వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 68

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 67 | పాత చర్చ 68 | పాత చర్చ 69

alt text=2019 అగస్టు 2 - 2019 సెప్టెంబరు 4 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 అగస్టు 2 - 2019 సెప్టెంబరు 4

వికీప్రాజెక్టు వ్యాసాలకు వ్యాసపేరుబరిలో మానవీయంగా ప్రాజెక్టు వర్గాలు చేర్చకూడదు[మార్చు]

ప్రాజెక్టు పేజీల నిర్వహణపనిలో చాలా వ్యాసాలకు పొరబాటున ప్రాజెక్టు పేరుతో (ఉదాహరణ:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన, పంజాబ్ ఎడిటథాన్,ప్రాజెక్టు టైగర్,) మానవీయంగా వర్గాలు చేర్చడం కనబడింది. ఇది బహుశా గూగుల్ అనువాద వ్యాసాలలో వుంచిన మూస({{యాంత్రిక అనువాదం}})లో తప్పుగా వర్గం చేర్చమన్న హెచ్చరిక వలన ప్రభావితం అయి ఉండవచ్చు. దీనిని ఇప్పుడు సవరించాను వాటిని తొలగించి ఆయా చర్చాపేజీలలో ఆయా ప్రాజెక్టుమూసలను చేర్చాలి. వాటిని నేను సవరిస్తున్నాను. ఆ మూసల ద్వారా ప్రాజెక్టులోని పేజీలను petscan ఉపకరణం ద్వారా గుర్తించవచ్చు. సభ్యులు గమనించి ముందు అలా దోషాలు జరగకుండా జాగ్రత్త వహించమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 07:16, 2 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వొకేట్ ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ[మార్చు]

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ వారి యాక్సెస్ టు నాలెడ్జ్ ప్రాజెక్టు (సీఐఎస్-ఎ2కె) ద్వారా తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం వార్షిక ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలుపరిచే దిశగా నేను పనిచేసిన సంగతి సముదాయ సభ్యులకు తెలిసిందే! 2015 డిసెంబరు నుంచి ఇప్పటివరకు ఉద్యోగబాధ్యతల పరంగా నేను ఈ పనిచేశాను. ప్రస్తుతం కెరీర్‌ పరంగా వేరే సంస్థలో వేరే ఉద్యోగానికి మారాలని నేను తీసుకున్న నిర్ణయం కారణంగా సీఐఎస్-ఎ2కెలో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను.

దాదాపు మూడున్నర సంవత్సరాల కాలం పాటు నా తెలుగుకు, నా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు పనిచేసుకునే అవకాశం రావడాన్ని నేనెంతగానో ఆస్వాదించాను. నా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, సముదాయ సభ్యుల సహకారాన్ని సాధ్యమైనంత తీసుకుంటూ ఎంతో నేర్చుకున్నాను. ఆ క్రమంలో సముదాయ విస్తృత లక్ష్యాల దిశగా పనిచేస్తూనే చాలామంది సముదాయ సభ్యుల స్వచ్ఛంద కృషికి సహకరించగలిగానని భావిస్తున్నాను. నేను ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చేసిన పనివల్ల సముదాయంలోకి వచ్చిన వికీపీడియన్ల కృషి సాగుతూ ఉండడం, పెంపుదల చేసిన ప్రాజెక్టులు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతూండడం వంటి పరిణామాలెన్నో నాకు వృత్తిగతంగా సంతృప్తినిచ్చాయి. సముదాయానికి నాపై ఉన్న నమ్మకం, తమతో భుజం భుజం కలిపి పనిచేసే అవకాశాన్ని నాకు ఇవ్వడం వంటివే లేకపోతే నేను సాధించానని అనుకుంటున్నవేవీ ఊహించడం కూడా సాధ్యమయ్యేదే కాదని నమ్ముతున్నాను. ఇందుకు నాతో కలిసి పనిచేసిన సముదాయ సభ్యులందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏ సందర్భంలోనైనా ఉద్యోగ పరంగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించమని కోరుతున్నాను.

ఐతే, తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల మీద నేను కృషిచేయడం అన్నది సీఐఎస్‌-ఎ2కెలో ఉద్యోగం ప్రారంభించడంతో మొదలుకాలేదు. అంతకు రెండేళ్ళ క్రితమే నేను వికీపీడియన్‌ని, ఆ ఉద్యోగం చేసిన కాలమంతా స్వచ్ఛంద కృషి సాగిస్తూనే వచ్చాను. ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేశాకా వికీపీడియాలో నా ప్రమేయం తగ్గకపోగా స్వచ్ఛంద కృషి మరింత గాఢంగా, స్వేచ్ఛగా చేయగలుగుతానని నమ్ముతున్నాను. ఈ రిజిగ్నేషన్ కేవలం ఉద్యోగ బాధ్యతలకేనని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఉద్యోగ బాధ్యతలు వదిలివేస్తున్నాను కాబట్టి ఇకపై సీఐఎస్-ఎ2కె తరఫున అధికారికంగా ఏ ప్రకటనా చేయబోవట్లేదు. ఇక నుంచి నేను తెలుగు వికీపీడియాలో ఏ చర్చలో ఏమి రాసినా, బయట ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగత స్థాయిలోనే చేయనున్నాను.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 16:11, 4 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • పవన్ సంతోష్ గారూ ముందుగా కొత్త కొలువులో చేరబోవుతున్నందుకు అభినందనలు.కెరీర్‌ పరంగా వేరే సంస్థలో ఉద్యోగానికి మారాలని మీరు తీసుకున్న నిర్ణయం మంచి భవిష్యత్తు అనే మార్గంలో మరో పై మెట్టు ఎక్కబోతున్నారని నాఅభిప్రాయం.మీరు ఆశించిన జీవన ప్రయాణంలో మరిన్ని శుభాలు కలగాలని,ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎక్కగలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తెలుగు వికీపీడియాకు మీ సేవలు, అవసరమైనవార్కి మీ సలహాలు ఎల్లప్పుడూ అవసరమనీ ఒకసారి గుర్తు చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:53, 4 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • వాడుకరి:Pavan_santhosh.s గారి సిఐఎస్-ఎ2కె కృషికి ధన్యవాదాలు. వికీపీడియాలో కృషి కొనసాగిస్తారని తెలపటం సంతోషం. వారి తదుపరి వృత్తిపరజీవితానికి, వ్యక్తిగతజీవితానికి శుభాకాంక్షలు.-- అర్జున (చర్చ) 03:09, 5 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి:Pavan_santhosh.s సి. ఐ. ఎస్ తరపున ప్రాతినిథ్యం వహించి తెలుగు వికీకి మంచి సేవలందించారు. ఇకపై కూడా తన కృషిలో ఏమాత్రం మార్పు ఉండబోదని ఖచ్చితంగా చెప్పగలను. రవిచంద్ర (చర్చ) 13:49, 6 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలంగాణలో పేజీలు సృష్టించబడని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా[మార్చు]

"భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చిన పనిపై స్థితి నివేదిక" విభాగంలో డేటా లేనందున పేజీలు సృష్టించకపోవడపై స్పష్టత లేదని అర్జున గారు ఒక అబిప్రాయం వెలిబుచ్చుతూ, “ప్రభుత్వ వుత్తర్వుల ప్రకారం పేజీలు సృష్టించవలసిన రెవిన్యూ గ్రామాలన్నింటికి మొలక పేజీలుయైనా సృష్టించితే కాలక్రమంలో జనగణన డేటాతో తాజా పరచబడతాయి” అని కూడా మరొక అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు నందు నిర్జన గ్రామాల విషయంలో ఎటువంటి ఆధారాలు చూపబడనందున వీటిలో ఏవి నిర్జన గ్రామాలు లేక ఏవి సరియైన ప్రజలు నివాసం చేసే గ్రామాలు అనే సందిగ్థం కలిగినందుననూ, నిర్జన గ్రామాల విషయంలో సముదాయం తొలగించటానికి నిర్ణయం ఉన్నందుననూ, తగిన ఆధారాలు లభ్యమైనప్పుడు సృష్టించవచ్చు అనే అబిప్రాయంతో వీటిని సృష్టించబడలేదు.ముందు ముందు వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి ఇక్కడ పొందుపరచబడినది. గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:01, 6 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు, నా ఇటీవల అద్దంకి మండలం (ప్రకాశం జిల్లా)అద్దంకి మండలం కృషిలో జనగణన లో జనాభా సున్నా గలవి నిర్జనగ్రామాలుగా గుర్తించాను. --అర్జున (చర్చ) 03:29, 7 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ జనన గణన డేటా ఎక్కించి ఉంటే, కేవలం జననగణన లొకేషన్ కోడ్, భూమి వినియోగం, నీటిపారుదల సౌకర్యాలు విభాగాలు మాత్రమే ఉంటాయి.జనాభా వివరాలు ఏమి ఉండవు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిర్జన గ్రామాలు పూర్తిగా తొలగించబడలేదు.జనాభా వివరాలు కొన్ని గ్రామాలలో ఎటువంటి ఆధారం లేకుండా కూర్పు చేసి ఉండి, జనన గణన కోడ్ లేకపోతే అది శివారు గ్రామం, లేక పంచాయితీ గ్రామం అని భావించవచ్చు.మాదిరి వ్యాసం ఇక్కడ చూడండి. --యర్రా రామారావు (చర్చ) 04:43, 7 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు నేను గ్రామాలకు వాడుతున్న కొత్త సమాచారపెట్టెలో {{Infobox India AP Village}} ఆ సూత్రాన్నే వాడి రెవిన్యూగ్రామం, లేకం గ్రామం అని వచ్చేటట్లుగా చేశాను. ఆ పనిపై ప్రతిక్రియ అభ్యర్ధించినా, 10 రోజులైనా ఒక్కరూ స్పందించకపోవటం నిరాశ కలిగిస్తున్నది. --అర్జున (చర్చ) 03:32, 8 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలంగాణలోని డేటా ఎక్కించని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా[మార్చు]

"భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చిన పనిపై స్థితి నివేదిక" విభాగంలో డేటా ఎక్కించకపోవడం అనే దానిపై స్పష్టత లేదనే ఒక అబిప్రాయం అర్జున గారు వెలిబుచ్చారు.దానికి వివరణ. ఈ గ్రామాల అన్నింటికి వ్యాస పుటలు ఉన్నవి.కానీ ఈ గ్రామాలకు డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు.కానీ ఈ జాబితాలోని ఉదహరించిన గ్రామాలు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం పేరుకు రెవెన్యూ గ్రామాలే కానీ, ఇందులో కొన్ని నగరాలు. పట్టణ ప్రాంతాలు, పట్టణ స్థాయికి ఎదిగిన గ్రామాలు, ఎక్కువగా మండల ప్రధాన కేంధ్రంగా కలిగిన గ్రామాలు ఉన్నవి.వీటి డేటా విషయంలో చదువరి గారూ, పవన సంతోష్ గారూ దీనిపై వివరణలు ఇవ్వవలసి ఉంది.ఆ గ్రామాలన్నింటికి ఇక్కడ పొందుపరచబడినది.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:18, 6 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలంగాణలోని అన్ని 589 మండలంలోని గ్రామాల మూసలు సంరక్షణలో ఉంచుట గురించి[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ‘ మండలంలోని గ్రామాలు ’ మూసలు ఇక ఎల్లప్పుడూ సవరించేపని ఉండదు. వాటిని సవరించేపని ఎదైనా జిల్లాలోగానీ, మండలంలోగానీ, లేదా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోగానీ ఇప్పుడు జరిగిన మాదిరిగా పునర్య్వస్థీకరణ జరిగినప్పుడు మాత్రమే వాటిని సవరించాల్సిన పని ఉంటుంది. వీటి విషయలో సముదాయం చర్చించి అన్నింటిని నిర్వాహకులు మాత్రమే మార్పులు చేర్పులు చేసేలాగున సంరక్షణచర్యలు లేదా ఇతరత్రా చర్యలు చేపట్టకపోతే, కొద్దికాలంలోనే పునర్య్వస్ఖీకరణ మార్పులు,చేర్పులు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందనేది నూటికి నూరుపాళ్లు నిజమని నా అభిప్రాయం. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఏది రెవెన్యూ గ్రామమో చెప్పలేని పరిస్థితి కలిగిందనేది వాస్తవం.ప్రస్తుతం తెవికీలో చురుకైన వాడుకరులు, నిర్వాహకులు కొరతగా ఉన్న సంగతి మనందరం ఒప్పుకోవాల్సిన విషయం.కొత్తగా వచ్చే వాడకరులు తెవికీ మార్గదర్శకాలుగానీ, విధాన నిర్ణయాలుగానీ వెంటనే వార్కి అవగాహన ఉండే పరిస్థితి లేదు.గ్రామాలు విషయం వస్తే రెవెన్యూ గ్రామానికి, పంచాయితీ గ్రామానికి, శివారు గ్రామానికి, నివాస ప్రాంతానికి ఉన్న వ్యత్యాసాలు చాలా మందికి అంతగా అవగాహన ఉండదు.ఈ ఆలోచన నా అంతట నాకు తోచిందికాదు.జిల్లాల,మండలాల పునర్య్వస్థీకరణ ప్రాజెక్టు పని చేసేటప్పుడు అవగాహనలేని వాడుకరులు అలాంటి మార్పుల చేసినందున తరుచూ సవరించవలసివచ్చేది.దాని నుండి ఈ అభిప్రాయం నా ఆలోచనకు స్పరించింది. కావున ఈ విషయంపై గౌరవ వికీపీడియన్లు స్పందించవలసిందిగా కోరుచున్నాను. --యర్రా రామారావు (చర్చ) 03:53, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • యర్రా రామారావు గారు మీ అభిప్రాయం సరైనదే అనిపిస్తుంది. రెవెన్యూ గ్రామానికి, పంచాయితీ గ్రామానికి, శివారు గ్రామానికి, నివాస ప్రాంతానికి వ్యత్యాసాలు ఉంటాయని మీరు చెప్పేంతవరకు నాక్కూడ తెలియదు. ఇంతకాలం ఎంతోకష్టపడి సమయం వెచ్చించి చేసిన దాంట్లో, వాటి గురించి సరైన అవగాహన లేనివారు వచ్చి మార్పులు చేస్తే, చేసినంతా వృధా అవుతుంది. కాబట్టి, మీ అభిప్రాయాన్ని నేను సమర్ధిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:49, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజ్ గారూ నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. --యర్రా రామారావు (చర్చ) 08:00, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రామారావు గారి ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాను. తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రామాల మీద గట్టి కృషిచేసి, ఈనాడు వీటిని సంరక్షించే దశకు తీసుకురావడం మంచి సంగతి. --పవన్ సంతోష్ (చర్చ) 13:28, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • యర్రా రామారావు గారి ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. రెవెన్యూ గ్రామానికి, పంచాయితీ గ్రామానికి, శివారు గ్రామానికి, నివాస ప్రాంతానికి ఉన్న వ్యత్యాసాలు తెలియని వాడుకరులు, అనామక వాడుకరులు అనవసర దిద్దుబాట్లు చేయకుండా సంరక్షించవలసిన అవసరం ఉంది.--కె.వెంకటరమణచర్చ 15:14, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, కె.వెంకటరమణ గారూ నాఅభిప్రాయంతో ఏకీభవించి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 15:21, 10 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ముందుగా, ఈ మూసలపై యర్రా రామారావు గారు చేసిన కృషిని అభినందిస్తున్నాను. ఇక ఈ మూసలను ఎందుకు సంరక్షించాలి, ఎందుకు కూడదు.. అని ఆలోచిస్తే కొన్ని సంగతులు నాకు తట్టాయి. ఇది కేవలం బాహాటంగా చేస్తున్న ఆలోచనలుగా (థింకింగెలౌడ్) భావించమని మిమ్మల్నందరినీ కోరుతున్నాను.
 1. [సంరక్షణ అవసరం లేదు] మామూలుగా ఇతర పేజీల్లో జరిగే స్థాయి కంటే, ఈ మూసల్లో ఎక్కువ దుశ్చర్యలు జరుగుతాయా? అవునని నాకు అనిపించడం లేదు.
 2. [సంరక్షణ అవసరం లేదు] ఇవి సాఫ్ట్‌వేరు కోడుతో కూడుకున్న సంక్లిష్టమైన మూసలు కావు, ఉత్త స్టాటిక్ మూసలు. ఒక మాట తీసేసినా, వేసినా ఆ మాట వరకే దాని ప్రభావం ఉంటుంది, మొత్తం మూసపై ఉండదు. మూస బేసిక్ కోడ్‌ను మారిస్తే ప్రభావం ఉంటుంది, నిజమే. కానీ అలా మారిస్తే ఈ మూసలు మాత్రమే కాదు.. ఏ మూసైనా వికలమౌతుంది.
  1. [అవసరమే] ఈ మూసలు ముఖ్యమైనవి కాబట్టి వాటికి సంరక్షణ అవసరం.
 3. [అవసరం లేదు] ఇవి, కొన్ని ఇతర మూసల లాగా వందల వేల పేజీల్లో వాడేవేమీ కావు. దానిలో చేసే మార్పులు మహా అయితే ఓ ఇరవై పాతిక పేజీల్లో ప్రభావం చూపిస్తాయి.
  1. [అవసరమే] ఇరవై పాతిక అయినా సరే.. మళ్ళీ సరిదిద్దే వరకూ సంబంధిత పేజీలు వికలమయ్యే ఉంటాయి గదా!
 4. [అవసరం లేదు] ఒక ముఖ్యమైన గమనిక.. వికీ పేజీలన్నీ సాధ్యమైనంత వరకు సార్వజనికంగా దిద్దుబాట్లకు అందుబాటులో ఉండాలి. అది వికీస్ఫూర్తి. ఏక మొత్తంగా ఓ పదీ పన్నెండొందల మూసలను (ఐదారొందలిక్కడ, ఇంకో ఆరొందలక్కడా) సంరక్షించడమంటే పెద్ద మాటే (పెద్ద పని అన్నేను అనడం లేదు).
 5. [అవసరమే] ఇకపై ఈ మూసల్లో మార్పుచేర్పులు చెయ్యాల్సిన అవసరమేమీ లేదు అని రామారావు గారు చెప్పారు.
  1. [అవసరం లేదు] చెయ్యాల్సిన అవసరం వచ్చినపుడు, మనం గమనించని అవసరాన్ని వేరొకరు గమనించినపుడు చెయ్యాలంటే..?
  2. [అవసరమే] స్ఫూర్తి సరే.., సంరక్షణ అవసరమైనప్పుడు చేస్తే తప్పేమైనా ఉందా? లేదు.
 6. [అవసరం లేదు] ఇన్నాళ్ళుగా ఈ మూసలు ఏ సంరక్షణలోనూ లేవు. మరి, ఇప్పుడెందుకు?
ఒక ముఖ్యమైన మాట - ఆయా మూసల్లో అనేక మార్పులు చేసి, తప్పులు సరిచేసి, ప్రస్తుత రూపానికి తెచ్చిన రామారావు గారికి - ఎవరైనా వీటిని చెడగొడతారేమోనన్న ఆదుర్దా ఉండటం చాలా సహజం. మనందరికీ అలాగే అనిపించడం కూడా సహజమే. నేను పై అభిప్రాయాలన్నిటినీ మన్నిస్తున్నాను.
ఇక, నా అభిప్రాయం - ప్రస్తుతానికి చెయ్యకుండా, కొన్నాళ్ళు చూసి, దుశ్చర్యలు జరుగుతున్నాయని గమనిస్తే, అప్పుడు సంరక్షణ (సామూహిక లేదా వైయక్తిక) గురించి ఆలోచించవచ్చేమో పరిశీలించవలసినదిగా అందరినీ కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:11, 11 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తెవికీలో ఏదేని పేజీకి రక్షణ విధించాలంటే మనం గమనించాల్సినవి రెండే విషయాలు. మొదటిది ఆ పేజీ అత్యంత ప్రధానపేజీ అయి ఉండి, అవగాహనలేని వారు అందులో మార్పులు చేస్తే వందలాది పేజీలలో ప్రభావం చూపడం తద్వారా ఆ పేజీలు ఛిన్నాభిన్నం కావడం, రెండోది ఆ పేజీకి తరుచుగా దుశ్చర్యలు జరుగుతూ ఉండటం. కాని గ్రామవ్యాసాలలో ఉండే మూసలు సరాసరిన 20-25 పేజీలలో మాత్రమే ప్రభావితం చూపుతాయి. అవి అంత ప్రధానమైన పేజీలు కూడా కావు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు ఏదేని మార్పులు చేసిననూ మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడం పెద్ద ఇబ్బంది కానేకాదు. ఇక దుశ్చర్యల సంగతి చూస్తే మూసలలో తరచూ దుశ్చర్యలు జరిగిన సంఘటనలు జరిగినట్లు దాఖలాలు ఇదివరకు ఎప్పుడూ లేవు. ఇదివరకు మండల వ్యాసాలలో ఉండే గ్రామపేర్ల పట్టికలో కొత్త వాడుకరులు మార్పులు చేర్పులు చేసినది వాస్తవమే కాని మూసలలో సాధారణంగా కొత్తవారు చేయడం చాలాచాలా అరుదే. నా స్వంతజిల్లా వికారాబాదు జిల్లాకు చెందిన అన్ని మండలాల గ్రామ మూసల చరితంను పరిశీలిస్తే ఎక్కాడా ఇదివరకు దుశ్చర్యలు జరిగిన దాఖలాలేమీ నాకు కనిపించలేవు. కనీసం కొత్త సభ్యులైనా మార్పులు చేర్పులు చేసినట్లు కూడా లేదు. కాబట్టి ఆ మూసలు ఇక సంపూర్ణంగా తయారయ్యాయనీ, ఇక ముందు మార్పులు చేయాల్సిన అవసరం ఉండదనే ఏకైక కారణంతో సంరక్షణ విధించడం సరికాదనిపిస్తుంది. ఆ మూసలు సంపూర్ణంగా తయారయ్యాయనీ, ఇక ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి కూడా వీలులేదు. నాకు తెలిసిన చాలా గ్రామాలను పరిశీలించాను, చాలా గ్రామాలకు ఉచ్ఛారణలో తేడా ఉన్నట్లుగా గమనించాను. గ్రామపేర్లలో ఉచ్ఛారణను సరిచేయడానికి తెవికీ నియమాల ప్రకారం అందరికీ దిద్దుబాట్ల అవకాశం ఉండాలి. కొత్తవ్యక్తులు మూసలలో దిద్దుబాట్లు చేసినప్పుడు అన్ని మూసలను గమనించే శక్తిసామర్థ్యాలు మనకు లేవనీ, చురుకైన వాడుకరుల కొరత ఉందనీ మనకు తెలుసు, కాని దుశ్చర్యలు జరుగని ఈ మూసలకే ఇంతగా ఇబ్బంది పడితే వేలాది వ్యాసాలలో జరిగే మార్పులుచేర్పులు పర్యవేక్షించడం అసలు సాధ్యం కాదేమో! ఇక గ్రామపేర్లలో ఉచ్ఛారణ గురించి తాండూరు మండలంలోని గ్రామాలను పరిశీలిస్తే ఇప్పుడు ఉన్నపేర్లకు అసలుపేర్లకు తేడా ఉంది. జింగుర్తి (జిన్‌గుర్తి), ఖంజాపుర్ (ఖాంజాపూర్), కొట్లాపూర్ ఖుర్ద్ (కొత్లాపూర్ ఖుర్ద్), మిట్టబాచ్‌పల్లి (మిట్టబాస్‌పల్లి), వీరెడ్‌పల్లి (వీరారెడ్డిపల్లి), చెంగేష్‌పూర్ (చెనిగేష్‌పుర్/చెన్‌గేష్‌పూర్), ఈర్షెట్‌పల్లి (ఈర్షెట్టిపల్లి) ఒక్క మండలంలోనే ఇచ్ఛారణలో ఇన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఈ ఉచ్ఛారణ తేడాలు సరిదిద్దాలంటే నిర్వాహకులకు సాధ్యంకాదు, ఆ పనికి నిర్వాహకేతర సభ్యుల సహకారం అవసరం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:02, 11 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రావు గారూ, చాలా అవసరమైన అంశాన్ని లేవనెత్తారు. ఊళ్ళ పేర్లు చాలావాటిని సంస్కరించాల్సి ఉంది. అందరం పూనుకుంటే గాని పని కాదు. మీరు ఆ పనికి నేతృత్వం వహించి ఈ తప్పు పేర్లున్న పేజీలను సవరించే పనికి పూనుకోవాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:05, 14 ఆగస్టు 2019 (UTC) +1 --రహ్మానుద్దీన్ (చర్చ) 13:59, 14 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరిగారూ, మండల వ్యాసాలలో మరియు గ్రామపేర్లకు చెందిన మూసలలో ఉన్న పేర్లలో పదేళ్ళ క్రితమే నేను నాకు తెలిసిన వాటిని చాలావరకు సవవరించాను (ఉదా:చూడండి). అయిననూ ఏ ఒక్కరికీ అన్ని మండలాలలోని గ్రామపేర్లపై అవగాహన ఉండదు కదా! అసలు ఈ గ్రామపేర్లన్నీ ఆంగ్లం నుంచి బాటు ద్వారా తర్జుమా చేసేటప్పుడే ఈ పొరపాట్లు వచ్చాయి. ఈ పేర్లు ముందుగా మండల వ్యాసాలలో అతికించడం, వాటినే కాపీపేస్టుల రూపంలో మూసలలో వాడటంతో ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. గ్రామపేర్లలో చాలావాటికి దీర్ఘాలు లేనిచోట్ల దీర్ఘాలు ఉండటం, ఉండాల్సినచోట లేకపోవడం, ళ, డ, ణ, శ తదితర ఉచ్ఛారణలుండేచోట్ల ల, ద, న, స లు రావడం ... ఇలా జరిగాయి. (దౌలతాబాదు మండలంలోని గ్రామపేర్లను పరిశీలిస్తే బిచ్చాల్ పేరు బీచల్‌గా, కౌడీడ్ పేరు కౌదీద్‌గా, అంత్వార్ పేరు అంత్వర్‌గా, చంద్రకల్ పేరు చంద్రాకల్‌గా, గోకఫసల్వాద్ పేరు గోకాఫసల్వాద్‌గా ... ఇలా ఉన్నాయి). ఇప్పుడు వీటన్నింటినీ సంస్కరించాలంటే మనలోని కొద్దిమందితో సాధ్యంకాదనుకుంటాయి. కనీసం జిల్లాకొకరు ఆయా ప్రాంతాలలోని గ్రామపేర్లను బాగా తెలిసిన వారు అవసరం. ఎవరైనా ముందుకు వస్తే దీనికి నా వంతు తోడ్పాటు అందించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:46, 14 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సంరక్షణకు బదులు మూస మెరుగు[మార్చు]

సంరక్షణకు పూనుకునే ముందు, ముందు దోషాలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. గ్రామ మూసలో ఒకే జాబితా వున్నందున, వివిధ గ్రామాలపై అవగాహన సరిగాలేక జరుగుతున్నాయి. అందుకని వివిధ గ్రామరకాల గురించిన అవగాహన వివరం తెలిపి, గ్రామ మూసలో వివిధ జాబితాలు వుంచితే దోషాలు చేరడానికి ఆస్కారం తక్కువ. ఉదాహరణగా {{పర్చూరు మండలంలోని గ్రామాలు}} మూస చూడండి. --అర్జున (చర్చ) 04:09, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • అర్జున గారూ, పర్చూరు మూసను చూసాను. అవాంఛిత పేజీల సృష్టిని అపే ప్రత్యేక అంశమేమీ లేదందులో. ఈ లక్ష్యంతో మూసను మార్చాల్సిన అవసరం లేదు. కానీ, పర్చూరు మూస పాత మూస కంటే మెరుగ్గా ఉంది. మండలాలన్నిటికీ మూసను అలా మార్చవచ్చు అనుకుంటున్నాను. మీరు ఆపనికి పూనుకుంటే బాగుంటుంది. అ మూసకు సంబంధించి ఒక సూచన: ఆ నాలుగు రకాల గ్రామాల శీర్షికలను మార్చాలి. ఆ క్రమంలోనే "మరియు" అనే పదాన్ని తీసెయ్యొచ్చు.__చదువరి (చర్చరచనలు) 05:01, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ, మీరు మార్చిన {{పర్చూరు మండలంలోని గ్రామాలు}} మూసను చూసాను.కొన్ని కొత్తగా ప్రయోగం చేసే పనులు పాత వాటికన్నా ఆకట్టుకుంటాయి.కానీ లోతుగా (ప్రాక్టికల్) ఆలోచిస్తే అన్నిటికీ కాదుగానీ కొన్నిటికి కొత్త సమస్యలు తలెత్తుతాయి.ఇది ఆ కోవకు చెందిన మార్పు.అసలు నేను పాత వాటిని సంరక్షణ చేయాలని అభిప్రాయం ఇటువంటి ప్రయోగాలు నివారించటానికే.నేను చర్చకు లేవనేత్తిన అంశానికి ఇది పరిష్కారమార్గం అని మీరు భావిస్తున్నారు.నా దృష్టిలో ఇది పరిష్కార మార్గం ఎంతమాత్రంకాదని నా అబిప్రాయం.
 • ఈ మూస సాంకేతికంగా అసలు పనికిరాదు.ఇలా అన్ని మండలాలకు తయారు చేయాలనే అభిప్రాయం కలిగితే రచ్చబండలో చర్చకు తీసుకువస్తే ఇతర గౌరవ వికీపీడియన్స్ అభిప్రాయాలతో పాటు, విశ్లేసణతో నా అబిప్రాయం వివరిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 10:35, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • @చదువరి, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుత చర్చా విషయం అవాంఛిత పేజీల సృష్టిగురించి కాదు కదా. మీరు ఆ అంశం ఎందుకు ప్రస్తావించారో అర్ధం కాలేదు. ఇక ఉదాహరణగా ఇచ్చిన మూసలో తగిన మార్పులు నిరభ్యంతరంగా చేసి మెరుగు పర్చండి.--అర్జున (చర్చ) 23:28, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అసలు మూస సంరక్షణ చెయ్యాలన్న ఆలోచన ఎందుకొచ్చి ఉంటుందంటే..
 • 1. మూసలో కొత్త లింకులను చేర్చకుండా (అంటే కొత్త పేజీలను సృష్టించి గాని, సృష్టించకుండా గానీ కొత్త లింకులను ఇక్కడ చేర్చడం)
 • 2. మూసలో ఈసరికే ఉన్నవాటిని మార్చకుండా ఉండేందుకు
 • 3. ఇతర మార్పులేమీ చెయ్యకుండా ఉండేందుకు
 • మొత్తమ్మీద మూసలో అవాంఛిత మార్పులు జరక్కుండా చూసేందు కన్నమాట. ఆ ప్రయోజనం ఈ కొత్త మూసతో నెరవేరదు, అది స్పష్టం. (కారణం అడగబోయే వాళ్ళకోసం ఇది: దిద్దుబాటు చెయ్యకుండా సంరక్షించబడని ఏ పేజీనైనా ఎవరైనా సరిదిద్దే వీలు వీకీలో ఉంది) కానీ.., మూసలో వివిధ రకాల గ్రామాలను విడివిడిగా చూపించారు కాబట్టిన్ని, ఈ కొత్త మూసతో కొత్తగా ఏర్పడే ఇబ్బందులేమీ ఉండవని నాకు తోస్తున్నది కాబట్టిన్నీ, దీన్ని వాడొచ్చని భావిస్తున్నాను. అయితే అక్కడ వివిధ రకాలకు ఇచ్చిన పేర్లలో ఉన్న "మరియు" వంటి అంత-సముచితం-కాని వాడుకలను సవరించాలని కోరాను. __చదువరి (చర్చరచనలు) 04:57, 16 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • @చదువరి, మీరు ఇచ్చిన స్పష్టతకు ధన్యవాదాలు. నా వ్యాఖ్య సంరక్షణకు వ్యతిరేకం కాబట్టి, మూసలో అవాంఛిత మార్పులు జరగకుండా వుండడం అనే దానిపై దృష్టి పెట్టింది. 'మరియు' అనేదానిని సవరించాను. అయినా ఆ పదం తెలుగులో సమ్మతం కాని విషయం ఇంకా తెలుసుకోవాలని వుంది. ఇక మిగతావి శైలి పై ఎక్కువగా ధ్యాసపెట్టే వారు సవరించితే మంచిది.-- అర్జున (చర్చ) 23:49, 16 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సంరక్షణకు వ్యతిరేకంగా ముగ్గురు మాట్టాడారిక్కడ.. చంద్రకాంతరావు గారు ముక్కుసూటిగా చెప్పేసారు. నేను మూడు మైళ్ళు తిప్పి చివర్లో చెప్పాను. మీరు ముప్పై మైళ్ళు తిప్పి చెప్పారు. (కోపగించుకోకండి, చెతురుగా రాసానంతే!). ఒక రకంగా మన ముగ్గురిలోనూ మీరు మెరుగు -ఒక ప్రత్యామ్నాయం కూడా చూపించే ప్రయత్నం చేసారు. అభినందనలతో. __చదువరి (చర్చరచనలు) 01:07, 17 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పోతే అర్జున గారూ, ఆ మూసను ఇప్పుడే చూసాను. మరియు తీసేసారు గానీ, ఇప్పుడు అది ఇవ్వాల్సిన అర్థాన్ని ఇవ్వడం లేదనిపిస్తోంది. పరిశీలించగలరు.__చదువరి (చర్చరచనలు) 01:28, 17 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ అభినందలకు ధన్యవాదాలు. మీకు ఏ విధంగా అర్ధాన్ని ఇవ్వడం లేదో నాకు తెలియదు. మీ ఆలోచనకు తగ్గట్లు మార్చితే స్పందించగలను.--అర్జున (చర్చ) 03:35, 17 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ నా అబిప్రాయాలకు సంబంధించిన వివరణలు తెలుసుకుందామని కుతూహలంగా వుంది అని తెలిపినందుకు ధన్యవాదాలు.మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించి నా అభిప్రాయాలపై వివరణ వివరించాను.స్వాగతించగలరని నమ్ముతున్నాను.
 • మండలంలో ఉన్న రెవెన్యూ గ్రామాలుపై రెవెన్యూ శాఖకు చెందిన మండల రెవెన్యూ కార్యాలయం పర్వేక్షణ ఉంటుంది. అలాగే గ్రామ పంచాయితీలుపై పంచాయితీరాజ్ శాఖకు చెందిన మండల ప్రజా పరిషత్ పర్వేక్షణ ఉంటుంది.గ్రామ పంచాయితీలు వేరు, రెవెన్యూ గ్రామాలు వేరు. ఈ రెండిటిని ఒకే మూసలో కలిపి చూపించుటలో అర్ధంలేదు.
 • మూసలో రెవెన్యూయేతర గ్రామాలు ఎంత వివరంగా చూపించినా పర్చూరు మండలంలోని గ్రామాలు అనే వర్గం పరిశీలిస్తే ఆ వర్గంలో సంఖ్యాపరంగా ఎన్ని రెవెన్యూ గ్రామాలు, ఎన్ని గ్రామ పంచాయితీలు, ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి అనే దానికి సమాధానం లేదు.
 • అలాగే ఏవి రెవెన్యూ గ్రామాలు, ఏవి గ్రామ పంచాయితీలు, ఏవి నివాస ప్రాంతాలు అనేదానికి కూడా సమాధానం కనపడదు.
 • గతంలో 10 సంవత్సరాలకు పైబడిఉన్న మొలక వ్యాసాలు/ ఏక వాక్యవ్యాసాలు (ఇవి అన్నీరెవెన్యూయేతర గ్రామాలు) ఎటువంటి అభివృధ్దికి నోచుకోగపోగా ఈ మార్పులు చేసిన మూస ఇంకా వాటిని ప్రోత్సహించినట్లుగా ఉంది.
 • వ్యాసాలు లేని రెవెన్యూయేతర గ్రామాలకు మూసలో చూపించిన ఎర్రలింకులు లోగడ ఉన్న ఏకవాక్య వ్యాసాలు చాలవన్నట్లు, క్రొత్తవాటికి ద్వారాలు తెరిచినట్లుగా ఉంది.
 • రచ్చబండ పాతచర్చ 1 నుండి 66 వరకు గల జరిగిన రచ్చబండలలో గ్రామ వ్యాసాలుపై (మొలక వ్యాసాలు, ఏకవాక్య వ్యాసాలు) జరిగిన చర్చలలో గౌరవ వికీపీడియన్స్ వెల్లబుచ్చిన అభిప్రాయాలకు ఈ మార్పులు చేసిన మూస భిన్నంగా ఉంది.ఆ అభిప్రాయాలు దిగువ వివరింపబడిన లింకులు ద్వారా పరిశీలించవచ్చును
 1. రచ్చబండ/పాత చర్చ 17 - ఏకవాక్య వ్యాసాలు,
 2. రచ్చబండ/పాత చర్చ 18 - గ్రామ వ్యాసాల మొలకల గురించి,
 3. రచ్చబండ/పాత చర్చ 24 - ఏక వాక్య వ్యాసాలు,
 4. రచ్చబండ/పాత చర్చ 19 - మొలకపేజీల నియంత్రణ విధానం
 5. రచ్చబండ/పాత చర్చ 52 - పంచాయతీ లేని గ్రామాలపేర్లు విభాగంలో చంద్రకాంంతారావు గారి అబిప్రాయం
 6. రచ్చబండ/పాత చర్చ 61 - రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు విభాగంలో చదువరి గారి అబిప్రాయం
 1. తెలుగు వికీపీడియాలో ఏదేని ఒక వ్యాసం సృష్టించిన తరువాత అది మొలక వ్యాసంగా ఎన్నాళ్లు కొనసాగవచ్చు.? లేదా? మొలకవ్యాసాలు అభివృద్ది చెందటానికి కాలపరిమితి గురించి ఏమైనా మార్గదర్శకాలు, విధాన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా?
 2. కొంతమంది వాడుకరులు ఏకవ్యాక్యంతో వ్యాసాలు సృష్టించి దాని అభివృద్ది గురించి తరువాత పట్టించుకోకపోవటం ఎంతవరకు సబబు?
 3. 'నేను సృష్టించిన వ్యాసాలు' అనే గణాంకాలు కోసం ఇలా ఏక వాక్యం, లేదా బహుకొద్ది సమాచారంతో వ్యాసాలు సృష్టిస్తూ పోతే, వ్యాసాల పేరుబరులకు వికీపీడియా నిఘంటువు అనేపరిస్థితికి మనందరం తోడ్పాటు కల్పిస్తున్నామా?
 4. మనం నిర్ణయించుకున్న మార్గదర్శకాలు, విది విధాన నిర్ణయాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేదానిపై ఎప్పుడైనా చర్చించుకున్నామా?
 5. ఏకవ్యాక్యంతో గత 10 సంవ్సత్సరంల క్రిందట సృష్టించబడి, ఈరోజుకు కూడా అలా ఉన్న వ్యాసాలుపై మనం ఎప్పడైనా చర్చించామా ?
 • నా అబిప్రాయాలు ఒక్క పర్చూరు మండలంలోని గ్రామాలు దృష్టిలో పెట్టుకొని తెలుపుటలేదు.వికీపీడియా దృష్టిలో పెట్టుకొని వివరించాను.ఇవి అన్నీ నా స్వంత అబిప్రాయాలు.ఏ ఒక్క గౌరవ వికీపీడియన్స్ ఉద్దేశించి నేను అభిప్రాయాలు వెల్లబుచ్చలేదు.సముదాయం నిర్ణయించిన నియమాలను నేను ఎప్పడూ గౌరవించుతాను.పాత మూసలో కొత్త ప్రయోగంగా రెవెన్యూయేతర గ్రామాలు చేర్చే ప్రక్రియకు, ఈ విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మీ మనస్సు నొప్పిస్తే క్షంతవ్వుడుని --యర్రా రామారావు (చర్చ) 07:12, 17 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • యర్రా రామారావు గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. దాని ద్వారా నాకు తెలిసినది చంద్రకాంతరావు గారు 24 ఆగష్టు 2016 రోజునే మూసలో మూడు విభాగాలుగా విస్తరించడం గురించి చెప్పారు. నేను గమనించక మరల అలాంటిదే చెప్పాను. చదువరి గారు దానిని మెరుగైన ప్రత్యామ్నాయంగా అంగీకరించారు. ఇక మీ సందేహాలకు సమాధానాలు:
 • "సంఖ్యాపరంగా ఎన్ని రెవెన్యూ గ్రామాలు, ఎన్ని గ్రామ పంచాయితీలు, ఎన్ని నివాస ప్రాంతాలున్నాయి." దీనికి పర్చూరు మండలం వ్యాసం చూడండి. మూసలో వాడుక సౌలభ్యానికి ఒక వ్యాసం ఒకే విభాగంలో వుండాలి కాబట్టి వర్గంలో మీకు లెక్క తెలియదు.
 • "మొలకలను ప్రోత్సహించినట్లవుతుంది." గ్రామ వ్యాసాల మొలకలు బాట్ తో తొలిగా సృష్టించినప్పటినుండి మొలకల సమస్య చర్చలలో వుంది. దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించినట్లుగా లేదు. ఏదో విస్తరణ అని పనిచేసినా, విస్తరణ తెవికీనాణ్యతను ఇంకా దెబ్బతీసిందని నాకే కాదు ఇంకాకొంతమందికి వుంది. దానిగురించిన చర్చలూ జరిగాయి. వికీపీడియా ఎక్కువ వీక్షణలు వచ్చే పేజీలే తాజా పరచక,నిర్వహణ లేక అంత ఉపయోగ పడని స్థితికి చేరుతున్నాయి. అన్ని రకాల గ్రామాల్ని ఇప్పటికైనా వికీపీడియాలో వున్నాయా, ఇంక ఎవరైనా కొత్త గ్రామం సృష్టించరు అనుకుంటే అదీ లేదు. వికీపీడియా కార్యశీలత తగ్గుతున్న నేపథ్యంలో నాకు ప్రస్తుతం అనిపించేదేమంటే, గ్రామ వ్యాసాలని నాణ్యతతో అభివృద్ధి చేయటం అయ్యే పనికాదు. జిల్లా వ్యాసాలు,జిల్లా ముఖ్యపట్టణ వ్యాసాలే మన నాణ్యతగా అభివృద్ధి చేయలేకపోతున్నాము. అందుకని గ్రామ వ్యాసాల మొలకలకి మొలక నియంత్రణ విధానం నుండి మినహాయింపు ఇవ్వటమే మంచిది. సమస్యంతా బాట్ తోటి, బాట్ పాక్షికంగా వాడి, లేక మనిషే బాటు లాగా వ్యాసాలు సృష్టించడం, నాణ్యత పై ధ్యాసం లేకుండా అభివృద్ధి చేయడం. అందుకని ఆయా మొలక గ్రామ వ్యాసాలపై ఆసక్తి వున్న వాళ్లు ఉన్న ఒక వాక్యానికి, ఇంకొక వాక్యం మూలంతో రాసినా మంచిదే.
 • "గతంలో వికీపీడియన్స్ అభిప్రాయాలకు భిన్నంగా వుంది" పంచాయతీ లేని గ్రామాలపేర్లు విభాగంలో చంద్రకాంంతారావు గారి అభిప్రాయం లో తెలిపినట్లు ఈ ప్రతిపాదన ఇంతకుముందే వచ్చినది కావున కొంతమంది అభిప్రాయాలతోటి భిన్నంగా లేదు. అయినా వికీపీడియా పాత చర్చలు ఆయా కాలపరిస్థితులకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా జరుగుతాయి. వికీపీడియాలో మార్పే సహజం. ఆ మార్పు మెరుగునకు దారితీసేదైతే అందరూ స్వాగతించాలి.
 • "మార్గదర్శకాలకు భిన్నంగా వుంది." అనేక కారణాలవలన ఈ మొలకపేజీల నియంత్రణ విధానం అమలు చేయలేకపోయం. కావున దానిని మరల పరిశీలించాలి. దీనిగురించి నిర్ణయం వెలువడిన తర్వాత కొంత మంది సభ్యులు అమలు చేయటంలో క్లిష్టత గురించి సూచనలు చేశారు గమనించండి.
 • "గ్రామ వ్యాసం మార్గదర్శకాలులోని 7, 8, 11 నియమాలుకు పూర్తి భిన్నంగా ఉంది." ఈ మార్గదర్శకాలలో లోపాలున్నాయి. గ్రామం మూసలో రెవిన్యూ గ్రామాలే వుండాలంటుంది. మిగతా గ్రామాలని ఏం చేయాలి అనే దానిగురించి స్పష్టత లేదు. గతంలో తెలుగులో పంచాయితీ గ్రామాల పేర్లు కూడా తెలిసేవి కావు. ఇప్పడు జిల్లా జాలస్థలులలో పంచాయితీ గ్రామాల పేర్లు తెలుగులో అందుబాటులో వున్నాయి. గ్రామ అక్షాంశ రేఖాంశాలు జిఐఎస్ పోర్టల్ లో అందుబాటులో వున్నాయి. త్వరలో గ్రామపంచాయితీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆసక్తి వున్న వారు వారి గ్రామాలకైనా ఎన్నికైన సర్పంచుల పేర్లను చేర్చాలని కోరుకుంటారు. అటువంటివారికి సరియైన విధానాలను, సూచనలను చేయాలి తప్ప, తెలుగు వికీలో రెవిన్యూగ్రామాలే వుండాలి, ఇతర గ్రామాలు వుండకూడదు అనడంలో అర్ధంలేదు. వికీలో అన్ని రకాల విషయాలుంటాయి. రెవిన్యూశాఖ వారి మీద అంత ప్రేమ, మిగతాశాఖలవారిమీద కినుక వహించాల్సిన పనిలేదు. మీరు పంచాయితీరాజ్ శాఖ లో పనిచేసారు కాబట్టి, మీకు పంచాయితీగ్రామాలపైన ఇష్టం వుంటుంది అని భావించాను. అయితే మీ అభిప్రాయం భిన్నంగా వుండడం ఆశ్చర్యంగా వుంది. ఇక మూసలో వివిధ విభాగాలు పెట్టినా ఆయా పరిపాలన సంబంధిత వ్యాసాలకు విభాగ శీర్షికలలో తగిన లింకులు పెట్టవచ్చు.
 • "ఇంకా కొన్ని సందేహాలు'". రెండేళ్లకు పైగా మీరు గ్రామ వ్యాసాలపై విశేషంగా కృషి చేశారు. రచ్చబండని పై స్పందనకై శోధించారు. అందుకని ఇంకా మీకు తెలియనివి ఇంకా వున్నాయనుకోను. ఈ వివరణ మీ సందేహాలను కొంతవరకు తీర్చిందనుకుంటాను.--అర్జున (చర్చ) 01:07, 18 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • యర్రా రామారావు గారికి, మీ సందేహాలకు నా శక్తిమేర కృషి చేసి, చాలావరకు నాకు వీలైనంత స్పష్టంగా సమాధానాలు రాశానే. ఎక్కడ సరిగా అర్ధం చేసుకోలేదో తెలియచేయండి. సహ సభ్యులు కూడా స్పందించమని కోరుతున్నాను.. వికీపీడియాలో చర్చలు, ఎంతకీ ఏకాభిప్రాయం కుదరకపోతే ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్ణయాలకు రావడమే ప్రస్తుతం వికీపీడియాలో మార్గం.--అర్జున (చర్చ) 03:55, 18 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ నా గురించి పరిశోధించినందుకు ముందుగా ధన్వవాదాలు.మీరు నాకు ‘రెవిన్యూశాఖ వారి మీద అంత ప్రేమ, మిగతాశాఖలవారిమీద కినుక వహించాల్సిన పనిలేదు.మీరు పంచాయితీరాజ్ శాఖ లో పనిచేసారు కాబట్టి, మీకు పంచాయితీగ్రామాలపైన ఇష్టం వుంటుంది అని భావించాను.అయితే మీ అభిప్రాయం భిన్నంగా వుండడం ఆశ్చర్యంగా వుంది’ అని అబిప్రాయం వెలిబుచ్చారు.చర్చకు సంబంధంలేని వ్యక్తిగత విషయాలు నేనైతే ప్రస్తావించను.--యర్రా రామారావు (చర్చ) 17:45, 18 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • యర్రా రామారావు గారికి, అయ్యో, మీరు నొచ్చుకున్నట్లన్నారే! చర్చలలోని సాధారణ తీవ్రతని తేలికపరచడానికి, వికీపీడియా అన్ని విషయాలను చేర్చుకునేదనే విషయాన్ని కాస్త నొక్కి చెప్పడానికి ఆ ప్రస్తావన చేశాను. అంతే తప్ప నొప్పించాలని కాదు. క్షమాపణలు, ఇకపై ముఖ్యంగా మీతో చర్చలలో అలా చేయను.-- అర్జున (చర్చ) 22:18, 18 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారికి, మీరు {{కర్లపాలెం మండలంలోని గ్రామ పంచాయితీలు}} అనే మూసని చేసినట్లు గమనించాను. ప్రస్తుత చర్చలో మూసతీరుకు ప్రత్యామ్నాయంగా దానిని ప్రతిపాదించుతుంటే, ఆ మూస ఎలా మెరుగో కూడా ఇక్కడ చర్చించాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 22:27, 18 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ముందుగా మీరు పెద్ద మనసుతో క్షమాపణలు తెలిపినందుకు ధన్యవాదాలు.మండలంలోని గ్రామాల మూసలు సంరక్షణలో ఉంచుట గురించి అనే చర్చను నేను ప్రవేశపెట్టాను.దానికి మీరు సంరక్షణకు బదులు మూస మెరుగు అని పాత మండలంలోని గ్రామాలు మూసపై నేను దేనికైతే చర్చ ప్రవేశపెట్టానే అది అర్దం చేసుకుండా, పర్చూరు మండలంలోని గ్రామాలు పాత మూసను కొన్ని మార్పుల చేసి సంరక్షణకు ఇది ప్రత్యామ్నాయం అని ప్రవేశపెట్టారు.దానిమీద నేను నా దృష్టిలో ఇది పరిష్కార మార్గం ఎంతమాత్రంకాదని, ఈ మూస సాంకేతికంగా అసలు పనికిరాదని చాలా వివరణలతో వివరించాను.సరే దానిమీద మీరు ఏవో కొన్ని అభిప్రాయాలు వెల్లడించారు.ముందుగా మీరు మార్పులు చేసిన పర్చూరు మండలంలోని గ్రామాలు మూస ఏ విధంగా ప్రత్యామ్నాయం అనే దానిపై ఎక్కడా వివరించలేదు.కావున ముందుగా మార్పులు చేసిన మూస ఏ విధంగా ప్రత్యామ్నాయమో వివరించగలరని భావిస్తున్నాను.నేను ఒకవేళ మీకు గతంలో నా అభిప్రాయం అర్ధం అయ్యేటట్టు వివరించలేకపోతే, నేను మరొకసారి నా అభిప్రాయం వెల్లడిస్తున్నాను.ఆ మూసలో కేవలం రెవెన్యూ గ్రామాలు మాత్రమే చూపాలి.--యర్రా రామారావు (చర్చ) 08:39, 19 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • యర్రా రామారావుగారికి, మీ అభిప్రాయాలు నాకు చక్కగానే అర్ధమయ్యాయనుకుంటున్నాను. నా అభిప్రాయాలు, మీతో చర్చ విస్తరించక ముందే చదువరి గారు అర్ధంచేసుకొని మద్దతుని ప్రకటించినా, మీకు అర్ధమయ్యేటట్లుగా లేనందుకు విచారిస్తున్నాను. మీరు పేర్కొన్న ప్రశ్నలకు అంశాలవారీగా సమాధానం ఇచ్చాను. వాటిలో ఏవి మీకు సమంజసమనిపించిందో, ఏవి కాదో తెలియచేస్తే చర్చ మరింత మెరుగుగా కొనసాగించటానికి వీలయ్యేది. అయినా మీరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇంకొక తీరుగా సారాంశం రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పెట్టిన ప్రతిపాదన "మూసలో అసలు మార్పులు జరగకుండా సంరక్షణ చేయడం". వివిధ రకాల గ్రామాల గురించి అవగాహన లోపం వలన జరుగుతున్న దోషాలను, మీ ప్రతిపాదన సమర్ధంగా నివరించగలుగుతుందని ముగ్గురు సభ్యులు మద్ధతు తెలిపారు. ఒక సభ్యుడు ఎందుకు సంరక్షణ చేయకూడదో వివరించారు. చదువరి తొలిగా ఎటూ నిర్ణయం చేయలేకం కొంతకాలం వేచిచూడడం మంచిదని చెప్పి, ఆ తరువాత చేర్చిన నా స్పందన అర్ధం చేసుకొని నేను తెలిపినది మంచి ప్రత్యామ్నాయం అని తెలిపారు. నేను ప్రతిపాదించిన మూసలోని మార్పులు, సభ్యుల అవగాహనను మెరుగుపరచి, ఒకవేళలో మార్పులు చేయవలసివస్తే తప్పులు జరగకుండా అంటే గ్రామాన్ని మూసలో చేర్చేటప్పుడు ఆ సంబంధిత జాబితాలో చేర్చటానికి వీలు కల్పిస్తుందని, అందువలన సంరక్షణ అవసరం లేదు అని నా అభిప్రాయం అని తెలిపాను.
 • ఇక మీ వాదనలో నాకు అర్ధం కానిది "---- మండలం లోని గ్రామాలు" అనే మూసలో రెవిన్యూ గ్రామాలు మాత్రమే చూపాలి. రెవిన్యూ గ్రామాలు మాత్రమే ఎందుకు చూపాలి? గ్రామపంచాయితీలు, శివారు గ్రామాలు గ్రామాలు కాదా? ఇప్పటికి వరకు చర్చలో మీరు తెలిపారని నేను అనుకుంటున్న 'సాంకేతిక' అంశాలు, నా సమాధాన సారాంశం:
 1. "ఇప్పటికి ఏర్పడిన మార్గదర్శకాలకు అది భిన్నం": ఆ మార్గదర్శకాలలో లోపం వుంది కాబట్టి వాటిని సవరించాల్సిన అవసరముంది
 2. "కొత్త మొలక వ్యాసాలకు ఆస్కారముంటుంది": మొలకలు ఉండటం సమస్య కాదు, ఆ మొలకలను నాణ్యతపై ధ్యాన లేకుండా విస్తరించడమే సమస్య
 3. "వివిధ రకాల గ్రామాలు పరిపాలన పరంగా వివిధ శాఖల క్రిందకి వస్తాయి": మూసలోని జాబితా శీర్షికలకు ఆయా పరిపాలనా శాఖలకు సంబంధించిన వ్యాసాలకు లింకు ఇవ్వవచ్చు.
 • ఈ సందర్భంగా వికీపీడియా:ఐదు మూలస్తంభాలు లో చివరి స్తంభంలో కొంత భాగాన్ని వుటంకిస్తున్నాను "వికీపీడియాలో విధానాలు, మార్గదర్శకాలూ ఉన్నాయి. అయితే ఏవీ కూడా శిలాశాసనాలు కాదు; నిరంతరం రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్షరాలు, మాటల కంటే వాటి స్ఫూర్తి, ఆదర్శమూ ముఖ్యం. కొన్ని సందర్భాల్లో వికీపీడియాను మెరుగుపరచేందుకు, నియమాలను పక్కన పెట్టాల్సి ఉండొచ్చు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి, అయితే నిర్లక్ష్యంగా ఉండకండి".
 • ఇక నాకు అర్ధంగాని 'సాంకేతికాంశాలు' ఏవైనా వుంటే వాటిని మీరు కొంత వివరంగా తెలియపరిస్తే, వాటికి స్పందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:42, 19 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి:యర్రా రామారావు గారూ, సంరక్షణకు ఈ మూస ప్రత్యామ్నాయం కాదు అనేది నా అభిప్రాయం. ఆ ముక్క నేను స్పష్టంగా చెప్పాను. సంరక్షణకు ఆ మూస ప్రత్యామ్నాయం కాదు అంటూ నేను చెప్పినదిది:
 • "అవాంఛిత పేజీల సృష్టిని అపే ప్రత్యేక అంశమేమీ లేదందులో. ఈ లక్ష్యంతో మూసను మార్చాల్సిన అవసరం లేదు."
 • "అసలు మూస సంరక్షణ చెయ్యాలన్న ఆలోచన ఎందుకొచ్చి ఉంటుందంటే.. 1... 2... 3... మొత్తమ్మీద మూసలో అవాంఛిత మార్పులు జరక్కుండా చూసేందు కన్నమాట. ఆ ప్రయోజనం ఈ కొత్త మూసతో నెరవేరదు, అది స్పష్టం."
ఇంత స్పష్టంగా పైన చెప్పినా అర్జున గారు దాన్ని వక్రీకరించారు.
రామారావు గారూ, ఈ పాటికి మీరు ఒక సంగతిని గ్రహించే ఉంటారు... అర్జున గారితో చర్చ ఒక స్థాయి దాటాక, ఆయన చర్చ చెయ్యరు. నిరర్థక, నిష్ఫల, వ్యర్థ వాదనలు చేస్తారంతే. అడ్డగోలు వాదనలు చేసుకుంటూ, గోలుపోస్టులను మార్చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఈ చర్చలో అబద్ధాలు కూడా చెప్పేస్తున్నారు. నాలుగైదు పేరాల కిందట నేను రాసినదాన్ని తిరగేసి, నా నోట్లో తన మాటలు పెట్టి, నా వెనక దాక్కుని మీతో చర్చ చేస్తున్నారు. పట్టించుకోకండి, వదిలెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 01:59, 20 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@చదువరి గారికి, మూసలపై సంరక్షణ ఎలా అవాంఛిత పేజీల సృష్టిని ఆపుతాయో నా కైతే అర్ధం కాలేదు. సారాంశంలో మీ వ్యాఖ్యని వక్రీకరించినట్లు అనిపిస్తే ఆమాత్రం చెప్పండి. సారాంశం చేసేటప్పుడు కొంత తేడాలు రావడం ఎవరికైనా సహజం. నిరర్ధక, నిష్ఫల, వ్యర్ధవాదనలు అడ్డగోలు వాదనలు, గోలుపోస్టులు మార్చడం లాంటి మాటలు వాడడం ఖండిస్తున్నాను. మీరు రామారావు గారు ఎక్కువ కాలం కలిసి కృషిచేసివుంటే ఆయన మాటలు మీకు సులభంగా అర్ధమవవచ్చు. నాకు అర్ధమవటానికి కొంత సమయం పట్టవచ్చు. వికీ కేవలం వ్యాఖ్యల ఆధారంగా సహకరించుకొనేది కాబట్టి ఒకరి వాదన ఇంకొకరు అర్ధం చేసుకోవటంలో సమయం పట్టవచ్చు. వికీపీడియా లో అధిక అనుభవం వున్న మీరు అలా మాట్లాడడం ఏమాత్రం సమర్ధనీయంకాదు. 12 ఏళ్లుగా వికీలో పనిచేస్తున్న నా వ్యక్తిత్వంపై మచ్చ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయటం వెంటనే ఆపండి. ఇది వికీసహకారానికి ఆటంకం కలిగిస్తుంది. నేను గతంలో విమర్శిస్తే మీ పనిని విమర్శించాను, గాని వ్యక్తిగతంగా ఏమి విమర్శించలేదు. అది గుర్తిస్తే మంచిది. దీనిపై సహ సభ్యులు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 02:27, 20 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీ వ్యక్తిత్వంపై మచ్చ తీసుకువచ్చే ప్రయత్నం కాదు నాది. కానీ, అలా మీకు అనిపించింది కాబట్టి, మిమ్మల్ని నొప్పించినందుకు గాను మన్నించండి. __చదువరి (చర్చరచనలు) 07:00, 20 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

[వాడుకరి:యర్రా రామారావు]] గారూ, మరొక్క సంగతిని గమనించారా.. ఈ చర్చ వలన మీరు మీకు ఇష్టమైన పనిని పక్కన పెట్టేసారు. ఈ చర్చలో దిగబడి పోయారు గానీ, లేకపోతే ఈ పాటికి ఒక జిల్లాలోని గ్రామాల పేర్లను సరిచెయ్యడం సగం అవగొట్టి ఉండేవారు, మీరు. "పట్టించుకోకండి, వదిలెయ్యండి." అంటూ నేను సలహా ఇవ్వడం మీకు నచ్చకపోతే మన్నించండి.__చదువరి (చర్చరచనలు) 02:13, 20 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ఊబిలాంటి ఈ చర్చలో నేను మరీ దిగకుండా సరైన సమయంలో హెచ్చరించి కాపాడారు.అందుకు ధన్యవాదాలు.మీ సూచన (ఇష్టమైన పని) గమనించాను. చర్చను గమనించిన అందరికి నమస్కారం.ఉంటాను.--యర్రా రామారావు (చర్చ) 02:56, 20 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్ల సవరణ వికీప్రాజెక్టు[మార్చు]

అనేక గ్రామాల పేర్లు తప్పుగా ఉచ్చరిస్తూ మనం పేజీలను సృష్టించాం. వీటన్నిటినీ సరైన పేజీలకు తరలించాలి. గతంలో కొంతమంది వాడుకరులు (ఉదా: వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Pavan santhosh.s) ఈ తప్పులను ఉదహరించారు. పైన తెలంగాణలోని అన్ని 589 మండలంలోని గ్రామాల మూసలు సంరక్షణలో ఉంచుట గురించి అనే విభాగంలో చంద్రకాంత రావు గారు కూడా వీటిని ఉదహరించారు. ఈ పని ఒక్కరు చెయ్యగలిగేది కాదు కాబట్టి, ఒక ప్రాజెక్టుగా చేస్తే అందరూ కలిసి సాధించవచ్చనే ఉదేశంతో గ్రామాల పేర్ల సవరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. వాడుకరులు ఈ పేజీని పరిశీలించి, సూచలేమైనా ఉంటే చేసి, ఈ పనిలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:22, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • గ్రామ వ్యాసాల అభివృద్ధిలో భాగంగా ఇది మరొక మంచి కార్యక్రమం.నేను ఈ ప్రాజెక్టు పనిలో భాగస్వామ్యమై నావంతు సహకారం, తోడ్పాటు అందించగలనని తెలుపుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:45, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • @Chaduvari: గారూ, కార్యాచరణలోకి దారివేస్తున్నందుకు ధన్యవాదాలు. నేను సైతం ఈ ప్రాజెక్టుకి కొంత సమయం వెచ్చిస్తాను. ఇప్పటికే సభ్యుల జాబితాలో పగో జిల్లా తీసుకున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:26, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఈ ప్రాజెక్టు పని ఓపికతో చేయగల్గితేనే ఫలితంలో సార్థకత ఉంటుంది. ఇదివరకు గ్రామవ్యాసాలలో కొందరు సభ్యులు వడివడిగా కేవలం దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకొనే మోజుతో పనిచేసి, చేసేపనిలో అవగాహన లేకున్ననూ దిద్దుబాట్లు చేసి సమస్యను పెంచినట్లు కాకుండా ఆలస్యమైననూ మంచిఫలితం వచ్చేలా చేద్దామని సభ్యులను కోరుచున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:29, 15 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఈ ప్రాజెక్టు సమూహంగా చేయగలగడమే ఉత్తమం. దీనిపై స్పందించి, పాల్గొనే అందరికీ అభినందనలు. నాకు గ్రామ వ్యాసాలపై ఆశక్తి ఉంది. నేనూ కొంత సమయం పని చేయగలను..B.K.Viswanadh (చర్చ) 03:35, 16 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • B.K.Viswanadh గారూ, అవునండి, మీరు చెప్పినది అక్షరాలా నిజం. అసలు ఏ ప్రాజెక్టైనా - దాదాపుగా అన్నీ - సామూహికంగా చేసేందుకు ఉద్దేశించినదే అని మీకు తెలియనిది కాదు. కాకపోతే వివిధ ప్రాజెక్టుల పట్ల ఉన్న ఆసక్తులను బట్టి కొందరు చేరుతారు, కొందరు చేరరు. అది చాలా సహజం. ఆసక్తి లేని పనులు ఎవరు మాత్రం చేస్తారు!? కొన్ని ప్రాజెక్టులు ఒకరిద్దరితోనే సాగుతూంటాయి. కొన్ని ఆ మాత్రం కూడా లేక చతికిలబడతాయి. ఏ ప్రాజెక్టునైనా ముందుకు తీసుకుపోయేది ప్రాజెక్టు కాడిని మెడకెత్తుకునే వాడుకరులే. __చదువరి (చర్చరచనలు) 05:07, 16 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • చిత్తూరు జిల్లాలో గ్రామాల పేర్లు చాలావరకు ఇదివరకే నేను సవరించాను. ఇంక నాకు చుట్టుపక్కల జిల్లాలైన నెల్లూరు, కడప జిల్లా ఊర్లపేర్ల మీద అవహగాన ఉంది కాబట్టి అందులో తోడ్పాటు అందించగలను. రవిచంద్ర (చర్చ) 11:36, 16 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

New tools and IP masking[మార్చు]

14:18, 21 ఆగస్టు 2019 (UTC)

2010వికీపీడియా ఎడిటర్ తో దోష నిర్ధారణకు సహాయం[మార్చు]

పంపానది బగ్ నమోదులో తెలిపినట్లు, 2010వికీపీడియా ఎడిటర్ తో పదాలు నకలు చేసి అతికించేటప్పుడు తొలిఅక్షరంలో సున్నా చేరివుంటే, దాని ముందు అక్షరం నకలులో చేరుటలేదు. అయితే బగ్ నిర్వహణాధికారి దానిని నిర్ధారించలేకపోయాడు. సహసభ్యులు ప్రయత్నించి వారు ఉపయోగిస్తున్న నిర్వహణ వ్యవస్థ, విహరిణి రూపము సంఖ్య లాంటి వివరాలతో బగ్ లోవ్యాఖ్య చేర్చండి. --అర్జున (చర్చ) 03:48, 22 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ నేను మ్యాక్ బుక్ ప్రో వాడుతున్నారు. ఫైర్ ఫాక్స్ 68.0.2 వాడాను. క్రోం Version 76.0.3809.100 (Official Build) (64-bit) వాడాను. మీరు చెప్పిన బగ్ రీప్రొడ్యూస్ కాలేదు. కానీ ఇంకో సమస్య ఉంది. అది ఇందులో చేర్చవచ్చో లేదో తెలియదు. నకారపు పొల్లు పదాంతంలో ఉంటే అది పూర్ణంగా (ం) మారిపోతున్నది. ఉదాహరణకు రూమ్ అని టైపు చేసి స్పేస్ బార్ నొక్కగానే రూం అని మారిపోతున్నది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి సవరించాల్సి వస్తున్నది. దీన్ని వేరే సమస్యగా నివేదించమంటారా?రవిచంద్ర (చర్చ) 06:28, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారి స్పందనకు ధన్యవాదాలు. మీ అనుభవం బగ్ లో నివేదించండి. నేను నా కంప్యూటర్ లోని inscript వాడుతున్నాను, మీరు వికీపీడియా ULS లిప్యంతరీకరణ వాడుతున్నారు. రూం వ్రాయటానికి ruuM లేక rUM అని వ్రాస్తే ఇబ్బంది వుండదు. పూర్తి వివరాలకు పట్టికచూడండి.--అర్జున (చర్చ) 00:09, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ నాకు కూడా ఆ ఇబ్బంది రాలేదు. నేను విండోస్ 7 లో బ్రేవ్ బ్రౌజరు 0.68.132 వాడుతున్నాను. ఇక్కడ మండల అతికించాను. గతంలో క్రోమ్ లో కూడా రాలేదు.
పదాంతంలో మకారపు పొల్లు రావాలంటే & వాడాలి. రూమ్ కోసం rUm& అని రాయాలి. రవిచంద్ర గారు అడిగినట్లు rUm అని రాస్తే రూమ్ వచ్చేలా ఉంటే సౌకర్యంగా బాగుంటుంది. ఈ ఎడిటరుతో మరో సమస్య: జ్ఞ గుణింతం రాయలేం (జ్ఞు, జ్ఞే వగైరాలు). శాస్త్రజ్ఞుడు రాయాలంటే లేఖినికి వెళ్తున్నాన్నేను. లేదా శాస్త్రవేత్త అని రాస్తున్నాను. వేరే మార్గమేమైనా ఉంటే చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 09:40, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారూ జ్ఞ గుణింతం గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. నేను కూడా చాలా రోజుల నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నాను. రవిచంద్ర (చర్చ) 10:49, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ అనుభవం బగ్లో నివేదించండి. రూం వ్రాయటం గురించి పైన చూడండి. శాస్త్రజ్ఞుడు రాయటానికి సమస్య నిజమే. ULS రాకముందు ఈ సమస్య లేదనుకుంటాను. గతంలో User:Veeven ఎక్కువగా ఈ కీబోర్డు పద్ధతి గురించి స్పందించేవారు. ఆయన దృష్టికి వచ్చినట్లు లేదు. నేను ఈ విషయమై బగ్ T231955 నివేదించాను. --అర్జున (చర్చ) 00:09, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ruuM రాసినా, rUM రాసినా రూం అనే పడుతోంది (అలాగే పడాలి కూడా). మీరు చెప్పినట్టు రూమ్ అని పడటం లేదు. __చదువరి (చర్చరచనలు) 00:49, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, నేను అలా చెప్పలేదే? మీరు రూమ్ గురించి స్పష్టత ఇవ్వగా, నేను రూం గురించి స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నం అవసరంలేదోమోననిపిస్తుంది. ఏమైనా 'm&' వాడటం RTS సమాచారం పట్టికలో కనబడలేదు. అది అవసరంలేకుండా మ్ రావాలి కాబట్టి వేరొక బగ్ నివేదించవచ్చు. వీలైతే ఆ పని చేయగలరు. రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 02:59, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
జ్ఞ గుణింతం గురించి వాడుకరి:రహ్మానుద్దీన్ కొంత పనిచేసాడు. దాన్ని ముందుకు కదిలించాలి. రహ్మానూ!
ఇక, మనం కోరుకున్నప్పుడు మ్ రావడానికి ఏదోటి చేయాలి. అందం, కంచం, మంచం, కందం, చందం, ఇలా మనం సున్నాలు ఎక్కువే రాస్తాం. కనుక mని సున్నాగా ఉంచేద్దాం. మ్ కోసం m& అని చైపు చేయగలిగేలా చేయాలి. చూస్తాను. అన్నట్టు మ్, సున్నాల మధ్య RTSలో తేడా రాకుండా ఉండటానికి ఎప్పుడో ఒక ప్రతిపాదనను రాయబోయాను. ఆసక్తి ఉన్నవారు, చూసి చెప్పండి. దాన్ని కూడా ఒక పట్టు పడదాం. — వీవెన్ (చర్చ) 09:54, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వీవెన్ గారి స్పందనకు ధన్యవాదాలు. అయితే దాదాపు 15 ఏళ్లు గడిచినా, ఇంకా తెలుగు ప్రవేశపెట్టు పద్ధతిలో దోషాలుండటం బాధాకరమనిపించింది. ఈ గుణింతము సమస్య, తెవికీలో తొలిగాప్రవేశపెట్టిన వైజాసత్య పద్ధతిలోకూడా సమస్య వుండేదా? తాజా తెలివైన లిప్యంతరీకరణ పద్ధతులు గురించి ప్రకటన చేశాను. ఆ పద్ధతులు దోషంలేకుండా తెలుగు టైపు చేయటంలో చాలావరకు మన వికీపీడియన్లకి ఉపయోగమనుకుంటాను. --అర్జున (చర్చ) 14:14, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వేబ్యాక్‌మెషిన్[మార్చు]

ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లోని వేబ్యాక్‌మెషిన్ ఈమధ్య పని చెయ్యడం లేదు, యూఆరెల్‌లు ఆర్కైవు కావడం లేదు. నాకొక్కడికేనా, ఇంకెవరికైనా కూడా జరుగుతోందా..!?__చదువరి (చర్చరచనలు) 10:25, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, నాకు బాగానే పనిచేస్తుందండీ. నేను ఫైర్ ఫాక్సు లో పవన్ సూచించిన ఒక యాడాన్ సహాయంతో ఇప్పుడే ఒక యూఆరెల్ భద్రపరిచాను చూడండి. లింకు. రవిచంద్ర (చర్చ) 12:29, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నాక్కూడా బాగానే పనిచేస్తుంది చదువరి గారు, దాదాపు నేను అన్ని యూఆరెల్‌లు ఆర్కైవు చేసిన తరువాతే వికీలో చేరుస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:18, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మరి.. నాకెందుకు పనిచెయ్యడం లేదు చెప్మా? చూడాలి.__చదువరి (చర్చరచనలు) 16:55, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెవికీపై మరో యాంత్రిక అనువాదాల దాడి?[మార్చు]

ఈ రోజు ఈనాడులో వచ్చిన వార్త( "అమ్మ భాషకు.. అక్షర తిలకం". ఈనాడు. Archived from the original on 2019-08-27.) చూడండి. వికీపీడియాలో పనిచేసే వారితో కనీసం ఎలాంటి సంప్రదింపులు జరపకుండా యాంత్రిక అనువాద వ్యాసాలు ఇక్కడికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండమని నా మనవి. ఒకసారి గూగుల్ అనువాదం చేసిన పని వల్ల చాలా చెత్త పేరుకుపోయింది. ఈ పని ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నాణ్యత లేని వ్యాసాలు రానీయకుండా జాగ్రత్త పడాలి. రవిచంద్ర (చర్చ) 12:26, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • "ఆన్‌లైన్‌లో అనువాదం చేయనుండటంతో యంత్రం కూడా ఎప్పటికప్పుడు కొత్త పదాలు తెలుసుకుని తప్పులు సరిదిద్దుకుంటుంది." అన్నది ఇక్కడ కీలకమైన అంశమని నా అవగాహన. 40 లక్షల వ్యాసాల ద్వారా వారి అనువాద యంత్రాన్ని మెరుగుపరుచుకోవడం దీనిలో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అలాగే దీనిలో పెయిడ్‌ ఎడిటింగ్ ప్రమాదమూ పొంచి ఉంది. మనం అప్రమత్తంగా ఉండడం అవసరం. --పవన్ సంతోష్ (చర్చ) 16:30, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రవిచంద్ర గారూ, చాలా అవసరమైన విషయాన్ని చర్చకు తెచ్చారు. కచ్చితంగా వాడుకరులంతా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళెవరో పారబోస్తూ ఉంటే మనం ఎత్తుకుంటూ ఉండటం కుదరదు. నాణ్యత బాగుంటే యాంత్రికానువాదాలతో మనకేమీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. కానీ గూగుల్ యాంత్రిక శవసాహిత్యం లాగా ఉంటే మాత్రం (ముఖ్యంగా వాక్యనిర్మాణం గురించి) మనం ముందే జాగ్రత్త పడాలి. కనీసం యాభయ్యో వందో దిద్దుబాట్లు చెయ్యనివాళ్ళు కొత్త పేజీలు సృష్టించవీలు లేని పరిస్థితి కల్పించడమో, మరోటో చెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 17:03, 26 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, చిన్న సూచన. ఇలానే కన్నడ వికీపీడియాలోకి సీఐఎస్-ఎ2కె నిర్వహిస్తున్న క్రైస్ట్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద ఎత్తున రూపొందిస్తున్న పేజీలు అన్నీ మొలకలు తయారు అవుతున్నాయని మొలకల నిరోధం ఒకటి విధించారు. కనీసం ఇన్ని బైట్ల (3 వేల బైట్లు అనుకుంటా) సమాచారంతో వ్యాసం సృష్టించకుంటే వ్యాసం సృష్టిని నిరోధించే ఓ టూల్ రూపొందించారు. నా ఉద్దేశంలో దాని వల్ల సముదాయం చురుకుదనం బాగా తగ్గిపోయింది. తర్వాత చాన్నాళ్ళకు పలు కళాశాలలో వికీపీడియా ప్రవేశపెట్టి రకరకాల ప్రయత్నాల ద్వారా దాన్ని గాడిలో పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి బయటి శక్తుల కోసం మనం నియంత్రణ విధానాలు రూపొందిస్తే సహజ వేగం మందగమనం అవుతుంది. కాబట్టి, మన నియంత్రణ విధానాలను రూపొందించుకునేప్పుడు ఈ అంశాలు గుర్తుంచుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:01, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • యాంత్రిక అనువాద సమస్యలు గురించి మన కొంత సమీక్ష చేశాము. అప్పుడు జరిగిన తప్పులు మరల దొర్లకుండ అది కొంత వరకు ఉపయోగపడవచ్చు. అయితే యాంత్రిక అనువాదమే కాదు, సమాజంలోని వారిని ప్రోత్సహించి తెలుగు వికీ వ్యాసాలు రాయించి ఎక్కించేలా చేస్తారట. దీనికి సిఐఎస్-ఎ2కె ప్రాజెక్టు అనుభవాలు కనీసం వారికి, మనకు సహాయం పడతాయి. మరి ఆ దిశగా సిఐఎస్-ఎ2కె అనుభవాలను సమీక్షించటం/క్రోడీకరించడం మంచిది. ఈ దిశగా నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అలాగే తెలుగు వికీ ప్రాధాన్యాలను కూడా నిర్ణయించితే వారు సంప్రదించినపుడు సరియైన సమాధానం చెప్పకలుగుతాము. 2012 వరకు సముదాయ పరంగా ప్రాధాన్యాలను నిర్ణయించే ప్రయత్నం చేశాము. ఆ తరువాత సిఐఎస్-ఎ2కె ఆ పనిచేస్తుందని అనుకున్నాము. తెలుగు వికీ పరంగా లక్ష్యాలుంటేనే ఇటువంటి ప్రయత్నాలను సమర్ధవంతంగా ఎదుర్కొనగలుగుతాము, లేకపోతే పట్టుమని పదిమంది, చాలావరకు వ్యక్తిగత ఆసక్తులపై పనిచేసే వికీపీడియన్లు , పెద్దమొత్తంలో పెట్టుబడితో, ప్రభుత్వం ప్రాయోజకత్వంతో ప్రారంభించే ప్రాజెక్టులను ఎదుర్కోలేము. --అర్జున (చర్చ) 01:00, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పెద్ద ఎత్తున ఒక వికీమీడియా ప్రాజెక్టు మీద పనిచేసిన అనుభవమూ, దాని వల్ల వచ్చిన అనుభవాలూ కూడా సీఐఎస్-ఎ2కెకి ఉన్నాయండీ. కాబట్టి, నేను ఈ అంశంపై ఇప్పటికే సంస్థ ఈడీ సునీల్ అబ్రహాం సమయం తీసుకుని, ఆయన్ని సంప్రదించివున్నాను. ఆ అనుభవాలు క్రోడీకరిస్తూ పరిశోధనాత్మక వ్యాసాన్ని రూపొందించి ప్రచురించడానికి, దీన్ని ఒక ముఖ్యమైన ప్రాధాన్యతగా స్వీకరించడానికి ఆయన అంగీకరించారు. ప్రచురించాకా, అది మనకు ప్రాతిపదిక ఏర్పరుచుకోవడానికి పనికివస్తుందనే భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:38, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. పరిశోధన వ్యాసానికి అవసరమైన దత్తాంశాల చిత్తు ప్రతి ఒకనెలలో వికీలో చేర్చి, సముదాయ స్పందనలు కూడా తీసుకుంటే ఉపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 00:57, 29 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అసలు ఈ ప్రాజెక్టు గురించి వికీపీడియాలో ప్రస్తావించకుండా ఎలా వాళ్ళు ప్రచురించారు. వికీసభ్యుల ప్రమేయం ఉందా?, ఉంటే వారు ఎలాంటి చర్చలు చేసారు, వికీలో ఇలాంటి ప్రయోగం కోసం ఆఫ్‌లైన్ వంటి చర్చలు నిర్ణయాలు కాని ఇతర ఏవైనా సంప్రదింపులు జరిగాయా? ఎందుకంటే వాళ్ళు పూర్తి ప్లాన్‌తో ప్రాజెక్టు వివరాలు అందించారు. కనుక ఎవరైన వాడుకరులు దీనిపై పని చేసి ఉండొచ్చా?. వీటిలో ఏదైనా జరిగి ఉంటే తెలియచేయగలరు. B.K.Viswanadh (చర్చ) 14:58, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

భారతీయ భాషల - ఇతర ఇంటర్నెట్లో అభివృద్ధి చెందుతున్న భాషల వికీపీడియాలకు గూగుల్-వికీమీడియా ఫౌండేషన్ మద్దతు[మార్చు]

బహరా ఇండోనేషియా భాష-వికీపీడియాపై గూగుల్ సంస్థ కొత్తగా ఓ ప్రయోగం చేపట్టింది. దీన్ని వికీమీడియా ఫౌండేషన్-బహరా ఇండోనేషియా వికీమీడియా సముదాయాలతో సంప్రదింపులు జరిపి, కలిసి పనిచేసి సముదాయం కోరిన విధంగా తన ప్రయోగంలో సవరణలు చేసి మరీ ఈ ప్రయోగాన్ని అమలుచేసింది.

ఇండోనేషియా భాషలో కనుక గూగుల్లో ఎవరైనా వెతికి చూస్తే, ఆ సమాచారం సదరు భాషకు చెందిన వికీపీడియాలో లేకపోతే ఆంగ్ల వికీపీడియాలోని పేజీ మీద ఆటోమేటిక్ అనువాదం కనిపించేలా ఓ ప్రయోగం చేశారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే చదివేవారికి ఇది మనుషులు చేసిన అనువాదం కాదని, గూగుల్ చేసిన యాంత్రికానువాదమని ఆ పేజీలో స్పష్టంగా బ్యానర్ కనిపిస్తుంది. ఆ పేజీ కింద ఇండోనేషియన్ వికీపీడియన్లు కోరిన విధంగా - ఫలానా బహరా ఇండోనేషియా భాషలో వికీపీడియా ఉందనీ, అందులో మీరూ కృషిచేయవచ్చనీ - ఇలా ఆ భాష వికీపీడియన్లు ఏం కోరితే అది చూపిస్తోంది.

తెలుగు సహా పలు భారతీయ భాషలు, ఆసియాకు చెందిన వివిధ భాషలు, అంతర్జాతీయంగా అనేక ఆఫ్రికన్, దక్షిణ అమెరికన్ భాషల్లో - స్థానిక ప్రజలు సమాచారం స్థానిక భాషల్లో వెతుకుతున్నా తగ్గ విధంగా ఆయా భాషల వికీపీడియాల్లో సమాచారం లభించట్లేదనీ, అలా లభించేలా ఏదైనా చేయాలని గత కొన్నేళ్ళుగా గూగుల్ పడుతున్న తాపత్రయం. భారతదేశంలో గత ఏడాది, ఈ ఏడాది ఇందుకోసమే - స్థానికంగా ఆసక్తి కలిగించే సమాచారం వృద్ధి - చేయాలంటూ తెలుగు సహా అన్ని భారతీయ భాషా సముదాయాలకు ప్రాజెక్టు టైగర్ పేరిట మద్దతునిచ్చారు. ఇండోనేషియా భాషలో మాత్రం పైన చెప్పినట్టు వేరే తరహా ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నాన్ని హిందీకి విస్తరిస్తామని గూగుల్వి కీమీడియా ఫౌండేషన్ ద్వారా హిందీ వికీపీడియన్లను అడగగా వారు తమ భాష వికీపీడియాలో భారీ ఎత్తున అనువాద చెత్త తయారవుతుందేమోనని భయపడి ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. ఐతే, ఆ యాంత్రికానువాద పేజీలో హిందీ వికీపీడియన్లు ఏ రకమైన సందేశం కావాలంటే అలాంటి సందేశమే చూపించగల అవకాశం ఉందని గూగుల్ వారికి తెలియజేసింది.

ఈ అంశాలన్నిటినీ వివరిస్తూ గూగుల్ - వికీమీడియా ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ఒక సమావేశానికి వికీమేనియాలో నన్ను, తమిళ, మలయాళ, అరబిక్, దక్షిణ అమెరికా భాషల వికీపీడియన్లను ఆహ్వానించగా హాజరయ్యాను. ఈ సందర్భంగా తెలుసుకున్న సంగతి సందర్భాలు సముదాయానికి తెలియజేస్తున్నాను. మొత్తానికి తెలియవచ్చిన సంగతి ఏమంటే - ఈ ప్రాజెక్టు రీత్యానే కాదు - మనం మన భాషలో సమాచారం విస్తరించడానికి గూగుల్ సహకారంతో చేయగలిగిన మోడల్, అది అంతర్జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో విస్తరించడానికి తగిన బలమున్నది ఏదైనా ఉంటే క్రమేపీ వికీమీడియా ఫౌండేషన్ ద్వారా ప్రతిపాదించవచ్చు. సాధ్యమైతే మన భాషకీ, తద్వారా ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భాషలకు మేలు చేకూర్చుకోగలిగితే చాలా బావుంటుంది.

ఇప్పటికిప్పుడు ఇదేదో తేల్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఐతే మన లక్ష్యాలను ఈ విధంగా ముడిపెట్టుకుని శ్రేయస్సు సాధించగలిగేది ఏమైనా ఉంటే చర్చించడానికి, సాధించడానికి అవకాశం ఉందని సముదాయ సభ్యులతో చెప్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:51, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు చెప్పినట్టుగానే టూల్ ప్రవర్తన ఉండేట్టయితే మనకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా వ్యాసాలు పాడయ్యే అవకాశాలు ఉన్నట్టు అనిపించలేదు. B.K.Viswanadh (చర్చ) 06:56, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • పవన్ సంతోష్ గారికి, వికీమేనియా లో గూగుల్ ప్రయోగం చర్చల వివరం తెలిపినందుకు ధన్యవాదాలు. అలాగే పూర్తి వికీమేనియా సందర్శన నివేదిక (తెలుగు వికీపై ప్రభావం చూపే అంశాలతో), మరియు ఈ సందర్శన తెలివిడులతో తెలుగువికీలో ఏమి చేస్తే బాగుంటుందో కాస్త వివరంగా తెలియచేస్తే సముదాయానికి ఉపయోగంగా వుంటుంది, భవిష్యత్ లో వికీమేనియా వెళదామనుకునే వారికి కూడా ప్రేరేపణగా వుంటుంది. --అర్జున (చర్చ) 01:02, 29 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Arjunaraoc గారూ, తప్పకుండా. మనం గవర్నెన్సులో ప్రభావం చూపగలగాలి అన్నా, వికీమీడియా ప్రపంచంలో తెలుగు వికీపీడియా దాని హక్కులు, అవకాశాలు అందుకోగలగాలి అన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ ఫలితాలు సముదాయానికి పంచే సత్సంప్రదాయం ఉండాల్సిందే. అలాగే చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:12, 29 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Wikimedia Strategy Draft Recommendation Discussion Salon[మార్చు]

Please translate this message to your language if possible.

Talk-icon-Tamil-yesNO.svg

Greetings,
You know Strategy Working Groups have published draft recommendations at the beginning of August. On 14–15 September we are organising a strategy salon/conference at Bangalore/Delhi (exact venue to be decided) It'll be a 2 days' residential event and it aims to provide a discussion platform for experienced Wikimedians in India to learn, discuss and comment about the draft recommendations. Feedback and discussions will be documented.

If you are a Wikipedian from India, and want to discuss the draft recommendations, or learn more about them, or share your valuable feedback you may apply to participate in the event.

Please have a look at the event page for more details The last date of application is 5 September.

It would be great if you share this information who needs this. For questions, please write on the event talk page, or email me at tito+indiasalon@cis-india.org

Regards. -- Tito using MediaWiki message delivery (చర్చ) 17:54, 27 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొంత నేపథ్యం[మార్చు]

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా స్ట్రాటజీ 2030 అన్న ప్రక్రియ నడుస్తోంది. అడ్వొకసీ, డైవర్సిటీ (వైవిధ్యం), రీసోర్స్ అలొకేషన్ (వనరుల కేటాయింపు), కెపాసిటీ బిల్డింగ్ (శిక్షణ, సామర్థ్యం పెంపు వగైరా), పార్టనర్‌షిప్ (భాగస్వామ్యం), రెవెన్యూ స్ట్రీమ్స్ (రాబడి తీరు), కమ్యూనిటీ హెల్త్ (సముదాయ శ్రేయస్సు), ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ (అధికార వ్యవస్థలు, బాధ్యతలకు సంబంధించింది) అన్న తొమ్మిది వర్కింగ్ గ్రూపులు తమ తమ థీమ్‌ల పైన పనిచేశాయి. 2030 నాటికి మన సముదాయాల ఉమ్మడి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన రికమెండేషన్లు అందిస్తాయి ఇవి. ఈ వర్కింగ్ గ్రూపుల్లో స్వచ్ఛందంగా పనిచేసే 9-12 మంది ఎంపికైన వాడుకరులు ఉంటారు. వీరిలో సాధారణమైన వాడుకరి నుంచి వికీమీడియా బోర్డు మెంబర్ వరకు వివిధ హోదాలు కలిగినవారు, ప్రపంచవ్యాప్తంగా పలు భాషలు, ప్రదేశాలు, ఇతర వివిధ గుర్తింపులకు చెందినవారు ఉన్నారు. వీరు ఇప్పటికే చిత్తు రికమెండేషన్లు అందించారు. పైన చెప్తున్న స్ట్రాటజీ సెలూన్ అలాంటి రికమెండేషన్లపై మనం, వికీపీడియన్లం, చర్చించి వాటిపై సూచనలు అందించే అంశానికి చెందింది. ఆసక్తికల వికీపీడియన్లు దరఖాస్తు చేసుకొమ్మని ప్రోత్సహిస్తూ ఇది రాశాను. అలానే మరో సంగతి కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్ గ్రూపులో నేనొక సభ్యుడిని. --పవన్ సంతోష్ (చర్చ) 09:11, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆటోమాటిక్ మూలాలు[మార్చు]

విజువల్ ఎడిటర్లో పని చేసేటపుడు, మూలాలను ఇవ్వాలంటే ఎడిటరుకు పైన ఉండే టూలుబారు లోని "Cite" అనే లింకును నొక్కాలి. అపుడు Add a Citation అనే డైలాగ్ బాక్సు వస్తుంది. ఇందులో Automatic, Manual, Re-use అనే మూడు ట్యాబులుంటాయి (ప్రస్తుతం ఇవి ఇంగ్లీషులోనే ఉన్నాయి, త్వరలోనే వీటిని తెలుగులోకి మార్చుకుందాం). ఇప్పటి వరకూ Automatic అనే ట్యాబు అచేతనంగా ఉండేది; నొక్కితే అది తెరుచుకునేది కాదు. ఇప్పుడు దీన్ని చేతనం చేసాను, తెరుచుకుంటోంది. అందులో ఒక url ఇస్తే దానంతట అదే మూలాన్ని తయారు చేసుకునే సౌకర్యం ఉంది. ఒక వార్తల url తో దాన్ని పరీక్షించాను, పని చేసింది, మూలాన్ని తయారు చేసింది. మిత్రులందరూ దీన్ని పరీక్షించి, వాడవలసినదిగా కోరుతున్నాను.

ఈ పరికరం url ను ఆర్కైవు చేసుకోదు, మనమే ఆర్కైవు చేసి అక్కడ చేర్చాలి. అది కూడా తానే స్వయంగా చేసుకుని, ఆర్కైవు url చేర్చేసుకునే సౌకర్యం ఉంటే ఈ పరికరంలో ఉంటే బాగుంటుంది. లేదా అర్జున గారు ప్రతిపాదించిన బాటును చేతనం చేసి, వారానికోసారి నడుపుతూంటే సరిపోతుంది. __చదువరి (చర్చరచనలు) 10:36, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 • చదువరి గారికి, మూలాల నాణ్యత పెంచే దిశగా పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు.నాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం, internetarchivebot కూడా మూలాలు చేర్చలేదు. ఇప్పటికే మూలాలు ఆర్కైవ్ లో వుంటే, ఆర్కైవ్ మూలాన్ని చేర్చి, పనిచేయని లింకుని పనిచేసే లింకులాగా మార్చుతుంది. అంతే. హిందూ లాంటి పత్రికలు కూడా చందాదారులుగా చేరిన వారికే, వారి వెబ్సైటు అందుబాటుచేసే (Paywall) నడిపే ప్రయత్నాలలో వున్నాయి. విహరిణికి archive addon చేర్చుకొని సభ్యులందరూ ఆర్కైవ్ లో భద్రపరచి, లింకులు చేర్చటం చేయకపోతే వికీపీడియా అతి తక్కువ కాలంలో మూలాల నిర్ధారణకు ఉపయోగపడనిదిగా అయిపోతుంది. --అర్జున (చర్చ) 10:50, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ, నేను అన్నది కూడా అదే, కానీ నేను సరిగ్గా చెప్పలేదనుకుంటా.. ఏంటంటే, మూలాలను మనం చేరుస్తాం. మీరు నడిపే బాటు ఆ మూలాలను ఆర్కైవు చేసి ఆర్కైవు లింకులను మూలానికి చేరుస్తుంది అని. ఇకపోతే, పత్రికలు.. చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంచటం.. భవిష్యత్తులో అది జరుగుతుందనే అనుకుందాం. అంత మాత్రాన, ఇప్పుడున్న సమస్య పొడవూ, వెడల్పులను పెంచేసి, భూతద్దం లోంచి చూసి నిరాశ పడ్డం నాకు ఇష్టం లేదు. ఆటోమాటిగ్గా మూలాలను చేర్చే వీలును వాడుకోడం, మీరు అ బాటు నడిపితే, ఆర్కైవు లింకులు కూడా మన ప్రమేయం లేకుండా చేరిపోవటం ప్రస్తుతానికి ఈ రెండూ జరిగితే చాలు అని నా ఉద్దేశం. ఆ తరవాత, తరువాతి మెట్టు గురించి ఆలోచిద్దాం అనేది నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 11:10, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • పోతే ఇప్పుడే గమనించాను, కొన్ని లింకులని అది మూలాలుగా మార్చడం లేదు. హిందూ లింకులతో బాగానే పని చేస్తోంది.తెలుగు పత్రికల లింకులతో పని చెయ్యడం లేదు. అవే లింకులు ఇంగ్లీషు, హిందీ వికీల్లో పనిచేసాయి. కారణమేంటో చూడాలి. __చదువరి (చర్చరచనలు) 11:12, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అవసరమైన మార్పుచేర్పులు చేసాను. ఇప్పుడు తెలుగు లింకులతో కూడా మూలాలను తయారు చేస్తోంది. దీన్ని విస్తృతంగా వాడి లోటుపాట్లను చర్చించవలసినదిగా వాడుకరులందరికీ వినతి. __చదువరి (చర్చరచనలు) 12:59, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • చదువరి గారికి,అర్ధమైంది. ఈ బాటు ఈ నెలాఖరులో పనిచేయవచ్చు అని ఆ బాటు నిర్మాత బగ్ నివేదికలో కొద్ది రోజులక్రిందట వ్రాశారు. అన్నట్లు, ఇది వికీసభ్యత్వమున్న ఎవరైనా వారు పనిచేసే పేజీలలో నడపవచ్చు. తొలి ప్రయోగాలు జరిగిన తరువాత దీనిలో పరిమితులేమైనా వుంటే చూద్దాం. --అర్జున (చర్చ) 11:23, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • నిజమే గానీ అర్జున గారూ, ముందు మీలాంటి సాంకేతికులు దాన్ని వాడి అంతా బాగుంది, ఇక ఎవరైనా వాడొచ్చు అని తేల్చిన తరువాతనే నాబోటి గాళ్ళు నడపాలని నేను అభిప్రాయ పడుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 13:03, 28 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Project Tiger important 2.0 updates[మార్చు]

Infrastructure support

Project Tiger Community Based Applications.png

Did you know that applications for Chromebooks and Internet stipends under Project Tiger 2.0 are open since 25th August 2019?
We have already received 35 applications as of now from 12 communities. If you are interested to apply, please visit the support page and apply on or before 14 September 2019.

Article writing contest

Project Tiger Media post Black.png

As part of the article writing contest of Project Tiger 2.0, we request each community to create their own list by discussing on the village pump and put it on respective topic list.

We also request you to create a pan India article list which needs to be part of writing contest by voting under each topic here

For any query, feel free to contact us on the talk page 😊
Thanks for your attention
Ananth (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 13:20, 29 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల గురించి[మార్చు]

కోటయ్య క్యాంపు, మల్కీజుగూడ, రెడ్డిపాలెం - ఈ మూడింటినీ గతంలో - వాడుకరి:యర్రా రామారావు గారనుకుంటాను - తొలగింపుకు ప్రతిపాదించారు. వాడుకరి:Arjunaraoc గారు వీటిలో మొదటి రెంటినీ ముందుకు తీసుకుపోతూ చర్చా పేజీలను (వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మల్కీజుగూడ, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కోటయ్య క్యాంపు) మొదలు పెట్టారు. వారం లోగా స్పందనలు లేకపోతే తొలగిస్తాను అని రాసారు అక్కడ. మూడో దానికి మాత్రం తొలగింపు మూసను తీసేసి మౌలిక పరిశోధన మూసను పెట్టారు. గ్రామ వ్యాసాలకు పరిమాణం ప్రామాణికం కాదు కావున మూస మార్చాను అని వివరణ ఇచ్చారు. ఈ చర్యల మధ్య కొన్ని వారాలో నెలలో ఎడం ఉందనుకోండి.. తొందర్లో గమనించలేదేమోలే అని అనుకునేవాణ్ని, లేదా అభిప్రాయం మార్చుకున్నారేమోలే అని అనుకునేవాణ్ణి. కానీ ఇవి వరసబెట్టి ఐదారు నిముషాల వ్యవధిలో చేసిన మార్పులు!

పైగా మొన్నీ మధ్యే బాగా చర్చ చేసిన, బాగా నలిగిన విషయం అది.

పెద్దగా సమాచారం లేని గ్రామ వ్యాసాలను తొలగించాలా లేదా అనే విషయమై ఈ మధ్య మళ్ళీ చర్చ జరిగింది. ఒక నిర్ణయం ప్రకటించాక, అర్జున గారు అబ్బే ఇది నిర్ణయమేమీ కాదు, దాన్ని పాటించేవాళ్లు పాటించవచ్చు, పాటించని వాళ్లు పాటించకుండా వుండవచ్చు అని ప్రకటించారు. ఆ మాటతో ఆ చర్చంతా దండగై పోయింది. ఇప్పుడు ఆ ముక్క రుజువైంది. అర్జున గారు తప్పు చేసారని చెప్పడం కాదు నా ఉద్దేశం; ఒక చర్చ చేసి, దానిపై చేసిన నిర్ణయాన్ని తూచ్, పట్టించుకోనక్కర్లేదు అంటూ అనేస్తే ఇదిగో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెబుతున్నాను. ఒక విధానాన్ని, ఒక మార్గదర్శక సూత్రాన్నీ పట్టించుకోకుండా పనిచేస్తూంటే మనకు తికమక ఉంటుంది అని చెబుతున్నాను. ఆయనకే కాదు, ఎవరికైనా జరుగుతుందది. (కొన్ని పేజీలను తొలగించనూ వచ్చు, కొన్నిటిని ఉంచనూ వచ్చు, అవే నిర్ణయాలను కొన్నాళ్ళాగి తిరగదోడనూ వచ్చు,.. అన్నీ రైటే అవుతాయి.) చేసిన చర్చను, దానిపై తీసుకున్న నిర్ణయాలనూ, మనకు ఇష్టమున్నా లేకున్నా, పాటించాలని చెప్పడం నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 04:43, 30 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, నా చర్యలకు కొంత నేపధ్యం అర్ధం చేసుకోవటం అవసరం. నిర్వహణ విభాగాలలో ఎక్కువగా గ్రామాలు (బహుశా శివారు గ్రామాలు లేక పంచాయితీలు అయివుండవచ్చు. ఎక్కువ సంఖ్యలో వుండడంతో పాక్షిక పరిశీలనతో చెపుతున్నది) వర్గం:తొలగించవలసిన వ్యాసములు అనే ప్రధాన వర్గంలో వున్నాయి. కొద్ది గ్రామాలు వర్గం:తొలగించవలసిన వ్యాసములు - చాలా కొద్ది సమాచారం అనే ఉపవర్గంలో వున్నాయి. అందువలన నిర్వహణ చేసేటప్పుడు ఆలోచన వేరుగానే వుంటుంది. వ్యాసాలు రాసినవారికి హెచ్చరికలు తొలగింపు ప్రతిపాదన చేసిన వారు చేర్చలేదు కనుక, వాటిలో సదరు సభ్యులను పేర్కొంటూ హెచ్చరిక చేయడమైనది. అది ప్రతిపాదించనవారి పనిని పూర్తిచేయడమే, నా స్వంత అభిప్రాయం కాదు అని గమనించాలి. ఇక గ్రామ వ్యాసాల గురించి అందరూ ఎవరు ఇష్టప్రకారం వారు చేస్తున్నప్పుడు గందరగోళంగానే వుంటుంది. అందుకనే చర్చను విధాన పద్ధతి వాడి ముందుకు తీసుకెళితే ఉపయోగంగా వుంటుంది. అప్పుడు నేను సైతం పాటిస్తాను. ఏదైనా మినహాయింపులుంటే చర్చించి అమలు చెయ్యవచ్చు. --అర్జున (చర్చ) 04:55, 30 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ,
 1. ఒక్కొక్కరు వారివారి ఇష్టప్రకారం చెయ్యడం గురించి నేను మాట్టాడలేదు, మీరే ఐదారు నిముషాల వ్యవధిలో రెండేసి ఇష్టాలను ప్రదర్శించడం గురించి మాట్టాడాను.
 2. రెండు పేజీల్లోనేమో ప్రతిపాదించినవారి పనిని పూర్తి చెయ్యడమేంటి, మూడో పేజీలో ప్రతిపాదించినవారి మూసను పక్కన పెట్టేసి మీ స్వంత అభిప్రాయాన్ని ప్రకటించడమేంటి? అని అడుగుతున్నాను. మూడు మూసలూ పెట్టినది ఒక్కరేనే! పెట్టిన మూస ఒక్కటేనే! చెప్పిన కారణమూ ఒక్కటేనే! మూడూ గ్రామ వ్యాసాలేనే!
 3. పోనీ పెట్టినది అజ్ఞాత కాదు, చెప్పకుండా తీసెయ్యడానికి, వాటిని పెట్టింది అనుభవమున్న వాడుకరే. మూసను తీసేసే ముందు చర్చ చేసి ఉండాల్సింది కదా.
 4. ".. అప్పుడు నేను సైతం పాటిస్తాను." అని అన్నారు. లేకపోతే పాటించరా? అంటే యర్రా రామారావు గారు సమర్ధించిన అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించారు కాబట్టి మూసను తీసేసారు. మరి ఆయన తన అభిప్రాయం ప్రకారం మూసను మళ్ళీ పెడితే..? మీ అభిప్రాయాన్ని మీరు అనుసరిస్తున్నట్టే, ఆయన అభిప్రాయాన్ని ఆయనా అనుసరిస్తున్నట్టే గదా. ఇప్పుడు మరి ఆ పేజీని ఉంచాలా, తీసెయ్యాలా? 12 ఏళ్ళ అనుభవమున్నంత మాత్రాన మీ అభిప్రాయానికి ఎక్కువ ప్రాముఖ్యత, 2 ఏళ్ళ అనుభవం మాత్రమే ఉన్నంత మాత్రాన ఆయన అభిప్రాయానికి తక్కువ ప్రాముఖ్యతా ఉండదు కదా? కానట్టయితే రెడ్డిపాలెం పేజీలోని తొలగింపు మూసను ఎందుకు తీసేసారు?
__చదువరి (చర్చరచనలు) 05:17, 30 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, స్పందన ఏకరీతిగా ఉండటానికి యాంత్రికంగా చేసిన నిర్వహణ కాదు. ఒక్కో వ్యాసం చూసి, దానికి ఎవరెవరు మార్పులు చేశారో ఉపకరణం వాడి చూసి, వారి దృక్పధాలు, అనుభవం అంచనా వేసుకొని, అర్ధం చేసుకొని, ఆయా వ్యాసాలు ఏ రకమో కొంత అంచనా వేసి, స్పందించినది. ఒక దానిలో మూస మార్చటం చర్చ జరపకుండా చేశాను అన్నారు. నేను మార్చినది కొద్ది సమాచారం అన్నదానిని మొలకతో మార్చాను. ఒక విధంగా రెండూ ఒకటే అర్ధమిచ్చేవే. ఇతర నిర్వాహకులు కొన్ని సార్లు తప్పు కారణాలు చూపుతూ హెచ్చరికలు చేయటం గమనించాను. ఈ సందర్భంలో ఆ వ్యాసం రెవిన్యూ గ్రామం కాదని అనుమానించి పంచాయితీ గ్రామమనుకొని మొలక మూస చేర్చినట్లున్నాను. ఇక చర్చ జరపకుండా మార్చటం పొరపాటే. ఎత్తిచూపిన మీకు ధన్యవాదాలు. తొలగింపు మూస చేర్చిన User:యర్రా రామారావు గారికి క్షమాపణలు. ఇకముందు మరికొంత జాగ్రత్తగా చేస్తాను. అయినా పొరబాటులేమైనా జరిగితే అభ్యంతరమున్న వారు ఆ మార్పులు రద్దు చేసి చర్చలో వ్యాఖ్యానించండి. నాకేమి అభ్యంతరము లేదు. ఇది తెలుగువికీలో సాధారణ విధానమేకదా. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 00:04, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, చాలా పేలవంగా ఉంది మీరు చెప్పిన "యాంత్రికంగా చేసిన నిర్వహణ కాదు" వాదన. కేవలం సమర్ధన కోసం చెబుతున్నదది. ఇకపోతే "అభ్యంతరమున్న వారు ఆ మార్పులు రద్దు చేసి చర్చలో వ్యాఖ్యానించండి." ని అన్నారు. పొరపాట్లు అందరూ చేస్తారు, అదేమీ ఎత్తి చూపాల్సిందేమీ కాదు. సరిదిద్దుకుంటూ పోతాం, అంతే. పొరపాట్లకు నేనేమైనా అతీతుణ్ణా ఏంటి! నేను ముందే చెప్పాను - అర్జున గారు తప్పు చేసారని చెప్పడం నా ఉద్దేశం కాదు అని. నేను చెప్పినదల్లా.. గతంలో చర్చ జరిగి నిర్ణయం వెలువరించాక, మీరు 'అబ్బే ఎవరికి తోచినట్లు వాళ్ళు పాటించవచ్చు, పాటించకపోనూవచ్చు' అని అన్నారు చూడండీ..అది సరికాదు అని అన్నాను. మీరు దాని గురించి మాట్టాడకుండా మీరు చేసిన పనికి తర్కమూ సమర్ధనా వెదికే పనిలో పడ్డ్రారు. __చదువరి (చర్చరచనలు) 15:37, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, నేను నాకు తెలిసిన నిజం చెప్పాను. ఇక విధాన పద్ధతి పాటించలేదుకాబట్టి ఆ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు అన్నది ఇప్పటికే చెప్పాను. అది ఆమోదయోగ్యంచేయటానికి విధానపద్ధతిని పాటించమని వేడుకున్నాను. ఇంక నేనీ విషయమై చెప్పవలసినదేమీలేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 03:03, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]