Jump to content

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 4

వికీపీడియా నుండి

పాత చర్చ 3 | పాత చర్చ 4 | పాత చర్చ 5

ఇది పాత ప్రతిపాదనలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా ప్రతిపాదించాలంటే ఇక్కడ చేయండి.


క్రొత్త దళాలు

[మార్చు]

ఒకప్పుడు చదువరి "పదివేల పండుగ" ను ఒక లక్ష్యంగా పెట్టగా అంతా దానికోసం ఎదురు చూశారు. ఇప్పుడు తెలుగు వికీపీడియా 40,000వ వ్యాసం లక్ష్యానికి చేరువ అవుతున్నది. 50,000 వ్యాసాల మజిలీ కూడా కనుచూపు మేరలోకి వస్తున్నది. తెవికీని ఉత్సాహంగా ఉరకలు వేయిస్తున్న వారందరికీ అభినందనలు. ముఖ్యంగా క్రొత్త సభ్యులు చేరిన కొద్ది రోజులలోనే మంచి ప్రమాణాలతో రచనలు కూరుస్తున్నారు.


ఇప్పుడు వికీ నాణ్యత పెంచే దిశలో కొన్ని ప్రయత్నాలు చేబట్టాలి. అందులో భాగంగానే క్రొత్త దళాల ప్రతిపాదన చేస్తున్నాను. అంతే గాక ఇంతకు ముందు పని చేస్తున్న దళాలలో కూడా ఉత్సాహం ఉన్నవారు చేరాలని ఆహ్వానిస్తున్నాను.


ప్రస్తుతం పనిచేస్తున్న దళాలు


ప్రతిపాదన - క్రొత్త దళాల ఏర్పాటు
  • వికీపీడియా:ఈ వారం వ్యాసం దళం - మొదటి పేజీలోని "ఈ వారం వ్యాసం" శీర్షికను నిర్వహించడం. దీనిని "ఈ రోజు వ్యాసం" గా మార్చాలని కొందరు ఉత్సాహంగా ఉన్నారు. (50,000 వ్యాసాల తరువాతే ఇది సాధ్యమని నాకు అనిపిస్తుంది)
  • వికీపీడియా:ఈ వారం బొమ్మ దళం - మొదటి పేజీలోని "ఈ వారం బొమ్మ" శీర్షికను నిర్వహించడం. దీనిని "ఈ రోజు బొమ్మ" గా మార్చాలని కొందరు ఉత్సాహంగా ఉన్నారు.
  • వికీపీడియా:మీకు తెలుసా దళం - మొదటి పేజీలోని "మీకు తెలుసా?" శీర్షికను నిర్వహించడం.
  • వికీపీడియా:కేలండర్ దళం - మొదటి పేజీలోని "చరిత్రలో ఈ రోజు" శీర్షికను నిర్వహించడం. కేలండర్ ను నిర్వహించడం. ప్రస్తుతం తెవికీలో కేలండర్ నిర్వహణ చాలా తక్కువ స్థాయిలో ఉంది.
  • వికీపీడియా:అనువాద దళం - అనువదించే వారికి చేతినిండా పని. కాని దళం బాధ్యత అది కాదు. ఎక్కువ కాలం అనువాదం కాకుండా ఉన్న ఆంగ్ల భాగాలను ఏరి, రచయితలను హెచ్చరించడం, తొలగించేయడం. మరియు అనువాదం చేసే విధానంలో మార్గదర్శకాలు చేయడం.
  • వికీపీడియా:శైలి మార్గదర్శక దళం - ఏకవచనమా? బహువచనమా? ఇంగ్లీషు పొడి అక్షరాలు ఎలా వ్రాయాలి? "గ్రామం" లేదా "గ్రామము"?. వ్యాసం మొదట్లో బొద్దుగా వ్రాయాలా? బొమ్మలు ఏ సైజులో ఉండాలి? ఎన్ని ఉండవచ్చు? ఇలాంటి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు.
  • వికీపీడియా:క్రొత్త సభ్యులకు సహాయం దళం
  • వికీపీడియా:కాపీ హక్కుల దళం - అన్ని మార్పులు, ముఖ్యంగా బొమ్మలు కాపీ హక్కులకు అనుగుణంగా ఉండేలా చూడడానికి. ఇతర సభ్యులకు సలహాలు ఇవ్వడానికి. కాపీ హక్కుల సమాచారాన్ని, మూసలను అభివృద్ధి చేయడానికి.
  • వికీపీడియా:వర్గీకరణ దళం - వ్యాసాలు పటిష్టంగా వర్గీకరించడానికి. "వెతుకు"లాట సరిగ్గా పని చేయనందున ఈ పని చాలా అవుసరం.
  • వికీపీడియా:ప్రచార దళం - బయట వికీపీడియాను గురించి ప్రచారం చేయడానికి.
  • వికీపీడియా:మూసల దళం - క్రొత్త మూసలు చేయడానికి, పాత మూసలు దిద్దడానికి, మూసలను తగిన పేజీలలో ఉంచడానికి.
  • (ఇంకా మీకు తోచినవి ఇక్కడ వ్రాయండి.)

పైన చెప్పిన అన్ని రంగాలలోనూ చేతినిండా పని ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారాలను ఎవరో ఒకరు చూస్తున్నారు కనుక తగినంత శ్రద్ధ, సమయం కేటాయించడం సాధ్యం కావడం లేదు. కనుక ఒకో విషయానికీ ఒకో దళం (నిర్వాహకులే కానక్కరలేదు) ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒకో దళంలోను కనీసం ముగ్గురు సభ్యులుంటే పని సులువు అవుతుంది. ఎక్కువ మంది ఉంటే బహు బాగు. మీ అభిప్రాయాలను తెలపండి.

ప్రస్తుతం వికీపీడియా:శుద్ధి దళం, వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం అనే వేరువేరు పేజీలున్నాయి. వర్గం:చిట్కా మాస్టర్, వర్గం:పహారా కాస్తున్న తెవికీపీడియన్లు అనేవి వర్గాలుగా ఉన్నాయి. అన్ని దళాల ఏర్పాటు, సభ్యులు, పని వివరణ గురించి ఒకే పేజీ వికీపీడియా:దళాలు అనే పేజీలో ఉంచాలనుకొంటున్నాను. ఇందులో దళాల పేర్లు, సభ్యుల పేర్లు మాత్రం ఉంటాయి.

ప్రతి పాదన చేసిన తేదీ - 29/3/2008

ప్రతిపాదించిన సభ్యులు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:32, 29 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"క్రొత్త దళాల ఏర్పాటు" పై వ్యాఖ్యలు

[మార్చు]
  • ఈ దళాలన్నీ ఉండాల్సినవే. ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని దళాలలో ఇప్పటికే కొంతమంది సభ్యులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారందరినీ ఇలా దళాల రూపంలో ఏకీకరించడం ఎంతయినా అవసరం. అలాగే కొత్త దళాలను సభ్యులే తమంతట తామే ఏర్పాటు ఏర్పాటుచేసి, ఇతర సభ్యులను వాటిలోకి ఆహ్వానించే కొత్త సాంప్రదాయాన్ని కూడా మొదలు పెట్టాలి. అందుకనే నేను కాపీహక్కుల దళానికి తవరలోనే ఒక పేజీని తయారు చేసి అందులోకి సభ్యులను ఆహ్వానించే ప్రక్రియను మొదలు పెడతాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:07, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ దళాలను ఆలోచించి ప్రతిపాదించినందుకు కాసుబాబు గారికి అభినందనలు. మంచి ఆలోచన. ఒక్కొక్కటి సృష్టించవచ్చు. ప్రస్తుతానికి బాగా అవసరమున్న దళం క్యాలెండరు దళమనుకుంటా..దానితో పాటు ఒక క్యాలెండరు ప్రాజెక్టును ప్రారంభించి తేదీల పేజీలు, నెలల పేజీలు, సంవత్సరాల పేజీలు అభివృద్ధి పరిస్తే బాగుంటుంది --వైజాసత్య 06:40, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని చిన్న పేజీల తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

వికీపీడియాలో "వ్యాసాలు" అంటే వాటిలో చదవడానికి కొంత సమాచారం ఉండాలి. లేకపోతే ఇది ఒక జోక్ అవుతుంది. ఈ విషయం గురించి ఇదివరకు కూడా సమయం దొరికినప్పుడల్లా నేను ప్రస్తావించాను. ఒకమారు ప్రత్యేక:ShortPages చూడండి. చాలా వ్యాసాలు సభ్యులు ఉత్సాహంగా విస్తరించాలని మొదలు పెట్టినవే. కొన్నింటిని వర్గం, మూసల పూర్తి కోసం సృష్టించారు. కాని సమయాభావం వలన అవి ముందుకు వెళ్ళలేదు. ఒక్కొక్కరూ ఎంత పని చేయగలరు? కనుక కొన్ని వ్యాసాలు అలా మిగిలిపోయాయి. ఐతే ఇటువంటి వ్యాసాలు ఉండడంలో అర్ధం లేదు. ఉదాహరణకు ఈ వ్యాసాలు చూడండి -

దోషి, తెలుపు, స్వతంత్ర భారతం, సుకన్య, రవి శంకర్, నెల్సన్ మండేలా, జీవితం, నైస్ రాజా, గరుడాసనం, కొవ్వు, దండాసనం, జరాసంధ

అప్పుడప్పుడూ ఇలాంటి కొన్ని మొలకలను తొలగించడమే మంచిదనుకొంటున్నాను. లేకపోతే ఈ విజ్ఞాన సర్వస్వం ఒక భ్రమ అవుతుంది. ఆంగ్ల వికీలో కూడా మొలకలు లక్షల సంఖ్యలో ఉన్నాయి కాని వారికున్న విస్తార వ్యాసాలలో వాటి నిష్పత్తి 15% మించదు. మనకు 50% నుండి 75% వరకు ఇలాంటివే. అందుకని చిన్న వ్యాసాలు తొలగించడంలో ఈ విధానాన్ని అనుసరిద్దామని నా ప్రతిపాదన.

  • గ్రామాల వ్యాసాలు ఇందుకు మినహాయింపు. ఎందుకంటే అవి ఒక సుదీర్ఘమైన ప్రాజెక్టులో భాగం.
  • కొన్ని ప్రణాళికలలో వ్యాసాలు - పిరియాడిక్ టేబుల్, దేశాలు, కేలండర్ వంటివి ప్రస్తుతానికి మినహాయిద్దాము. వీటిని మరొ కొంత కాలం అయినాక పునఃపరిశీలించవచ్చును.
  • ఒకటి రెండు పదాలు ఉన్న సినిమాలకు మినహాయింపు అవుసరం లేదు. కనుక తొలగించాలి. ఎవరైనా ఆ సినిమా గురించి వ్రాయాలంటే మళ్ళీ వ్యాసం సృష్టించవచ్చు.
  • మిగిలిన మొలకలు - 3 నెలలకంటే ఎక్కువ కాలం రెండు లైన్లకు లోపు ఉన్నట్లయితే వాటిని తొలగించవచ్చును. తొలగించే ముందు ఆ వ్యాసం చరిత్ర, దాని లింకులు పరిశీలించాలి.

ఉత్సాహంతో సభ్యులు మొదలు పెట్టిన వ్యాసాలు తొలగించడం ఇబ్బంది అయినా గాని అవి అలా ఉంచితే మరీ నవ్వులపాలుగా ఉంటుంది. మంచి వ్యాసాలు ఒక వంద ఉన్నా గాని మనం గర్వంగా చెప్పుకోవచ్చును. గంగిగోవుపాలు గరిటెడైనను చాలు. మరో సమస్య - క్రొత్త సభ్యులు వికీలో వ్యాసం వ్రాయడం అంటే ఇంతే గదా - "కన్ను - ఇది శరీరంలోని ఒక అవయవం" అని వ్రాస్తే చాలుననుకొంటున్నారు.

దయచేసి మీ అభిప్రాయాలను తెలపండి. వ్యాసాలు తొలగించే పని ఏకముఖంగా చేయడం సబబు కాదు. సభ్యుల అభిప్రాయాన్ని బట్టే ఇది చేయడం కుదురుతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:03, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఉద్దేశ్యం ప్రకారం మొలకలకు నాణ్యతను నిర్దేశించాలి. ఆ తర్వాత అది మొలక క్రింద కూడా రాకపోతే దానిని తొలగించవచ్చు. ఇలా చేస్తే చాలా వరకు గ్రామాల వ్యాసాలు ఇందులోకి వస్తాయి. మీరన్నట్లు 50-75% చిన్న వ్యాసాలల్లో ఎన్ని గ్రామాల వ్యాసాలు ఉంటాయి. నా ఉద్దేశ్యం ప్రకారం 90% గ్రామాల వ్యాసాలు, సినిమా వ్యాసాలుంటాయి. కావున తొలగింపు కుదరకపోవచ్చు. చిన్న వ్యాసాలకు నిర్వహణ మూసలు తగిలించి, వాటిని మెరుగుపరచే దిశగా కృషి చేయడం ఉత్తమం. కొత్త సభ్యులకు సలహాలు, చిట్కాల రూపంలో మనం సహాయాన్ని అందివచ్చు, అది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. తెవీకీలో ఎంతమంది సభ్యులు ఒక్క మార్పు కూడా చేయకుండా కేవలం సభ్యత్వం తీసుకొని ఉన్నారో అదే సంఖ్యలో 1-10 మార్పులు చేసిన సభ్యులు కూడా ఉన్నారు. సభ్యత్వం తీసుకొన్న సభ్యులైనా మార్పులు చేసే విధంగా మనం వారిని ఆకర్షించగలగాలి. సభ్యుల సంఖ్య అయితే ఉంది గాని అందులో 90% కంటే ఎక్కువ మంది సభ్యులు అసలు వికీలో పాల్గొనడం లేదు. δευ దేవా 20:19, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చిన్న చిన్న వ్యాసాలలో ప్రాముఖ్యత కలిగిన వ్యాసాలుగా తయారు కాగలిగినవి ఉండవచ్చు.కాబట్టి వాటిని వేరు చేసి వెంటనే (Immediately changes needed) దిద్దుబాట్లు అవసరమైన వ్యాసాల క్రింద చేర్చి అందరు సభ్యులకూ కనిపించేటట్లు ఉండటం ద్వారా వాటిని విస్తరించవచ్చునని నా అభిప్రాయం. మరీ విస్తరించడానికి అవకాశం లేని వ్యాసాలను మాత్రమే తీసివేయాలని నా ఆలోచన. రవిచంద్ర(చర్చ) 05:16, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాను..ప్రస్తుతం చిన్నవిగా ఉన్నా నెల్సన్ మండేలా లాంటి వ్యాసాలు పెద్దవి కాగల అవకాశాలు మెండు. అలాంటి వాటిని తుడిచెయ్యటం సమంజసం కాదు. కానీ పెరుగుతాయన్న నమ్మకం లేని వ్యాసాలను తొలగించవచ్చు ఉదాహరణకి ఒక్కొక్క విష్ణుసహస్రనామానికి ఉన్న పేజీలను తొలగించవచ్చు..ఇంకా ఇంటిపేర్లకు వ్యాసాలు తయారుచెయ్యటంలో కూడా కొద్దిగా ఆచితూచి అడుగెయ్యాలి --వైజాసత్య 06:45, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్క వాక్యం మాత్రమే ఉన్న వ్యాసాలు అనేకం ఉన్నాయి అలాంటివి వీకీ పాఠకులను నిరాశ పరచడం సహజం.
--t.sujatha 16:51, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న వ్యాసాలను నిస్సందేహంగా తొలిగించవచ్చు. అసలు నాలుగు వాక్యాలు కూడా లేని సమాచారాన్ని వ్యాసం అని ఎలా అనగలం. ఇలాంటి వ్యాసాల వలన విజ్ఞాన సర్వస్వానికే చెడ్డ పేరు రావచ్చు. అయితే తొలిగించడానికి కేవలం పరిమాణం మాత్రమే కాకుండా మొలక రకం కూడా గుర్తించాలి. ప్రారంభంలో అన్ని మొలకలు చిన్నవిగానే ఉంటాయి కాని కాలక్రమంలో కొన్ని మహా వృక్షాలుగా అవతరిస్తాయి. కాబట్టి మొలకల భవిష్యత్తును అంచనావేసి తొలిగిస్తే బాగుంటుంది. వైజాసత్య గారు చెప్పినట్లు ఇంటిపేర్ల వ్యాసాలపై కూడా దృష్టి సారించాలి. వాటి అవసరం అంతగా లేదని నా అభిప్రాయం.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:53, 14 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ కొనసాగింపు

పైన సభ్యులు వెలిబుచ్చిన అభ్యంతరాలలో ఉన్న ముఖ్య విషయాలు - (1) విస్తరించడానికి అవకాశం ఉన్న మొలకలు (2) మొలకల వర్గీకరణ (3) మొలకల వృద్ధికి ప్రోత్సాహం (4) వీటిలో అధికం గ్రామాలు, సినిమాలు - వీటి గురించి కొంత వ్యాఖ్యానించదలచుకొన్నాను.

  • విస్తరించడానికి అవకాశం ఉన్న మొలకలు - దాదాపు ప్రతీ వ్యాసం విస్తరించడానికి అవకాశం ఉన్నదే. వ్రాసేవారి ఉత్సాహాన్ని, శక్తిని బట్టి. అయితే నేను పైన ఉదాహరించిన వ్యాసాలు తెరిచి ఒకసారి చూడండి. నెల్సన్ మండేలా "వ్యాసం" జూలై 2005 నుండి ఉంది. కాని అందులో ఒక్క వాక్యం కూడా లేదు. తెలుపు వ్యాసం నవంబర్ 2007 నుండి ఉంది. "తెలుపు ఒక స్వచ్ఛమైన రంగు" అన్న ఒకే ఒక వాక్యంతో. ఇవన్నీ కొన్ని వర్గాల పూర్ణత కోసం మొదలు పెట్టినవి. వీటిని వ్యాసాల క్రింద ఉంచడం అనవసరమనే అనిపిస్తుంది నాకు. తొలగించినా గాని, ముందు ముందు ఎవరైనా వీటి మీద వ్యాసాలు వ్రాయాలంటే అవరోధం లేదుగదా? వీటిని తొలగించినందువల్ల కోల్పోతున్న సమాచారం కూడా దాదాపు శూన్యం.
  • మొలకల వర్గీకరణ, భవిష్యత్తు అంచనా - మంచిదే. కాని ఇది ఆచరణలో అంత సులభం కాదు. శాస్త్రీయం కూడా కాదు. Statistical Principles ప్రకారం మొత్తం వ్యాసాల వృద్ధిని అంచనా వేయవచ్చునుగాని individual వ్యాసాల వృద్ధిని అంచనా వేయడం అసాధ్యం. వ్యాసాలు విస్తరించే బదులు వీటిని బేరీజు వేయడానికే ఎక్కువ సమయం పడుతుంది. ఆ ప్రక్రియ వల్ల చివరకు ఏమి ప్రయోజనం కలుగుతుంది?
  • మొలకల వృద్ధికి ప్రోత్సాహం - ఎవరైనా సభ్యులు తమకు ఆసక్తి ఉన్న వాటి మీదే వ్రాస్తారు. ఇది వికీయుల ఒక మౌలిక తత్వం (అనుకొంటాను). ఇతరులు సృష్టించిన మొలకల వృద్ధికి ఉత్సాహం చూపరు. చురుకుగా ఉన్న సభ్యులంతా ఇప్పటికే తలమునకలుగా ఉన్నారు. Immediately changes needed అని వ్రాస్తే మాత్రం వాటిని వృద్ధి చేయడం సాధ్యమా?. మూస:ఈ వారము సమైక్య కృషి పై ఏమయినా చేయగలుగుతున్నామా?
  • వీటిలో అధికం గ్రామాలు, సినిమాలు - అవును. గ్రామాలు - గ్రామాల ప్రాజెక్టుల మీద ఇప్పటికే పెట్టిన శ్రమ, దాని పరిధులవలన గ్రామాల వ్యాసాలు కొంతకాలమయనాక (ఒక సంవత్సరం?) పునఃసమీక్షించాలి. తప్పదు. ఇక సినిమాలు - దోషి వంటి వ్యాసాలు "ఒక్క పదం" వ్యాసాలు. వీటిని తొలగించడమే మంచిది. తెలుగు వికీ తెలుగు సినిమాల డేటాబేస్ కాదు. "ఆన్ని" సినిమాలకూ పేజీలు ఉండాల్సిన అవుసరం నాకు కనిపించడం లేదు. అదే సినిమా గురించి వ్రాయాలంటే క్రొత్త వ్యాసం సృష్టించడం కష్టం కాదు గదా!


ప్రతిపాదన సారాంశము: (1) మూడు నెలలు, మూడు లైనులు అనే మార్గదర్శకం ప్రవేశపెడదాము. వ్యాసం సృష్టించి మూడు నెలలు దాటినా మూడు లైనులకు మించని వ్యాసాలు తొలగించడమే ఉచితం అనుకొంటాను. తొలగించే ముందు {{తొలగించు|చాలా స్వల్ప సమాచారం}} అనే మూస ఒక వారంపాటు ఉంచుదాము. (2) ఇక ముందు ఒక్క పేరా అయినా లేని "మొలక"ను సృష్టించవద్దని సభ్యులను, కోరదాము.

సమస్యను మరొకమారు పరిశీలించి మీ అభిప్రాయాలను తెలియజేయమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:55, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • కాసుబాబుగారి సూచన సరిగా ఉంది .ఇది అమలుచేస్తే బాగుంటుంది.

--t.sujatha 07:27, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రతిపాదన బాగుంది. రెండు సూచనలు ఖచ్చితంగా అమలు పరిస్తే మనం చిన్న వ్యాసాలను అరికట్టవచ్చు. అలాగే ఈ వారము సమైక్య కృషిలో వర్గాలకు బదులు అన్నీ దిద్దుబాట్లు అవసరమైన వ్యాసాల పేర్లే చేరుద్దామనేది నా ఆలోచన రవిచంద్ర(చర్చ) 08:23, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
పక్షపాతం - గ్రామాల వ్యాసాలకు మాత్రం ఎందుకు పక్షపాతం చూపుతున్నారో అర్థం కావడం లేదు, కొన్ని వేల మొలకలను (గ్రామాల వ్యాసాలను) ఉంచి, కొన్ని వందల మొలకలను తొలగించడం వల్ల కలిగే లాభం ఏమిటో వివరించగలరా? ఒకసారి యాధృచ్చిక పేజీని పలుమార్లు నొక్కి చూడండి. ఏ వ్యాసాలు వికీని అపహాస్యానికి గురిచేస్తున్నాయో అర్థం అవ్వచ్చు. ఇది నా స్వీయ అభిప్రాయం ఎక్కువ మంది సభ్యులు ఎలా నిర్ణయిస్తే అలానే కానివ్వండి. δευ దేవా 08:46, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు చెప్పింది సరి. నేను దీని గురించి ఎవరితోనైనా చెబుదామనుకుంటున్నాను. 50,000 వ్యాసలు ఉండొచ్చు. అందులో 40,000 మెలకలైతే, దానికి 10,000 మంచి వ్యాసాలకి ఉన్నదానికి తేడా ఏమిటి? నేను వచ్చిన రోజే ఇది చూసాను. కనీసం ఒక పారా ఉన్న వ్యాసం రావాలంటే ఒక 20 సార్లు యాదృఛ్ఛిక పేజి నొక్కాలి. సాయీ(చర్చ) 08:55, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా పైన దేవా మరియూ సాయి చెప్పినదానికి ఏకీభవిస్తాను. గ్రామాలకు వ్యాసాలు నాకు కూడా అనవసరంగానే తోస్తున్నాయి. ఆ వ్యాసాలకు వివరాలను యాత్రికంగా చేర్చి, ఎప్పటికప్పుడు తాజాపరచాలన్నా కూడా, సరయిన మూలాలు లభించటం లేదు. అయితే అసలు ఈ గ్రామాల పేజీలను సృష్టించడానికి వెనుకగల కారణాలను మొదటగా పరిశీలిద్దాము. మొదట్లో మండలాల పేజీలను సృష్టించినప్పుడు, ప్రతీ మండలం పేజీలో, ఆ మండలంలోని గ్రామాల జాబితాను తయారు చేసాము. ఆ జాబితాలో ఉన్న ప్రతీ గ్రామానికీ లింకును ఏర్పాటుచేసాము. అప్పట్లో ప్రతీరోజూ ఎవరో ఒకరు వచ్చి మండలాల పేజీలో తమ గ్రామానికి ఎర్రలింకుని చూసి, వెంటనే ఒక పేజీని సృష్టించేవారు. కానీ ఒక వాక్యం కంటే ఎక్కువ ఏమీ రాసేవారు కాదు. కొన్ని రోజులకు ఇంకో కొత్త సమస్య తలెత్తింది. అదేంటంటే కొన్ని వేర్వేరు మండలాలలో ఒకే పేరు గల ఊర్లు ఉండేవి, ఇలాంటి వాటికి, ఈ మండలంలో కూడా ఈ ఊరు ఉంది, ఆ మండలంలో కూడా ఈ ఊరు ఉంది, మొదలైన వాక్యాలతో నిండిపోయేవి. ఈ సమస్యలన్నీ తీర్చేయడానికి, నిర్వహణా భారాన్ని తగ్గించడానికి ఇలా ప్రతీ ఊరికీ ఒక పేజీని సృష్టించడం జరిగింది. నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం చిన్న వ్యాసాలు ఉండటం వలన చాలా నామోషీగా ఉందని పెద్దగా ఫీలవ్వనవసరం లేదని నా ఉద్దేశం. తెలుగు వికీపీడియాలో మనం గర్వించదగ్గవి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు మూలాలను పేర్కొనడం, బొమ్మలకు కాపీహక్కుల వివరాలను చేర్చడం, ప్రాజెక్టులు మొదలైనవన్నీ తెలుగు వికీపీడియా నాణ్యతను ఇప్పటికిప్పిడు పెంచకపోయినా భావిశ్యత్తులో బాగా పెంచుతాయని నా నమ్మకం. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:26, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ వూరు ఉందా? కాకుండా మీ అభిమాన నటుడి పేజి ఉందా? లేక మీ అభిమాన క్రికెట్ ఆటగాడి పేజి ఉందా? అంటే బావుంటుంది. ఉదాహరణకు, తెవికీలో పవన్ కళ్యాణ్ వ్యాసాన్ని అనువదించాల్సి ఉంది. సాయీ(చర్చ) 11:15, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • గ్రామాల వ్యాసాలు తుడిచి వేయడం సరికాదు.అలాంటి సమాచారం వీకీకి అవసరమైనవి అందరూ తెలుసుకుకోవలసినవి ఇవి భవిష్యత్తులో ఎవరైనా అభివృద్దిపరచే అవకాశం ఉంది.అలాగే నెల్సన్ మాండేలా,హిల్లారీ,ఒబామా లాంటి వ్యాసాలను అలాగే ఉంచడం అవసరం.అలాంటివి భవిష్యత్తులో అభివృద్ధి చేయవచ్చు.కొన్ని వ్యాసాలను వర్గీకరించి తొలగించిన సమాచారాన్ని ఒకే పేజీలో చేర్చవచ్చు.గ్రామాల సమాచారాన్ని జిల్లా పేరుతోనో మండలాల పేరుతోనో వర్గీకరించి ఒకేచోట చేర్చవచ్చు.అలాగే భారతంలో పాత్రలు,రామాయణంలో పాత్రలు ఆయాపేర్లతో పేజీ సృష్టించి చేర్చవచ్చు.అలాచేస్తే తొలగించామన్న మధన ఉండదు.

--t.sujatha 16:04, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాని ఇప్పుడు ఉన్న వ్యాసాల వల్ల ఉన్న లాభం ఏమిటి? ఆ పేజి వల్ల ఆ గ్రామం ఏ మండలం ఏ జిల్లా తప్ప ఇంకేమన్నా తెలుస్తుందా? ఒక చిన్న గ్రామంలో మహా అంటే 1000 మంది ఉండోచ్చు. అందులో ఏదో 100 మంది కి ఇంటర్నెట్ ఉండొచ్చు. అందులో ఓ పది మందికి తెవికీ గురించి తెలిసుండొచ్చు. అందులో ఏవరో వచ్చి తమ గ్రామం గురించి వ్రాస్తారని నేను అనుకోవటం లేదు. నా లెక్కలు తప్పు కావచ్చు. నాకు గ్రామాల గురించి సరిగా తెలియదు. మీరే చప్పండి. ఈ వ్యాసాలు పేరిగే అవకాశం ఉందా? సాయీ(చర్చ) 01:39, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


షుమారుగా సాయీ చెప్పిన రేంజిలో కూడా లేదు. ఇంకా తక్కువ ఉంటుంది. ఆ కారణంగానే ఈ వ్యాసాలలో ప్రగతి చాలా తక్కువగా ఉంది. గ్రామాల వ్యాసాలవల్ల తెలుగు వికీ సమతుల్యత దెబ్బ తిన్నది (అని వైజాసత్య స్వయంగా ఒకమారు అన్నాడు). ఆ పేజీలు సృష్టించినపుడు అనుకొన్నది వేరు. జరిగింది ఆ స్థాయిలో లేదు. ఇది ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టుగానే చూడాలి. అయితే పెద్ద ప్రాజెక్టు గనుక మరికొంతకాలం వేచి, తరువాత పునఃసమీక్షించాలి. ఈ వ్యాసాలను Holy Cow లాగా చూడడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:07, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామవ్యాసాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రతి గ్రామానికి కొద్దిగా సమాచారం జోడిస్తే ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగువికీ అనగానే గ్రామవ్యాసాలు గుర్తుకు వచ్చే దశరావచ్చు. ఇతర వ్యాసాలు కావాలంటే ఎన్నో మార్గాలున్నాయి. కాని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక వ్యాసం ఒకే చోట మరెక్కడా దొరకదు. వాటిని కొద్దిగా అభివృద్ధి పరిస్తే చాలు. మునుముందు వాటికి మంచి దశరావచ్చు. ఇప్పటికే నేను మహబూబ్ నగర్, రంగారెడి జిల్లాలలోని అనేక గ్రామ వ్యాసాలను వృద్ధిపరిచాను. ప్రతిరోజు వార్తాపత్రికల జిల్లా ఎడిషన్లు చూస్తే ఆయా గ్రామాల గురించి ఎంతో సమాచారం లభ్యమౌతుంది. గ్రామ సమాచారాన్ని ఆ గ్రామం వారే చేరుస్తారని ఎదురుచూడనక్కరలేదు ప్రతి జిల్లాకు ఒకరిద్దరు ఈ పనికి పూనుకొంటే కొద్దిరోజుల్లోనే గ్రామవ్యాసాలు ఒక స్థాయికి వస్తాయి. కాబట్టి గ్రామ వ్యాసాలు ప్రస్తుతం చిన్నవైనా భవిష్యత్తులో మంచి సమాచారం అందజేస్తాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:23, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామాల వ్యాసాల్లో చాలా కృషి జరిగింది. ఇంకా గణాంకాలు వగైరా త్వరలో చేరుద్దాము. వాటి ప్రస్తుత పరిమాణం మొలక స్థాయిలో ఉందనుకుంటే ఎన్వికీలో రాంబాట్ పేజీల్లాగా గణాంకాలతో కూడిన ఒక పేరా వ్రాయవచ్చు. కానీ అసలు ఆలోచించవలసిన విషయం అదికాదు. ఒక వ్యక్తిని రెండుమూడు తరాల్లో మరిచిపోవచ్చు, వికీపీడియాలో వ్యాసం వ్రాసేంత పేరుకు కూడా నోచుకోకుండా పోవచ్చు కానీ గ్రామాలు శతాబ్దాలనుండి వస్తున్నవి వచ్చే 200-300 యేళ్లలో కుడా చాలాగ్రామాలు ఉండే అవకాశాలు మెండు. కాబట్టి వాటిని చిన్నచూపు చూడొద్దని మనవి. ఇక కేవలం పరిమాణాము దృష్టిలో పెట్టుకొని తుడివెయ్యటం నేను ఆంగ్లవికీలో కూడా చూడలేదు. ఒక చిన్న వ్యాసం ఇంకెక్కడైనా విలీనం చెయ్యగలిగే అవకాశమున్నా, దానంతట అది పెద్దగా విస్తరించే అవకాశము లేదన్నప్పుడే తుడిచివేస్తారు. ఒకప్పుడు గ్రామాల వ్యాసాలతో వికీ సమతుల్యం దెబ్బతిన్నమాట నిజమే కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందుతుంది కదా! ఇంకా చింత ఏల? గ్రామాలు కానీ వ్యాసాలు కూడా వికీలో 15 వేలకు పైగానే ఉన్నాయి. స్థిరమైన ఎడిషన్లను ఎలాగు సీడీల్లో విడుదల చేసే అవకాశముంది --వైజాసత్య 20:16, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకలు

[మార్చు]

ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులు ఎవరైతే మంచి మొలకలు తెవికీలో ఉండాలనుకుంటున్నారో వారికిష్టమైన కొన్ని మొలకలను దత్తత తీసుకుందాం. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకొక మొలక చొప్పున విస్తరిస్తే వాటిని కాపాడినట్లుంటుంది. రవిచంద్ర(చర్చ) 03:57, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నట్లు చేద్దాం. అయితే ఈ వారం సమైక్య కృషిని దారికి తీసుకువద్దాం. నేను రెడీ!, మరి ఇతర సభ్యులు కూడా రెడీ అంటే చెప్పండి. ఆ మూసకు విలువనిచ్చి ఈ పనిని పట్టాలకెక్కిద్దాం. దయచేసి ఆసక్తి ఉన్న సభ్యులు క్రింద తమ అంగీకారాన్ని తెలుపగలరు. δευ దేవా 13:31, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మరి ముఖ్యమైన మొలకలను ఒక వర్గంలో చేర్చి, వారానికి కొన్ని చొప్పున ఈ వారం సమైక్య కృషి లో చేరుద్దాం. ఇంకొక విషయం, అసలు మొలకలుగా వర్గీకరించబడిన కొన్ని వ్యాసాలు మరీ అంత చిన్నవేమీ కావు. మరలా ప్రమాణాలకనుగుణంగా ఒకసారి వర్గీకరించడం అవసరమనుకుంటా. కొన్ని అసలు వికీ విధానాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఈ రోజే తొలగించాను. అవసరమైతే ఇతర సోదర ప్రాజెక్టులకు తరలించాను. ఉదాహరణకు, జలుబు చేస్తే ఏం చేయాలి?, దురద ఎందుకు వస్తుంది?, క్యారెట్ తనడం కళ్ళకు మంచిదా? ఇలాంటి వ్యాసాలు. వీటిని వెంటనే తొలగించడానికి ఇతర సభ్యుల సలహా అవసరం లేదనుకుంటా. రవిచంద్ర(చర్చ) 13:50, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
జలుబు చేస్తే ఏం చేయాలి?, దురద ఎందుకు వస్తుంది?, క్యారెట్ తనడం కళ్ళకు మంచిదా? - ఇవి వికీ ఆరంభ దశలో వచ్చిన వ్యాసాలు గనుక వాటికి కొంత చారిత్రాత్మక విలువ ఉంది. వాటిని పూర్తిగా తొలగించకుండా పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:13, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాహిత్యం

[మార్చు]

తెలుగు సాహిత్యం లో చాటువులకు ప్రత్యేక స్థానం ఉన్నది. దానికి గాను ఒక శీర్షిక ఏర్పాటు చేయగలమా లేదా వికిసోర్సు లో పొందుపరచ గలమా?

చాటువులు గురించి వ్యాసం ఇక్కడ వ్రాయవచ్చును. ఇంకా విపులంగా వ్రాయాలనుకొంటే శ్రీనాధుని చాటువులు, వేములవాడ భీమకవి చాటువులు వంటి వ్యాసాలు వ్రాయొచ్చు. చాటు పద్యాలను కొద్దిగా ఈ వ్యాసాలలో ఉదాహరించవచ్చును. మొత్తం పద్యాలకు వికీసోర్స్, ఎన్నుకొన్న పద్యాలకు వికీవ్యాఖ్య సరైన స్థలాలు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:07, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


raavuri bharadwaja

[మార్చు]

మన వద్ద రావూరి భరద్వాజ గురించి సమాచారం లేదు, మీకెవరికయినా తెలిస్తె నేను పేజి వుంచాను లోడ్ చేయండి.़125.17.79.82 నాగ సాయి సూరి. పరవస్తు

మీరు వికీపీడియా:కోరుచున్న వ్యాసములు లో ఇది add చేయండి. చర్చసాయీరచనలు 07:38, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
[మార్చు]

వ్యవసాయం కోసం ఒక శీర్షిక పెడితే బాగుంటుందేమో ? తె.వికీ నిజంగా ఒక విజ్ఞాన సర్వస్వం కావాలటే, సాగుబడిలో ఉండే విషయాల గురించి వివరాలు కూడా చేర్చాలి.

మీ సూచన బాగుంది. తప్పక చేద్దాము. ఇప్పటికి వ్యవసాయం గురించి పెద్దగా వ్యాసాలు లేనందున ఈ శీర్షిక పెట్టలేదు. ప్రస్తుతానికి వర్గం:వ్యవసాయం, వర్గం:పంటలు ఉన్నాయి. ఈ వర్గాలలో వ్యాసాలను మీరు మరింతగా మెరుగుపరచ వచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:42, 13 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసాలు దిన పత్రికలో

[మార్చు]

నాకొక అలోచన వచ్చింది! వికీలో ప్రతివారం "ఈ వారపు వ్యాసం" గా పూర్తిగా వ్రాయబడిన/పరిణితి గలిగిన వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగు దిన పత్రికలన్నిటికి ఆదివారం అనుబంధాలు ఉన్నాయి. అందులో ఏదయినా పత్రికకు, ప్రతివారం, వికీలో ప్రర్శించబడిన/బడుతున్న "ఈ వారం వ్యాసం" ను ప్రచురించటానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది. వ్యాసం చివర తెలుగు వికీలోకి ఎలా ప్రవేశించాలి, వెబ్ చిరునామా వివరాలు ఒకటి రెండు వాక్యాలు జతపరచాలి. దీనివల్ల, ఈ వారం వ్యాసం వేల మంది చదువుతారు. అందులో పదిమందయిన ఆ విషయంమీద ఇంకా ఎక్కువ సమాచారం తెలిసినవారయి, వికిలోకి వచ్చి, వ్యాసాన్ని మరింత పరిపుష్టం చెయ్యచ్చు. ఇంకా అనేకమంది, తెలుగు వికి తెలియని తెలుగు వారు వికీ గురించె తెలుసుకుని, సభ్యులుగా చేరి వారి వారి కంట్రిబ్యూషన్ కూడ చేసే అవకాశం ఉన్నది. ఇతర సభ్యులు, ఈ విషయం మీద చర్చించగలరు.--SIVA 10:19, 8 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో ఉన్న వ్యాసాలన్నిటినీ ఎవరయినా ఏవిధంగానయినా ఉపయోగించుకునే/ప్రచురించుకోగలిగే అవకాశం ఉంటుంది.అందుకు వారు ఎవరివద్ద నుండి అనుమతి కూడా తీసుకోనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:37, 8 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
GFDL లైసెన్సు గురించి బహుశా తెలియకపోవడం వల్ల శివా అలా "అనుమతిస్తే" అని వ్రాశారు అనుకొంటాను. కాని ఆయన ఆలోచన సరైనదే. విద్యాలయాలు, పత్రికలు వికీ ప్రగతికి తోడ్పడగలిగే శక్తి కలిగి ఉన్నాయి. కాని అందుకు ఎవరు ఉత్సాహం చూపుతారో చూడాలి. ప్రస్తుతం వస్తున్న "ఈ వారం వ్యాసాలు" ఇంకాస్త మెరుగుపరిస్తే గాని "విశేష వ్యాసాలు" స్థాయికి చేరుకోవు. ప్రస్తుతం మన పని ఇలా కొనసాగిద్దాం. ఆచరణ సాధ్యమైతే శివా సూచన అమలు చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:33, 8 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శివ సమాధానం

[మార్చు]

ప్రచురణకు "అనుమతిస్తే" అని ఎందుకు వ్రాశానంటే, మనకు తెలుసు వికీలో ఉన్న వ్యాసాలకు ఎవరూ అనుమతి తీసుకోకుండా ప్రచురించవచ్చని. కాని, పత్రికల వారికి తెలియక పోవచ్చునుగదా. వారు, దీనికి ప్రచురణకు అనుమతి పొందాలి, ఎవరిదగ్గరనుంచి పొందాలి అని భావిస్తూ ఉండచ్చు. అందుకని, వికీ నిబంధనలు అనుమతిస్తే, కొన్ని సెలక్ట్ వార పత్రికలకు (అతి కొద్ది మిగిలినాయి) లేదా దిన పత్రికలకు వికీ ద్వార అఫీషియల్ గా తెలియ చేస్తే(ఈ మైలు ద్వార) కొన్ని వ్యాసాలు వరుసగా ఏదయినా వార/దిన పత్రిక ప్రచురించటం మొదలు పెట్టవచ్చు. ఒక్కటే నిబంధన, వ్యాసం చివర రెండువాక్యాలు తెలుగు వికీ చిరునామా, అందులోకి ఎలా వెళ్ళాలి అని మాత్రం తప్పనిసరిగా తెలియచేయాలి.దీనివల్ల తెలుగు వికీ ఎక్కువ ప్రాచుర్యం సంపాయించి మరింతమంది చురుకైన సభ్యులను పొందవచ్చని నా ఆకాంక్ష.--SIVA 10:32, 15 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Position is Wroనg in google in site maps.google.com (మీరు ఇలాంటి స్థానభ్రంసాలు వ్రాయండి)

[మార్చు]

maps.google.com లో రాజోలు యొక్క స్థానం తప్పుగా చూపటం జరిగింది.

ప్రగతికి సోపానాలు

[మార్చు]

ముచ్ఛటైన మూడు సూత్రాలు విధ్య వైధ్యం సేధ్యం చిరు మార్గదర్శకాలు ప్రగతికి సోపానాలు

వికీపీడియ పదమునకు బదులు "తెలుగు వికిపీడియా" అని వాడుట

[మార్చు]

మొదటి పేజీలో కాని, మరెక్కడైనా "వికిపీడియా" అనే పదం వాడినప్పుడు, దానికి బదులుగా "తెలుగు వికిపీడియా" అనే పదం వాడితే బాగుంటుందని నా ప్రతిపాదన. పరిశీలించగలరు. Madhavarao, pabbaraju 12:56, 7 ఆగష్టు 2008 (UTC)

Madhavarao, pabbaraju 14:32, 7 ఆగష్టు 2008 (UTC)—== ఈ వారం వ్యాసం - శివగారి అభిప్రాయం-నా అభిప్రాయం ==

."ఈ వారం వ్యాసం" పై, ఇతర తెలుగు పత్రికలలొ ప్రచురించటానికి అనుమతి ఇస్తే బాగుంటుందని శివగారు అభిప్రాయ పడ్డారు. అయితే, తెవికీలొ ఈ వారం నెల్సొన్ మండెలా పై వ్రాసిన వ్యాసం చాల వివరణాత్మకముగా వున్నది.సభ్యుల సమిష్టి పరిశొధనా ఫలితమని తలుస్తాను. అదే విధంగా శివగారి చందమామ తెలుగు మాస పత్రికపై వ్రాసిన వ్యాసం కూడా ఎంతో వివరణాత్మకముగా వున్నది. బహుశా, తెలుగు దినపత్రికలు కూడా ఇంతకంటే గొప్పగా వ్రాయక పోవచ్చు. తెలుగు వికిపేడియా లో వివిధ రచనలు చెయుట కొరకు పరిశొధనా బ్రుందం వున్నట్లే, తెలుగు దినపత్రికలలొను వుంటాయి కాబట్టి, ప్రత్యేక అనుమతి ఇవ్వవలసిన అవసరం వుండకపోవచ్చని నా అభిప్రాయం. అయితే, తెలుగు వికిపేడియా గురించి, తెలుగు పత్రికల ద్వారా, తెలుగు ప్రజలకి తెలియచెస్తే చాల బాగుంటుంది.

పుస్తకాలు కావాలి

[మార్చు]

నాకు రావూరి భరద్వాజ గారి పుస్తకాల కాపీలు కావాలి.ఏవరి వద్దఎనా వుంటె srigargeya_1@yahoo.co.in 9949497202(sai)కి దయఛెసి తెలుపగలరు. భవదీయుడు పరవస్తు నాగ సాయి సూరి.

Translation

[మార్చు]

Hey Dev! Are you available to finish this translation on Meta-Wiki? You can do it here. If you need help, you can talk to us on IRC at #wikimedia-translation, e-mail me, or leave a message on my meta talk page. Thanks! Cbrown1023 చర్చ 21:33, 29 ఆగష్టు 2008 (UTC)

ఇక్కడ నేను అనువదించాను. ఎవరైనా ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేయగలరా? ఇంకో విషయం, Tell_us_about_Telugu_Wikipedia పేజీలో ప్రశ్నలకు జవాబులు రాయగలరా? δευ దేవా 08:40, 30 ఆగష్టు 2008 (UTC)

ప్రస్తుత రాష్త్ర రాజకీయాల గురించి, ఒక మంచి పార్తి గురించి రాబొయె ప్రభుత్వం గురించి అన్దరి అభ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికి ఇలా ఉండటానికి కారణాలు ఏమిటి. మార్పు ఎక్కడ రావాలి. ప్రజలలోనా లేక ప్రభువులలొనా. మార్పును తెస్స్తాము అంటు వచ్ఛిన జయ ప్రకాష్ నారాయణ గారిని ప్రజలు ఎందుకు.. ఆహ్వానించడంలేదు? చిరంజీవిని ఎందుకు... అంతలా ఆరాధిస్తున్నారు... అసలు.. లోపం ఎక్కద ఉన్నది. ప్రజలలోనా? లేక... ఏమో... నాకు అయితే.. ప్రజలలోనే అని..అనిపిస్తూ ఉంది.. దీని మీద.. మీ అందరి అభిప్రాయాలు అహ్వానిస్తున్నాను.

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. . రచ్చబండలో మామూలుగా వికీపీడియాలోని వ్యాసాలు, మొదలైన సమాచారం గురించి చర్చ జరుగుతుంటుంది. అభిప్రాయాలకు ఇది సరైన వేదిక కాదు. వాటికి బ్లాగులు సరైనవని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 08:48, 13 సెప్టెంబర్ 2008 (UTC)

ప్రజలు ఛైతన్యవన్థముగానె ఉన్నారు జయప్రకాష్నారాయణ గారికి పాపులరితీ లెదు. ఎవరిన కొథవారు వఛి మీకు సలహ ఇస్తె పాట

కథానిలయం గ్రంథాలయం లోని రచనలు, రచయితల వివరాలు

[మార్చు]

కథానిలయం పేజీ ఖాళీ గా ఉండటం బాధగా ఉంది. దయ చేసి కథానిలయం లోని రఛనల వివరాలు రఛయితల వివరాలు ఉంచండి.

వినయ్ గారూ! మీకు ఈ వ్యాసం విస్తరించాలని ఆసక్తి ఉండడం సంతోషం. ఇవి వ్రాసినవారు తమకు లభించినమేరకు సమాచారాన్ని ఇందులో కూర్చారు. విషయం విపులంగా తెలిసినవారు ఇలాంటి వ్యాసాలను మరింత విస్తరిస్తారని మా ఆకాంక్ష. మీకు ఏవైనా వివరాలు తెలిస్తే తప్పక చేర్చేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 27 సెప్టెంబర్ 2008 (UTC)

తెలంగానా గురింఛి చర్ఛ

[మార్చు]

నెడు రాస్త్రం లొ వేడీ గా ఈ ఛర్ఛ నడుస్తుంది కావున దీని గూర్చి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొంటే బాగుంటుంది K.P.AJAYKUMAR 11:11, 24 అక్టోబర్ 2008 (UTC)కె.పి.అజయ్ కుమర్

ఇక్కడ వ్యాసాలు, సాంకేతికాంశాల తదితర వికీపీడియాకు సంబంధించిన అంశాలపైన మాత్రమే చర్చ జరుగుతుంది. బయటి చర్చలకు దీనికి సంబంధం లేదు గమనించండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:06, 24 అక్టోబర్ 2008 (UTC)

మీ సలహా కు ధన్యవదాలు ajay 04:30, 25 అక్టోబర్ 2008 (UTC)

తెలుగు ప్రాచీన హోదా పై

[మార్చు]

తెలుగుకు ప్రాచీన హోదా లభించిన ఈ సందర్భంలో దాని పై ఓ వ్యాసాన్ని తయారు చేస్తీ బాగుంటుంది.

విశేషవ్యాస ప్రతిపాదన

[మార్చు]

ఆది శంకరాచార్యుడు వ్యాసాన్ని విశేషవ్యాసంగా గుర్తించాలని ప్రతిపాదించాను. సభ్యులు దయచేసి తమ అభిప్రాయాలను వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు అను పేజీలో తెలుపవలసినదని కోరుతున్నాను.
Cnbrajesh 12:35, 18 డిసెంబర్ 2008 (UTC)

కవిత్వ అభిమానులకు కానుకగా కవితా పేజీని కూడా కేటాయిస్తె బాగంటుంది.........

[మార్చు]

కవితాభిమానులకు మన రోజువారీ పేజీలో ఒక కాలం కేటాయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతీ వార్తా పత్రిక వాళ్ళు ఆది సోమవారంలలో సాహిత్య పేజీలు కేటాయిస్తున్నారు. మన విశ్వ వీచికలో కూడా కొంత మేర కేటాయింపు వుండాలని నా ఆశ.కవితా దాహార్తిని తీర్చే ప్రయత్నం మనం మాత్రం ఎందుకు చేయకూడదు. ़~~़జంఝావతి.

జంఝావతి గారూ! మీ సూచనకు కృతజ్ఞతలు. ఇదివరకు నేను కూడా "ఈ వారం పద్యం" లాంటి ఒక కాలమ్ ఉండాలని కోరాను. కాని వికీపీడియా ప్రధానంగా వ్యాసాలకు పరిమితమైనది గనుక ఇది అందుకు సరైన స్థలం కాదు అని భావించారు. అందుకు వికీవ్యాఖ్య, వికీ మూలములు లు సరైన ప్రాజెక్టులు. అవి ఒకమారు చూడగలరు. కవిత్వం, సాహిత్యం గురించిన వ్యాసాలు ఇక్కడ వ్రాయవచ్చును. మీరు కూడా సహకరించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:26, 23 డిసెంబర్ 2008 (UTC)

"తెలుగు-to-తెలుగు పదకోశం" అనే నూతన విభాగం ప్రారంభించాలని సూచన.

[మార్చు]

తెలుగు వికీ లోని వివిధ విభాగాలు, విశయాలు పరిశీలించిన మీదట తెలుగు వికీ యొక్క వుపయోగతను విస్త్రత పరిచే ఒక సలహాను ఇవ్వదలచాను. దీనిలో ఒక పదకోశ విభాగాన్ని(Telugu-to-Telugu Dictionary) ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞులైన నిర్వాహకులు ఈ అంశం గురించి పరిశీలిస్తారని ఆశిస్తూ...

మన రాస్త్ర్రం లొ వున్న పున్య క్షె త్రల గురించి

[మార్చు]

సభ్యులకు,

మన రస్త్రం లొ వున్న అన్ని దెవాలయాల గురించి సమాచారాన్ని సెకరించి పొందు పరిస్తె అందరికి వుపయూగ పదుతుందని నా అభిప్రయం. ఈ విషయంలొ నా వంతు సహకారాన్ని అందిస్తాను.======= వెంకటా ఫణీ. దెవలరాజు.


థయిరాయిడ్ గ్రంధి గురింఛి

[మార్చు]

థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా స్త్రీలలో కనబడే సమస్య. దీని గురింఛిన పూర్వాపరాలు వైద్యం లో అనుభవం ఉన్న వారు ఎవరైనా పూనుకొని విశదీకరిస్తే సామాన్యులైన మాలాటి వారికి వుపయోగ పడుతున్ది. ముఖ్యముగా హోమియో పతి ద్వారా నయము ఛేసే ప్రక్రియ ,వాడాల్సిన మందులు వివరాలు ను తెలియ ఛేసే తగిన వారి కొసం ఈ నా అభ్యర్డనా పూరక ప్రతిపాదన ను మీ ముందు పెడుతున్నాను. -- ఇట్లు కె.నళినీ మోహన్ కుమార్

అవటు గ్రంధి. ఈ లింకును అనుసరించండి. -- రవిచంద్ర(చర్చ) 10:58, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
కొంత సమాచారం అవటు గ్రంధి మరియు ఇతర వినాళ గ్రంథులు వ్యాసాలలో ఉన్నది. ప్రత్యేకంగా ఏదైనా వ్యాధి గురించి కావాలంటే చేర్చవచ్చును. మీరు హోమియోపతీకి చెందినవారైతే దానికి చెందిన సమాచారం చేరిస్తే ప్రాథమిక సమాచారం తర్వాత చేర్చవచ్చును.Rajasekhar1961 12:08, 13 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]