Jump to content

కిరాతార్జునీయం

వికీపీడియా నుండి
19వ శతాబ్దంలోని రవివర్మ చిత్రం : శివుని గుర్తించి లొంగిపోతున్న అర్జునుడు.

కిరాతార్జునీయం 6 వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతం లోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి . పద ఎన్నిక, అద్భుత వర్ణన, సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది,, భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు.చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు.శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.

కిరాతుడు-శివుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు

అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు మహాభారత యుద్ధ సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.

కంగ్రా చిత్రపటం, హిమాచల్ ప్రదేశ్ : అప్సరసలు, గంధర్వ సేనతో కూడిన అర్జునుడు

ఇంద్రకీలాద్రి పర్వతం

[మార్చు]

సంస్కృత మహాభారత కావ్యంలో భాగమైన కిరాతార్జునీయములో ఇంద్రకీల పర్వతం పై అర్జనుడికి, కిరాతుడి అవతారంలో ఉన్న శివుడికి మధ్య యుద్ధం జరిగింది. అయితే ఇంద్రకీల పర్వతం గురించి దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అభిప్రాయములున్నవి. కిరాతార్జునీయాన్ని వ్రాసిన భారవి ఉత్తరభారత దేశానికి చెందినవాడు కనుక, తన ప్రకారం ఇంద్రకీల అనగా హిమాలయాల్లో భగీరధ నది (గంగా నది) ఒడ్డున ఉన్న పర్వతమని,[1][2] పూర్వం కవులు సర్వసాధారణంగా తమ కావ్యాల్లో స్థానికంగా లేక చేరువలో ఉన్న భౌగోళిక ప్రదేశాలను మాత్రమే పేర్కొనేవారని పలువురి అభిప్రాయం. కిరాతార్జునీయాన్ని శ్రీనాధుడు తెలుగులోకి అనువదించి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొండని ఇంద్రకీలాద్రిగా భావించి, శివుడిని బోయవాడి అవతారంలో పరిచయం చేయడం వలన తెలుగువారు కిరాతార్జునీయం కథ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిందని నేటికీ భావిస్తున్నారు. అలాగే కిరాతార్జునీయాన్ని కన్నడ భాషలోకి అనువదించుటవలన కర్నాటక రాష్ట్రంలో కొప్పల్ జిల్లాలో పల్కిగుండు అనే కొండ ప్రదేశం ఈ పేరున ఉంది.[3] [4] బౌద్ధ మతము, హిందూ మతము విరాజిల్లుతున్న ఇండొనేషియా దేశంలోని హిందువులు అక్కడ ఉన్న ఒక పర్వతాన్ని ఇంద్రకీల పర్వతంగా భావిస్తున్నారు[5][6]

మూలాలు

[మార్చు]
  1. RUDRA - THE AMAZING ARCHER, Author: Bharat Bhushan, ISBN 978-81-909471-4-5 (Paper Edition)
  2. Design and Rhetoric in a Sanskrit Court Epic: The Kiråatåarjunåiya of Bhåaravi
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-27. Retrieved 2013-07-24.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-09. Retrieved 2013-07-24.
  5. http://peakery.com/gunung-indrakila/[permanent dead link]
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-26. Retrieved 2013-07-24.

ఇంకా చదవండి

[మార్చు]

ఇంద్రకీలాద్రి పర్వతం

బయటి లంకెలు

[మార్చు]