యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

వికీపీడియా నుండి
(వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Chairman వై.ఎస్.జగన్మోహన్_రెడ్డి
వైఎస్. విజయమ్మ
స్థాపన మార్చి 11, 2011
సిద్ధాంతం ప్రాంతీయతావాదం
రంగు నీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
67 / 175
తెలంగాణా అసెంబ్లీ
3 / 119
లోక్ సభ
9 / 545
రాజ్య సభ
0 / 245
ఓటు గుర్తు
Ceiling fan.jpg
వెబ్ సిటు
www.ysrcongress.com
అభిమానులతో వై.యస్.జగన్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్._రాజశేఖరరెడ్డి కుమారుడైన వై.ఎస్.జగన్మోహన్_రెడ్డి ద్వారా ముందుకు తేబడింది [1]. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ కొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను కనుగొన్నారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు[2]. రాజశేఖర రెడ్డి ఏకైక కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) పేరు మీద కె.శివకుమార్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

ఎన్నికలు[మార్చు]

2014[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.

శాసనసభ ఫలితాలు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతము ఫలితం మూలం
2014 14వ శాసనసభ 67 44.47 % ఓటమి [3]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరము సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు
2014 16వ లోక్ సభ 9

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

Script error: No such module "Side box".