వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ
Chairpersonవై. ఎస్. షర్మిళ
స్థాపకులువై. ఎస్. షర్మిళ
స్థాపన తేదీ8 జూలై 2021
(3 సంవత్సరాల క్రితం)
 (2021-07-08)
రద్దైన తేదీ4 జనవరి 2024; 8 నెలల క్రితం (2024-01-04)
ప్రధాన కార్యాలయంలోటస్ పాండ్, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034
రాజకీయ విధానంసంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం
రంగు(లు)పాలపిట్ట రంగు, నీలిరంగు

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) గా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి కుమార్తె వై. ఎస్. షర్మిళ ఈ పార్టీని 2021 జూలై 8 న ఏర్పాటు చేసింది.[1] వైఎస్సార్​ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 2022 ఫిబ్రవరి 23న గుర్తింపు ఇచ్చింది.[2] దీనికి సంబంధించిన లేఖ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వాడుక రాజగోపాల్‌కు అందింది.

పార్టీ నిర్మాణం

[మార్చు]

వైఎస్ షర్మిల 2021 మార్చిలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వైఎఆర్ అభిమానులు, నాయకులతో హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందనీ, రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఆమె నిర్ణయాన్ని తెలిపింది.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2021 మార్చి 3 న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసి మద్దతు తెలిపింది.[3][4] ఆమె ఖమ్మంలో 2021ఏప్రిల్‌ 9 న 'సంకల్ప సభ' పేరున బహిరంగ సభ నిర్వహించి జూలై 8న పార్టీ పెడుతున్నట్టు తెలిపింది.[5] 2021 మార్చి 15న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏపూరి సోమన్న వైఎస్ షర్మిల పార్టీలో చేరాడు.

ఆమె హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ దగ్గర ఏప్రిల్ 15 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ నిరుద్యోగుల కోసం ‘ఉద్యోగ దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం కాగా, ఆమె దీక్షకు పోలీసులు ఉదయం 10 గంటల నుంచి, సాయంత్రం ఐదు వరకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్​ ఇచ్చారు. .[6] అయితే సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో ఆమె తన దీక్షను లోటస్‌పాండ్‌లోనైనా కొనసాగిస్తానంటూ, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా పాదయాత్రన బయలుదేరగా పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్‌ పాండ్‌కు తరలించగా ఆమె అక్కడే రెండు రోజులపాటు దీక్ష చేసి విరమించింది.[7][8]

వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్ర‌తినిధులుగా తొమ్మిది మందిని నియమిస్తూ జూన్ 4 న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు.[9]

పార్టీ ఆవిర్భావం

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి జయంతి రోజు 2021జూలై 8న ఆమె ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధిని, తల్లి వై.యస్.విజయలక్ష్మితో కలిసి సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం, ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. ఆమె హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాగుట్ట జంక్షన్‌లో ఉన్న వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. అక్కడి నుండి ఆమె పార్టీ అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా జూబ్లీహిల్స్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌ చేరుకుంది. కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి తల్లితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వై.ఎస్.షర్మిల పార్టీ జెండా ఆవిష్కరణతో తన పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ప్రకటించింది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పార్టీ ప్రధాన అజెండా సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అని తెలిపింది.[10][11][12][13] వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలిరంగు మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం, మధ్యలో రాజశేఖర్​రెడ్డి బొమ్మతో ఉంది.[14]

తిరిగి ప్రజాప్రస్థానం

[మార్చు]

పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల 2022 మార్చి 11న తన ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి యాత్ర నిలిచిపోయిన గ్రామం నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి మొదలు పెట్టారు. 2021 అక్టోబరు 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర కొండపాకగూడెం వరకు సాగి 2021 నవంబరు 9న వాయిదాపడింది.[15]

వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 2022 మే 4వ తేదీ నాటికి 75 రోజులకు చేరుకుంది.[16] ఆ తరువాత రోజు వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటోంది. ఈ సందర్భాంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం తాళ్ళమడ గ్రామంలో 25 అడుగుల పైలాన్ ను వైఎస్ షర్మిల ఆవిష్కరించింది.

ఎన్నికల గుర్తు

[మార్చు]

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి అక్టోబరు 26న ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది.[17][18]

కాంగ్రెస్‌లో విలీనం

[మార్చు]

వైఎస్సార్ తెలంగాణ పార్టీని 2023 డిసెంబరు 04న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[19][20]

మూలాలు

[మార్చు]
  1. The News Minute (8 July 2021). "YS Sharmila launches YSR Telangana Party: Vijayamma attends event, Jagan gives it a miss" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  2. Eenadu (24 February 2022). "వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి ఈసీ గుర్తింపు". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. HMTV (3 March 2021). "లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసిన ఇందిరా శోభన్". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  4. Mana Telangana (4 March 2021). "కాంగ్రెస్‌కు షాక్". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  5. BBC News తెలుగు (10 April 2021). "వైయస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో పాటు, ఖమ్మం సభలో ఇంకా ఏం ప్రకటించారంటే." Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  6. News 18 Telugu. "Ys sharmila deeksha". Archived from the original on 22 June 2021. Retrieved 9 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. EENADU (2021). "ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  8. The News Minute (4 June 2021). "'YSR Telangana party': YS Sharmila registers her political party" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  9. NTV (4 June 2021). "వైఎస్ఆర్‌టీపీ అధికార ప్ర‌తినిధుల నియామ‌కం.. వీరికి చోటు." Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  10. BBC News తెలుగు (8 July 2021). "వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్‌ షర్మిల". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  11. Sakshi (8 July 2021). "వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  12. TV9 Telugu (8 July 2021). "Sharmila's YSRTP: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల - YS Sharmila launched new political party as YSR telangana Party in Hyderabad". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. The Hindu (8 July 2021). "Sharmila launches YSR Telangana Party, targets KCR". The Hindu (in Indian English). Archived from the original on 8 July 2021. Retrieved 9 July 2021.
  14. 10TV (4 July 2021). "YSR Telangana Party : షర్మిల కొత్త పార్టీ జెండా వివరాలివే | ys sharmila new party flag details". 10TV (in telugu). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  15. "నేటి నుంచి వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం". EENADU. Retrieved 2022-03-13.
  16. "ఉద్యోగాలు ఇచ్చేదాకా పోరాడుతా - Andhrajyothy". web.archive.org. 2022-05-04. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. Hindustantimes Telugu (26 October 2023). "వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు - ఈసీ ఆదేశాలు". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  18. Sakshi (26 October 2023). "వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు కేటాయింపు". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  19. Eenadu (4 January 2024). "కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  20. News18 తెలుగు (4 January 2024). "కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్టీపీ విలీనం". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)