Jump to content

షర్మిలారెడ్డి

వికీపీడియా నుండి
(షర్మిల నుండి దారిమార్పు చెందింది)
వై ఎస్ షర్మిల
షర్మిలారెడ్డి


పదవీ కాలం
2021 జులై 8 – 2024
ముందు కార్యాలయం స్థాపించబడింది

పదవీ కాలం
2012 – 2021 జులై 8

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (2011-2021)
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (2021 - 2024)
సంతానం 2
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‍రెడ్డి కుమార్తె. 2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రకు "మరో ప్రజా ప్రస్థానం" అనే పేరు పెట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడైన అన్న జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తను తీసుకుని ప్రజలకు మరింత చేరువయింది.

ఆమె 2024 జనవరి 4న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[1] వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా జనవరి 16న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.[2]

విద్యాభ్యాసము

[మార్చు]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ. వైకాపా పార్టీ స్థాపకులు జగన్ కు చెల్లెలు.

షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. షర్మిలకు అనిల్ తో ద్వితీయవివాహం జరిగింది. మొదటి వివాహం మేనమామ ప్రతాప్ రెడ్డితో జరిగింది.

రాజకీయ జీవితం

[మార్చు]

అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012నుంచి జరుగుతున్న ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది.జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగనుపార్టీ అభ్యర్థి కొండ సురేఖ తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటంద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర.

మరో ప్రజాప్రస్థానం

[మార్చు]

వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా మరో ప్రజా ప్రస్థాపన పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు. ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది, యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను, తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుండి ప్రారంభించింది. పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17న గాయం అవటంవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి అపోలో ఆసుపత్రిలో ఆపరెసను చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు.ఆమె స్వస్తత పొందినతరువాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించింది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగి ఆగస్టు 4, ఆదివారం న ముగిసినది.9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాలగుండా జరిగింది.116 నియాజకవర్గాల మీదుగా జరిగింది. ఇందులో 9 కార్ఫోరేసన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాలు ఉన్నాయి.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాలలో బారీ స్థాయిలో జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.

షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాలు :1.వైస్సార్,2.అనంతపురం,3.కర్నూలు, 4.మహబూబ్ నగర్,5.రంగారెడ్డి, 6.నల్లగొండ, 7.గుంటూరు,8. కృష్ణా.9.ఖమ్మం, 10.పశ్చిమ గోడావరి, 11.తూర్పు గోదావరి, 12.విశాఖపట్నం, 13.విజయనగరం, 14.శ్రీకాళం.

మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3,112 కి.మీ. ప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిలా.

మరో ప్రజా ప్రస్థాన యాత్రా విశేషాలు

ప్రస్థానం (కి.మీ) ప్రదేశం నియోజక వర్గం జిల్లా
తొలిఅడుగు ఇడుపులపాయ పులివెందుల వైస్సార్
500 జూలకల్ అలంపూర్ మహబూబ్ నగర్
1000 కొండప్రోలు తండా మిర్యాలగూడ నల్లగొండ
1500 పెడన పెడన కృష్ణా
2000 రావికంపాడు చింతలపూడి పశ్చిమ గోదావరి
2500 కాకరాపల్లి తుని తూర్పుగోదావరి
3000 ధనుపురం పాతపట్నం శ్రీకాకుళం
3112 ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం శ్రీకాకుళం

మరో ప్రస్థానం చిహ్నం విజయప్రస్థానం

[మార్చు]

ఇచ్ఛాపురంలో వై ఎస్ రాజశేఖరుగారు గతంలో తను ప్రతి పక్షసభ్యుడుగా వున్నప్పుడు చేవెల్ల నుండి పాదయాత్రచేపట్టి 68 రోజులపాదయాత్రచేసి,1,473 కి.మీ ఇచ్ఛాపురం వరకు నడచి, పాదయాత్రముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన విజయవాటిక స్మారక స్తూపానికి ఎదురుగనే షర్మిలా మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం విజయ ప్రస్థానం నిర్మించి, ఆవిష్కారం చేసారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వంశవృక్షం

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 January 2024). "కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  2. V6 Velugu (16 January 2024). "ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.