వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా
ప్రతిక్రియ అభ్యర్ధన
[మార్చు]- ప్రకాశం జిల్లా గ్రామవ్యాసాలపై 2019-07-28 కు ముందు అత్యధికంగా కృషి చేసినసభ్యులకు, ఇతరత్రా గ్రామాల పేజీలలో కృషి చేసిన సభ్యులకు, వికీడేటాలో డేటా చేర్చిన user:chaduvari మరియు ఇతర సభ్యులకు విజ్ఞప్తి.
పై పట్టికలో ఆత్యధికంగా (సవరణల సంఖ్యను బట్టి) కృషి చేసిన సభ్యుల లింకులు ఇవ్వడమైనది. మొదటిగా మీ కృషికి నా తరపున అభివందనలు,ధన్యవాదాలు. ఇటీవలి గ్రామాల చర్చలలో నా వ్యాఖ్యలు మిమ్ములను నొప్పించితే క్షంతవ్యుడను. వికీవ్యాసాలు చదువరులకు, సంపాదకులకు ఉపయోగపడటమే ఉద్దేశ్యంగా నా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవలి సమాచారపెట్టె మెరుగు చేసే దిశగా, చాలా మానవీయ కృషితో మరియు బాట్ తో సమాచారపెట్టెని మెరుగు చేయడం జరిగింది. దీనివలన కొన్ని దోషాలు ఏర్పడి వుండవచ్చు. మీరు కొంత తనిఖీ చేసి స్పందిస్తే దోషాలు తొలగించటానికి, సభ్యుల ఆసక్తిని బట్టి ఇతర జిల్లాల వ్యాసాలకు మరింత వేగంగా కృషి జరగడానికి వీలవుతుంది. అందుకని మీ స్పందనలు తెలపండి. ఆలాగే సమచారపెట్టె లో కనబడే పెన్సిల్ బొమ్మతో వికీడేటా పేజీకి వెళ్లి ఏమైనా సవరణలు అవసరమైతే (కొద్దిగా తెలుసుకున్నాక, (వనరులు) సులభంగా చేయవచ్చు. ధైర్యంగా ప్రయత్నించి చూడండి. అర్జున (చర్చ) 12:24, 28 జూలై 2019 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}} చేర్చబడింది. --అర్జున (చర్చ) 03:12, 12 ఆగస్టు 2019 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}} చేర్చి చాలాకాలం గడచినా, స్పందనలు లేనందున తొలగించాను.--అర్జున (చర్చ) 23:40, 22 మార్చి 2021 (UTC)