పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ
పదవీ కాలం
2019 జూన్ 8 – 2022 ఏప్రిల్ 10

వ్యక్తిగత వివరాలు

జననం 01 జులై 1952
ఎర్రతివారిపల్లె, సదుం మండలం , చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి స్వర్ణలత
సంతానం పి.వి.మిధున్ రెడ్డి
నివాసం ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి,[1] [2] 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు[3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 01 జులై 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చిత్తూరు జిల్లా , పుంగనూరు లో జన్మించాడు. ఆయన 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.[5]

రాజకీయ జీవితం[మార్చు]

1974 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1985, 1994 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[6] అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు.

ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 , 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[7]ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[8]పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.[9]

శాసనసభకు పోటీ[మార్చు]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2019 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ 107431 ఎన్‌.అనూషారెడ్డి తె.దే.పా 63876
2014 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ 104587 ఎమ్‌ వెంకటరమణ రాజు తె.దే.పా 72856
2009 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ 84083 ఎమ్‌ వెంకటరమణ రాజు తె.దే.పా 43356
2004 పీలేరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ జివి. శ్రీనాథ రెడ్డి తె.దే.పా
1999 పీలేరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్‌ వెంకటరమణ రాజు తె.దే.పా
1994 పీలేరు జనరల్ జివి. శ్రీనాథ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తె.దే.పా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 పీలేరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా రామచంద్ర రెడ్డి తె.దే.పా
1985 పీలేరు జనరల్ చల్లా ప్రభాకర రెడ్డి తె.దే.పా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1978 పీలేరు జనరల్ మొగల్ సుఫుల్లా బైగ్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. V6 Velugu, V6 (8 June 2019). "ఏపీ కొత్త మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  4. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  6. "AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌.. మంత్రుల నేపథ్యమిదీ." EENADU. Retrieved 2022-04-11.
  7. Sakshi (2019). "Punganur Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  8. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  9. TV9 Telugu (21 September 2020). "ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... - ap govt has allotted key portfolios". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)