Jump to content

మోమిన్ ఖాన్ మోమిన్

వికీపీడియా నుండి
మోమిన్ ఖాన్ మోమిన్
మోమిన్ ఖాన్ మోమిన్
జననం1800 (1800)
ఢిల్లీ, మొఘల్ సామ్రాజ్యం, ప్రస్తుతం భారతదేశం
మరణం14 మే 1852 (aged 51–52)
ఢిల్లీ, మొఘల్ సామ్రాజ్యం, ప్రస్తుతం భారతదేశం
సమాధి స్థలంమెహదియన్, ఢిల్లీ, భారతదేశం
వృత్తికవి, రచయిత, హకీమ్[1]
గుర్తించదగిన సేవలు
కుల్లియత్ -ఎ- మొమిన్
(మొమిన్ రచనల సర్వస్వము)

మోమిన్ ఖాన్ మోమిన్ ( Moʾmin Xān Moʾmin ; 1800- 1852 మే 14) ఉర్దూ గజల్స్‌కు ప్రసిద్ధి చెందిన మొఘల్ శకపు చివరి కవి. గాలిబ్, జౌక్ ల సమకాలీనుడు. అజ్ఞాత కవి. "మోమిన్" ఇతని కలం పేరు. ఇతని సమాధి ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని మెహదియాన్ శ్మశానవాటికలో ఉంది.[2]

జీవితం

[మార్చు]

మోమిన్ ఖాన్ 'మోమిన్' ఢిల్లీలో కాశ్మీరీ మూలానికి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించాడు.[3][4] ఇతని తండ్రి, గులాం నబీ ఖాన్, హకీమ్ (సాంప్రదాయ/ యునానీ వైద్యుడు). మోమిన్ ఖాన్ చిన్న వయస్సు నుండే కుటుంబ వృత్తిలో శిక్షణ పొంది హకీమ్ అయ్యాడు. దీని వల్ల ఇతడిని తరచుగా సమకాలీన వర్గాలలో "హకీమ్ ఖాన్" అని పిలిచేవారు. హకీమ్ అనేది వైద్యుడికి ఉర్దూ పదం. అయినప్పటికీ, ఇతను కవిత్వం వైపు మొగ్గు చూపాడు. తక్కువ సమయంలోనే ఇతడు నిష్ణాతుడైన కవిగా పేరు పొందాడు. వివాహం ద్వారా అనుకోకుండా లభించిన అనుబంధాల కారణంగా ఇతడికి కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. 1823లో, మోమిన్ జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం విఫలమైంది. ఇతడు తన భార్య నుండి విడిపోయాడు. తరువాత ఇతడు ఉర్దూ కవి, సూఫీ సన్యాసి ఖ్వాజా మీర్ దార్ద్ బంధువైన అంజుమన్-ఉన్-నిసా బేగాన్ని వివాహం చేసుకున్నాడు. వీరికి అహ్మద్ నాసిర్ ఖాన్ అనే కుమారుడు, ముహమ్మదీ బేగం అనే కుమార్తె కలిగారు.[5] మోమిన్ తన 52వయేట 24 రజబ్ 1268 హిజ్రీ ( 1852 మే 14)న తన ఇంటి పైకప్పు నుండి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మరణించాడు.[6] ఔషధం, కవిత్వం కాకుండా అనేక ఆసక్తులతో మోమిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యం, కవిత్వాలతో పాటుగా ఇతడు గణితం, భూగోళశాస్త్రం, జ్యోతిష్యం, చదరంగం, హిందుస్థానీ సంగీతం మొదలైనవాటిలో సమర్థుడు.[7][8][9]

రచనలు

[మార్చు]
దేవనాగరి లిపిలో మోమిన్ ఖాన్ మోమిన్ యొక్క ప్రసిద్ధ గజల్ .

మోమిన్ ప్రధాన రచనల్లో ఒక దివాన్, ఆరు మస్నవీలు ఉన్నాయి. [10]

మోమిన్ తన ప్రత్యేకమైన పర్షియన్ శైలికి, తన 'తఖల్లస్' యొక్క అందమైన ప్రయోగానికి ప్రసిద్ధి చెందాడు. మీర్జా గాలిబ్ (ఇతని సమకాలీన ప్రత్యర్థి) మోమిన్ వ్రాసిన ఒక కవితకి బదులుగా మోమిన్‌కి అతని మొత్తం దివాన్ (కవితా సంకలనం) అంకితం చేశాడని అంటారు. అయితే చాలా మంది ఆధునిక కవులు ఈ వాదనను 'అతిశయోక్తి'గా పరిగణిస్తారు. ఈ అతిశయోక్తి సాధారణంగా ఏదో ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి చేయబడుతుంది. ప్రశ్నలోని ద్విపద:

تم میرے پاس ہوتے ہو گویا
جب کوئی دوسرا نہیں ہوتا
"Tum mērē pās hōtē hō gōyā
Jab kō'ī dūsrā nahīⁿˡ hotā"[11]

దీని అనువాదం ఇలా ఉంటుంది:

నువ్వు నాకు దగ్గర అయ్యావు [అలా]
మరెవరూ లేనప్పుడు.

ఈ ద్విపద యొక్క అందం దాని క్లుప్తత, అర్థం అనేక పొరలలో నిక్షిప్తమై ఉంది. ఒక అర్థంలో నువ్వు నాతో ఉన్నప్పుడు (నా మనస్సులో), మరెవరూ లేరు. రెండవ అర్థం/వ్యాఖ్యానం నువ్వు నాతో ఉన్నావు (నా వైపు), మరెవరూ లేనప్పుడు . గోయా, జబ్ (ఎప్పుడు) అనే పదాలను ఉపయోగించడం ద్వారా రెండు అర్థాలు ఉద్భవించాయి. "

ఇతని ప్రసిద్ధ గజల్‌లలో ఒకటి క్రింది మట్లాతో ప్రారంభమవుతుంది ( గజల్ ప్రారంభ ద్విపద మొదటి పంక్తి).

వో జో హామ్ మేⁿ తుమ్ మే ఖరార్ తా; తుమ్హేⁿ యాద్ హో, కెహ్ నహ్ యాద్ హో:
వోహీ, యాని వాదా నిబాహ్ కా; తుమ్హేⁿ యాద్ హో, కెహ్ నహ్ యాద్ హో [12]
وہ جو ہم میں تم میں قرار تھا، تمہیں یاد ہو کہ نہ یاد ہو
وہی یعنی وعدہ نباہ کا، تمہیں یاد ہو کہ نہ یاد ہو[12]
మన మధ్య ఉన్న అవగాహన... నీకు గుర్తుందో లేదో...
ఆ విశ్వాసం ఆ వాగ్దానం ... నీకు గుర్తుందో లేదో... [12]

మూలాలు

[మార్చు]
  1. Profile of Momin Khan Momin on allpoetry.com website Retrieved 20 May 2018
  2. "In the lanes of Zauq and Ghalib". Indian Express (newspaper). 15 March 2009. Archived from the original on 21 January 2012. Retrieved 20 May 2018.
  3. Abida Samiuddin, Encyclopaedic Dictionary of Urdu Literature, Global Vision Publishing House (2007), p. 342
  4. Kuldip Salill, A Treasury Of Urdu Poetry, Rajpal & Sons (2009), p.72
  5. Siddiqui, Zaheer Ahmad (1991). Momin Khan Momin (in హిందీ). Translated by Sharma, Janaki Prasad. New Delhi: Sahitya Akademi. pp. 19–20. ISBN 81-7201-143-1.
  6. Diwan-e-Ghalib, compiled by Kalidas Gupta Riza, pg 90, Anjuman-i Taraqqi-i Urdu, Karachi (1997)
  7. K.C. Kanda, Masterpieces of Urdu Ghazal from the 17th to the 20th Century, Sterling (1992), p. 182
  8. Ali Jawad Zaidi, A History of Urdu literature, Sahitya Akademi (1993), p. 181
  9. D.J. Matthews, Urdu Literature, South Asia Books (1985), p. 86
  10. Saksena 1927, p. 149.
  11. Peerzada Salman (5 January 2017). "The triumvirate of Ghalib, Zauq and Momin". Dawn (newspaper). Pakistan. Retrieved 16 October 2021.
  12. 12.0 12.1 12.2 Peerzada Salman (5 January 2017). "The triumvirate of Ghalib, Zauq and Momin". Dawn (newspaper). Pakistan. Retrieved 16 October 2021.Peerzada Salman (5 January 2017). "The triumvirate of Ghalib, Zauq and Momin". Dawn (newspaper). Pakistan. Retrieved 16 October 2021.

ఉదహరించిన మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]