వాడుకరి చర్చ:Ahmed Nisar

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

మీజాన్ పత్రిక గురించి[మార్చు]

నిసార్ భాయ్, దస్త్రం:Meezan Urdu newspaper March 14, 1944 Firstpage.jpg ఈ చిత్రంలో ప్రముఖ వార్తలు, విశేషాలు ఏవైనా ఉన్నాయో కాస్త చదివిచెప్పగలరు. ఇది ఈ పత్రిక యొక్క లభ్యమౌతున్న తొలి సంచికలలో ఒకటి. నేను మీమ్ ఐన్ జే అలిఫ్ నూన్ అంటూ ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ చదివే సరికి తెళ్లారుతుంది --వైజాసత్య (చర్చ) 01:22, 23 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, మీ ఫర్మాయిష్ ప్రకారం, జనవరి 24 న మీకు ఒక మెయిల్ పంపాను. బహుశా మీరు చూసేవుంటారు. అది పి.డి.యఫ్. ఫైలు. అందులో మీజాన్ ఉర్దూ పత్రిక యొక్క మార్చి 14, 1944 ముఖ పేజీలో గల విశేషాలు తెలుగులో తర్జుమా చేసి పంపాను. ఉర్దూ మరియు తెలుగు భాషలలో గలదు. ఓసారి చూడండి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:54, 11 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారూ, మీ చాలా శ్రమకోర్చి తెలుగులోకి అనువదించి పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. ఏదో మూడు నాలుగు ముఖ్య వార్తల శీర్షికలు వ్రాసి పంపిస్తారని అనుకున్నాను కానీ మీరు దానికి చాలా సమయం వెచ్చించారని అనిపించి నాకు మీకా పని పెట్టినందుకు కాస్త చివుక్కుమన్నది. అందునా ఆ పత్రికలో స్థానిక వార్తలేమీ లేకపోవటం ఒకింత ఆశ్చర్యమును, కాస్త నిరుత్సాహం కలిగింది. కానీ మీరు నా మాట మన్నించి తర్జుమా చేసినందుకు ధన్యవాదాలు. కాస్త తీరిక దొరికినప్పుడు ఉర్దూ వేగంగా చదవగలిగే స్థాయి చేరాలన్నది నా ఆకాంక్ష --వైజాసత్య (చర్చ) 02:31, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

చుప్కే చుప్కే రాత్ దిన్ గజల్ : ఉర్దూ నుండి తెలుగు అనువాదము[మార్చు]

నమస్కారం అహ్మద్ నిసార్ గారూ,
చుప్కే చుప్కే రాత్ దిన్ గజల్ లోని సాహిత్యాన్ని తెలుగువారి కోసం కొంచెం వివరిస్తే బాగుంటుందని రాజశేఖర్ గారి కోరిక.ఉర్దూ భాష లో నాకున్న పరిమిత జ్ఞానం కారణంగా ఈ అనువాదమును చేయలేకపోతున్నాను. వీకు కుదిరితే చేయమని విన్నపము.
ధన్యవాదాలు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:48, 3 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము[మార్చు]


నమస్కారం Ahmed Nisar గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:52, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
అహ్మద్ నిసార్ గారూ, తెలుగు మరియు ఉర్దూ వికీమీడియా ప్రాజెక్టులలో మీరు చేసిన కృషి అమోఘం. ముస్లిం ఆచార వ్యవహారాలు మరియు అన్ని మతాల చరిత్ర పై, రాయలసీమ అంశాలపై లోతుగా విశ్లేషించి రాసిన పెద్ద వ్యాసాలు తెలుగు వికీ పరిధిని చక్కగా విస్తరించాయి. పూనా తెలుగు సముదాయంలో తెవికీ గురించి ప్రచారం చేసి వికీ అభివృద్ధి గణనీయంగా తోడ్పడిన మీ కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

భారతదేశాంలోని జిల్లాలు[మార్చు]

నిస్సార్ గారికి నమస్కారం ! భారతదేశ జిల్లాల జాబితా వ్యాసం పరిశీలించాను. వీటిలో వ్రాయవలసిన వ్యాసాల సంఖ్య 439. అన్నింటినీ సమగ్రంగా వ్రాయాలంటే కనీసం 10 మంది క్రియాశీలక సభ్యులు ఒక సంవత్సరకాలం పనిచేయవల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అంతమంది సభ్యులు లేరు కనుక మీరన్నట్లు వాటికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ఒక రూపం ఇవ్వడానికి అవసరమైన సూచనలను ఇచ్చి మీరు మార్గదర్శకం చేయండి. అందులో నా వంతు బాధ్యతలు నేను నిర్వహిస్తాను. --t.sujatha 05:06, 21 ఫిబ్రవరి 2014 (UTC)

ఒకేసారి వీటన్నింటికి పేజీలు సృష్టిస్తే, తరువాత విస్తరించటం కష్టం అవుతుంది, ఒక్కొక్క రాష్ట్రం తీసుకొని పనిచేద్దాం. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రలలో జిల్లాలకు (అన్నీ కాకపోయినా) పేజీలు ఉన్నాయి. వాటిని విస్తరించే ప్రయత్నంతో మొదలు పెడితే బాగుంటుంది. నిసార్ గారూ, మీరు మహారాష్ట్రలో ఉంటున్నారు కాబట్టి మహారాష్ట్రతో మొదలుపెడదామా? --వైజాసత్య (చర్చ) 08:44, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యగారూ ఒకేసారి పేజీలు  సృష్టించే విషయం ఇక్కడ చర్చకు రాలేదు, మీరన్నట్టు విస్తరించడం కష్టతరం. భారతదేశ జిల్లాల జాబితా సంపూర్ణం ఐన తరువాత, మీరు చెప్పినట్టు రాష్ట్రాలవారిగా పోవడం ఉత్తమం. అలాగే, ఈ జాబితాతో లంకె ఇచ్చేందుకు ఇప్పటికే ఏవైనా వ్యాసాలున్నాయా అని కూడా ఒక సారి చూసుకోవడం మంచిది. ఉదాహరణకు అక్షరాతేడాలతో ఉన్నవాటికి నేను మహారాష్ట్ర విభాగంలో సరిచేసాను. మహారాష్ట్రతో ప్రారంభిద్దాం అని సత్య గారు సూచించారు, అలాగే చేద్దాం. సుజాతగారూ, ముందు మనం మనరాష్ట్రపు జిల్లాలకు ప్రాధాన్యమిద్దాం, ఆతరువాత పక్క రాష్ట్రాల (ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల) జిల్లాలను పూర్తీ చేద్దాం. ఆతరువాత మిగాతారాష్ట్రాలలోని ప్రఖ్యాత జిల్లాలు సెలెక్ట్ చేసి వాటిని రాద్దాము. అహ్మద్ నిసార్ (చర్చ) 09:48, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారూ క్షమించాలి నాకు కొంత బయటి పని ఉండటం చేత నెట్ అందుబాటులో లేక చేయలేకపోయాను. అన్ని పొటోలు కామన్స్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నను. అక్కద చూసి మీకు కావాల్సినవి తీసుకొండి లాగే జి డ్రైవ్‌లో కూడా ఇస్తాను త్వరలో...విశ్వనాధ్ (చర్చ) 15:54, 2 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నిస్సార్ గారూ ! ప్రశంశకు ధన్యవాదాలు. కొంతవరకు ప్రాజెక్టు వరకు ఒక దారికి వచ్చింది. ఇక ఆసక్తి కలిగిన సభ్యులు వారికి ఆసక్తి ఉన్న వ్యాసాలలో పని మొదలు పెట్టవచ్చు. వ్యాసాలలో ఇన్ఫోబాక్స్ చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్రాజెక్ట్ పూర్తి అయింది. వాటికి దాదాపు ఒక రూపం వచ్చింది. కనుక వాటిని ఇప్పటికి వదిలి వేయవచ్చు. ఇది చాలా బృహత్తరమైన పని అన్నది నిజం. అయినా ఏమీ లేనిదానికంటే ఏదైనా కొంత విషయం ఉంటే మంచిది అని ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాను. వాస్తవానికి ఉత్తరాంచల్‌లో కొంత పని జరిగింది. మిగిలిన వ్యాసాలు నేను పూర్తిచేయాలని అనుకుంటున్నాను. అలాగే నేను తమిళనాడులో ఉన్నాను కనుక తమిళనాడు వ్యాసాలు అభివృద్ధిచేయాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా ఈ పని చేయాలని అనుకుంటున్నాను. కనుక సభ్యులు నిదానంగా చేయగలిగినంత చేయవచ్చు. వైజాసత్యగారు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపడం శుభసూచకం. రాజశేఖర్ గారు ఇందులో పనిచేయ డానికి ఆసక్తిగాఉన్నారు. ప్రాజెక్టు గురించి ఇక రచ్చబండలో వ్రాయాలని అనుకుంటున్నాను. ప్రాజెక్టు పేజిలో వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు కూడా కొంత విషయం వ్రాసి ఆసక్తి కలిన సభ్యులు తమ పేరు జతచేయాలి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. వ్రాయవలసిన వ్యాసాలు దాదాపు 364 పైగా ఉన్నాయి. సమగ్రంగా వ్రాయలేకపోయినా కొంతవరకు విషయం చేరుస్తాము. మనదేశం గురించి మనం తెలుసుకుంటూ అందరికీ అనదరికీ తెలియజేయడానికి సహకరిస్తాం. --t.sujatha 17:10, 2 మార్చి 2014 (UTC)
సుజాతగారు సుమారు అన్ని జిల్లాలకు పేజీలను సృష్టించారు. నేను ఆంగ్ల వికీపీడియాలోని జిల్లా మూసని మరియు ఉపోద్ఘాతాన్ని తెలుగు లోని కాపిచేసి అనువదిస్తున్నాను మరియు ఆంగ్ల వికీ వ్యాసానికి వికీడాటా లింకు చేరుస్తున్నాను. వీలున్నవారు వాటిని విస్తరించవచ్చును. ఈ పెద్ద ప్రాజెక్టు కోసం అలుపెరుగకుండా కృషి చేస్తున్న సుజాతగారికి మరియు నిసార్ గార్లకు నా ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 17:27, 2 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:00, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా ఇస్లాం, సాహిత్యం, జిల్లాల ప్రాజెక్టు వంటి వైవిధ్యభరితమైన విషయాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:43, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు --పవన్ సంతోష్ (చర్చ) 18:00, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష వ్యాసాలు[మార్చు]

తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింవబడినవి ఉన్నట్లున్నవి. ఉదాహరణకు పాలగిరి వ్రాసిన అనేక నూనెల వ్యాసాలు, రసాయన శాస్త్ర వ్యాసాలన్నీ పూర్తిగా విస్తరింపబడినవి ఉన్నవి. వాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? చంద్రకాంతరావు గారు విశేషంగా వ్రాసిన తెలంగాణ వ్యాసం వంటివాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? మీరు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించని అనేక విస్తరిత వ్యాసాలు తెవికీలో ఉన్నవి. వాటిని కూడా విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించిన వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసినయెడల వాటిని విశేష వ్యాసాల హోదాలు ఎలా యివ్వాలి. విశేష వ్యాసాల వర్గంలో చేర్చితే సరిపోతుందా? సందేహ నివృత్తి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:07, 4 ఆగష్టు 2014 (UTC)

వెంకటరమణ గారూ, మీరన్నట్టు, తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింపబడి యున్నవి. అందుకొరకే విశేష వ్యాసాల పరిగణనా ప్రక్రియ. ఈ సంవత్సరాంతానికి ఓ వంద విశేష వ్యాసాలు చూడవచ్చనే ఆశ.
తెవికీలో 25 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 58,545 - ఆగస్టు 4, 2014 నాటికి)
ఇవికీలో 4,323 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 4,573,497)
తెవికీలో అనేక వ్యాసాలు విస్తరింపబడి యున్నవి, ప్రతిపాదనలలో వాటి పేర్లు ఉండవచ్చు, లేకపోవచ్చు.
ప్రతిపాదింపదలిస్తే;
విశేష వ్యాసాల కొరకు ఏ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు.
ఎన్నైనా ప్రతిపాదించవచ్చు.
చంద్రకాంతరావు గారు వ్రాసిన తెలంగాణా వ్యాసమూ ప్రతిపాదించవచ్చు.


విశేష వ్యాసాల ప్రతిపాదన ఎన్నిక కొరకు ఈలింకులు చూడండి. విశేష వ్యాసాల జాబితా
వికీపీడియా:విశేష వ్యాసాలు. అలాగే "విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది" కొరకు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు చూడండి. అలాగే ఇవికీలో ఈపేజీ చూడండి Wikipedia:Featured_articles.
కేవలం విశేష వ్యాసం వర్గంలో ఉంచిన యెడల అది విశేష వ్యాసం కాదు. ఇవికీ నుండి తర్జుమా కొరకు విషయాన్ని ఇవికీనుండి కాపీ చేసి తెవికీలో వుంచినందువలన, ఆ వ్యాసం ఇవికీలో విశేష వ్యాసం అయివున్నందువలన, విశేష వ్యాసం వర్గంలో చేరి ఉండవచ్చు. అలా అయిన పక్షంలో, ఆవ్యాసం నుండి వర్గం:విశేష వ్యాసం తొలగించవచ్చు.

విశేష వ్యాసాల ఎన్నిక సభ్యుల అభిప్రాయాలతోనే జరుగుతుంది. ఈ ఎన్నిక ప్రక్రియ వలన లభాలేమంటే, ప్రతిపాదించేవారు ఆయా వ్యాసాలను ఒక సారి పరికిస్తారు, వాటి నాణ్యతా విషయాలు గుర్తిస్తారు, ఇంకా ఇతర విషయాల దిద్దుబాట్లు చేస్తారు, ఆతరువాతే ప్రతిపాదిస్తారు. సరిగ్గా మనకు కావలసిందీ ఇదే.

విశేష వ్యాసాల కొరకు నిబంధనలు / మార్గదర్శకాలు ;
 • వ్యాసం పరిపూర్ణంగాను, ఖచ్చితత్వాన్ని కలిగి వుండాలి
 • నిష్పక్షపాతంగా వుండాలి
 • సమతౌల్యతలను పాటించి వుండాలి
 • మూలాలు కలిగి ఉండవలెను
 • అధిక లింకులు కలిగి ఉండవలెను
 • ఎర్రలింకులు లేకుండా ఉండవలెను.
 • సంబంధిత వ్యాసాలకు, వాటి విషయాలకు తగిన బొమ్మలు కలిగి వుండాలి
 • సభ్యుల ఆమోదాలతోను, నిర్ణయాలతో ఎన్నికై వుండాలి.
విశేష వ్యాసంగా ఎన్నికైన వ్యాసాన్ని,
 • {మూస:విశేష వ్యాసం /(ఎన్నికైన తేదీని గుర్తిస్తూ)}, మరియు [వర్గం:విశేష వ్యాసం] లో చేరుస్తారు.

ఇంకనూ చర్చించవలసిన విషయాలుంటే, సభ్యులు చర్చించవచ్చు. (ఈ విభాగాన్ని రచ్చబండలోనూ, విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 చర్చాపెజీలోనూ ఉంచుతున్నాను). అహ్మద్ నిసార్ (చర్చ) 14:47, 4 ఆగష్టు 2014 (UTC)

నిసార్ భాయ్, ప్రస్తుతం చురుకుగా పనిజేస్తున్న వారినే ఆక్టివ్ వికీపీడియన్ అని అనాలి. నాకు పనుల ఒత్తిళ్ల వళ్ల మరో మూడు, నాలుగు నెలలపాటు ఇక్కడికి తరచుగా వచ్చే వీలుపడదు. ఆ తర్వాత ఖచ్చితంగా తిరిగి క్రియాశీలకమై తెలుగు వికీకి నా సేవలను అందించగలను. అధైర్యపడకుండా చక్కగా సముదాయాన్ని ముందుండి నడిపించగలరు. మీకా సత్తా, అనుభవం మరియు కలుపుగోలుతనం మెండుగా ఉన్నాయని నా అభిప్రాయం. --వైజాసత్య (చర్చ) 02:08, 20 ఆగష్టు 2014 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! నమస్కారాలు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మరింత బాధ్యతగా తెవికీలో కొనసాగడానికి ప్రయత్నిస్తాను. Naidugari Jayanna (చర్చ) 13:51, 28 ఆగష్టు 2014 (UTC)

విశేష వ్యాసాలు-పహారా[మార్చు]

వికీపీడియా:విశేష వ్యాసాలు లో 27 వ్యాసములున్నవి. కానీ వర్గం:విశేషవ్యాసాలు లో 32 ఉన్నవి. వర్గంలో ఎక్కువగా ఐదు వ్యాసాలున్నవి. వాటిలో ఈ క్రింది వాడుకరులు విశేష మూసను చేర్చారు. ఆ వ్యాసాలు ప్రతిపాదించబడినవేనా? అవి ఆమోదం పొందినవా? అవి ఆమోదం పొందినవైనచో వికీపీడియా:విశేష వ్యాసాలు లో చేర్చవచ్చు. లేనిచో ఆ పేజీలలో {{విశేషవ్యాసాలు}} మూసను తొలగించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 18:17, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

 1. ఆఫ్ఘనిస్తాన్ - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
 2. బ్రాహ్మణగూడెం - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
 3. మహాత్మా గాంధీ - Dev - 28, ఆగష్టు 2008 న ఈ దిద్దుబాటు ద్వారా
 4. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
 5. వైరస్ - Dev - 10, డిసెంబరు 2007 న ఈ దిద్దుబాటు ద్వారా,

విశేష వ్యాసాల మూసను చేర్చారు. వాటిని పరిశీలించవలెను.---- కె.వెంకటరమణ చర్చ 18:17, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పరిశీలించాను, ఇది తేలింది;
విశేషవ్యాసాలు కావచ్చు : వీటిని విశేషవ్యాసాలుగా పరిగణించి ప్రదర్శించారు కూడా. బహుశా విశేషవ్యాసాల జాబితాలో చేర్చడానికి మరచిపోయి ఉండవచ్చు. కావున ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా వాటి జాబితాలో చేర్చవచ్చు.
 • {విశేషవ్యాసం|27 ఏప్రిల్ 2008} - ఆఫ్ఘనిస్తాన్
 • {విశేషవ్యాసం|2008 ఏప్రిల్ 26} – మిన్నియాపోలిస్
 • {విశేషవ్యాసం|2008 ఏప్రిల్ 26} – బ్రాహ్మణగూడెం
ఈవారం వ్యాసాలు కావచ్చు : ఈ క్రింది వ్యాసాలను పరిశీలిస్తే, ఈవారం వ్యాసాల్లా అనిపించాయి. కానీ విశేషవ్యాసం మూస పెట్టారు. బహుశా ఈవారం వ్యాసం మూస స్థానంలో విశేషవ్యాసం మూస పెట్టారు. కానీ వీటిని మీరు ఓసారి పరిశీలించండి, అర్హతలు గోచరిస్తే చొరవతీసుకుని విశేషవ్యాసాలుగా ప్రకటించి, వాటి జాబితాలో చేర్చండి.
 • {విశేషవ్యాసం|46వ వారం} – వైరస్
 • {విశేషవ్యాసం|2007 49వ వారం} – మహాత్మా గాంధీ


అలాగే ఈ ప్రక్రియలోని ఉపోద్ఘాతములో మొదటి పాయింట్ ఒక క్లిష్టమైన ఘట్టాన్ని ప్రస్తావించడం జరిగినది. అదేమంటే,

ఒకవేళ ఈతంతు ముఖ్యమని అనిపిస్తే వ్రాద్దాం, లేదంటే లేదు. అంత ముఖ్యమని అనిపించలేదు. అలాగే వాటి వరుసక్రమం తేదీలను బట్టి నిర్ధారించి వ్రాయాలి. మీఅభిప్రాయం ఏమిటి చెప్పగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:54, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రయాణాన్ని ఇక్కడ వెంటనే నిర్ధారించండి[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ!
వికీమీడియా ఫౌండేషన్‌కు ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్-2014కు తెలుగుకు ప్రాతినిధ్యం వహించనున్న వికీమీడియన్లలో మీరూ ఒకరు కదా. మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసేందుకు ఈ కింది లింకులో సంబంధిత మార్పులు చేయాలి. నేను అక్కడ స్పందించినాకా మీరు పూర్తిచేయాల్సిన వివరాలు ఖాళీగా ఉండడం గమనించాను. అందుకే మీకు ఇలా ఆన్-వికీ రాస్తున్నాను. ఈ లింకును సంప్రదించగలరు.
https://meta.wikimedia.org/wiki/India_Community_Consultation_2014#Telugu
--పవన్ సంతోష్ (చర్చ) 02:15, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


పవన్ సంతోష్ గారూ, తెలిపినందులకు ధన్యవాదాలు. మార్పులు చేసాను. అహ్మద్ నిసార్ (చర్చ) 07:04, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ, నా నెంబరు - 09175562265 - ఈమెయిలు - ahmadnisarsayeedi@yahoo.co.in - అహ్మద్ నిసార్ (చర్చ) 20:38, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా[మార్చు]

గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా కు తగిన తెలుగు పేరు సూచించి, ఆ వ్యాసాన్ని ఆ పేరుకు తరలించ మనవి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:42, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మహమ్మదీయ మహాయుగము[మార్చు]

మహమ్మదీయ మహాయుగము పుస్తకంలో భారతదేశ్ంలో మహమ్మదియుల యుగానికి సంబంధించిన వివరాలు సవిస్తరంగా తెలియజేయబడ్డాయి. ఇది స్వేచ్చా కాపీహక్కులలో నున్నది. కాబట్టి వికీసోర్స్ లో మొత్తం పుస్తకాన్ని అంతా చేర్చి దానినుండి మన ఇస్లాం ప్రాజెక్టు కోసం చాలా వ్యాసాలను తయారుచేయవచ్చును. దాని లింకు వ్యాసం పేజీలో వున్నది.Rajasekhar1961 (చర్చ) 07:41, 2 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

.రాజశేఖర్ గారూ, మీ సూచనకు, ధన్యవాదాలు. అలాగే, ఇదీ ఒక రెఫరెన్సు గా పనికి రావచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 13:31, 2 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

As Salamu Alaikum, I would like to start my bot on your wiki which will add categories in all namespaces from english wikipedia. This bot is running on urdu wiki as well. May I? --Muhammad Shuaib (చర్చ) 15:13, 8 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Should I continue these test edits? Muhammad Shuaib (చర్చ) 17:20, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Namaskar, Janab, hope you remember me from ICC 2014. I know neither Telugu nor Urdu,. I can understand simple Urdu, but can not read or write the language still. What I have noticed so far, you or someone need to check and participate in Meta:Grants talk:IEG/Islam in Andhra Pradesh, as isomething is going wrong there, in my opinion.
do not check Urdu Wiki, but, always reachable at En WP under same username. Regards. --Titodutta (చర్చ) 20:35, 14 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

మీ పునరాగమనానికై ఆకాంక్ష[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! బెంగుళూరు వికీ సమావేశాల అనంతరం, మీరు తెవికీలో కార్యకలాపాలు ఆపివేశారు. తెరవెనక్కి వెళ్ళిపోయారు. కారణాలు ఏమిటో చెప్పమని నేనడుగలేను. కానీ తెవికీ అభివృద్ధిలో మీ పాత్ర విస్మరింపరానిది. తెవికీ భవిష్యత్తు పురోగమన మార్గంలోనూ మీ తోడ్పాటు అవసరమే. తెవికీ కుటుంబ సభ్యులలో ఎవరి వలనైనా మీకు ఏమైనా మనస్తాపం కలిగి ఉంటే,మన్నించమని కోరుతున్నాను. మీరు తెవికీలో తిరిగి క్రియాశీలంగా కొనసాగుతారని, తిరుపతి సమావేశాలకూ హాజరవుతారని ఆశిస్తున్నాను. --Naidugari Jayanna (చర్చ) 14:06, 1 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారికి నమస్కారములు. అయ్యా, తెవికీ అభివృద్ధి కోసం మీ పునరాగమనాన్ని ఆశిస్తున్నాను. ఆమధ్య విశేష వ్యాసాలపై చర్చ జరిపి విశేష వ్యాసాలను పెంచడానికి కృషిచేశారు. గూగుల్ అనువాద వ్యాసాలను శుద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. మీ ఆలోచనలకు నేను కార్యరూపం అందించగలను. దయచేసి తెవికీ కుటుంబ సభ్యులలో ఎవరి వలనైనా మీకు ఏమైనా మనస్తాపం కలిగి ఉంటే,మన్నించమని కోరుతున్నాను. మీ పునరాగమనంతో వ్యాసాల నాణ్యత పెరుగుందనటంలో సందేహం లేదు. దయచేసి ఆలోచించండి.-- కె.వెంకటరమణ 22:39, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

హలో Ahmed Nisar! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:33, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయేతర సంస్థలు[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:04, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]


నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి[మార్చు]

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా అహ్మద్ నిసార్ గారి కీ నా మనవి.

శుభాకాంక్షలు[మార్చు]

2015 Global Congress on Intellectual Property and the Public Interest సదస్సుకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు నిస్సార్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:56, 28 నవంబర్ 2015 (UTC)

కతిన చర్యలు[మార్చు]

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

Your administrator status on te.wikipedia[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 02:33, 13 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఉస్మానియా సామ్రాజ్యం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం పేజి 2013 మే 23న సృష్టించబడింది.పూర్తిగా ఆంగ్లంలో ఉంది.సృష్టించిన నాటినుండి తెలుగులో అనువాదం చేయుటకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తుంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 15:28, 19 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 15:28, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సెనెగల్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2009 ఏప్రియల్ 5 సృష్టించబడింది.వ్యాసంలో ఎక్కువ భాగం ఆంగ్లంలో ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 17:19, 19 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:19, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కౌలాలంపూర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2008 మార్చి 12న సృష్టించబడింది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 15:46, 27 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 15:46, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇస్లామీయ పాఠశాలలు, శాఖలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

ఇస్లామీయ పాఠశాలలు, శాఖలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2014 లో సృష్టించారు.వ్యాసం సుమారు 69 వేల బైట్లుకు నింపబడింది.2020 ఫిబ్రవరి 9న అనువాదం మూస పెట్టబడినది.తరువాత దీనిలో ఇంతవరకు ఎటువంటి అనువాద మార్పుల జరగలేదు.ఇందులో ఇంకా సుమారు 80 శాతానికి పైగా అనువాదం చేయవలసి ఉంది.2021 జనవరి 10 వ తేదీ లోపు వ్యాసాన్ని అనువదించి తగిన మూలాలు చూపనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇస్లామీయ పాఠశాలలు, శాఖలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 15:42, 31 డిసెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 15:42, 31 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మోమిన్ ఖాన్ మోమిన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

మోమిన్ ఖాన్ మోమిన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేం.2008 ఫిబ్రవరిలో సష్టించబడినది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది. మూలాలు లేవు.2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మోమిన్ ఖాన్ మోమిన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 05:28, 7 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 05:28, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

భారతీయ మతములు వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

భారతీయ మతములు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2008 జులై లో సృష్టించబడింది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది.అంతేకాకుండా ఇదే సమాచారంతో కొద్దిపాటి అక్షరబేదాలతో భారతీయ మతాలు అనే మరొక పేజీ ఎక్కువ సమాచారంతో ఉంది.కవున దీనిని తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతీయ మతములు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:10, 17 అక్టోబరు 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:10, 17 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నల్ల సముద్రం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

నల్ల సముద్రం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2008లో సృష్టించబడినది. విషయ సంగ్రహం రెండు లైన్లు మాత్రమే ఉంది.సుమారు 10 పైగా బొమ్మలు, 100 కు పైగా ఆంగ్ల వ్యాసాల లింకులు మాత్రమే ఉన్నవి.ఇలా కూడా రాయవచ్చా అనే సందేహం నాకు కలుగుతుంది.నాకైతే ఎవరైనా ఒక 10 రోజులులోపు (డిసెంబరు 15లోపు) వ్యాస విస్తరణ జరగకపోతే తొలగించాలని ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నల్ల సముద్రం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 17:46, 6 డిసెంబరు 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:46, 6 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:54, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]