వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/తరచుగా అడిగే ప్రశ్నలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ కొత్త పురస్కారం ఎందుకు?[మార్చు]

ప్రస్తుత గుర్తింపు విధానాలు[మార్చు]

  1. మార్పుల సంఖ్యను బట్టి వాడుకరికి శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
  2. మార్పుల విషయం ఆధారంగా శుభాకాంక్ష బొమ్మ ద్వారా గుర్తింపు
  3. వార్షికోత్సవాలలో భాగంగా ఇ-పుస్తక కూపన్
  4. వికీఉత్సవాలకి ప్రయాణ, వసతి ఖర్చులు
  5. విద్యార్ధులకు వ్యాసరచనపోటీ-నగదు బహుమతులు

పరిమితులు[మార్చు]

  1. ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు లేవు
  2. ప్రస్తుత గుర్తింపు విధానం ఏ ఒక్కరిపైనే ఆధారపడివున్నది. కేవలం మార్పుల సంఖ్య ఆధారంగానే గుర్తింపు వస్తుందన్న భావన బలపడడానికి కారణమవుతున్నది. దీనివలన సరైన సమయానికి సభ్యుల కృషిని గుర్తించడం కొన్ని సార్లు జరగటంలేదు. పక్షపాత ఆరోపణలకు అవకాశముంటున్నది. సమగ్ర విశ్లేషణ ఆధారంగా గుర్తింపు లేదు.
  3. పోటీలో బహుమతులు కొత్త వారిని ఆకర్షించటానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అలా ఖర్చుపెట్టినా ఎంతమంది వికీలో మరింత క్రియాశీలమవుతారన్నది సంశయమే
  4. చాలా కొద్దిమంది మాత్రమే వికీమేనియా లేకభారత వికీసమావేశాలకి ఎంపిక కాగలుగుతున్నారు.
  5. పోటీ విధానాలు వికీ విలువైన సహకారం పెంపొందించడానికి తోడ్పడుటలేదు.

ప్రస్తుతమున్న వాటి పరిమితులను ఎదుర్కోటానికి ప్రస్తుతము వాడుతున్న గుర్తింపులతో పాటు వాడుటకు ఈ కొత్త పురస్కారం రూపొందించబడింది.

పురస్కారం వలన వొరిగేదేమిటి[మార్చు]

  • పురస్కార ప్రక్రియలో భాగంగా సభ్యులలో ప్రశంసాగుణం ప్రదర్శితమవుతుంది. ఇదీ వికీ సంస్కృతిని ధనాత్మకంగా ప్రభావితంచేస్తుంది. మరింత సహకారం వికీ అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • వికీ కృషి వ్యాప్తి తెలుస్తుంది
  • ఏమైనా సందేహాలుంటే ఎవరిని సంప్రందించాలో తెలుస్తుంది.
  • పురస్కార గ్రహీతలు నూతన తరం వికీ సభ్యులకు మార్గదర్శకులవుతారు
  • పురస్కార గ్రహీతలు వికీ మరియు మాధ్యమాలలో గుర్తించబడతారు.
  • వికీపీడియా ప్రచారానికి ఉపయోగపడుతుంది.
  • పురస్కార గ్రహీతలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలకి అభ్యర్ధిస్తున్నప్పుడు, ఇటువంటి పురస్కారం పొంది వుంటే వారి అభ్యర్ధనకి విలువపెరుగుతుంది

పురస్కారానికి నగదు ఎందుకు?[మార్చు]

  • విశేష కృషి చేసినవారికి ఇచ్చే ఈ పురస్కారానికి నగదు రూపం వుంటే పురస్కారానికి ఎక్కువ విలువ వుంటుంది. వికీలో కృషి స్వచ్ఛందమైనా సభ్యులు తమ సమయంతోపాటు, వికీలో కృషికి కొంత ధనం ఖర్చు చేస్తుంటారు. ఈ పురస్కారం పొందే వారు తమ కృషిని కొనసాగించటానికి మరింత విస్తరించడానికి పురస్కార నగదు కొద్ది మొత్తమైనా వుపయోగంగా వుంటుంది.
  • వస్తుసేవలరూపేణా బహమతి ఇవ్వదలచుకుంటే వుత్సవాల కార్యనిర్వాహకవర్గానికి అదనపు శ్రమతో పాటు, గ్రహీతలకు వారుకోరుకున్న విధంగా ఖర్చుచేసేందుకు సౌలభ్యం ఉండదు కాబట్టి ఆ ఎంపిక తిరస్కరించబడింది.
  • విద్యార్ధి వ్యాసరచనపోటీలకు కూడా నగదు బహమతి ఇచ్చాము కాబట్టి. ఈ పురస్కారానికి ఎంపికయ్యేవారు సాధారణంగా పరిణతి చెందిన వ్యక్తులు వికీ కృషిలో చాలా కాలం పాల్గొన్నవారు కాబట్టి వస్తుసేవల రూపం అమలుచెయ్యడంలో సరియైన కారణం కనబడలేదు.

ఇలా నగదు ఇస్తే వికీలో పనికి నగదు ఇస్తారని అపోహ బలపడుతుందేమో ఎలా?[మార్చు]

వికీకృషికి నగదు చెల్లింపులు కొత్తేమీ కాదు. మూడు సంవత్సరాల క్రిందట గూగుల్ ఆంగ్లంనుండి అనువాద వ్యాసాలు గుత్తేదారులద్వారా వికీలో చేర్చింది. ఇటీవల కొన్ని సంస్థలు ప్రతిఫలం మేరకు వికీలో వ్యాసాలు చేరుస్తున్నాయన్న వుదంతం కూడా వార్తల్లో వచ్చింది. GLAM అనే కార్యక్రమంలో కొన్ని నెలలకు అనుభవమున్న వికీసభ్యుని కృషికి నగదు ప్రతిఫలం ఇస్తున్నారు. వికీ అభివృద్ధిని త్వరితం చేయడానికి వికీసంస్థలకు లేక వికీమీడియా ఫౌండేషన్ తో వొప్పందం ప్రకారం పనిచేసే సంస్థల ఉద్యోగులు ప్రతిఫలంమేరకే పనిచేస్తున్నారు కూడా. ఆ పనిలో కొంత భాగం వికీలో మరికొంత వికీ వెలుపల వుండవచ్చు.

ఈ పురస్కారం చేసిన పనికి ప్రోత్సాహకరంగా ఇచ్చే చిన్న మొత్తమే కా ని ప్రతిఫలం కాదు. ఇప్పటికే చేసిన కృషికి కాబట్టి, పోటీల ద్వారా వికీ వాడుకరులను ఆకర్షించే దానికన్నా ఇదే మెరుగైనది. ఇలాంటి పురస్కారం కూడా వుందని తెలిస్తే వికీ సభ్యులకు ప్రోత్సాహం కలుగుతుంది.

పురస్కారానికి నగదు మొత్తం ఏవిధంగా నిర్ణయించారు[మార్చు]

దశాబ్ది ఉత్సవాలకి 10మందిని ఎంపికచేసి ఒక్కొక్కరికి 10,000చొప్పున బహమతి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. ఉత్సవాల కార్యనిర్వాహక కమిటీ ఈ బడ్జెట్ కు ఆమోదముద్రవేసింది. కార్యనిర్వాహక కమిటీ ఉత్సవాల మొత్తము బడ్జెట్ కి వనరులు వివిధ రకాలుగా సేకరించదలచుకుంది. ఇదీ ఇతర బహమతుల వివరాలతో పోల్చితే (విద్యార్ధి వ్యాసరచనపోటీకి 1000రూపాయలు, WLM2013మొదటి బహమతికి రూ30,000) సమంజసంగా వుందని సాధారణ అభిప్రాయం.

పురస్కార నగదు బహమతి గ్రహీత తీసుకొనలేకపోతే ఎలా?[మార్చు]

విదేశాల్లో వుండుటవలన లేక ఏకారణంచేతనైనా ఒక వేళ బహుమతిగ్రహీత నగదు తీసుకొనలేకపోతే వార్షికోత్సవాల కార్యనిర్వాహకవర్గం అధ్యక్షుడిని సంప్రదిస్తే వేరే మార్గాలను పరిశీలించి సహాయంచేస్తారు.

పురస్కార నగదు వలన ఆదాయం పన్ను బెడద వుంటుందా?[మార్చు]

పురస్కార గ్రహీత బహుమతి వలన ఆదాయం పన్నుకు గురి కావలిసివస్తే తనే భరించాలి.

పురస్కారానికి నగదు మొత్తం ఏమంత వుపయోగం?[మార్చు]

  • ఇంటర్నెట్ సేవలకొరకు ఒక సంవత్సరానికి వుపయోగపడవచ్చు.
  • తెలుగు ప్రదర్శించగల ఆధునిక స్మార్ట్ ఫోన్ లేక టెేబ్లెట్ కొనుక్కోవచ్చు. తద్వారా వారి సమీప పరిచయాల్లో తెలుగు వికీగురించి సులభంగా వివరించవచ్చు
  • తెలుగు వికీ ప్రచారానికి, శిక్షణకు దగ్గరి ప్రాంతాలకు ఏ సంస్థని సహాయం ఆశించకుండా పురస్కార బహమతిని వాడుకోవచ్చు
  • తమకిష్టమైన ప్రాంతానికి విహారయాత్రకి పోవొచ్చు. అప్పుడు ఆ ప్రదేశం గురించి వికీలో విషయాన్ని బొమ్మలను చేర్చవచ్చు.
  • వికీకృషి పై ఆసక్తితో, తమ దగ్గరి బంధుమిత్రులసంబంధాలను కూడా పరిగణించంకుండా కృషి చేస్తే, వారి కొక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా సంబంధాలను మెరుగు చేసుకొనవచ్చును.

ఏదైనా పురస్కార గ్రహీతల ఇష్టం. వారు ఎలా వాడుకున్నారో, ఎ విధంగా వికీ అభివృద్ధికి దోహదపడిందో తరువాత మనందరికి చెబుతారని ఆశిద్దాం.

పురస్కారం వచ్చే సంవత్సరం కూడా వుంటుందా?[మార్చు]

ఈ పురస్కారానికి సభ్యుల స్పందన బట్టి ఫలితాలను బట్టి దీనిని కొనసాగించవచ్చు. పురస్కార విధానం, నగదు మొత్తం అప్పటి పరిస్థితులని బట్టి ప్రతిసారి మెరుగులో భాగంగా మార్పులుండవచ్చు.

ఇటువంటి పురస్కారం వికీలో ఇంతకు ముందెవరైనా చేశారా?[మార్చు]

భారతీయ భాషల వికీసముదాయలలో ఇలా చేసినట్లు తెలియలేదు. జర్మన్ వికీ సముదాయం ఇటువంటి గుర్తింపు పద్ధతులని వాడింది. అయితే వికీ బయటి వారికి నగదు బహమతి మరియు సభ్యులకు వస్తులేక సేవలరూపేణా బహమతి అందచేసింది.

పురస్కారానికి అర్హతలను ఎలా నిర్ణయించారు[మార్చు]

ఇప్పటికే గుర్తింపు వున్న సభ్యులను ఎంపికమండలికి ఆహ్వానించారు. పక్షపాతం లేకుండా వుండటానికి మరియు గుర్తింపు పొందని వారిని ఈపురస్కారానికి ఎంపికచేయడానికి ఎంపిక మండలి సభ్యులు తమను అనర్హులుగా నియమం చేశారు.

ఇప్పటికే విశేషకృషి చేసిన వైజాసత్య లాంటి వారికి కూడా పురస్కారం ఇచ్చేటట్లు నియమాలెందుకు చేయలేదు[మార్చు]

ఎంపిక మండలి సభ్యులకు ఇప్పటికే తెవికీ/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలలో కొంత గుర్తింపు వుంది. గుర్తింపు పొందని వారిని ఈపురస్కారానికి ఎంపికచేయడానికి ఎంపిక మండలి సభ్యులు తమను అనర్హులుగా నియమం చేశారు. వీరిని ఇతర గుర్తింపులలో భాగంగా వీలున్నచోట్ల సభ్యులు తమ సిఫారస్ చేయవచ్చు.

ప్రతిపాదన పూర్తి చేయడానికి సులభమైన మార్గం వుందా?[మార్చు]

ప్రతిపాదన సులభంగా చేయడానికి వీలైనంత పనిజరిగింది. ప్రతిపాదనపేజీలోనిపెట్టెలో మీ దృష్టిలో అర్హులైన వాడుకరి పేరు ప్రవేశపెట్టితే వచ్చే పేజీని భద్రపరచండి. ఆ పేజీని మీరు చూస్తే ఆ వాడుకరికి సంబంధించిన పేజీకి, చర్చా పేజీకి, రచనలకు, గణాంకాలు మరియు ఈమెయిల్ లింకులుకనబడతాయి. వాటిని పరిశీలించండి. వాటినుండి మరియు మీకు వికీగతంగా తెలిసిన విషయాలను సంబంధిత విభాగాలలో రాయండి. వీలైతే ఆధారాలు చేర్చండి. ఆ తరువాత ప్రతిపాదిత వ్యక్తికి ప్రతిపాదనను మెరుగుపరచి అంగీకరించమని వారి చర్చాపేజీలో వ్యాఖ్య చేర్చండి లేక ఈమెయిల్ పంపండి. ఇలా మొదటి ప్రతి చేయటానికి15-25 నిముషాల సమయం సరిపోతుంది. ఆ తరువాత మీరు, ప్రతిపాదిత సభ్యుడు ఇతరులు ప్రతిపాదనను విస్తరించి మెరుగుచేయవచ్చు.

నముూనా ప్రతిపాదన వుందా?[మార్చు]

వికీపీడియా:కొలరావిపుప్ర2013/వైజాసత్య గారి కై ప్రతిపాదన చిత్తు ప్రతి చూడండి. వారు ఎంపిక మండలి సభ్యులుగా ఈ పురస్కారానికి అనర్హులని ఇది సభ్యులకు మార్గదర్శనము చేయడానికి ఉదాహరణ మాత్రమేనని గమనించండి.

నేను ఇటీవలే వికీలో కృషి ప్రారంభించాను. ఎక్కువగా పనిచేస్తున్న వారి వివరాలు తెలియవు నేను ఎవరిని ప్రతిపాదించాలి?[మార్చు]

అర్హులైన వారినెవరినైనా ప్రతిపాదించవచ్చు. మీరు చేరినప్పుడు మిమ్ములను స్వాగతించినవారెవరు? మీరు వికీలో తప్పటడుగులు వేస్తున్నప్పుడు సహాయం చేసిందెవరు? మీకు క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు ఎవరు సహాయం చేశారు? వికీని చదువుతున్నప్పుడు చరిత్రపేజీలలో ఎవరి కృషి మిమ్మలను ఆకర్షించింది. వీరిలో అర్హులైన వారిని ప్రతిపాదించండి. ఒక వేళ మీరు ప్రతిపాదించిన వారు విజేతలుకాకపోయినా, మీ చర్య వారికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఫలితం ప్రకటనలో వారి స్థాయి తెలుసుకొనే అవకాశం కలిగి వచ్చే సంవత్సరములో మరింత కృషి చేయటానికి ప్రోద్బలము కలుగుతుంది.

నేను ప్రారంభించిన ప్రతిపాదన పేజీలో లింకులు సరిగా లేవు, ఎలా?[మార్చు]

ప్రతిపాదనల ప్రారంభించు పెట్టెలో వాడుకరి పేరు కు ఎ విధమైన ముందు వెనుక అక్షరాలు , పదాలు జతచేసిన కోడ్ విరుగుతుంది. అలా జరిగినప్పుడు మానవీయంగా ఆ పేజీని సరియైన పేజీకి తరలించాలి. మరల ఆ పేజీలో దోషమున్న చోట తగిన మార్పులు చేయాలి. మీకు సహాయం అవసరమైతే ఆ పేజీ చర్చాపేజీలో విభాగం ప్రారంభించి ఆతరువాత {{సహాయం కావాలి}}మూస చేర్చి సమస్యను వివరించండి. వీలైనంత త్వరలో సహాయం పొందుతారు.

నేను ప్రధానంగా కృషి చేసిన వికీమీడియా ప్రాజెక్టు వికీపీడియా కాదు. ప్రతిపాదన పేజీలో లింకులను ఎలా మార్చాలి?[మార్చు]

ప్రతిపాదన పేజీలో [http://te.wikipedia.org ను [<మీ ప్రధానవికీప్రాజెక్టు URL> ( ఉదాహరణకు విక్షనరీ ప్రాజెక్టు అయితే [http://te.wiktionary.org తో మార్చి) భద్రపరచండి.

ప్రతిపాదన పేజీలో గణాంకాల లింకులలో నేను చేరిన తేదీ తప్పుగా వున్నది. ఎలా?[మార్చు]

CentralAuth ఉపకరణం, ఖాతాలను ఏకీకరణ చేసిన తేదీని కొన్ని సార్లు చూపెడుతున్నది. ఇప్పడు SULInfo గణాంకానికి లింకులు మార్చాము. ఇప్పుడు సరియైన తేదీలు కనబడతాయి.

నేను పొరబాటున ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు వాడాను, ప్రతిపాదన పేరు వున్నదానిలో తక్కువ గణాంకాలు వున్నాయి,ఎలా?[మార్చు]

ప్రత్యేక పరిస్థితులలో తప్పించి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు వాడడం వికీ ప్రోత్సహించదు. మీకు గల ఇతర ఖాతాలను అదనపు సమాచారంలో తెలపండి. ఇక ముందు ఒకే ఖాతా వాడండి. అలా నిశ్చయించినతరువాత ఇతర ఖాతాల వాడుకరి పేజీలనుండి మరియు వాడుకరి చర్చాపేజీలనుండి నిశ్చయించిన ఖాతాకు దారిమార్పులు చేయండి

పైనున్న వాటితో నా సందేహం నివృత్తి కాలేదు. ఎలా?[మార్చు]

సంబంధిత చర్చాపేజీలో కొత్త విభాగం ప్రారంభించి ఆ తరువాత {{సహాయం కావాలి}} మూస చేర్చి మీ సందేహం వివరించండి. త్వరలో సహాయం పొందుతారు.

ఇవీ చూడండి[మార్చు]