వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రతిపాదనలు
ముగిసింది. ( )
ప్రతిపాదన నమూనా(Proposal Sample)
[మార్చు]- వికీపీడియా:కొలరావిపుప్ర2013/వైజాసత్య గారి కై ప్రతిపాదన చిత్తు ప్రతి చూడండి. పురస్కార నియమాల ప్రకారం వారు ఎంపిక మండలి సభ్యులుకావున ఈ పురస్కారానికి అనర్హులని ఇది సభ్యులకు మార్గదర్శనము చేయడానికి ఉదాహరణ మాత్రమేనని గమనించండి.
ప్రతిపాదనల ముగింపు(Due date)
[మార్చు]ముగింపు సమయం: 10 17 డిసెంబర్ 2013 05:29 IST( 9 16 డిసెంబర్ 2013 23:59 UTC)
తరచూ అడిగే ప్రశ్నలు(Frequently Asked Questions)
[మార్చు]- ప్రతిపాదన పూర్తి చేయడానికి సులభమైన మార్గం వుందా?
ప్రతిపాదన సులభంగా చేయడానికి వీలైనంత పని జరిగింది. ప్రతిపాదన పేజీలోని పెట్టెలో మీ దృష్టిలో అర్హులైన వాడుకరి పేరు (వికీలింకులు లేకుండా వుత్తపేరు) ప్రవేశపెట్టితే వచ్చే పేజీని భద్రపరచండి. ఆ పేజీని మీరు చూస్తే ఆ వాడుకరికి సంబంధించిన పేజీకి, చర్చా పేజీకి, రచనలకు, గణాంకాలు మరియు ఈమెయిల్ లింకులు కనబడతాయి. వాటిని పరిశీలించండి. వాటినుండి మరియు మీకు వికీగతంగా తెలిసిన విషయాలను సంబంధిత విభాగాలలో రాయండి. వీలైతే ఆధారాలు చేర్చండి. ఆ తరువాత ప్రతిపాదిత వ్యక్తికి ప్రతిపాదనను మెరుగుపరచి అంగీకరించమని వారి చర్చాపేజీలో వ్యాఖ్య చేర్చండి లేక ఈమెయిల్ పంపండి. ఇలా మొదటి ప్రతి చేయటానికి 15-25 నిముషాల సమయం సరిపోతుంది. ఆ తరువాత మీరు, ప్రతిపాదిత సభ్యుడు ఇతరులు ప్రతిపాదనను విస్తరించి మెరుగుచేయవచ్చు.