చర్చ:తిరుమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 29 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


I have some recent photos from tirupati trip. Not able to decide which one fits here. Can somebody help?

http://flickr.com/photos/chavakiran Chavakiran 17:32, 21 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


వ్యాసం పేరు

[మార్చు]

1) ఈ వ్యాసాన్ని తిరుమల, తిరుపతి అని రెండుగా విభజిస్తే ఎలా ఉంటుంది? ఒక వేళ ఇది వరకే తిరుపతి మీద వ్యాసం ఉంటే, దానితో కలపాలేమో 2) చరిత్ర క్రింద ఉన్న 3 పేరాలలో తగిన అర్హత కలిగిన పదాలకు లింకులు పెట్టగలరా? --Gsnaveen 14:47, 30 నవంబర్ 2006 (UTC)

తిరుమల గురించి చర్చించకుండా తిరుపతిని, తిరుపతిని గురించి చర్చించ కుండా తిరుమలను గురించి రాయలేమని ఇలా ప్రారంభించాము. అదికాక చాలామంది తిరుమల కెల్తున్నా తిరుపతికి వెల్తున్నాము అంటారు (ఎలాగైతే జంటనగరాలను కలిపి సాధారణంగా హైదరాబాదు అన్నట్టు). రాయగలిగితే ప్రత్యేక వ్యాసాలు సృష్టించడములో తప్పేమిలేదు. --వైఙాసత్య 17:52, 30 నవంబర్ 2006 (UTC)

ఈ వ్యాసానికి ఇంకో 3-4 చిత్రాలు జోడిస్తే విశేష వ్యాసం అయ్యే అవకాశాలు కలుగు తాయి అని భావిస్తున్నాను. వేంకటేశ్వర స్వామి చిత్రం ఈ వ్యాసంలొ ఉంచితే ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను--శాస్త్రి 20:19, 26 మే 2007 (UTC)

చరిత్ర మరీ పెద్దది అవుతోంది!

[మార్చు]

చరిత్ర మరీ పెద్దది అవుతోంది!

క్లుప్తంగా ఇక్కడ వ్రాసి, మిగిలినది వేరే వ్యాసంలో ఉదా: తిరుమల చరిత్ర లో వ్రాస్తే బాగుంటుంది. Chavakiran 13:11, 29 అక్టోబర్ 2007 (UTC)

తిరుమలకు సంభందించిన వర్గం ఉందిగా. తిరుమలను కొన్ని పేజీలుగ విడగొడితే ఎలా ఉంటుంది?. అంటే 1.తిరుమల చరిత్ర, 2.స్వామి పూజా విధానాలు, 3. తిరుమల ప్రయాణ సౌకర్యాలు ఇలా విడగొట్టి వాటిని తిరుమల పేజీలో ఇవి కూడా చూడండి అనే లింకులిస్తే. ఆయా పేజీలలో ఎలానూ తిరుమల వర్గం ఉంటుంది. వెనుకకు వచ్చేందుకు. విశ్వనాధ్. 08:39, 30 అక్టోబర్ 2007 (UTC)
విశ్వనాధ్ గారూ బాగా చెప్పారు. ఇలా వేర్వేరు పేజీలు సృష్టించాలి. కానీ ప్రధాన పేజీ మొత్తం తిరుమల వర్గానికి గుండె లాంటిది. కాబట్టి దాంట్లో చరిత్ర గురించి, పూజావిధానాల గురించి కూడా కొంచెం క్లుప్తంగా తిరగరాయాలి. స్థూలంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు ఆయా ఉపపేజీల్లో వెతుక్కోకుండా బాగుంటుంది. --వైజాసత్య 08:45, 30 అక్టోబర్ 2007 (UTC)

ధృవీకరణ ఎవరు చేయాలి

[మార్చు]

నేను తిరుమల శ్రీవారి గర్భగుడి లో ని పిల్లి గూర్చి వివరాలు తెలిపాను. కాని అందులో ధృవీకరించవలసి వుంది అని రాసారు. దీనిని ఎవరు ధృవీకరించాలి? ఎందుకంటే నేను రాసిన విషయం 100% నిజమైనది. నేను మరియు మా కుటుంబీకులు సుమారు 10 తరాల నుండి శ్రీవారి ఆలయం లో అర్చకత్వం చేస్తున్నాము. కావున నేను స్వామి వారి ఆలయం గురించి రాసిన విషయములు నిజమైనవి. గమనించగలరు. సభ్యుడు:రామకృష్ణ దీక్షితులు,9:10 ఐఎస్టి 8/2/2008

నేను ఇప్పుడే మీరు పిల్లి గురించి చేర్చిన కొత్త సమాచారాన్ని చదివాను. దృవీకరణకు ప్రత్యేకంగా ఎవరూ ఉండరు, ఇక్కడున్న సభ్యులలో ఎవరయినా దృవీకరించవచ్చు. నాకయితే అస్సలు నమ్మకశ్యంగా లేదు. ఇటువంటి విషయాలను నేణు స్వయంగా గర్భగుడిలోకి వచ్చి చూస్తే గానీ నమ్మలేను (అది సాధ్యపడదనుకోండి). పైగా ఈ విషయం గురించి ఇప్పటివరకూ పత్రికలలో వచ్చినట్లు కూడా నాకు తెలియదు. ఈ విషయాన్ని కేవలం మీమాటపై నమ్మకముంచి నమ్మాలి. మీరు అక్కడ ఒక చోట 100 సంవత్సరాల నుండీ ఒకే పిల్లి రోజూ వస్తుంది అని అనకుండా, పిల్లి జీవిత కాలం ముగిసిపోతూనే కొత్త పిల్లి వస్తుందని చెప్పారు. ఈ వ్యాక్యం వల్ల మిగతా సమాచారానికి కొంతలో కొంత నమ్మిక పెరిగింది. ఈ సమాచారానికి నోటిమాట ద్వారా కాకుండా వేరేవిధానంలో రుజువు చేయలేమా? __మాకినేని ప్రదీపు (+/-మా) 07:11, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దర్శనంపొందే భక్తుల సంఖ్య

[మార్చు]

నాకు తెలిసి గరిష్టముగా 70 నుంచి 80 వేల మంది కి మత్రమె శ్రీవారిని ధర్శనం లబిస్తుంది. 2010-07-25T14:24:49 User:Bollinamurali

చిన్న మార్పులు

[మార్చు]

తిరుమల వ్యాసాలలో ప్రయోగాత్మకంగా చిన్న మార్పు చేస్తున్నాను. సభ్యులు గమనించి తగు సలహాలు ఇవ్వగలరు..--విశ్వనాధ్ (చర్చ) 06:28, 13 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లవ్యాస అనువాదం, విలీనం, మెరుగు

[మార్చు]

ఆంగ్లవికీవ్యాసాన్ని అనువదించి వాడుకరి:Arjunaraoc/తిరుమల లో ముద్రించాను. మరిన్ని సవరణల తరువాత వ్యాసంలో అంచెలంచెలుగా చేర్చి విలీనం చేశాను. ఆంగ్ల వికీలో ఆలయ చరిత్ర, తితిదే వివరాలు, వాస్తుశిల్పం, ఆరాధాన చాలా మెరుగుగా వున్నాయి. మెరుగు చేయటంలో భాగంగా, స్వేచ్ఛానకలుహక్కులు కాని బొమ్మలు తొలగించాను. OSM పటం అందుబాటులోకి వచ్చినందున, ఇతర పటముల బొమ్మ కూడ తొలగించాను. చిత్రమాలికను కుదించాను. ఇంకా తెలుగు మూలాలు కొన్ని చేర్చాను. నాకు దేవాలయాల వ్యాసాలు అభివృద్ధి చేయడంలో అంత అనుభవం లేదు కనుక, సహ సభ్యులు, ఈ వ్యాసాన్ని పరిశీలించి తప్పులు సరిదిద్ది, మరింత మెరుగు పరచమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 12:31, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]