పి.వి.మిధున్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి

పార్లమెంటు సభ్యుడు,రాజంపేట లోక్ సభ స్థానము
ముందు అన్నయ్యగారి సాయిప్రతాప్
నియోజకవర్గం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం
ఆధిక్యత 6,01,752 (51.95%) 2014 - 2019

పార్లమెంటు సభ్యుడు,రాజంపేట లోక్ సభ స్థానము
పదవీ కాలం
2014
మెజారిటీ 7,02,211 (57.35%) 2019 - 2004
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019

వ్యక్తిగత వివరాలు

జననం 5 April 1984 (40)
పుంగనూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , స్వర్ణలత
జీవిత భాగస్వామి లక్ష్మీ దివ్య
సంతానం 1
నివాసం 335, చర్చ్ రోడ్డు, మారుతి నగర్, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ -517501 [1]

పి.వి. మిధున్ రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన రాజకీయ కుటుంబానికి చెందినవాడు. అతను రాజంపేట (లోక్సభ నియోజకవర్గం) నుండి పార్లమెంటు సభ్యునిగా 16 వ లోక్‌సభకు ఎన్నికైనాడు. అతను భారత ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలలో వాగ్దానం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ఆయన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులతో కలిసి తమ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ప్రధాని మోడీపై అవిశ్వాస తీర్మానం చేసిన తొలి పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ. 5 జూన్ 2019 న అతను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నాయకుడిగా ఎన్నికయ్యాడు.

ఎన్నికల పనితీరు[మార్చు]

2014 భారత సాధారణ ఎన్నికల లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి పై విజయం సాధించాడు. 2019 లో అతను రాజంపేట (లోక్ సభ నియోజకవర్గం) నుండి వై.సీ.పీ తరపున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.కె.సత్యప్రభ పై 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

వ్యక్తిగత సమాచారం[మార్చు]

అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. తన తండ్రి ప్రస్తుతం పుంగనూర్ శాసనసభ్యునిగా ఉన్నాడు. వైయస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయితీ రాజ్ &గ్రామీణాభివృద్ధి, మైనింగ్ & జియాలజీ శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. [2] . 2019 ఎన్నికల అఫిడవిట్ లో ఈయన తన మొత్తం ఆస్తి 66.51 కోట్ల రూపాయలుగా పేర్కొన్నాడు[3].

వివాదాలు, ప్రవర్తన[మార్చు]

విమానాశ్రయంలో దాడి[మార్చు]

తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగి మేనేజర్ అయిన రాజశేఖర్ పై బౌతిక దాడి బాగా వివాదాస్పదం అయ్యింది[4]. నిబందనల ప్రకారం బోర్డింగ్ పాసులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో వాగ్వాదం జరిగినది. ఈదాడి లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర కార్యకర్తలు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. బైల్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికి వీరికి బైల్ నిరాకరించబడింది[5], ఈయనతో పాటు శ్రీకాళహస్తి ఇంచార్జ్ అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్టు చేసి శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్కి తరలించారు.మిథున్ రెడ్డిని శ్రీకాళహస్తి అదనపు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపర్చగా 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు [6][7].

నమోదైన కేసులు[మార్చు]

భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) ప్రకారం ఈయన మీద 333, 324, 448, 427, 34, 149, 188, 341, 323 ఐపిసి సెక్షన్ ల మీద పలు కేసులు ఉన్నాయి [8].

మూలాలు[మార్చు]

  1. https://www.india.gov.in/my-government/indian-%7C parliament/midhun-reddy
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 26 మే 2019. Retrieved 22 జూలై 2019.
  3. https://timesofindia.indiatimes.com/elections/candidates/p-v-midhun-reddy
  4. https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-mp-mithun-reddy-attack-on-tirupati-air-port-manager-168135.html
  5. http://www.andhrabhoomi.net/content/ctr-43
  6. http://www.andhrabhoomi.net/content/ctr-43
  7. https://m.teluguin.com/featured/ysrcp-mp-mithun-reddy-arrested-in-chennai-airport-at-2-am-today.html[permanent dead link]
  8. http://myneta.info/LokSabha2019/candidate.php?candidate_id=4626