Jump to content

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

వికీపీడియా నుండి
డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 3 జూన్ 2024
ముందు గల్లా అరుణకుమారి
తరువాత పులివర్తి నాని
నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 జూన్ 1973
తుమ్మలగుంట, తిరుపతి గ్రామీణ మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం రెడ్డి
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం 2
పూర్వ విద్యార్థి ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ
మతం హిందూ మతము

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతి గ్రామీణ మండలం, తుమ్మలగుంటలో 04 జూన్ 1973లో జన్మించాడు. ఆయన ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 27 ఏళ్ళ వయసులో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. భాస్కర్‌ రెడ్డి 2007 నుండి 2010 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశాడు. ఆయన వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 41,755 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్‌‌గా నియమితుడయ్యాడు.[4]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా 16 జూన్ 2019న బాధ్యతలు చేపట్టాడు.[5] ఆయన 2021లో టీటీడీ పాలకమండలి ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[6] ఆయన 2024లో లోక్‌సభ ఎన్నికలలో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". ఒరిజినల్ నుండి 8 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". ఒరిజినల్ నుండి 13 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2021.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". ఒరిజినల్ నుండి 6 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2021.
  4. Sakshi (24 May 2019). "ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు". ఒరిజినల్ నుండి 10 జనవరి 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2022.
  5. Sakshi (16 June 2019). "తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి". the original నుండి 2020-05-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2021.
  6. 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala". ఒరిజినల్ నుండి 16 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "2024 Loksabha Elections Results - Ongole" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. the original నుండి 4 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2025.