దేవయాని (నర్తకి)

వికీపీడియా నుండి
(ఆన్నే షేమోటీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవయాని
జననంఆన్నిక్ షేమోటీ
పారిస్, ఫ్రాన్స్
నివాసంకొత్త ఢిల్లీ , భారతదేశం
జాతీయతఫ్రెంచి
వృత్తిభరతనాట్యం కళాకారిణి, నృత్యదర్శకురాలు
భాగస్వామిఎం.ఎం.కోహ్లి
వెబ్ సైటుhttp://www.devayanidance.com

దేవయానిగా ప్రసిద్ధి చెందిన ఆన్నిక్ షేమోటీ పారిస్లో పుట్టి భారత దేశములో స్థిరపడిన భరతనాట్య కళాకారిణి. 1977 నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఢిల్లీలో స్థిరపడిన దేవయాని జీవకళ ఉట్టిపడే మార్మికమైన భారతీయ కళ్లే తనను భరతనాట్యం నేర్చుకోవటానికి ప్రేరేపించాయి అని అన్నదీమె.

వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నృత్యం అభ్యసించిన దేవయాని అమెరికా అమ్మాయి సినిమాలో భారతదేశానికి కూచిపూడి నేర్చుకోవటానికి వచ్చిన విదేశీవనితగా నటించింది. ఆ సినిమా ఘనవిజయం సాధించంతో ఈమె దక్షిణ భారతదేశములో బాగా పేరుపొందింది. ఈ సినిమాకి ఆన్నే, చిదంబరం దేవస్థాన మండపంలో 'ఆనంద తాండవమాడే శివుడు' పాటకు అద్భుతంగా నర్తించింది.

మూలాలు[మార్చు]