Jump to content

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

వికీపీడియా నుండి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019, మే 30 న ఆంధ్రప్రదేశ్ (నవ్య) రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 25 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.[1]

గవర్నరు ప్రసంగం

[మార్చు]

ఉభయసభల నుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు 2019 జూన్ 14 నాడు ప్రసంగించాడు. దానిలో ముఖ్యమైన నవరత్నాలను ప్రస్తావించాడు. [2]

'నవరత్నాలు'

[మార్చు]
  1. వైఎస్ఆర్ రైతు భరోసా
  2. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ,
  3. అమ్మ ఒడి
  4. ఫీజు రీయింబర్స్మెంటు
  5. వైఎస్ఆర్ పింఛన్లు
  6. పేదలందరికీ గృహాలు
  7. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన
  8. వైఎస్ఆర్ ఆసరా - వైఎస్ఆర్ చేయూత
  9. దశల వారీగా మద్యనిషేధం
  10. జలయజ్ఞం

ముఖ్య నిర్ణయాలు లేక ప్రతిపాదనలు

[మార్చు]
  • వైఎస్ఆర్ పింఛను మొత్తాన్ని రూ. 2250/- లకు పెంచడం.[3]
  • ఆశా వర్కర్ల జీతాలను రూ.3000/- నుండి రూ. 10,000/-లకు పెంచడం.[4]
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతులకు మాధ్యమంగా తెలుగు తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.[5] తదుపరి సంవత్సరాలలో పై తరగతులకు విస్తరించబడుతుంది.
  • జగన్ ప్రభుత్వం నియమించిన జియన్ఆర్ కమిటీ రాజధాని వికేంద్రీకరణను సూచించింది. దీనిలో భాగంగా అమరావతితో పాటు, విశాఖపట్నం, కర్నూలును రాజధాని కార్యకలాపాలు జరిగే ప్రదేశాలుగా గుర్తించారు. దీనికి అమరావతి రాజధాని ప్రాంతం రైతులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.[6] చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేసినా, న్యాయవివాదాలు తలెత్తినందున హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యథాతథ స్థితి కొనసాగుచున్నది.

ఇవీచూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కొలువుదీరిన కొత్త మంత్రివర్గం". సాక్షి. 2019-06-08. Archived from the original on 2019-06-15.
  2. ఇ.ఎస్.ఎల్, నరసింహన్ (2019-06-14). Wikisource link to ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
  3. "పేదలకు మరింత భరోసా." ఆంధ్రజ్యోతి. 2019-06-02. Archived from the original on 2019-06-15.
  4. "ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి.. విప్‌గా మాజీ మంత్రి!". సమయం. 2019-06-02. Archived from the original on 2019-06-15.
  5. "పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్". NTVnews. 2019-12-11. Archived from the original on 2019-12-14.
  6. వి, శ్రీనివాసరావు. "రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ". ప్రజాశక్తి. Archived from the original on 2019-12-28. Retrieved 28 December 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: