Jump to content

పాశుపతాస్త్రం

వికీపీడియా నుండి
పాశుపతాస్త్రం
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
పి.సూరిబాబు,
నిడుముక్కల,
వై.వి.రావు
సంగీతం వి.జె.గోపాల్ సింగ్
గీతరచన వజ్ఝల కాళిదాసు
భాష తెలుగు

పాశుపతాస్త్రం లేదా కిరాతర్జునీయం 1939లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖపట్నంలోని ఆంధ్ర సినీటోన్‌ స్టూడియోలో తీశారు. ఈ స్టూడియోలో నిర్మించబడిన రెండవ, చివరి చిత్రం పాశుపతాస్త్రం. ఈ సినిమాను కొచ్చర్లకోట రంగారావు డైరెక్టు చేశారు. అయితే, స్టూడియో భాగస్వాముల్లో తేడాలు వచ్చి పాశుపతాస్త్రం షూటింగ్‌ చివరిదశలో ఉండగా, లైట్లు వగైరా తన భాగంగా ఇచ్చిన భాగస్వామి షూటింగ్‌ జరుగుతూ ఉండగానే, మనుషుల్ని పంపించి లైట్లు తీసుకెళ్లిపోయాట్ట! లైట్లతోపాటు అతనికి సంబంధించిన ఇతర పరికరాలూ లాక్కున్నాట్ట! అంతే! ఎలాగో సినిమా పూర్తయింది కానీ స్టూడియో మాత్రం మూతపడిపోయింది.[1]

'పాశు పతాస్త్రం' తెలుగు చలన చిత్రం1939 జులై 25 న విడుదల.రాంగోపాల్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కల్యాణం రఘురామయ్య, సూరిబాబు, శకుంతల, అన్నపూర్ణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు టీ.ఎస్.మణి.సంగీతం వి.జె.గోపాల్ సింగ్ సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

కల్యాణం రఘురామయ్య

పి సూరిబాబు

నిడుముక్కల

శకుంతల

అన్నపూర్ణ

వై.వి.రావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: టి ఎస్.మణి

సంగీతం: వి.జె.గోపాల్ సింగ్

గీత రచయిత: వజ్జల కాళిదాసు

గాయనీ గాయకులు: పి.సూరిబాబు

నిర్మాణ సంస్థ: రాం గోపాల్ పిక్చర్స్

విడుదల:25:07:1939.

పాటలు

[మార్చు]
  1. ఆదిపురుష నారాయణ సదానంద సత్యరూప - పి.సూరిబాబు
  2. . గంగాధరా శంకరా పార్వతీశ శంకరా - పి. సూరిబాబు
  3. సాధుజనలోల గోపాల చకతి విజ్ఞాన - పి.సూరిబాబు
  4. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - పి.సూరిబాబు
  5. ఈవనమే కనుమా నాథా సుఖకరమీవేళ-
  6. కాంచిలే మయూరి నాథా తాండవైకానందము-
  7. కాంతినిధి లోక భాంధావ అంభుజాత నాథా-
  8. చలమా చెలి తరళనయనా ప్రియ సఖియా-
  9. జయ మంగళ మహావీరా మహిత శురా తరళాకారా-
  10. జయము జయ శ్రీ పరంజ్యోతి సాధుపాలా పాల నయనా-
  11. జై జై జై లోకావనా కరుణా భవ భయ హరణా-
  12. ప్రేమమయ సుమ బాలికా సుధా ధారా పనలోల-
  13. భళి భళి భళి భళి భళి లాడులు చక్కని లాడులు -
  14. భారముగా దోచుకదా భవమే సుఖమికలేదే-
  15. రాగ భోగ విరాగ నమో నమో నాగహారా విమోదా నమో-
  16. వారే వారే వారే లతవళు తేవాలే-
  17. వీర శేఖర ధీరా కుమారా మదినెంతో విమోద మౌర-
  18. శైలకుమారి హృదయ విహారీ పాహి సరళమతి-
  19. శోభామోహన మీరేయీ హాయి గూరుచు-



పద్యాలు

[మార్చు]
  • దూరమున కొండమీదకు జారుతున్న చిరుత మేఘం-
  • అప్సరకాంతనైన నా యంత వలచి-
  • పురుహూత ఇటు పీల్చి మోనంబున-
  • లలిత మనోజ్ఞముల్ కరములన్ గమలమ్ముల-
  • వెడలెనా నాకంటి వెంట కోపాగ్నులు -
  • వైరి గజసింహుడగు మన పార్థుడిపుడే - పి.సూరిబాబు
  • శాంతి జేందుము ఊర్వశి శాపమునకు-
  • సంతసించితిని నీ ధైర్య సాహసాది గుణగణాళికి-
  • సరసి జనాభు సాయమున శౌర్యదురీణుల-
  • సురపతి పోయివత్తు భువి సోదరులన్ గని-

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.