జరాసంధుడు

వికీపీడియా నుండి
(జరాసంధ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


Jarasandh పరమ శివ భక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం వచ్చే పాత్ర.

జన్మ వృత్తాంతం

[మార్చు]
జరాసంధునితో పోరాడుతున్న బలరాముడు - మహాభారతంలోని ఒక దృశ్యం

బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరకి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రడుడి రాజ్యానికి వచ్చి జరాసంసంధుడిని చూసి, జరాసంధుడూ పరమ శివ భక్తులలో ఒకడౌతాడు అని చెబుతాడు.

యుధిష్టరుడి రాజసూయం - శ్రీకృష్ణుడు, భీముడు, పార్థుడు యుద్ధ భిక్ష

[మార్చు]
పోరాడుతున్న భీమ జరాసంధులు

ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని, జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తునాడని, రాజులను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను, భీముడు, అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణు వేషముతో వెళ్ళి యుద్ధ భిక్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. మగధ పొలిమేరలకు చేరు కొనుచుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ ఢంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములో ప్రవేశిస్తే తామంటతామే మోగుతాయి. భీముడికి చెప్పి ఆ ఢంకాలను భీముడీ ఉదరముతో చీల్చమని చెబుతాడు. ఢంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ, అర్జున, భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డిమార్గములో రాజధానిలో ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి అర్ఘ్య్పాద్యాలు ఇచ్చి, తాంబూలము ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడుగగా యుద్ధ భిక్ష కోరుతాడు. జరాసంధుడు భీముడితో మల్లయుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు. అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు. జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకము చేసి మల్ల యుద్ధానికి దిగితాడు.

జరాసంధుడు-భీముల యుద్ధము

[మార్చు]
జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చుచున్న భీముడు

యుద్ధం 27 రోజులు గడుస్తుంది. జరాసంధుడు-భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు. శ్రీకృష్ణుడి సూచన మేరపు భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కు విసిరేస్తాడు. ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు.

మూలాలు

[మార్చు]
  • వేదవ్యాసుని మహాభారత మూలం
  • గీతా ప్రెస్, గోరఖ్‌పూర్
  • Gibbs, Laura. Ph.D. Jarasandha Modern Languages MLLL-4993. Indian Epics.

బయటి లింకులు

[మార్చు]

జరాసంధుడి వధ