Jump to content

దగ్గుబాటి పురంధేశ్వరి

వికీపీడియా నుండి
(పురంధేశ్వరి నుండి దారిమార్పు చెందింది)
దగ్గుబాటి పురంధేశ్వరి
దగ్గుబాటి పురంధేశ్వరి


ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ 13వ అధ్యక్షురాలు
పదవీ కాలం
2023 జూలై 4 – 2025 జూన్ 30
ముందు సోము వీర్రాజు
తరువాత పి.వి.ఎన్.మాధవ్

కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2012 అక్టోబర్ 28 – 2014 మార్చి 11
ఎస్. జగద్రక్షకన్ తో పాటు (2012-2013)
ఈ.ఎం సుదర్శన నాచ్చియప్పన్ తో పాటు (2013-2014)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జ్యోతిరాదిత్య సింధియా
తరువాత నిర్మలా సీతారామన్ (2014-2017)
సి.ఆర్. చౌదరి (2017-2019)

37వ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సహాయ మంత్రి
పదవీ కాలం
2006 జనవరి 29 – 2012 అక్టోబర్ 28
ఇ. అహ్మద్ తో పాటు (2011-2012)
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు కాంతి సింగ్
తరువాత జితిన్ ప్రసాద

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4
ముందు మార్గాని భారత్
నియోజకవర్గం రాజమండ్రి
పదవీ కాలం
2009 జూన్ 1 – 2014 మే 28
ముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డి
తరువాత కంభంపాటి హరిబాబు
నియోజకవర్గం విశాఖపట్నం
పదవీ కాలం
2004 మే 29 – 2009 మే 31
ముందు డి. రామానాయుడు
తరువాత పనబాక లక్ష్మి
నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-22) 1959 ఏప్రిల్ 22 (వయసు: 66)
మద్రాస్, మద్రాస్ రాష్ట్రం, (ప్రస్తుత చెన్నై, తమిళనాడు) భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2014-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2004-2014)
తల్లిదండ్రులు ఎన్.టి. రామారావు, బసవరామతారకం
జీవిత భాగస్వామి
సంతానం 1 కొడుకు , 1 కూతురు
మూలం [1]

దగ్గుబాటి పురంధేశ్వరి (జ: 22 ఏప్రిల్, 1959) భారత పార్లమెంటు సభ్యురాలు. ఈమె 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. ఈమె బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు. జులై 4, 2023 న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.[1]

కుటుంబం

[మార్చు]

ఈమెకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో వివాహం జరిగింది.

రాజకీయ ప్రస్తానం

[మార్చు]

పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేసింది.

పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరింది. అనంతరం ఆమె మహిళా మోర్చా ప్రభారిగా, బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆమెను 2023 జులై 4న  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.[2][3][4]

దగ్గుబాటి పురంధేశ్వరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 2,39,129 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[5][6]

రచించిన గ్రంధాలు

[మార్చు]

ఈమె In Quest Of Utopia అనే గ్రంథాన్ని రచించి ప్రచురించింది.

మూలాలు

[మార్చు]
  1. "BJP: ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే." EENADU. Retrieved 2023-07-04.
  2. A. B. P. Desam (4 July 2023). "ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం, వాళ్లిద్దరికీ నిరాశే!". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  3. Eenadu (4 July 2023). "ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే." Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. Andhra Jyothy (4 July 2023). "ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి." Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  5. "2024 Loksabha Elections Results - Rajahmundry". Election Commission of India. 4 June 2024. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
  6. "Rajahmundry Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.

బయటి లింకులు

[మార్చు]