శోభానాయుడు
శోభా నాయుడు | |
![]() సంగీత నాటక అకాడమి ఢిల్లీ లో ప్రదర్శన |
|
జననం | 1956 అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ |
జాతీయత | భారత్ |
రంగం | శాస్త్రీయ నృత్యం నర్తకి |
ఉద్యమం | కూచిపూడి |
పురస్కారాలు | పద్మశ్రీ |
విషయ సూచిక
ప్రవేశిక[మార్చు]
శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. శోభానాయుడు కూచిపూడి కళను ప్రదర్శంచడంలో అమెకు ఆమె సాటి అన్న ప్రఖ్యాతి గడించింది. ఈమె వెంకటనాయుడు మరియు సరోజిని దేవి దంపతులకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించింది. ఆమె బాల్యంలో తన నాట్యకౌశలంతో అనేకమంది హృదయాలను మంత్రముగ్ధులను చేసింది.
అవార్డులు[మార్చు]
- 2001 - పద్మశ్రీ పురస్కారం
- 1990 - సంగీత నాటక అకాడమీ పురస్కారం
- 2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు