పాదయాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పు సత్యాగ్రహ పాదయాత్రలో గాంధీజీ

కాలినడకన చేసే ప్రయాణాన్ని పాదయాత్ర అంటారు. ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు వారిని మరింత సన్నిహితంగా సంప్రదించుటకు, వారి మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు, ప్రముఖులు పాదయాత్ర చేపట్టుతారు. హిందూ మతంలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు కొందరు భక్తులు పాదయాత్ర ద్వారా చేరుకుంటారు. [1]

సామాజిక కారణాలు

[మార్చు]

1930లో దండి వరకు జరిగిన ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్రతో మహాత్మా గాంధీ పాదయాత్ర ప్రారంభమయింది. 1933-34 శీతాకాలంలో, మహాత్మా గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు.[2] తరువాత 1951 లో భూదాన ఉద్యమంలో భాగంగా గాంధేయవాది వినోభాభావే కూడా తన పాదయాత్రను ప్రారంభించారు. భావే ప్రారంభించిన పాదయాత్ర తెలంగాణా ప్రాంతం నుండి ప్రారంభమై బుద్ధగయ వరకు కొనసాగింది.[3] 1983 జనవరి 6 న చంద్రశేఖర్ సింగ్ కన్యాకుమారి నుండి తన పాదయాత్ర ప్రారంభించారు, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ 1983 జూన్ 25 వరకు ఢిల్లీలో రాజ్ ఘాట్ దాకా తన 4260 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "History of Padyatra". Archived from the original on 2012-07-23. Retrieved 2014-07-14.
  2. Ramachandra Guha (Nov 8, 2005). "Where Gandhi Meets Ambedkar". The Times of India. Archived from the original on 2012-07-11. Retrieved 2014-07-14.
  3. David R. Syiemlieh (2005). Reflections From Shillong: Speeches Of M.M. Jacob. Daya Books. p. 135. ISBN 8189233297.
  4. Manisha (2010). Profiles of Indian Prime Ministers. Mittal Publications. pp. xxi. ISBN 8170999766.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాదయాత్ర&oldid=3879116" నుండి వెలికితీశారు