వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
(వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి .

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మే 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు చంద్రబాబు నాయుడు
నియోజకవర్గం పులివెందుల

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకుడు
పదవీ కాలము
26 మే 2014 – 30 మే 2019
ముందు చంద్రబాబు నాయుడు
తరువాత చంద్రబాబు నాయుడు

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ముందు వై. ఎస్. విజయమ్మ
నియోజకవర్గం పులివెందుల

లోకసభ సభ్యుడు
పదవీ కాలము
26 మే 2009 – 26 మే 2014
ముందు వై.ఎస్.వివేకానందరెడ్డి
తరువాత వై ఎస్ అవినాష్ రెడ్డి
నియోజకవర్గం కడప లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1972-12-21) 1972 డిసెంబరు 21 (వయస్సు: 46  సంవత్సరాలు)
జమ్మలమడుగు గ్రామము, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
జీవిత భాగస్వామి భారతీ రెడ్డి
సంతానము ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష)
నివాసము హైదరాబాదు బెంగలూరు మరియు అమరావతి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) ఆంధ్రప్రదేశ్రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. వీరు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్. రాజశేఖర రెడ్డికుమారుడు. జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు, రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ తో విబేధాలు కారణంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ని చీల్చాడు. 2014 ఎన్నికలలో పార్టీ వోటమి పాలైనా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం , సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.

రాజకీయ జీవితము[మార్చు]

విద్యుత్ ప్రాజెక్టులు,వ్యాపారాలు నిర్వహిస్తున్న జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. [1] తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు.

రాజీనామా ఫలితంగా 2011 మే లో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు.

2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25)తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

రాష్ట్రవిభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తు వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017-11-16 లో ఇడుపలపాయ నుండి 2019-01-09 లో ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలొమీటర్లు పాదయాత్ర చెసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారు.

ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీలచేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.[2]

అభియోగాలు[మార్చు]

2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. సెప్టెంబరు 23-2013 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తండ్రిని మించిన విజేతగా." ఈనాడు. 2019-06-24. Archived from the original on 2019-05-24. Retrieved 13 June 2019.
  2. "ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు". 2019-05-30. Archived from the original on 2019-06-09.

బయటి లింకులు[మార్చు]

అంతకు ముందువారు
నారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
2019 మే 30 నుండి
Incumbent