసిన అవసరము ఉన్నది. అందువల్ల మిగతా పత్రికలను మనము విస్మరించ కూడదు అని నా అభిప్రాయము.
- (2) విక్షనరీలో దాదాపు చాలా పుటలకు తప్పకుండా "'మూస:వికీపీడియా"' ఉంచటము జరుగుతున్నది. ఈ లింకు వలన వ్యాసము చదివేందుకు చదువరులకు అవకాశము ఉంటున్నది.
- (3) వివిధ భాషలలో పత్రికలు, పుస్తకములు ఇలా అనేక వర్గాలు పొందు పరచుకుని వారి వారి పుటల సంఖ్యలను పెంచుకుంటున్నారు. వారిని మక్కీకి మక్కీ అనుసరించుదామని నా ఉద్దేశ్యం కాదు.
- (4) వికీపీడియాలో అనేక ఎలక్ట్రానిక్ మాధ్యామాలకు వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కేవలము మనము వర్గం:విభిన్న అర్థాలు కలిగిన పదాలు అవసరము అనుకున్న వాటికే కొత్తవి కేటాయించడము జరిగినది. వాటిని అభివృద్ధి చేయవలసిన అవసరము కూడా ఉన్నది. సంశయ స్పందన వలన అలానే ఉంచటము జరిగినది.
- (5) ఇతర సభ్యుల సముదాయ పందిరిగా చర్చించి, నిర్ణయము తీసుకుంటే, సభ్యులే నిర్వాహకులుగా ఉన్న విక్షనరీలో తొందరపడి మనకు మనము (నాకుగా నేనే) నిర్ణయాలు తీసుకుంటే మీ(నా)బోటి వారలకు ఉత్సుకత తగ్గవచ్చు, మనఃక్లేశానికి గురికావచ్చు.
- (6) సభ్యుల స్పందనల కనుగుణంగా తొలగించవలసి వచ్చినట్లయినా, తప్పక నేను తొలగించగలను.
- (7) మీకు వెను వెంటనే జవాబు పొందు పరచక పోవుటకు కారణము కూడా ఉన్నది. నేను అవును, మీరు కాదు అన్న ధోరణిలో సంశయము తీర్చుకొను వారము. వేరెవరైనా స్పందిస్తే వారలకు నేనిచ్చే నా జవాబు మీకు పాక్షిక మనస్పందన అవుతుంది. చర్చలు చేయవచ్చును.
- గమనిక:విక్షనరీలో కూడా చర్చ వ్రాసినందులకు అక్కడ కూడా ఇదే జవాబు పొందు పరచడ మయినది.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:11, 2 డిసెంబర్ 2013 (UTC)
- ఏయే భాషలలో అన్ని వార్తాపత్రికల గురించి వ్యాసాలున్నాయో లింకుల్ని ఇవ్వండి. ఒకసారి చూస్తాను.Rajasekhar1961 (చర్చ) 05:23, 2 డిసెంబర్ 2013 (UTC)
- Rajasekhar1961 గారు, మీరు మొత్తము జవాబునకు కూడా స్పందనలు తెలియజేస్తే బావుండేది. మీరడిగినట్లు లింకు [2] ఇస్తున్నాను. ఆయా భాషలలోని వారు కొంత వరకు పని చేసి ఉండవచ్చును. అన్ని వార్తాపత్రికల గురించి పేజీలు ఉండకపోయినా, కాని వార్తాపత్రికల గురించి మాత్రము వర్గములు ఉన్నాయి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:07, 2 డిసెంబర్ 2013 (UTC)
- మీరు చూపిన ఆంగ్ల విక్షనరీలో ఒక 4-5 పేర్లు మాత్రమే నామవాచకాలుగా ఉన్నాయి. వాటిలో కొన్ని జాతీయాలుగా వున్నాయి. నాకెందుకో అన్ని వార్తా పత్రికల పేర్లు చేర్చడం సబబుగా లేదు. ఒకే పదం ఉన్న సాక్షి, వార్త, ఉదయం లాంటి పేర్లను మాత్రము విక్షనరీలో చేర్చి వాటిని వార్తాపత్రికలు వర్గంలో చేర్చితే సరిపోతుంది. ఇండియా టుడే, సినీ హెరాల్డ్, అందరికీ ఆయుర్వేదం లాంటి 2-3-4 పదాలున్న పదాలు చేర్చకుంటేనే మంచిదని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 11:24, 2 డిసెంబర్ 2013 (UTC)
- రాజశేఖర్ గారు, మీ అభిప్రాయము చెప్పారు. కానీ మీరు అడిగే ధర్మ సందేహాలు నేను తీర్చలేక పోవచ్చును. ఎప్పుడయినా నేను చేస్తున్న పనిలో మీ అభ్యంతరములు వచ్చినప్పుడు, తప్పకుండా ఆ పని ఆపివేస్తాను. సహ సభ్యులు ఏనాటికయినా వారి వారి స్పందనలు పొందు పరచుటకు అవకాశము రావచ్చును. అందువల్ల వేచి చూద్దాము. నేను అంతవరకు మీ సందేహము ఎవరయినా నివృత్తి చేసేవరకు, మీకు తెలియకుండా మాత్రము ఆ పత్రికల వర్గం జోలికి వెళ్ళను. మీ అభ్యంతరములు వచ్చిన వెంటనే, ఇప్పటికే ఆ పని ఆపి వేశాను. ఈ సందర్భముగా వెంటనే మీ అభ్యంతరములు తెలిపినందులకు, మీకు మరీ మరీ ధన్యవాదములు. ఇదే రీతిలో (వెంటనే) తప్పకుండా ఏ ఒక్కరయినా అభ్యంతరములు ఏ పనులలో అయినా వ్యక్తము చేసిన యెడల, ఆ పనిని గురించి చర్చలలో ఫలితములు వచ్చేవరకు, ఆ అభ్యంతరకర మయిన పనిని ప్రక్కన పెట్టి, అందరము ఆగుదాము. వేరొక పని చేసుకుందాము.
- ఏయే భాషలలో అన్ని వార్తాపత్రికల గురించి వ్యాసాలున్నాయో లింకుల్ని ఇవ్వండి. ఒకసారి చూస్తాను.Rajasekhar1961 (చర్చ) 05:23, 2 డిసెంబర్ 2013 (UTC)
- సభ్యులకు గమనిక: ఈ చర్చ అసంపూర్ణం. ఫలితము రాలేదు. కావున ఇది (సజీవం) సశేషం, దయచేసి గమనించగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:01, 2 డిసెంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:05, 2 డిసెంబర్ 2013 (UTC)
2013 వికీ పురస్కార ప్రతిపాదన
[మార్చు]వికీదశాబ్ధి ఉత్సవ కమీటీలో నగదు ఎంపిక కమిటీ ఉపకమిటీ అయినందున ఉత్సవ నిర్వహక కమిటీ నుండి నిధులు కేటాయించబడినందున అందులో సభ్యులైన నేను, ప్రణయ్‌రాజ్, విష్ణు, రహమనుద్దీన్ మరియు కష్యప్‌లు నగదు బహుమతికి అనర్హులుగా నిర్ణయించాం... విశ్వనాధ్ (చర్చ) 08:44, 2 డిసెంబర్ 2013 (UTC)
- విశ్వనాధ్, తెవికీలో క్రియాశీలంగా వున్నవారిలో చాలా తక్కువమందిని మాత్రమే అంటే ఎంపికమండలి సభ్యులని మాత్రమే అనర్హులుగా వుంచాలని ఎంపికమండలి సమావేశం తీర్మానించింది. ఇంతలోనే మీ వ్యాఖ్య చూశాను. ఇది బాధాకరమైనా, లాభాసక్తి ఏమాత్రము ఈ ప్రక్రియను ప్రభావితం చేయకూడదని మీ కార్యనిర్వాహకవర్గం తీసుకున్న నిర్ణయం ఆదర్శమైనది మరియు మెచ్చదగినది. --అర్జున (చర్చ) 10:10, 2 డిసెంబర్ 2013 (UTC)
- నిజానికి నగదు అన్నది ముఖ్యం కాదు. అయినా గుర్తింపు ముఖ్యం. సభ్యులు లాభాపేక్ష లేకుండా పనిచేస్తారన్నది నిర్వివాదాంశం. విశ్వనాధ్ , చర్చత్యాగనిరతి మెచ్చతగినది శ్లాఘించతగినది. అధికాలం వికీలో భాగస్వామ్యం వహించి, సమన్వయం పాటించి , క్రియాశీలకంగా ఉన్న కార్యవర్గ సభ్యులకు అర్హత కలిగించాలని కోరుకుంటున్నాను. వారిది వద్దంటున్నా వారిని అర్హులను చేసి గుర్తించడం ధర్మం, వికీపీడియాకు మార్గదర్శకం. నగదు బహుమతి లేకున్నా వారికి గుర్తింపుకు అర్హత కల్పించాలని కోరుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అయినా మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తప్పక గౌరవించి పాటిస్తాను. --t.sujatha (చర్చ) 13:08, 2 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాం
[మార్చు]తెవికీ సభ్యులందరికీ నమస్కారాలు. తెలుగు వికీ పది సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత పది సంవత్సరాలలో విశేష కృషి చేసి, తెలుగు వికీ ఈ స్థాయికి చేరటానికి దోహదం చేసిన మిత్రులందరినీ ఒక్కసారి మళ్లీ వారి సేవలకు గుర్తు చేసుకొని, వారికి తగు విధంగా గుర్తింపు ఇచ్చే శుభ సందర్భం ఇది. ఈ పురస్కారాల ప్రకటన అధికారికంగా వెలువడక ముందే కొన్ని ప్రతిపాదనలు ప్రారంభించబడటం ఆహ్వానించదగ్గ విషయం. సభ్యులందరూ ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొని, గుర్తింపుకు అర్హులైన అందరినీ ప్రతిపాదించి, వాళ్ళను గుర్తించేందుకు తగు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పురస్కారాన్ని సాకారం చేయటానికి కృషి చేస్తున్న దశాబ్ది ఉత్సవాల కమిటీకి ధన్యవాదాలు. అలాగే ఈ పురస్కార ప్రతిపాదనకు చాలా సమయం వెచ్చించి రూపుదిద్దిన ఎంపిక సంఘం సభ్యులు అర్జున గారికి, సుజాత గారికి, రాధాకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. మీ ప్రతిపాదనలు ఇక్కడ చేయగలరు. ప్రతిపాదనలు చేయటానికి గడువు సమయం 09 డిసెంబరు 2013 11:59 (UTC) (10డిసెంబరు 2013 05:29 ఉదయం భారత ప్రామాణిక కాలం). స్వీయపత్రిపాదనలు చేయటానికి వెనుకాడవద్దు. మీరు ప్రతిపాదితులైతే, మీ ప్రతిపాదనకు అదనపు సమాచారం చేర్చటానికి మొహమాటపడపద్దు. మన కృషి మనకంటే ఇంక ఎవరికి బాగా తెలుస్తుంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫలప్రదం చేస్తారని ఆశిస్తూ..
ఎంపిక సంఘం అధ్యక్షుడు - వైజాసత్య --వైజాసత్య (చర్చ) 16:15, 2 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్య గారికి, మీరు సూచించిన సూచన ఒక విధంగా మంచిదే. మీరు చెప్పినట్లు ప్రభుత్వ ఆఫీసులలో ఎవరికి వారము చేసిన పని/పనులను పై వారికి వ్రాసి ఇస్తాము. అక్కడ ఎల్లప్పుడూ మన పని పద్ధతులు, వివరాలు, మిగతా విషయాలు కొత్తగా మారుతుండే పై అధికారులు గుర్తించలేరు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ "'అన్నీ"' అందరకూ ఎదో విధముగా తెలుస్తునే ఉంటాయి. అలాగే ఈ మధ్యనే తెవికీ ఉత్సవాలలో కొంతమంది అయినా ఒకరికొకరు వ్యక్తిగతంగా కలవడము జరిగింది. నిజానికి ఎవరి పని వారికే తెలుస్తుంది. కాని తోటి సభ్యులే ఇక్కడ పని/పనులు వరకు పరిమితం చేసుకుని ఆలోచించి ప్రతిపాదించి, చివరకు నిర్ణయము తీసుకుంటే బావుంటుందని నా అభిప్రాయము. తదుపరి, క్రియాశీలకంగా ఉన్న సభ్యులకు వారు ఎవరైనా (సమావేశము నిర్వహించే ఏ స్థానములో ఉన్న వారు) అయినా అందరిని ఒకేలా చూసి ప్రతిపాదిస్తే మంచిది. ఇక ఏదైనా స్వీకరించటము, లేకపోవడము అది వారి వారి వ్యక్తిగతం. చాలా వరకు అన్ని విషయములు సజావుగానే సాగుతున్నాయి కనుక మీరు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారో వారినందరిని తగు రీతిలో (నగదు లేదా పత్రం) సన్మానించుకుందాము. అటువంటి వారి సేవలు మెచ్చుకోదగినవి. అందరికీ ఆదర్శం కావచ్చును. ఇందులో ఎవరూ సన్మానమండలి నిర్ణాయాలను ఆక్షేపిస్తారని, అభ్యంతరము వ్యక్తం చేస్తారని నేను ఈషణ్మాత్రం అనుకోవడము లేదు. ఈ సందర్భముగా సభ్యులందరు ముందుకు సాఫీగా సాగగలరు. "'సర్వేజనా సుమేధో భవంతుః"' జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:17, 3 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారికి, క్రియాశీలకంగా ఉన్న సభ్యులందరకూ (లేదా కొందరకు) ఈ సందర్భముగా సన్మాన పత్రాలు ఇవ్వాలని ప్రతిపాదిస్తే బావుంటుంది అని అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:34, 3 డిసెంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారి సూచన బాగుంది. క్రియాశీలక సభ్యులందరికీ సన్మాన పత్రాల ప్రతిపాదన మంచిదే. అహ్మద్ నిసార్ (చర్చ) 10:00, 3 డిసెంబర్ 2013 (UTC)
తెలుగు వికీ సభ్యుల సహాయ సహాకారాలతో ముందుకు సాగుతూ అతిపెద్ద మైలురాయిని దాటబోతున్న తెలుగు వికీపీడియాలో సభ్యులకు ఉత్సాహ,ప్రోత్సాహాలనందించడానికి నగదు బహుమతి పురస్కారాల కొరకు సభ్యులను ఎన్నిక చేస్తూ అత్యంత శ్రమిస్తున్న ఎన్నిక మండలి సభ్యులు రవి వైజాసత్య గారికి, అర్జున గారికి, సుజాత గారికి, రాధాకృష్ణ గారికి, రాజశేఖర్ గారికివారికి తోడ్పాటునందిస్తున్న అందరు సభ్యులకు తెవికీ దశాబ్ధి ఉత్సవ కమిటీ తరుపున మనహ్‌పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..విశ్వనాధ్ (చర్చ) 13:10, 3 డిసెంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారూ, క్రియాశీలక సభ్యులందరికీ సన్మాన పత్రాలు ఇవ్వటం అన్నది చాలా చక్కని సూచన. దానిని తప్పకుండా అమలుచేద్దాం --వైజాసత్య (చర్చ) 09:57, 5 డిసెంబర్ 2013 (UTC)
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/నాలుగవ స్కైప్ సమావేశం నివేదిక ప్రకారం ప్రతిపాదనల గడువు 16 డిసెంబరు గా పొడిగించడానికి మండలి నిర్ణయించింది. సముదాయం ప్రతిపాదనలను కొలబద్ద ఆధారంగా తగిన వివరణలతో పరిపుష్టం చేయవలసినదిగా మరియు ఇంకా అర్హులైన వారిని ప్రతిపాదించి, వారి అంగీకారం కొరకు ప్రయత్నించవలసిందిగా సముదాయాన్ని కోరుతున్నది. అలాగే కొలబద్దని మెరుగుచేయటానికి ఏమైనాసూచనలుంటే వారంరోజులలోగా చర్చాపేజీలో తెలియచేయమని కోరుతున్నది. --అర్జున (చర్చ) 10:56, 9 డిసెంబర్ 2013 (UTC)
పాత సభ్యులకు తెలిపేదేలా?
[మార్చు]పాత సభ్యులైన, కాసుబాబు గారు, ఎం.ఆర్.ప్రదీప్, చదువరి, వీవెన్, లాంటి వారికి, తెవికీ ఉత్సవాలు, పురస్కార ప్రతిపాదనల గూర్చి తెలిపేదేలా ? ఇంకనూ ఇతర పాత సభ్యులను తెలిపేదేలా ? వారి ఈ-మెయిల్ అడ్రస్సులు వుంటే, సహసభ్యులు వారికి తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 06:13, 4 డిసెంబర్ 2013 (UTC)
- వీవెన్ గారు చురుగ్గానే ఇంకా పని చేస్తున్నారు. కాకపోతే ఆయన పనితనం ట్రాన్స్లేట్ వికీ లాంటి ప్రదేశాలలోనే గమనించగలము. మాకినేని ప్రదీప్ గారిని నేను సంప్రదిస్తున్నాను. ఇంకా అంతగా చురుగ్గా లేని పాత సభ్యూలనూ మనం మెయిలింగ్ లిస్టు ద్వారా లేదా వారి వాడుకరి పేజీ చర్చ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిద్దాం. చదువరి గారు మరలా పునరుత్తేజంతో ఏదో ఒక రోజు త్వరలో చురుగ్గా ముందుకు వస్తారని అనుకుంటున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 06:22, 4 డిసెంబర్ 2013 (UTC)
- అప్పట్లో ఎక్కువగా శ్రమించిన అనేక మంది సభ్యులను గురించి ఇప్పటి సభ్యులకు ఎక్కువగా తెలియదు. తెలిసిన చాలామంది సభ్యులు కార్యవర్గంలో ఉన్నారు కనుక ప్రతిపాదించదం తగదు. ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్న సభ్యులందరూ ఒకసారి పాత సభ్యులను గురించి చదివి ,తెలుసుకొని తగిన వారిని ఎన్నిక చేయాలని నా కోరిక....విశ్వనాధ్ (చర్చ) 07:02, 4 డిసెంబర్ 2013 (UTC)
- తెవికీలో విశేష కృషి చెసిన పాత సభ్యులను కూడా ప్రతిపాదించి ఈ మెయిల్ ద్వారా తెలియజేద్దాం--కె.వెంకటరమణ (చర్చ) 07:39, 4 డిసెంబర్ 2013 (UTC)
- పురస్కారం ఇవ్వదలిస్తే ఒక్కసారిగా పేర్లు ప్రకటించి వారి పూర్వ కృషికి గుర్తింపు లభించేటట్లు చేయవచ్చు. అదే సమయంలో వారికి ఆశ్చర్యం, ఆనందం కలిగించవచ్చు, కాని ముందే వారికి ఆశ కలిపించి, వారి సంతకాలను తీసుకొని, ఇప్పటికే "పోటీ"లో పలువులు ఉండటం వల్ల అందరికీ న్యాయం చేకూర్చలేక, పిలిచిన అందరికీ పురస్కారాలు ఇవ్వలేక వారిని నిరాశకు గురిచేయడం సమంజసం కాదని మనం ఆలోచించాలి. అన్నట్టు ఇదివరకు విశేషకృషి చేసినవారికే గుర్తింపు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:43, 4 డిసెంబర్ 2013 (UTC)
- మీ ఇబ్బంది నాకర్ధమైంది. అన్ని కోణాలు ఆలోచించాము. అన్నిటికీ ఏదోఒక లోటుపాట్లు కనిపించాయి. విశేష కృషి చేసినవాళ్ళను, ఊరికే బుట్టలో పేరు వేసిన వాళ్ళని గుర్తించలేమంటారా? కనీసం పది ప్రతిపాదనలు కూడా వస్తాయో, లేదో అని కంగారుపడ్డాము. కాబట్టి మీరూహిస్తున్న పరిణామం జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళ జరిగినా ఒక ప్రత్యామ్నాయం ఉన్నది. --వైజాసత్య (చర్చ) 09:53, 5 డిసెంబర్ 2013 (UTC)
- విశేషకృషి చేసినవాళ్ళను గుర్తించలేమని చెప్పే ఉద్దేశ్యం కాదు కాని మెయిల్ ద్వారా పిలిపించిన అందరికీ పురస్కారం ఇవ్వలేముకదా. అలాంటప్పుడు ఇదివరకు కొంత కృషిచేసి ఇప్పుడు తెవికీలో అచేతనంగా ఉన్నవారికి పిలిపించి అంగీకారం తీసుకొనే అవసరం ఉన్నదా అన్నదాన్ని గురించే నేను చెప్పాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:33, 5 డిసెంబర్ 2013 (UTC)
- మీ ఇబ్బంది నాకర్ధమైంది. అన్ని కోణాలు ఆలోచించాము. అన్నిటికీ ఏదోఒక లోటుపాట్లు కనిపించాయి. విశేష కృషి చేసినవాళ్ళను, ఊరికే బుట్టలో పేరు వేసిన వాళ్ళని గుర్తించలేమంటారా? కనీసం పది ప్రతిపాదనలు కూడా వస్తాయో, లేదో అని కంగారుపడ్డాము. కాబట్టి మీరూహిస్తున్న పరిణామం జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళ జరిగినా ఒక ప్రత్యామ్నాయం ఉన్నది. --వైజాసత్య (చర్చ) 09:53, 5 డిసెంబర్ 2013 (UTC)
- పురస్కారం ఇవ్వదలిస్తే ఒక్కసారిగా పేర్లు ప్రకటించి వారి పూర్వ కృషికి గుర్తింపు లభించేటట్లు చేయవచ్చు. అదే సమయంలో వారికి ఆశ్చర్యం, ఆనందం కలిగించవచ్చు, కాని ముందే వారికి ఆశ కలిపించి, వారి సంతకాలను తీసుకొని, ఇప్పటికే "పోటీ"లో పలువులు ఉండటం వల్ల అందరికీ న్యాయం చేకూర్చలేక, పిలిచిన అందరికీ పురస్కారాలు ఇవ్వలేక వారిని నిరాశకు గురిచేయడం సమంజసం కాదని మనం ఆలోచించాలి. అన్నట్టు ఇదివరకు విశేషకృషి చేసినవారికే గుర్తింపు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:43, 4 డిసెంబర్ 2013 (UTC)
- తెవికీలో విశేష కృషి చెసిన పాత సభ్యులను కూడా ప్రతిపాదించి ఈ మెయిల్ ద్వారా తెలియజేద్దాం--కె.వెంకటరమణ (చర్చ) 07:39, 4 డిసెంబర్ 2013 (UTC)
- అప్పట్లో ఎక్కువగా శ్రమించిన అనేక మంది సభ్యులను గురించి ఇప్పటి సభ్యులకు ఎక్కువగా తెలియదు. తెలిసిన చాలామంది సభ్యులు కార్యవర్గంలో ఉన్నారు కనుక ప్రతిపాదించదం తగదు. ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్న సభ్యులందరూ ఒకసారి పాత సభ్యులను గురించి చదివి ,తెలుసుకొని తగిన వారిని ఎన్నిక చేయాలని నా కోరిక....విశ్వనాధ్ (చర్చ) 07:02, 4 డిసెంబర్ 2013 (UTC)
ఇది వరకు కృషిచేసిన వారిని మళ్ళీ గుర్తించడంద్వారా వాళ్ళను మళ్ళీ తెవికీలో క్రియాశీలకం చేయవచ్చు అనేది ఒక విషయం. ఎంత చేసినా నాకేం వచ్చింది అనుకొని తప్పుకొన్న వారికి ఇలాంటి వాటి ద్వారా మరల పునరుత్తేజం కల్పించడం ద్వారా తెవికీలో మళ్ళీ రచనలు చేసేలా చేయించడం అవసరం...విశ్వనాధ్ (చర్చ)
వికీలలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసం మెరుగు
[మార్చు]కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసం వచ్చేవారం ఈ వారంవ్యాసంగా ప్రదర్శితమవనుంది. దీనిని 2007లో గణనీయమైన అభివృద్ధి తరువాత పెద్దగా మార్పులులేవు. ఇక్కడ మరియు ఆంగ్లంలో మరింత నాణ్యంగా చేయటానికి వనరులు అందుబాటులోవున్న వాళ్లు సహకరించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 08:30, 4 డిసెంబర్ 2013 (UTC)
- వ్యాసాన్ని కార్యక్రమం జరిగే తేదీలలో ప్రదర్శితమయ్యేలా చూడగలిగితే బావుంటుంది...విశ్వనాధ్ (చర్చ) 10:29, 4 డిసెంబర్ 2013 (UTC)
- అర్జున గారు, విశ్వనాథ్ గారు సరైన విషయాన్ని దృష్టికి తెచ్చారు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:43, 4 డిసెంబర్ 2013 (UTC)
వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
[మార్చు]తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, మనం వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు సంపూర్ణం చేసుకునేలా చూద్దామా. ఉత్సవ నిర్వాహక సంఘం తప్పించి మిగతా సభ్యులు తలా ఓ వ్యాసం రాస్తే, వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు, పూర్తి చేసుకోవచ్చు. వ్యాసాలూ వ్రాస్తున్న మరియు దిద్దుబాట్లు చేస్తున్న సభ్యులకు ఒక విన్నపం. పై నుదహరించిన వ్యాసాల జాబితాలో గల వ్యాసాలను వ్రాస్తే మంచిది. ఒక సబ్జెక్ట్ పూర్తీ అయినట్టు వుంటుంది. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 15:50, 4 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్ గారు చాలా చక్కని ఆలోచన. --విష్ణు (చర్చ)
నేను అభిమానించే తెవికీ సభ్యులు
[మార్చు]కొత్తగా ప్రవేశించిన సభ్యులకూ, నిర్వాహకులకూ ఒక చిన్న సూచన. నేను ఓసారి, సరదాకు తయారు చేసిన ఈ పట్టికను గమనించండి. పాత వికీపీడియన్లను కొత్తవారికి పరిచయం చేసే సదుద్దేశ్యంతోనే ఇవ్వబడినది.
తెవికీపీడియన్స్ రేటింగ్స్
-- కేవలం పరిచయం కోసం మాత్రమే సుమా !! అహ్మద్ నిసార్ (చర్చ) 22:00, 4 డిసెంబర్ 2013 (UTC)
ఇది మీ వాడుకరి పేజీకి ఉపపేజీగా ఉంచగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:34, 5 డిసెంబర్ 2013 (UTC)
తెవికీ సమగ్ర ప్రణాళిక
[మార్చు]ఓ సారి ఓ ప్రణాళిక తయారు చేశా, ఇదేమైనా పనికొస్తుందా ? కొత్త సభ్యులకు తెవికీ పట్ల అవగాహన కొరకు ఏమైనా ఉపయోగపడుతుందంటే మంచిదే.
ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే. అహ్మద్ నిసార్ (చర్చ) 01:05, 5 డిసెంబర్ 2013 (UTC)
- ఇది మీ వాడుకరి పేజీకి ఉపపేజీగా ఉంచగలరు. ఇంకా అందరికీ ఉపయోగపడే విధంగా సముదాయ పందిరిలో చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:35, 5 డిసెంబర్ 2013 (UTC)
- నిస్సార్ గారూ ! మీ పేజీలో నుండి చదివాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.t.sujatha (చర్చ) 12:58, 5 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్ గారు, మీరిచ్చిన రెండు మూసలు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి వాడుకోవచ్చును. ఈ మూసలను కొత్త సభ్యులను వికీలోకి స్వాగతం మూస ద్వారా లోపలికి ఆహ్వానించిన తదుపరి, ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా కూడా ఈ మూసలను తయారు చేసి కొత్తవారికి ఉత్సాహం కలిగించ వచ్చును. నాకూ ఇదే ఆలోచన ఎప్పటి నుండే ఉంది. అది వ్యక్తి గతమవుతుందని, వికీ నియమాలకి విరుద్ధమేమోనని ప్రయత్నించలేదు. మీరు ప్రస్తావించారు కనుక, సభ్యుల స్పందనలు, చర్చలు సఖ్యసామరస్యంగా సాఫీగా ఎక్కువగా ముందుకు వెళ్ళేందుకుంటే మంచిదే. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:21, 6 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్ గారికి, మీ ఆలోచనలు బాగున్నాయి. 2011 సమీక్ష చేసి, 2012 లో ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయాలని పనిచేశాము. అప్పుడు వాడుకరి:వైజాసత్య గారు ప్రారంభించిన పాత ప్రణాళికలు చూసి సహసభ్యులతో చర్చించి కొంత అభివృద్ధి సాధించాము. మీ పేజీ అప్పుడు నాకు తెలియలేదు. మీరు కొంత కాలం తెవికీలో లేరు కాబట్టి ఆ కాలంలో ఎంత వరకు వికీపీడియా అభివృద్ధి చెందింది విశ్లేషించి, మీ ఆలోచనలు తాజా చేసి వికీపీడియా:2013 సమీక్ష మరియు వికీపీడియా:2014 లక్ష్యాలు కు సంబంధించి కొత్త పేజీలు ప్రారంభించవచ్చు. --అర్జున (చర్చ) 09:27, 17 డిసెంబర్ 2013 (UTC)
- నిస్సార్ గారూ ! మీ పేజీలో నుండి చదివాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.t.sujatha (చర్చ) 12:58, 5 డిసెంబర్ 2013 (UTC)
నా సందేహాలు, సూచనలు
[మార్చు]తెవికీ దశమ వార్షికోత్సవ పురస్కార ప్రక్రియపై నాకున్న సందేహాలు, సూచనలు తెలుపుతున్నాను. అయితే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి దీన్ని మారుస్తారని నేను అనుకోవడం లేదు, మార్చాలని నేను చెప్పడం లేదు. ఇది కేవలం పరిశీలనకు మరియు సభ్యుల దృష్టికి తేవడం కోసం మాత్రమేనని అర్థం చేసుకోగలరు.
1)అసలు ఇది ఎంపికనా? లేదా ఎన్నికనా? అనేది స్పష్టం కావడం లేదు. ఎంపిక అన్నప్పుడు ఎవరైనా ఒక సభ్యుడు ఒక పేరును ప్రతిపాదిస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా?
- వైజాసత్య: సభ్యున్ని ఎంపిక చేసి, తీరా ఆ సభ్యుడు తిరస్కరిస్తే అభాసు పాలుకాకూడని అంగీకారం పెట్టాం. మరికొన్ని హేతువులు కూడా ఉన్నాయి వాటిని వివరంగా వ్రాస్తాము
- సిసికెరావు:అంగీకరించిన సభ్యుడు కూడా తర్వాత తిరస్కరించే అవకాశం ఉంది కదా! సభ్యులు తర్వాత తిరస్కరించే అవకాశం ఉంది అని కాకుండా వారి కృషికి తెవికీ తరఫున పురస్కారం ప్రకటన చేయడమే మంచిది కదా!
2)ప్రదిపాదిత (పురస్కార) సభ్యుని పేజీలో ఇతర సభ్యుల సమర్థన అవసరమేనా? ఎంపిక ప్రక్రియలో దీనికుండే ప్రాధాన్యత ఏమిటి? ఇది ఓటింగ్ కానప్పుడు ఇతర సభ్యుల మద్దతులు కూడా పొందడానికి ఇవి అందాల పోటీలు గాని టెలివిజన్‌లో ప్రసారమయ్యే డ్యాన్సు ప్రోగ్రాంలు కాని కావు కదా!
- వైజాసత్య: ఇతర సభ్యుల సమర్ధన అవసరం లేదు. కానీ సమర్ధనతో ఆ సభ్యుని గురించి ఇతర సభ్యులు మరింత జొడిస్తారని మాత్రమే కానీ, ఎన్ని సమర్ధనలు వచ్చాయన్నది పరిగణా అంశం కాదు.
- సిసికెరావు:అంటే సభ్యులు అర్థం చేసుకోలేరన్న మాట, ఇదేదో ఓటింగులాగా భావించి యుండవచ్చు.
3)ఎన్నిక అన్నప్పుడు పోటీ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుటి ప్రక్రియ పరిశీలిస్తే పోటీలాగానే కనిపిస్తోంది. ఎంపిక ప్రక్రియ అన్నప్పుడు, ఎంపిక మండలి ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో సభ్యుల ప్రమేయం అవసరమా?
- వైజాసత్య: ఎంపిక మండలి మీద పక్షపాత ధోరణి వ్యవహరించారన్న ఆరోపణలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకున్నాం. చివరికి ఇతరులను ప్రతిపాదించే అవకాశం లేక, ఇతర ప్రతిపాదనలను సమర్ధించే అవకాశం లేకుండా ఎంపిక మండలి తమ చేతుల్ని తామే కట్టేసుకున్నారు.
- సిసికెరావు:అందరి పేర్లు పరిగణలోకి తీసుకుంటే సరిపోయేది కదా!
4)పురస్కార ఎంపికకు ప్రాతిపదికలేమిటి అనేది స్పష్టంగా లేదు. అంటే ఎంపిక మండలి ఇష్టానిష్టాలపై ఆధారపడి ఉంటుందా?
- వైజాసత్య:ప్రాతిపాదికలు తర్వలోనే మరింత స్పష్టంగా విడుదలచేస్తాం. కానీ కొన్ని అంశాలు గుణాత్మకంగానే అంచనా వేయటానికి వీలౌతుంది.
- సిసికెరావు:అంటే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైననూ ఎంపిక ప్రాతిపదికలు కాలేవన్నమాట!
5)ఎంపికకు కేవలం తెవికీలో కృషి మరియు తెవికీకై కృషి మాత్రమే పరిగణనలోకి వస్తుందా? లేదా తెలుగు బాషా అభివృద్ధికి సేవలందించిన సభ్యులందరినీ పరిగణలోకి తీసుకుంటారా? అలా అయితే ఒకట్రెండు దిద్దుబాట్లు మాత్రమే చేసి బయటి ప్రపంచంలో తెలుగు విజ్ఞానానికి కృషిచేస్తున్న వారికి కూడా పురస్కారం ఇవ్వవచ్చా?
- వైజాసత్య: ఈ పురస్కారం యొక్క పరిధి కేవలం వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి వరకే ఉన్నది
- సిసికెరావు:వికీమీడియా అంటే తెలుగు వ్యక్తులు కృషిచేసే తెలుగేతర ప్రాజెక్టులు కూడానా? లేదా కామన్స్ లాంటివేనా?
6)సెప్టెంబరు 2012 లోపే చేరిన సభ్యులను మాత్రమే ఎంపిక ప్రక్రియలో ఎందుకు పరిగణించాలి? ఆ తర్వాత చేరి ఇప్పుడు చురుకుగా ఉంటూ తెవికీలో సేవలందిస్తున్న వారిని విస్మరించడం సమంజసమేనా? 9/2013ను కట్ ఆఫ్ డేట్ గా మారిస్తే మరికొందరి సేవలను గుర్తించినట్లు కాదా?
- వైజాసత్య: విశేష కృషి చేయాలంటే కనీసం ఒక సంవత్సరమైనా పడుతుందని అంచనా. పైగా ఈ మొదటి దాంట్లో పదేళ్ళ కృషిని గుర్తిస్తున్నాం, ఆ తరువాత ప్రతి సంవత్సరం గత రెండేళ్ళ కృషిని గుర్తించి పురస్కారం ఇవ్వాలని ఆలోచన. ఈ సారి కేవలం కట్ ఆఫ్ అనర్హులైన వారికి వచ్చే సంవత్సరం పురస్కారం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
- సిసికెరావు:అంటే ఈ తేది తర్వాత చేరినవాళ్ళకు తదుపరి సంవత్సరాలలో గుర్తింపుకు అవకాశం లభిస్తుందన్నమాట. సరే అలాగే చేయండి.
7)కేవలం 9/2012 లోపు దిద్దుబాట్లు చేసినవారు అన్న ఒక్క అర్హతతో వందలాది సభ్యుల పేర్లు ప్రతిపాదితమైతే ఎంపికమండలికి అనవసర ప్రయాస కాదా? ప్రతిపాదనకు మరిన్ని అర్హతలు అవసరం లేదా? కనీసం ఇన్ని విశేషవ్యాసాలు, ఇంత కాలం నిర్వహణ, ప్రధాన శీర్షికల భాద్యత చేపట్టడం, 100 లేదా 250 దిద్దుబాట్లు చేసి ఉండటం లాంటి మరికొన్ని అర్హతలు చేరిస్తే బాగుండేది. (కనిష్ట 1000, గరిష్ట 2000 అనేది ఇచ్చారు కాని అర్థం కావడం లేదు) ఎంపిక కొలబద్ద అనేది ఒక్కరిపైనే ఆధారపడి ఉంటుందా? దాన్ని ఎవరైనా మార్చవచ్చా? ఒకరు చేసిన కొలబద్దనే ఎంపిక మండలి పరిగణిస్తుందా? కొలబద్దే ఇంకా పూర్తికానిదే ఎంపిక ప్రక్రియ ప్రారంభించవచ్చా?
- వైజాసత్య:కొలబద్దను ఇంకా పూర్తిగా ఖరారు చెయ్యలేదు. ఈ కొలబద్దను రూపొందించడానికి అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటాయి. ముఖ్యంగా మీలాంటి వారి సూచనలు బహుమూల్యం.
- సిసికెరావు:నా సూచనలు మీకు అంగీకారమే కావచ్చు కాని అందరూ ఒప్పుకోరు. అయినా ప్రతిపాదనలు స్వీకరించిన పిదప ప్రతిపాదనలకు అర్హతలు పొందుపర్చడం సరైనది కాదు కదా!
8)గణాంకాలలో నమోదుకాని నిర్వహణ లాంటి పనులు, సలహాలు-సూచనలు తదితరాలు ఈ ప్రక్రియలో ఎలా పరిగణిస్తారు?
- వైజాసత్య: పైన చెప్పినట్టు అన్నీ గణాంకాల్లో అంచనా వెయ్యలేము. ఇక్కడ ఇతర సభ్యుల వ్యాఖ్యలు, ప్రతిపాదనలో ప్రతిపాదితుని వ్యాఖ్యలు చాలా ఉపయోగపడతాయి. అందుకే వీలైనంత పుష్టిగా ప్రతిపాదన తయారుచెయ్యాలి. అలాగే ప్రతిపాదితుని కృషిపై ఎంపిక మండలికున్న అవగాహన కూడా ఉపయోగపడుతుంది.
- సిసికెరావు:ఎంపిక మండలిలో అందరికీ అవగాహన ఉండాలి కదా!
9)కొందరి గణాంకాలు బాగా ఉండవచ్చు కాని అలాంటి దిద్దుబాట్ల వల్ల తెవికీ వ్యాసాలలో ఎంత నాణ్యత పెరిగిందనేది ఎలా తెలుస్తోంది? వాపుకు బలుపుకు తేడా గుర్తించడానికి కొలబద్దలో ఏమైనా ఆధారం ఉందా?
- వైజాసత్య: రెడీమేడ్ గా లభ్యమయ్యే గణాంకాలు కాక ఎంత పరిమాణంలో మార్పులుచేర్పులు చేశారు వంటి గణాంకాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు తోచిన గణాంకాలుంటే సూచనలు చేయగలరు
- సిసికెరావు:ఇదివరకు చర్చలలో తెలిపినట్లుగా కేవలం గణాంకాల కొరకే కృషిచేసే వారికి, బాటుచేసే పనులను కూడా మానవ ప్రయత్నంగా చేయడం తదితరాలు చేసే సభ్యులను, తెవికీ వ్యవస్థనే తప్పుపట్టి వెళ్ళిపోయిన సభ్యులను విస్మరించండి. మరిన్ని తర్వాత చెబుతాను.
10)ఎంపిక అనేది మండలి మెజారిటీ నిర్ణయమా? లేదా అధ్యక్షుడి తుది నిర్ణయమా? అలా కాకుండా ఒక్కో సభ్యుడు రెండేసి సభ్యులను ఎంపికచేస్తారా? ఎలా ఎంపిక చేశారనేది తెలుసుకోవడానికి అందరికీ అవకాశముందా?
- వైజాసత్య: ఎంపిక మెజారిటీ నిర్ణయమే. ఎంపికను వీలైనంతగా పారదర్శంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నాము.
- సిసికెరావు:కొందరు సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేయదలిచే ప్రమాదమైతే లేదుకదా!
11)తెవికీలో ఏది చేసిననూ అంతా బహిర్గతమే. అలాంటప్పుడు ఒక్కో ప్రతిపాదిత సభ్యునికి ఒక పేజీ కేటాయించడం వారి కృషిని వ్రాసుకోమనడం బాగుండదు. విశేషకృషి చేసినవారు తమగురించి వ్రాసుకోవడానికి ఇష్టపడనప్పుడు పురస్కారం పొందే అవకాశం సన్నగిల్లినట్లేనా?
- వైజాసత్య: బహిర్గతమే కానీ ఆ సమాచారం అంతా త్రవ్వితీసి అనుసంధించి బేరీజు వెయ్యాలంటే సులభమైన పనికాదు. తమ గురించి తాము వ్రాసుకోనప్పుడు ఎంపిక మండలి వీలైనంతగా ఆ సభ్యుని కృషిని అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఎవరికి వారు, మరియు ఇతర సభ్యులు ప్రతిపాదనను బలిష్టంగా తయారుచేస్తే సులువుగా ఉంటుంది.
- సిసికెరావు:కాని అందరూ దీనికి ఇష్టపడరు కదా!
12)ఎంపికైన 10 సభ్యులకు ర్యాంకులిస్తారా? లేదా ఒక్కో రంగంలో చేసిన కృషి ప్రకారం ఎంపికచేస్తారా? లేదా ఎంపికైన వారందరినీ సమానంగానే పరిగణిస్తారా?
- వైజాసత్య:ఎంపికైన వారందరినీ సమానంగానే పరిగణిస్తాం
- సిసికెరావు:కానీయండి
13)దశమ వార్షికోత్సవం అనేది కేవలం తెవికికే అయిననూ తెవికీ కాకుండా ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులకు కూడా పరిగణిస్తే ఒక్కో ప్రాజెక్టుకు ఎన్ని పురస్కారాలు కేటాయిస్తారు. రెండు-మూడు ప్రాజెక్టులలో విశేషకృషి చేసిన వారికి ఒకటికి మించి పురస్కారాలు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందా?
- వైజాసత్య: అన్ని ప్రాజెక్టులలో కృషిని సమిష్టిగా పరిగణిస్తాం. పురస్కారాలు ప్రాజెక్టువారిగా కేటాయించబడవు.
- సిసికెరావు:ఒకటికి మించి ప్రాజెక్టులలో కృషిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట
14)పురస్కారాల ఎంపికపై తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఎవరినైనా సంప్రదించే అవకాశం ఉందా? ఎంపిక మండలి నిర్ణయమే తుదినిర్ణయమా? ఎంపిక మండలి సభ్యులకున్న ప్రమాణాలేమిటి అనేది తెలుసుకోవచ్చా?
- వైజాసత్య:ఏ ప్రకియా పరిపూర్ణం కాదు. ఎంపిక మండలి నిర్ణయమే తుది నిర్ణయం. అందుకే ముందస్తుగానే పారదర్శం ఉంటున్నాము.
- సిసికెరావు:అది ముందే స్పష్టం చేయడం మంచిది.
15)ఎంపిక ప్రక్రియపై పలువురికి సందేహాలున్నప్పుడు దీన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా? లేదా ఇలాగే కొనసాగిస్తారా? ఇలా మార్చుకుంటూ వెళితే ప్రక్రియ ఎన్నటికీ పూర్తికాదనే సందేహం ఉందా? సరైన ప్రక్రియ ముందుస్తుగా సిద్ధం కానిదే అలాగే ముందుకు వెళ్ళి తర్వాత వివాదాలు తెచ్చుకోవడం భావ్యమేనా?
- వైజాసత్య: వీలైనంతగా సముదాయాన్ని అద్దం పట్టడానికి ఒకరు, ఇద్దరు సభ్యులు నిర్ణయించకుండా ఐదుగురు సభ్యులతో ఎంపికమండలి ఏర్పడినది. ఎప్పటికప్పుడు చర్చించిన విషయాలను ఇక్కడ వ్రాస్తున్నాం, ప్రక్రియ ప్రారంభించటానికి ముందే సలహాలు సూచనలు ఆహ్వానించాం. మీరు ఎంపిక మండలిలో చేరదలిస్తే మీరు చేరవచ్చును. కాకపోతే మిమ్మిల్ని పురస్కరించే అవకాశం కోల్పోతున్నామన్న బాధ మాత్రం ఉంటుంది.
- సిసికెరావు:నాకు పురస్కారం ప్రధానం కాదండి, పురస్కార ప్రతిపాదనను తిరస్కరించాను కూడా. సరైన కృషిచేసిన వారికి న్యాయం కలిగించడం ముఖ్యం.
16)పది మంది సభ్యులకు కలిపి పురస్కారం ప్రకటించే బదులు ఒక్కో ఏడాదికి ఒక్కో సభ్యుడు చొప్పున ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనేది కూడా ఆలోచించాలి. ఈ ప్రక్రియను తదుపరి సంవత్సరాలలో కూడా కొనసాగించవచ్చు. ఒకే ఏడాదిలో ఒకరికంటే ఒక్కువగా కృషిచేసిన వారుంటే మరికొందరి పేర్లను తదుపరి సంవత్సరాలలో పరిగణించవచ్చు (ఇద్దరికి కలిపి సంయుక్తంగా ఇచ్చిననూ సమస్య ఉండదు). తెవికీ పితామహుడు వెన్న నాగార్జునతో ప్రారంభించి ప్రతి సంవత్సరానికి ఒక్కరి చొప్పున ఎంపిక చేస్తూ చివరికి 2012 సం.పు ఉత్తమ వికీపీడియన్, 2013 సం.పు ఉత్తమ వికీపీడీయన్ అనే పురస్కారం ప్రధానం చేయడం ఉత్తమం. ప్రధాన పురస్కారాలనేవి సంవత్సరాల వారీగానే ఇస్తారనేది మనకందరికీ విదితమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:27, 5 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్య: వచ్చే సంవత్సరం నుండి దాదాపు అలాగే జరుగుతుంది. కొన్నిసంవత్సరాల్లో కృషిచేసినవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల్లో కొత్తగా కృషి లేకపోయిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ మొదటి విడత పురస్కారాలు ఇలాగే కానిస్తే మంచిది. ముందు ముందు ఈ పురస్కారం విజయవంతంగా కొనసాగాలంటే దీని మనం విజయవంతంగా నిర్వాహించగలగాలి.
- సిసికెరావు:గత సంవత్సరాలలో విశేషకృషి చేసి ఇప్పుడు పురస్కారం పొందని వారికి భవిషత్తులో అవకాశం ఉంటుందా?
- చంద్రకాంతరావు చక్కని సందేహాలు లేవనెత్తారు. మీరు ప్రశ్నలకు వాటి వాటి క్రిందే సమాధానమిచ్చాను --వైజాసత్య (చర్చ) 09:35, 5 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారూ, నేను ఎంపికమండలిలో చేరకపోవడం పురస్కారం పొందే అవకాశం కోసం కాదండి. ఇప్పుడు చేరిననూ "పురస్కరించే అవకాశం కోల్పోతున్నామన్న బాధ" మీకు మాత్రమే ఉండవచ్చు కాని అందరికీ ఉండకపోవచ్చు. పోటీ ద్వారా పురస్కారం పొందాలని నాకు లేదు కాబట్టి విరమించుకుంటున్నాను. మనం కోరుకునేది గుర్తింపు మాత్రమే కాని పురస్కారాలు, బహుమతులు కావు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి, సరైన కృషి చేసినవారికి మాత్రమే ఎన్నిక చేయండి చాలు. ఎంపికమండలి బదులు మీరొక్కరే ఎన్నికచేస్తే చాలు, ఎందుకంటే మొదటి నుంచీ అందరినీ గమనిస్తున్నది మీరొక్కరే. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:59, 5 డిసెంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావుగారు ! మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీ లాంటి సమర్ధులు ఎంపిక మండలో ఉండాలని నేను అనుకున్నాను. నిజానికి ఈ పురస్కార ప్రతిపాదనలకు ఎంపిక మండలికీ దూరంగా ఉండాలని అనుకున్నాను. మీలాంటి వారి అంగీకారం లభించని కారణంగా నాలాంటి వారు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు అంగీకరిస్తే నావరకు నేను ఎంపికమండలి నుండి వైతొలగిపోతాను. నేను ఎప్పటిలా నా పని నేను చేసుకు పోతాను. --t.sujatha (చర్చ) 13:28, 5 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్య: మిగిలిన వాటిని కూడా సావధానంగా సమాధానం వ్రాస్తాను. కానీ ఇది ముఖ్యమైనదనిపించి ముందుగా జవాబిస్తున్నాను. అర్హులైన వారు ఎంపికయ్యేలా చేయగలిగే శక్తి సమాజం చేతుల్లోనే (అంటే మీ చేతుల్లోనూ) ఉంది. అర్హులైన వారిని ప్రతిపాదిస్తే కదా వాళ్ళు ఎంపికయ్యేది. ప్రతిపాదన తిరస్కరించటం మీ వ్యక్తిగతం, నేను అంతకు మించి మిమ్మల్ని ఒత్తిడి పెట్టలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను చంద్రకాంతుల వారు వేటినీ ఆశించరు అనేది తెలుగు వికీలో అందరికీ విదితమే, "కేవలం పురస్కారం కోసం ఎంపిక సంఘంలో చేరలేదు అని అనుకుంటున్నారు" అని భావించటం మీ స్వకపోలకల్పితం. కాబట్టి చివరగా నేనర్ధించేదేమిటంటే అర్హులైన వారిని ప్రతిపాదించి, వాళ్ళ ప్రతిపాదనలు పరిపుష్టం చేసి, నిజంగా అర్హులైన వారికి పురస్కారం అందేట్టు కృషిచేస్తారని ఆశిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 17:45, 5 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్యగారూ ! చంద్రకాంత రావుగారూ ఎదీ ఆశించరు అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎంపిక సంఘంలో ఉండడానికి నాకు అర్హత గురించి నేను ఆలోచించాను. నా పేరు పురస్కారానికి ప్రతిపాదించడానికి నేను దూరంగా ఉండాలని భావించాను. ఏదైనా పొరపాటుగా ధ్వనిస్తే మన్నించండి. --t.sujatha (చర్చ) 18:05, 5 డిసెంబర్ 2013 (UTC)
- అసలు ఎంపిక ప్రక్రియే నాకు నచ్చనప్పుడు ప్రతిపాదించడం, ప్రతిపాదనలు పరిపుష్టం చేయడం లాంటివి చేయరాదనుకుంటున్నాను. మరి ప్రక్రియ గురించి ముందే ఎందుకు సూచనలు చేయలేయపొయాననే దానికి చెప్పాలంటే ఇదివరకు అనేక సార్లు నేనిచ్చిన సూచనలు కొందరు సభ్యులు చెత్తబుట్టిలో వేసిన సంగతి మీకు తెలుసుకదా! సరైనవిధంగా చేస్తారనే వేచిచూశాను కాని సరైన ప్రణాళిక లేనిదే ప్రక్రియ ముందుకు వెళుతోంది. దీన్ని చూస్తూ ఉండలేకనే ఈ చర్చతీశాను. తెవికీలో ఉంటూ, తెవికీకై కృషిచేసినవారిని గుర్తించడం మీ లాంటి వారికి ఇదేమంత కష్టసాధ్యమైన పనికాదు. దీనికై ఇంత ప్రక్రియ అవసరమా? అని ఆలొచించాల్సిందే. పేరును ప్రతిపాదించడం, అంగీకారం తీసుకోవడం, సమర్థనలు, గణాంకాలు పరిశీలించడం, గణాంకాలలో చేరని కృషిని బేరీజు వేయడం, .... ఇదో పెద్ద ప్రయాస. ఇలా ఎన్నింటినీ పరిశీలించిననూ సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. ఎంపిక మండలిలో తెవికీకి చెందని వారు ఉన్నప్పుడు పరిశీలించడానికి ఇలాంటి ప్రక్రియ ఉపయోగపడవచ్చేమో లేదా ఆంగ్లవికీలాగా పెద్ద సముహాలలో అందరి కృషిని గమనించే వీలు లేనప్పుడు ఇలాంటి ప్రక్రియ రూపొందించారేమో కాని మనలాంటి చిన్న సముహానికి ఇది అవసరమా? కేవలం పదే పది నిమిషాలలో నేను పదిమంది జాబితా ఇచ్చేయగలను. ఇన్నేళ్ళు తెవికీని బాగా గమనిస్తున్న మీరు ఈ పని చేయలేరని నేను అనుకోవడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:05, 5 డిసెంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావు చక్కని సందేహాలు లేవనెత్తారు. మీరు ప్రశ్నలకు వాటి వాటి క్రిందే సమాధానమిచ్చాను --వైజాసత్య (చర్చ) 09:35, 5 డిసెంబర్ 2013 (UTC)
- సిసికెరావు:గత సంవత్సరాలలో విశేషకృషి చేసి ఇప్పుడు పురస్కారం పొందని వారికి భవిషత్తులో అవకాశం ఉంటుందా?
అబ్బ !! ఏమి సంభాషణ !!! మొత్తం సందేహాలన్నీ పటాపంచలు, అందుకేనండి, మాకు (తెలుగు వికీపీడియన్లకు) వైజాసత్య, చంద్రకాంతరావు గార్లంటే, వెర్రి అభిమానం. ఇద్దరికీ అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:13, 5 డిసెంబర్ 2013 (UTC)
- వాదనల వలన పూర్తిగా మార్పులు సాద్యం కాదని నా అభిప్రాయం. అలాగని ఇపుడున్న దానిని మొత్తంగానూ మార్చలేము. చంద్రకాంతరావు గారి అభిప్రాయాలలో చాలా వరకూ అమలు కావాలంటే ఆయన స్వయంగా ఎంపిక కమిటీలో దూకి కమిటీలో సభ్యులను కలుపుకొని చర్చల ద్వారా మార్పులు ప్రతిపాదించాలి. దానికి చంద్రకాంతరావు గారు సుముఖమేనా?.ఎంపిక కమిటీలో కొందరి సభ్యుల అవగాహనపై అనుమానాలు ఉన్నపుడు ఆయన కమిటీలో సభ్యునిగా ఉండి తీరాలి. ఇపుడైనా సమయం మించిపోలేదు కనుక చంద్రకాంతరావు గారు కమిటీలో సభ్యునిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను....విశ్వనాధ్ (చర్చ) 05:31, 6 డిసెంబర్ 2013 (UTC)
- మీరునట్టు నేను స్వయంగా ఆ పదిమందిని నిర్ణయించవచ్చు. కానీ అన్నీ మొదటినుంచి చూసిన / తెలిసిన సభ్యులు ఎల్లకాలం ఉండలేరు కదండి. తెవికీ ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల స్థాయి నుండి వేగంగా పెద్ద సమాజంగా మారే క్రమంలో ఇవి పురిటినొప్పులు మాత్రమే. అందరికీ అన్ని నచ్చవలసిన అవసరం లేదు. అలా జరగదు కూడా. సముదాయం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది నచ్చకపోయినా, దాని స్ఫూర్తి గ్రహించి కట్టుబటి ఉండటం మంచి సముదాయపు సభ్యుల లక్షణం అని నేననుకుంటాను. చర్చలు, వాదోపవాదాలు లేవనెత్తకూడదని కాదు.. after all the arguments and counters, when everything is said and done సముదాయపు నిర్ణయాన్ని శిరసావహించాలి. "వికిపీడియా" ను "వికీపీడియా"కు మార్చటం నాకు నచ్చలేదు, అంతదాకా ఎందుకు ఉపాధి వ్యాసాలపై పోటీ నాకు నచ్చలేదు, కానీ దాని ఉద్దేశం, స్ఫూర్తి అర్ధమైంది కాబట్టి దానికి నేను అభ్యంతర పెట్టలేదు. ఇంకా ఉంది...
- 1) సముదాయపు నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను కాని ఒకరిద్దరి నిర్ణయాన్ని సముదాయపు నిర్ణయంగా నేను భావించలేను.
2) అయిననూ ఈ ప్రక్రియను నేను వ్యతిరేకించడం లేదు కేవలం సందేహాలు మాత్రమే వెలిబుచ్చాను, ఈ విషయం ప్రారంభంలోనే స్పష్టంగా పేర్కొన్నాను.
3) స్థూలంగా చెప్పాలంటే నాకు సందేహాలున్నది రెండు అంశాలపైనే. ఒకటి ఎంపిక ప్రక్రియ, రెండవది ఎంపిక మండలి.
4) ఈ ప్రక్రియలోనే చూడండి, ఇప్పటివరకూ అంగీకారం తెలపని ప్రతిపాదనలు పరిగణించాలా? వద్దా? లేకుంటే విలువైన సభ్యులను కోల్పోయినట్లు కాదా?
5) పురస్కారం రాకున్ననూ పెద్దగా పట్టించుకోరు కాని ముందస్తుగా అంగీకారం తెలిపి ఆ తర్వాత రానప్పుడు మాత్రం నిరాశకు లోనవడం సహజమే.
6) ఈ ప్రక్రియను వీలుంటే సరిచేయడానికి కొంతవరకైనా నా సందేహాలు ఉపయోగపడతాయని, అదే సమయంలో సభ్యుల దృష్టికి తేవడానికి దోహదపడుతుందని తెలిపాను, కాని నేను సముదాయపు నిర్ణయాన్నే వ్యతిరేకించినట్లు ముద్రవేసి చెడ్డ లక్షణంగా పరిగణించడం భావ్యం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:00, 6 డిసెంబర్ 2013 (UTC)
- 1) సముదాయపు నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను కాని ఒకరిద్దరి నిర్ణయాన్ని సముదాయపు నిర్ణయంగా నేను భావించలేను.
- మీరునట్టు నేను స్వయంగా ఆ పదిమందిని నిర్ణయించవచ్చు. కానీ అన్నీ మొదటినుంచి చూసిన / తెలిసిన సభ్యులు ఎల్లకాలం ఉండలేరు కదండి. తెవికీ ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల స్థాయి నుండి వేగంగా పెద్ద సమాజంగా మారే క్రమంలో ఇవి పురిటినొప్పులు మాత్రమే. అందరికీ అన్ని నచ్చవలసిన అవసరం లేదు. అలా జరగదు కూడా. సముదాయం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది నచ్చకపోయినా, దాని స్ఫూర్తి గ్రహించి కట్టుబటి ఉండటం మంచి సముదాయపు సభ్యుల లక్షణం అని నేననుకుంటాను. చర్చలు, వాదోపవాదాలు లేవనెత్తకూడదని కాదు.. after all the arguments and counters, when everything is said and done సముదాయపు నిర్ణయాన్ని శిరసావహించాలి. "వికిపీడియా" ను "వికీపీడియా"కు మార్చటం నాకు నచ్చలేదు, అంతదాకా ఎందుకు ఉపాధి వ్యాసాలపై పోటీ నాకు నచ్చలేదు, కానీ దాని ఉద్దేశం, స్ఫూర్తి అర్ధమైంది కాబట్టి దానికి నేను అభ్యంతర పెట్టలేదు. ఇంకా ఉంది...
- తెవికీ ప్రపంచాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సూర్య, చంద్రుల చర్చలు విశేష కృషి చేసిన వారి ఎంపికను సులభతరం చేయవచ్చు. YVSREDDY (చర్చ) 03:05, 7 డిసెంబర్ 2013 (UTC)
- పైన సశేషం అన్న తర్వాత నేను వ్రాయాలనుకున్నది ఇది - 15వ పాయింటులో చంద్రకాంతరావు గారు వ్యక్తపరచిన ఉద్దేశం "సరైన కృషిచేసిన వారికి న్యాయం కలిగించడం". ఈ ఉద్దేశాన్ని తమంతటతామే రెండు విధాల గండికొట్టారు. ఒకటి, ఆయన ప్రతిపాదనను తిరస్కరించి, రెండు, ఇతరుల ప్రతిపాదించను మరియు ప్రతిపాదనలకు మద్దతు చేకూర్చను అని.
- ఇక నేనిది పూర్తి చేయకముందే ప్రతిస్పందించిన మిగిలిన విషయాల గూర్చి. ఏకకాలంలో పట్టుమని 20-30 మంది కూడా క్రియాశీలకంగా లేని సమాజంలో ఎంపిక సంఘంలో ఐదుగురు సభ్యులున్నారు. అది ఒకరిద్దరి అభిప్రాయం అని తీసివేయటం సమంజసం కాదు. వాళ్ళందరూ మీలాగే స్వచ్ఛందగా, వికీకి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విశేష సహాయం చేసినవారే, వారి నిబద్ధతను ప్రశ్నించడం సమంజసం కాదు. ఎంపిక మండలి వికీలోనే, వికీ పద్ధతిలోనే ప్రారంభమైంది, ఇక్కడ తెలియకుండా చర్చలు చేసి ఏర్పడినది కాదు. అంగీకారం తెలిపి రాకుంటే నిరుత్సాహపడతారు అన్నారు, మీ ఇబ్బందిని నేను అవగాహన చేసుకున్నాను, కానీ మీరు అవతలి కోణాన్ని చూడట్లేదు - తీరా ఎంపికచేసిన తర్వాత తిరస్కరిస్తే, అనవసరంగా ఒక పురస్కారం వృధా అవుతుంది, అదే మరో వికీకృషీవలుని గుర్తించేందుకు ఉపయోగపడేది. లేదా ఆ తర్వాత మళ్ళీ తర్జనభర్జనలు చేయవలసి వస్తుంది. మీలాంటి వారికి పురస్కారం అవసరం లేకపోవచ్చు. ఈ ప్రక్రియను వచ్చే సంవత్సరం మరింత మెరుగుపరచవచ్చు. ఎంపికమండలిలో చేరే అవకాశం అందరికీ ఉన్నది. కానీ అది రూపుదిద్దుకుంటున్న సమయంలో మీరు ముందుకురాలేదు. కేవలం ప్రక్రియ నచ్చలేదు అని, సమాజంతో పాటు, మీరు కూడా కోరుకున్న "సరైన కృషీవలులను గుర్తించి, పురస్కరించటం" అన్న స్ఫూర్తిని పక్కకు నెట్టారు. ప్రక్రియ ఏదైనా, ఎంపిక మండలి ఎవరైనా, మీరు క్రియాశీలకంగా పాల్గొంటే ఆ లక్ష్యాన్ని చేరేవారు. ఈ చర్చలో నేను చెప్పదలచుకొన్నది ముగిసింది. ఇప్పటి దాకా నేను వ్యక్తపరిచిన భావాలు నేను ఎంపిక మండలితో ప్రమేయం లేకుండా నేను వ్రాసాను. ఎంపికమండలి, ప్రక్రియపై ఉన్న సందేహాలను మరింతగా వివరిస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదలచేస్తుంది. --వైజాసత్య (చర్చ) 08:57, 7 డిసెంబర్ 2013 (UTC)
- పైన సశేషం అన్న తర్వాత నేను వ్రాయాలనుకున్నది ఇది - 15వ పాయింటులో చంద్రకాంతరావు గారు వ్యక్తపరచిన ఉద్దేశం "సరైన కృషిచేసిన వారికి న్యాయం కలిగించడం". ఈ ఉద్దేశాన్ని తమంతటతామే రెండు విధాల గండికొట్టారు. ఒకటి, ఆయన ప్రతిపాదనను తిరస్కరించి, రెండు, ఇతరుల ప్రతిపాదించను మరియు ప్రతిపాదనలకు మద్దతు చేకూర్చను అని.
- సత్యగారి సూచనలూ సబబే. దాదాపు అన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి. విశ్వనాథ్ గారన్నట్టు వాదనలు పూర్తిస్థాయి మార్పులను తీసుకు రాలేవు. కానీ చంద్రకాంతరావు గారు లేవనెత్తిన సందేహాల వలన, అనేక సందేహాలు దూరమయ్యాయి. సందేహాల గూర్చి చర్చలు సమాప్తి చేద్దాం. మిగతా కార్యక్రమాల పట్ల దృష్టి సారిద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 10:05, 7 డిసెంబర్ 2013 (UTC)
- 1) నేను పురస్కార ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించవలసి వచ్చిందో మీకు తెలుసు. ప్రారంభంలో కేవలం ఆమోదానికి మాత్రమే (అంటే సంతకం చేయడానికి) ఒప్పుకోలేను. అదే విషయం స్పష్టం చేస్తూ నా ప్రతిపాదిత (పురస్కార) పేజీ పైన బాక్సు పెట్టి ఈ విధంగా వ్రాశాను "పురస్కారం పొందడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని పోటీపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిపాదనకు సమ్మతి తెలపడం లేదని చెప్పదలుచుకున్నాను" (అంటే ప్రతిపాదనను తిరస్కరించినట్టు కాదుకదా). ఆ వెంటనే అర్జునరావు గారు పేజీలో వర్గం మార్పు చేసి తిరస్కరణ వర్గంలో చేర్చారు. అయిననూ నేను మళ్ళీ వర్గాన్ని మార్చి మామూలు వర్గంలో చేర్చాను. అంటే ఎంపిక మండలి కార్యదర్శే స్వయంగా తిరస్కరణకు (వర్గంలో పెట్టడం వల్ల !) గురిచేసిననూ నేను మార్చుకున్నానన్న సంగతి గుర్తించండి చాలు. ఆ తర్వాత నా సందేహాలకు మీరు సమాధానం ఇస్తూ 15వ పాయింటులో "ఎంపిక మండలిలో చేరదలిస్తే మీరు చేరవచ్చును. కాకపోతే మిమ్మిల్ని పురస్కరించే అవకాశం కోల్పోతున్నామన్న బాధ మాత్రం ఉంటుంది" అని వ్రాయడంతో పురస్కారం పొందే అవకాశం కోసమే ఎంపిక మండలిలో చేరలేదనే సందేశం పరోక్షంగా తెవికీ సమాజానికి అందింది (అని నేను భావించాను). ఆ కారణంతోనే నేను ప్రతిపాదన పేజీలో మళ్ళీ వర్గాన్ని మార్చాను. అయిననూ అది ప్రతిపాదనను మాత్రమే తిరస్కరించినట్లు. బాక్సులోని విషయాన్ని మాత్రం మార్చలేనని గమనించండి.
2) "ప్రతిపాదించను మరియు ప్రతిపాదనలకు మద్దతు చేకూర్చను" అనడం ఎందుకో కూడా మీకు ఇదివరకే తెలిపాను. అంతే కాకుండా ఎంపికలో సభ్యుల ప్రమేయం అవసరమేనా? అనే సందేహం కూడా 3వ పాయింటులోనే తెలిపాను. మరో కారణమేమిటంటే ఇలా చేయడం వల్ల నాకు అనుకూలమైన సభ్యుల గురించి సిఫార్సు చేసినట్లు ఇతరులు భావించకుండా కూడా (వాస్తవానికి ఇక్కడ ఎవరూ మరొకరికి అనుకూలం కాదు కాని అలాంటి భావన కూడా రాకుండ జాగ్రత్త కొరకే).
3) ఎంపిక సంఘంలో ఉన్నవారు నిపుణులే, కాదనను. ఆ మాటకొస్తే తెవికీలో కృషిచేసే ప్రతీవారు నిపుణులే. ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో నిపుణత కలిగిన వారే. ఒకరికి భాషపై, మరొకరికి విజ్ఞానంపై, ఇంకొకరికి సాంకేతిక విషయాలపై, ఇంకనూ బొమ్మలపై, నిర్వహణపై, శీర్షికలపై ఇలా పట్టు ఉంది/ఉంటుంది. కాకుంటే తొలిసారిగా పదేళ్ళలో జరిగిన సభ్యుల కృషిని పరిగణించేటప్పుడు, పలు ఉద్ధండులు రంగంలో ఉన్నప్పుడు, పలుపలు రకాలుగా విశేష సేవలందించి కృషి చేసిన వారిని గుర్తించేందుకు, పలు కోణాల నుంచి విశ్లేషించేందుకు, కేవలం గణాంకాలపై కాకుండా సమగ్ర కృషిని బేరీజు వేసేందుకు, అందులోనూ మెజారిటీ నిర్ణయమని అన్నప్పుడు, ....
4) "ఎంపికచేసిన తర్వాత తిరస్కరిస్తే, అనవసరంగా ఒక పురస్కారం వృధా అవుతుంది" అంటున్నారు. ఆ మాట వద్దండీ. సభ్యుల కృషికే పురస్కార ప్రకటన ఉండాలి, కాని వారు స్వీకరిస్తారా లేదా అని ముందే ఆలోచించడం బాగుండదు. వారు తిరస్కరించిననూ ఆ పురస్కారం వృధా అయినట్లు ఎందుకు అనుకోవాలి? నోబెల్ బహుమతి, భారతరత్న లాంటి పురస్కారాలు కూడా తిరస్కరణకు గురి అయ్యాయి, అంతమాత్రాన దానికీ ముందస్తు అంగీకారం ఉండదు. కేవలం వారిసేవలకు "కృషి" మాత్రమే పరిగణించి ప్రకటిస్తారు. ఒకరు తిరస్కరించిననూ వారి బదులు మరొకరిని ఎంపిక చేసే అవసరం కూడా లేదనుకుంటున్నాను. పదిగురి సేవలను "గుర్తించి" పురస్కారం ప్రకటించడమే మన భాద్యత, స్వీకరించడం/స్వీకరించకపోవడం సభ్యుల ఇష్టానిష్టాలు. స్వీకరించే ఇష్టమున్న సభ్యులకు పురస్కార ప్రధానం రోజు స్వీకరించడానికి వీలుకాకపోవచ్చు కూడా, లేదా తమ తరఫున మరెవరైనా పంపవచ్చు, అది తర్వాతి సంగతి.
5) ఎంపిక మండలిలో చేరకపోవడమే కాకుండా పలు ముఖ్య సమావేశాలకు, వెబ్‌సమావేశాలకు కూడా నేను హాజరు కావడం లేదు. అది ఎందుకో మీకు మళ్ళీ చెప్పదలుచుకోలేను.
6) నేను నా "ప్రతిపాదనను" తిరస్కరించిననూ, ప్రతిపాదిత సభ్యులను "గుర్తించ"కపోయిననూ స్ఫూర్తిని పక్కకు నెట్టినట్లు భావించకండి. ఇప్పటికే దాదాపు అందరి పేర్లు (దేవా లాంటి సభ్యులు మినహా) ప్రతిపాదించబడ్డాయి. గుర్తించడం అనేది ఎంపిక మండలి భాధ్యత కదా! నా భావాలు వెల్లడించాను. ఈ చర్చ అనుకున్నదాని కంటే చాలా పొడవైంది. ప్రతిపాదిత ప్రక్రియ చాలా ఉన్నట్లుంది, కాబట్టి త్వరగా చేపట్టండి. ధన్యవాదాలతో సి. చంద్ర కాంత రావు- చర్చ 11:51, 7 డిసెంబర్ 2013 (UTC)- సభ్యుడు:C.Chandra Kanth Raoగారికి, ఎంపికమండలి కార్యదర్శిగా వచ్చిన ప్రతిపాదనలు క్రమబద్దంచేసేకృషిలో మీ సమ్మతి తెలపనని ప్రతిపాదన పేజీలోనే రాయడాన్ని ప్రతిపాదనను తిరస్కరించడంగా నేను అర్ధం చేసుకొన్నాను. అది మీకు వేరే అర్ధంలో ధ్వనించివుంటే క్షమాపణలు. ఆతర్వాత మీరు మీరు పాత వర్గాన్ని చేర్చినందులకు సంతోషించాను. అప్పటికే మీ కొరకై కొత్త ప్రతిపాదన కూడా వచ్చిందన్న సంగతి తెలిసినదే. ఇప్పటివరకు చెయ్యని వినూత్న ప్రక్రియకు మీ నిర్ణయాన్ని మరల సమీక్షించుకొని సహకరిస్తారని ఈ క్రమంలో ఏదైనా చిన్న తప్పులు దొర్లితే పెద్దమనసుతో క్షమించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:12, 7 డిసెంబర్ 2013 (UTC)
- క్షమాపణలు వద్దండీ, అది మీ తప్పు కాదు. మీరు తిరస్కరించారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు కాని పొరపాటున తిరస్కరణ వర్గంలో చేర్చిననూ నేను మళ్ళీ మామూలు వర్గంలో చేర్చాను అని చెప్పడం కోసమే జరిగిన ప్రక్రియను తెలిపాను. ఉద్దేశ్యపూర్వకంగా మీరు నన్నేమీ తిరస్కరించలేరు కదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 12:27, 7 డిసెంబర్ 2013 (UTC)
- కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం ప్రశ్నలుకు ఎంపిక మండలి సమాధానాలు ఇక్కడ చూడవచ్చు --వైజాసత్య (చర్చ) 09:47, 9 డిసెంబర్ 2013 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Raoగారికి, ఎంపికమండలి కార్యదర్శిగా వచ్చిన ప్రతిపాదనలు క్రమబద్దంచేసేకృషిలో మీ సమ్మతి తెలపనని ప్రతిపాదన పేజీలోనే రాయడాన్ని ప్రతిపాదనను తిరస్కరించడంగా నేను అర్ధం చేసుకొన్నాను. అది మీకు వేరే అర్ధంలో ధ్వనించివుంటే క్షమాపణలు. ఆతర్వాత మీరు మీరు పాత వర్గాన్ని చేర్చినందులకు సంతోషించాను. అప్పటికే మీ కొరకై కొత్త ప్రతిపాదన కూడా వచ్చిందన్న సంగతి తెలిసినదే. ఇప్పటివరకు చెయ్యని వినూత్న ప్రక్రియకు మీ నిర్ణయాన్ని మరల సమీక్షించుకొని సహకరిస్తారని ఈ క్రమంలో ఏదైనా చిన్న తప్పులు దొర్లితే పెద్దమనసుతో క్షమించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:12, 7 డిసెంబర్ 2013 (UTC)
- 1) నేను పురస్కార ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించవలసి వచ్చిందో మీకు తెలుసు. ప్రారంభంలో కేవలం ఆమోదానికి మాత్రమే (అంటే సంతకం చేయడానికి) ఒప్పుకోలేను. అదే విషయం స్పష్టం చేస్తూ నా ప్రతిపాదిత (పురస్కార) పేజీ పైన బాక్సు పెట్టి ఈ విధంగా వ్రాశాను "పురస్కారం పొందడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని పోటీపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతిపాదనకు సమ్మతి తెలపడం లేదని చెప్పదలుచుకున్నాను" (అంటే ప్రతిపాదనను తిరస్కరించినట్టు కాదుకదా). ఆ వెంటనే అర్జునరావు గారు పేజీలో వర్గం మార్పు చేసి తిరస్కరణ వర్గంలో చేర్చారు. అయిననూ నేను మళ్ళీ వర్గాన్ని మార్చి మామూలు వర్గంలో చేర్చాను. అంటే ఎంపిక మండలి కార్యదర్శే స్వయంగా తిరస్కరణకు (వర్గంలో పెట్టడం వల్ల !) గురిచేసిననూ నేను మార్చుకున్నానన్న సంగతి గుర్తించండి చాలు. ఆ తర్వాత నా సందేహాలకు మీరు సమాధానం ఇస్తూ 15వ పాయింటులో "ఎంపిక మండలిలో చేరదలిస్తే మీరు చేరవచ్చును. కాకపోతే మిమ్మిల్ని పురస్కరించే అవకాశం కోల్పోతున్నామన్న బాధ మాత్రం ఉంటుంది" అని వ్రాయడంతో పురస్కారం పొందే అవకాశం కోసమే ఎంపిక మండలిలో చేరలేదనే సందేశం పరోక్షంగా తెవికీ సమాజానికి అందింది (అని నేను భావించాను). ఆ కారణంతోనే నేను ప్రతిపాదన పేజీలో మళ్ళీ వర్గాన్ని మార్చాను. అయిననూ అది ప్రతిపాదనను మాత్రమే తిరస్కరించినట్లు. బాక్సులోని విషయాన్ని మాత్రం మార్చలేనని గమనించండి.
వికీపీడియా:వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక)- 2వచిత్తుప్రతి అనువాదమునకు సహాయం
[మార్చు]వికీపీడియా:వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక)- 2వచిత్తుప్రతి చూసి అనువాదం చేయుటకు సహకరించమని మనవి. ఈ పాఠము చివరిది కాదు కనుక స్వల్ప మార్పులు వుండవచ్చు. మూలప్రతి చర్చాపేజీలో మీ స్పందనలు తెలుపవచ్చు. దీని నేపథ్యానికి #తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక చూడండి--అర్జున (చర్చ) 15:21, 5 డిసెంబర్ 2013 (UTC)
- అనువాదం పూర్తి అయింది. ఇక పరిశీలించి మిగిలిన పనులు కొనసాగించ వచ్చు. --t.sujatha (చర్చ) 17:54, 10 డిసెంబర్ 2013 (UTC)
- t.sujatha , అహ్మద్ నిసార్ లకు ధన్యవాదాలు. ఇక దీనిని శుద్ధి చేయటం, కొత్త రూపంతో సరిచేయడం, తెలుగు వికీపీడియా సంబంధించి పేజీలను, ఛాయా చిత్రాలను ఖరారు చేయాలి. కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారం ప్రకటించిన పిదప పురస్కార గ్రహీతల బొమ్మలు వాడదామనుకున్నా, పురస్కారం ప్రకటన ఒక వారం ఆలస్యం అవటం మరియు ఈ పుస్తకం ఈ నెలలోపులో ముద్రితమై, ముద్రాపకుడికి చెల్లింపుకూడా చేయాలని రహ్మానుద్దీన్ ద్వారా తెలిసింది. కనుక ఈ పనులకు సహాయం, సూచనలు చేయండి. --అర్జున (చర్చ) 10:13, 11 డిసెంబర్ 2013 (UTC)
- ఛాయాచిత్రానికి ఇప్పటికే వచ్చిన వాడుకరి:JVRKPRASAD,వాడుకరి:విశ్వనాధ్.బి.కె., వాడుకరి:వైజాసత్య ప్రతిపాదనలను పుస్తకం పేజీలో చేర్చాను. ఇంకా ఎవరైన తమ పేర్లను ఛాయాచిత్రాలను చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 10:34, 11 డిసెంబర్ 2013 (UTC)
మోడల్ గ్రామ వ్యాసం
[మార్చు]మన తెవికీలో ఏదైనా ఒక మోడల్ గ్రామ వ్యాసం ఉంటే తెలుపగలరు. నేను చూసినంతలో ఒక చక్కని గ్రామ వ్యాసం కానరాలేదు. తెలుగు వికీ శిక్షణ శిబిరాలలో కొత్త సభ్యులు వారి గ్రామ వ్యాసాలను విస్తరించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఒక ప్రామాణిక మోడల్ వ్యాసాన్ని చూపగలిగితే ఉపయుక్తంగా ఉంటుందని. మీ సూచనలకు ధన్యవాదాలు. --విష్ణు (చర్చ)
- నేను అనుకున్న విధంగా "ఆదర్శ గ్రామవ్యాసం" ఇక్కడ ఉందో లేదో కాని అలాంటి వ్యాసాన్ని తయారుచేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. ఈ గ్రామవ్యాసంలో ప్రతి రంగం నుంచి తగినంత సమాచారం ఉండేట్టుగానే కాకుండా, బొమ్మలు, లింకులు, మూలాలు తదితరాలు కూడా ఉండేట్టు చూస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:31, 9 డిసెంబర్ 2013 (UTC)
- చేమూరు, ముచ్చివోలు వ్యాసాలు చూడండి. ఇలా ఇంకా కొన్ని అక్కడక్కడా ఉన్నాయి --వైజాసత్య (చర్చ) 08:22, 10 డిసెంబర్ 2013 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, వైజాసత్య గారు ధన్యవాదాలు --విష్ణు (చర్చ)16:28, 10 డిసెంబర్ 2013 (UTC)
- ఆదర్శ గ్రామవ్యాసం కోసం నేను భూత్పూర్ గ్రామాన్ని ఎంపిక చేసి వ్యాసం కూడా ప్రారంభించాను. ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ నుంచి కేవలం 8 కిమీ దూరంలోనే ఉండుటయే కాకుండా జాతీయ రహదారిపై ఉండుటచే ఉత్తర-దక్షిణాలుగా ప్రయాణించే వారికి ఇది చిరపరిచితమే. బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వెళ్ళేటప్పుడు జడ్చర్ల కంటె కొద్దిగా ముందుగా వచ్చే ఈ గ్రామం ఎంతో చారిత్రక పాశస్త్యం కలిగియుంది. ప్రాచీన దేవాలయ సంపదతో పాటు ఎన్నో శాసనాధారాలు కల ఈ గ్రామం ప్రాచీన రాజధానిగా వర్థిల్లిన వర్థమానపురానికి కూడా సమీపంలో ఉంది. ఈ గ్రామంపై కొద్దిగా పరిశోధన చేసి సమాచారం వెలికితీసి, ఇదివరకే ఉన్న సమాచారం కూడా చేర్చి ఆదర్శ గ్రామవ్యాసంగా చేయడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:49, 10 డిసెంబర్ 2013 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు భూత్పూరు గ్రామ వ్యాసాన్ని ఒక మేటైన శిల్పం చెక్కినట్లు, చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నందులకు అనేకానేక ధన్యవాదాలు. --విష్ణు (చర్చ)07:04, 13 డిసెంబర్ 2013 (UTC)
- విష్ణుగారికి కృతజ్ఞతలు. ఈ వ్యాసాన్ని ఇంకనూ చాలా విస్తరించవలసి ఉంది. సుమారు 6 మాసాల క్రితమే నా బ్లాగులో వ్రాయడం కొరకు సమాచార సేకరణకై, బొమ్మలకై గ్రామం మొత్తం పరిశోధించాను. ఈ వ్యాసం కొరకు మరి కొన్నిసార్లు గ్రామాన్ని అధ్యయనం చేసి, ఆధారాలు సేకరించి వ్యాస విస్తరణ చేయగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:41, 13 డిసెంబర్ 2013 (UTC)
- ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ వ్యాసంగా, గద్వాలను ఉత్తమ మండల వ్యాసంగా, మహబూబ్ నగర్ ను ఉత్తమ జిల్లా వ్యాసంగా, అలాగే ఉత్తమ నియోజకవర్గ వ్యాసం, ఉత్తమ వ్యక్తి వ్యాసం, ఉత్తమ దేవాలయ వ్యాసం, ఉత్తమ రాష్ట్ర వ్యాసం (కొత్త రాష్ట్రంగా అవతరించనున్న తెలంగాణ), ఉత్తమ కోట వ్యాసం ... ఇలా తయారుచేయడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:47, 13 డిసెంబర్ 2013 (UTC)
- సూపర్ లైక్ సి. చంద్ర కాంత రావు గారు. తెవికీ ఫేస్‌బుక్‌లో గుంపులో ఈ వ్యాసం పెట్టాను చూడండి --విష్ణు (చర్చ)06:21, 15 డిసెంబర్ 2013 (UTC)
- ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ వ్యాసంగా, గద్వాలను ఉత్తమ మండల వ్యాసంగా, మహబూబ్ నగర్ ను ఉత్తమ జిల్లా వ్యాసంగా, అలాగే ఉత్తమ నియోజకవర్గ వ్యాసం, ఉత్తమ వ్యక్తి వ్యాసం, ఉత్తమ దేవాలయ వ్యాసం, ఉత్తమ రాష్ట్ర వ్యాసం (కొత్త రాష్ట్రంగా అవతరించనున్న తెలంగాణ), ఉత్తమ కోట వ్యాసం ... ఇలా తయారుచేయడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:47, 13 డిసెంబర్ 2013 (UTC)
- విష్ణుగారికి కృతజ్ఞతలు. ఈ వ్యాసాన్ని ఇంకనూ చాలా విస్తరించవలసి ఉంది. సుమారు 6 మాసాల క్రితమే నా బ్లాగులో వ్రాయడం కొరకు సమాచార సేకరణకై, బొమ్మలకై గ్రామం మొత్తం పరిశోధించాను. ఈ వ్యాసం కొరకు మరి కొన్నిసార్లు గ్రామాన్ని అధ్యయనం చేసి, ఆధారాలు సేకరించి వ్యాస విస్తరణ చేయగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:41, 13 డిసెంబర్ 2013 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు భూత్పూరు గ్రామ వ్యాసాన్ని ఒక మేటైన శిల్పం చెక్కినట్లు, చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నందులకు అనేకానేక ధన్యవాదాలు. --విష్ణు (చర్చ)07:04, 13 డిసెంబర్ 2013 (UTC)
- ఆదర్శ గ్రామవ్యాసం కోసం నేను భూత్పూర్ గ్రామాన్ని ఎంపిక చేసి వ్యాసం కూడా ప్రారంభించాను. ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ నుంచి కేవలం 8 కిమీ దూరంలోనే ఉండుటయే కాకుండా జాతీయ రహదారిపై ఉండుటచే ఉత్తర-దక్షిణాలుగా ప్రయాణించే వారికి ఇది చిరపరిచితమే. బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వెళ్ళేటప్పుడు జడ్చర్ల కంటె కొద్దిగా ముందుగా వచ్చే ఈ గ్రామం ఎంతో చారిత్రక పాశస్త్యం కలిగియుంది. ప్రాచీన దేవాలయ సంపదతో పాటు ఎన్నో శాసనాధారాలు కల ఈ గ్రామం ప్రాచీన రాజధానిగా వర్థిల్లిన వర్థమానపురానికి కూడా సమీపంలో ఉంది. ఈ గ్రామంపై కొద్దిగా పరిశోధన చేసి సమాచారం వెలికితీసి, ఇదివరకే ఉన్న సమాచారం కూడా చేర్చి ఆదర్శ గ్రామవ్యాసంగా చేయడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:49, 10 డిసెంబర్ 2013 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, వైజాసత్య గారు ధన్యవాదాలు --విష్ణు (చర్చ)16:28, 10 డిసెంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావు గారూ, మోడల్ గ్రామం బాగుంది, ఇతర గ్రామాల వ్యాసాలు వ్రాయడానికి ఒక ఆదర్శ "ఫార్మాట్" లాగ వున్నది. అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:17, 14 డిసెంబర్ 2013 (UTC)
- ఈ వ్యాసం గురించి ఫేస్‌బుక్‌లో గుంపులో పెట్టిన విష్ణు గారికి, వ్యాసం సమాచారంపై అభినందించిన అహ్మద్ నిసార్ గారికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:49, 15 డిసెంబర్ 2013 (UTC)
- చేమూరు, ముచ్చివోలు వ్యాసాలు చూడండి. ఇలా ఇంకా కొన్ని అక్కడక్కడా ఉన్నాయి --వైజాసత్య (చర్చ) 08:22, 10 డిసెంబర్ 2013 (UTC)
వికీపీడియా 11 వ జన్మదినం శుభాకాంక్షలు
[మార్చు]వికీపీడియా దశాబ్ది శుభాకాంక్షలు. |
కొద్ది సేపటిక్రితం తెలుగు వికీపీడియా 11 వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ ప్రత్యేక శుభసందర్భంగా తెలుగు వికీపీడియా మరియు సోదర తెలుగు వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన వందలాది మంది తెలుగు వారు, లక్షలమంది సహ వికీ సభ్యులకు అభినందనలు. తెలుగు వికీపీడియా కు సంబంధించి మీ అనుభవాలను, వికీపీడియా భవిష్యత్తు గురించిన ఆలోచనలను అభిప్రాయాల పేజీలోని విభాగం లో తెలియచేయండి. --అర్జున (చర్చ) 01:40, 10 డిసెంబర్ 2013 (UTC)
- వికీ పది సంవత్సరాలు పూర్తిచేసుకొన్న సంధర్భంగా వికీ సభ్యులందరకూ అభినందనలు....విశ్వనాధ్ (చర్చ) 05:38, 10 డిసెంబర్ 2013 (UTC)
- అందరికీ శుభాకాంక్షలు. రహ్మానుద్దీన్ (చర్చ) 08:35, 10 డిసెంబర్ 2013 (UTC)
- తెవికీ ప్రపంచానికి హార్థిక శుభాభినందనలు. నేడు (పది సం.ల తరువాత) 53958 వ్యాసాలు. రాబోయే ఐదు సం.లలో రెండు లక్షల వ్యాసాలతో తెవికీ వర్థిల్లాలని ఆకాంక్ష.
అహ్మద్ నిసార్ (చర్చ) 10:28, 10 డిసెంబర్ 2013 (UTC)
- పదేళ్ళ చరితం, ఆనంద భరితం, ఎందరికో లాభితం, మన తెవికీ ఫలితం సి. చంద్ర కాంత రావు- చర్చ 17:00, 10 డిసెంబర్ 2013 (UTC)
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఖర్చులు CIS-A2K గ్రాంటు నుండి
[మార్చు]తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 CIS-A2K గ్రాంటు నుండి ఖర్చులకై ఇక్కడ చూడండి -- విష్ణు, 2013-12-11T14:28:40 2013-12-11T14:28:40
- విష్ణు గారికి ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా మహోత్సవం కార్యనిర్వాహక వర్గం, వికీమీడియా భారతదేశ చాప్టర్ నుండి ఏమైనా పొందిన మొత్తం వివరాలతో పూర్తి ఖర్చు వివరాలు, లక్ష్యాలు మరియు ఫలితాలు, ఇంకా సమావేశం నుండి నేర్చుకొన్న విషయాలు (ముందు సమావేశాల నిర్వహణకు ఉపయోగపడడానికి) త్వరలో ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 00:29, 12 డిసెంబర్ 2013 (UTC)
తెవికీ దశాబ్ది కార్యక్రమం
[మార్చు]తెవికీ దశాబ్ది సంబరాల కార్యక్రమం పేజీని ఇక్కడ చూడవచ్చు, దయచేసి మీ సలహాలూ, సూచనలను చర్చ పేజీలో తెలపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 17:31, 11 డిసెంబర్ 2013 (UTC)
CIS-A2K వద్ద CCC గా బాధ్యతల స్వీకరణ
[మార్చు]CIS-A2K వారి CCC ఉద్యోగానికి నేను దరఖాస్తు చేసుకొని, ఎంపిక అయి, ఉద్యోగంలో చేరడం జరిగింది. ఈ ఉద్యోగం ద్వారా తెవికీకి మరింత దోహద పడగలనని ఆశిస్తున్నాను. ఈ విషయమై భారతదేశ ఎయిలింగ్ లిస్ట్ లో నా నియామకం ప్రకటన చూడగలరు. ఇది తాత్కాలిక ఉద్యోగం కనుక వికీమీడియా ఇండియా చాప్టర్ లో నా పనితనం, సభ్యత్వంలో ఎలాంటి మార్పులూ ఉండబోవని చాప్టర్ అధ్యక్షుడి నుండి సందేశం వచ్చిందని కూడా తెలుపుతున్నాను. ఈ ఉద్యోగం ద్వారా ఎలాంటి సహాయ సహకారాలను అందించగలనో సభ్యులు తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 07:29, 12 డిసెంబర్ 2013 (UTC)
- కొత్త బాధ్యతలు చేపట్టినందులకు శుభాకాంక్షలు రహ్మానుద్దీన్ గారూ. ఈ పదవిలో మీరు మీ పూర్వ పదవులవలె సమర్థవంతంగా రాణించాలని కోరుకుంటున్నాను. ముబారక్ హో ...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:33, 12 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి, ఈ సందర్భములో మీకు శుభాభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:38, 12 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి కొత్త బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ ఉద్యోగానికి నియామకం గురించి ప్రకటనలో వివరంగా ఉంది కానీ. ఉద్యోగపు బాధ్యతలు ఏమిటో స్పష్టం కాలేదు. మీ బాధ్యతలు ఏమిటో తెలియజేస్తే, ఆ హోదాలో మీ సహాయాన్ని తెవికీ ఎలా ఉపయోగించుకోగలదో విశ్లేషించుకోవటానికి ఉపయోగపడుతుంది --వైజాసత్య (చర్చ) 07:53, 12 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి శుభాకాంక్షలు. WMF ఉద్యోగులు వారి విధినిర్వహణలో చేసే మార్పులలో స్పష్టత కొరకు కొత్త ఖాతాను (WMF) అనే అంత్యసర్గ తో వాడుతుంటారు. అలాగా మీరు కూడా కొత్త ఖాతా వాడితే బాగుంటుందేమో పరిశీలించండి. అలాగే విష్ణు గారు కూడా వారి ఖాతా పేరు మార్పు గురించి పరిశీలించగలరు. --అర్జున (చర్చ) 08:07, 12 డిసెంబర్ 2013 (UTC)
- అర్జున గారు, వికీపై నేను ఈ ఉద్యోగపరంగా మార్పులు చేసేది లేదు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:02, 12 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ , మీ స్పష్టీకరణ కు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 09:34, 12 డిసెంబర్ 2013 (UTC)
- అర్జున గారు మీ సూచనకు ధన్యవాదాలు. వికీలో వ్యాసాలు వ్రాయడం తప్పించి నేను చేసే ప్రతి పని ఉద్యోగపరంగా చేస్తున్నదిగానే పరిగణించ ప్రార్థన. --విష్ణు (చర్చ)11:25, 12 డిసెంబర్ 2013 (UTC)
- విష్ణు , వికీలో వ్యాసం లేక ప్రధానపేరుబరితో పాటు చాలా పేరుబరులున్నందున, మరియు వాటికి దగ్గరి సంబంధం వున్నందున మీరు అంటున్నదానికి స్పష్టత ఇవ్వండి. --అర్జున (చర్చ) 11:43, 12 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ! బాధ్యతలు చేపట్టినందులకు శుభాకాంక్షలు.--శ్రీరామమూర్తి (చర్చ) 01:40, 13 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి శుభాకాంక్షలు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:53, 13 డిసెంబర్ 2013 (UTC)
- CIS-A2K వద్ద CCC గా బాధ్యతల స్వీకరణ సందర్భంలో రహ్మానుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.--t.sujatha (చర్చ) 05:03, 14 డిసెంబర్ 2013 (UTC)
వికీ స్వయం శిక్షణ పుస్తకాల ముద్రణ కు కమిటీ ఏర్పాటు మరియు గ్రాంటు స్వీకరణ
[మార్చు]http://wiki.wikimedia.in/Grants/Printing_and_distribution_of_Wikipedia_introduction_manuals వద్ద చెప్పిన విధంగా వికీ స్వయం శిక్షణ పుస్తకం మరియు ఇతర పుస్తకాల ముద్రణకు అయ్యే అన్ని పనులను సమర్ధవంతంగా చేయగల వారు ఒక కమిటీగా ఏర్పడి ముందుకు రావాలని మనవి. ఈ విషయమై అర్జున గారిని కోరగా వారు తిరస్కరించి విముఖత చూపించారు. మిగిలిన సభ్యులు ముందుకు రాగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:17, 12 డిసెంబర్ 2013 (UTC)
- ఈ పుస్తకం విడుదల చేయాలని ఎన్నాళ్లనుండో వున్న ఊహకు కార్యరూపం ఇవ్వటానికి గత నెలన్నరనుండి నా వంతు కృషిచేస్తున్న సంగతి సహసభ్యులకు తెలుసనుకుంటాను. ఈ పుస్తకం కొత్త రూపం పాఠ్యం బొమ్మలు చిత్తు ప్రతి తయారీలో కృషి మరియు సమన్వయం చేస్తున్నది మీరు గమనించి వుంటారు. ఇక మిగతా పనులు నా వ్యక్తిగత ప్రాధాన్యతలవలన చేయలేకపోతున్నందులకు చింతిస్తున్నాను. ఎవరైనాసహసభ్యులు ముందుకువచ్చి ఈ పుస్తకం త్వరలో వెలుగుచూడటానికి బాధ్యత తీసుకొనవలసినది. దానికి నా సహాయం తప్పనిసరిగా వుంటుందని రహ్మనుద్దీన్ గారికి, బాధ్యత తీసుకోబోయే సభ్యులకు తెలియచేయడమైనది.--అర్జున (చర్చ) 09:42, 12 డిసెంబర్ 2013 (UTC)
54000 వ్యాసాలు దాటిన తెలుగు వికీపీడియా
[మార్చు]తెలుగు వికీపీడియా నేడే 54,000 మైలురాయి దాటి 54,003 వ్యాసాలకు చేరింది. రాసితో పాటు వాసిలో కూడా మెరుగుదనం కానవస్తుంది. జనవరి చివరలో తెవికీ దశమ వార్షికోత్సవ వేడుకలు జరిపే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అప్పటి వరకు ఇంకో 1,000 నాణ్యత కలిగిన వ్యాసాలను జోడించగలమా? చురుకుగా ఉన్న వాడుకరులు సగటున రోజుకు తలా ఓ వ్యాసం జోడించగలిగితే ఈ 55,000 వ్యాసాల మైలురాయిని ఖచ్చితంగా అందుకోవచ్చు. కాకపోతే నాణ్యతకు గండికొట్టకుండా జాగ్రత్త పడాలి. సభ్యులు దీనికి సై అంటారని ఆశిస్తున్నాను. ఆవగింజంత నావంతు కృషి నేను చేయటానికి ప్రయత్నిస్తాను. --విష్ణు (చర్చ)20:02, 12 డిసెంబర్ 2013 (UTC)
- 25వ తేదీకి 54,300 వ్యాసాలు దాటాయి. సభ్యులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి కొత్త వ్యాసాల్ని తయారుచేయాలని మనవి.Rajasekhar1961 (చర్చ) 08:36, 26 డిసెంబర్ 2013 (UTC)
తెలుగు పదాలతో ఆంగ్ల పదాల అయోమయనివృత్తి కొరకు
[మార్చు]latitude, longitude and elevation లకు విడివిడిగా తెలుగు పదాలు తెలియజేయగలరు. అక్షాంశము = Longitude, రేఖాంశము = Latitude సరైనవేనా, డిక్షనరీలలో వేరుగా ఉన్నాయి. YVSREDDY (చర్చ) 10:53, 13 డిసెంబర్ 2013 (UTC)
- Latitude= అక్షాంశము , Longitude=రేఖాంశము, elevation= సముద్ర మట్టం నుంచి ఎత్తు. అక్షాంశము, రేఖాంశము వ్యాసాలలో కూడా అర్థం తప్పుగా వ్రాయబడింది. డేటావికీ లింకు కూడా తప్పుగా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:17, 13 డిసెంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావు గారికి ధన్యవాదములు, డేటావికీ లింకులు మార్చాను, ఎవరయినా అక్షాంశము, రేఖాంశము వ్యాసాలతో పాటు భౌగోళిక నిర్దేశాంక పద్ధతి వ్యాసాన్ని కూడా పరిశీలించి తప్పులు సరిచేయగలరని మనవి. YVSREDDY (చర్చ) 06:32, 19 డిసెంబర్ 2013 (UTC)