Jump to content

వెంపటి చినసత్యం

వికీపీడియా నుండి
(వెంపటి చిన సత్యం నుండి దారిమార్పు చెందింది)
వెంపటి చినసత్యం
వెంపటి చినసత్యం
జననం
వెంపటి చినసత్యం

అక్టోబర్ 15, 1929
మరణంజూలై 29, 2012
వృత్తినాట్యాచార్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కూచిపూడి నాట్యాచార్యుడు.
పిల్లలు2 కుమారులు; 3 కుమార్తెలు
తల్లిదండ్రులు
  • చలమయ్య (తండ్రి)
  • వరలక్ష్మమ్మ (తల్లి)

వెంపటి చినసత్యం (అక్టోబర్ 15, 1929 - జూలై 29, 2012) కూచిపూడి నాట్యాచార్యుడు.

జననం

[మార్చు]

వెంపటి చినసత్యం 1929, అక్టోబర్ 15కృష్ణా జిల్లా లోని కూచిపూడి వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించాడు.[1]

కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. చెన్నైలో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు.

కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, ఎన్టీఆర్‌ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వారి శిష్యులే.

1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు వచ్చింది.

మరణం

[మార్చు]

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు వెంపటి రవిశంకర్‌ కూడా నాట్యాచార్యుడే. 2012, జూలై 29 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం 'కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ'లో తుదిశ్వాస విడిచారు.[2]

పురస్కారాలు

[మార్చు]
  • 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, కళాప్రపూర్ణ, నాట్యకళాసాగర్‌
  • 1967లో సంగీత నాటక అకాడమీచే ఫెలోషిప్‌
  • 1982లో భరత కళాప్రపూర్ణ
  • 1992లో కాళిదాస్ సమ్మాన్, సర్‌ సింగర్‌ అవార్డు, సప్తగిరి సంగీత విద్యాన్‌మణి, నాట్య కళాతపస్వి, నాట్య కళాభూషణ, కళైమామణి
  • 1998లో పద్మభూషణ్‌ పురస్కారం
  • 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యంలో విశిష్ట పురస్కారం
  • 2011, 12లో జీవన సాఫల్య పురస్కారం

శిష్యులు/శిష్యురాళ్ళు

[మార్చు]

నృత్యరూపకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vempati Chinna Satyam: కూచిపూడి విదుషీ ధీమణి". Sakshi. 2022-10-15. Retrieved 2023-10-29.
  2. "Dance guru Chinna Satyam passes away". The Times of India. 2012-07-30. ISSN 0971-8257. Retrieved 2023-10-29.

బయటి లింకులు

[మార్చు]