నిక్ వుజిసిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిక్ వుజిసిక్
Nick Vujicic speaking in a church in Ehringshausen, Germany - 20110401-02.jpg
జర్మనీలో ఎరింగ్‌షాన్ చర్చిలో ఉపన్యాసిస్తున్న నిక్ (2011)
జననంనికోలస్ జేమ్స్ వుజిసిక్
(1982-12-04) 1982 డిసెంబరు 4 (వయస్సు: 37  సంవత్సరాలు)
మెల్‌బోర్న్, విక్టోరియల్, ఆస్ట్రేలియా
నివాసందక్షిణ కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
పౌరసత్వంఆస్ట్రేలియా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
చదువుబ్యాచిలర్స్ డిగ్రీ
విద్యాసంస్థలుగ్రిప్ఫిత్ విశ్వవిద్యాలయం
వృత్తి
 • మత ప్రచారకుడు
 • ప్రాత్సాహం అందిచే వక్త
క్రియాశీలక సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామికానే మియహర (వి. 2012)
పిల్లలు4
బంధువులుBR.Aaron vujicic, sis.Michelle vujicic
వెబ్ సైటుnickvujicic.com

నికోలస్ జేమ్స్ వుజిసిక్ (/ˈvɔɪɪ/ VOY-chitch;[1] జననం: 1982 డిసెంబరు 4)[2][3] ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు.[4]

ప్రారంభ జీవితం[మార్చు]

వుజిసిక్ 1982 డిసెంబరు 4ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో దుసంక, బోరిస్లావ్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు.[5][6] అతను రెండు కాళ్ళు, చేతులు లేకుండా టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను అరుదైన వ్యాధితో జన్మించినందున అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి నిరాకరించింది. తరువాత అతని తల్లిదండ్రులు పరిస్థితులను అర్థం చేసుకొని అతనిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ పరిస్థితిని "వారి కొడుకు కోసం దేవుని ప్రణాళిక" గా వారు అర్థం చేసుకొన్నారు.[7]

అతను రెండు చిన్న, వైకల్య పాదాలను కలిగి ఉన్నందున, వాటి ఆకారం కారణంగా వాటిని అతను "చికెన్ డ్రమ్‌ స్టిక్" అని పిలిచేవాడు[8]. వాస్తవంగా అతని "చికెన్‌ డ్రమ్‌ స్టిక్" గా పిలిచే అతని పాదాల వ్రేళ్ళు కలిసిపోయాయి. వాటిని విడదీయడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. దీని వల్ల అతను వస్తువులను పట్టుకోవటానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులకు చేయడానికి వ్రేళ్ళుగా ఉపయోగించవచ్చు[9]. అతను తన పాదాన్ని విద్యుత్ చక్రాల కుర్చీని నడపడానికి, కంఫ్యూటర్, మొబైల్ ఫోన్‌ లను ఉపయోగించడానికి వినియోగిస్తాడు . వుజిసిక్ ఆత్మహత్యాయత్నం చేసాడు కానీ "అద్భుతంగా సాధారణ బాల్యం" తనకు ఉన్నట్లు తెలియజేసాడు[ఉల్లేఖన అవసరం].

ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు

వుజిసిక్ తన కౌమర దశ, యవ్వన దశలలో అనేక వేధింపులకు గురైనప్పటికీ అభివృద్ధి చెందాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లి అనేక వైకల్యాలతో బాధపడుతూ అభివృద్ధి చెందిన ఒక వ్యక్తిని గూర్చి ఒక వార్తాపత్రికలో కథనాన్ని అతనికి చూపించింది. అతను తన ప్రార్థన సమూహంలో చర్చలు చేయడం ప్రారంభించాడు. [10] అతను తన 21వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ, ఆర్థిక ప్రణాళిక అంశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు.

2005లో "లైఫ్ వితౌట్ లింబ్స్‌"[11] అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో "ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్" అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు[12].

అతను "ద బటర్‌ఫ్లై సర్కస్" అనే లఘు చిత్రంలో నటించాడు[13]. 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో షార్ట్ ఫిలింలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు[14].

2011లో ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ సంస్థ ద్వారా "సమ్‌థింగ్ మోర్" అనే మ్యూజికల్ వీడియోను వుజిసిక్ విడుదల చేసాడు[15][16].

వ్యక్తిగత జీవితం[మార్చు]

2002 మార్చి 9న అతను కాలిఫోర్నియాకు మారాడు. 2008 లో డల్లాస్ కు సమీపంలోని మిక్‌కిన్నీ లో కానే మియహరాను కలిసాడు. వారు 2012 ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు[17]. వారికి నలుగురు పిల్లలు.[18][19][20][21] వారు దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. [22]

పుస్తకాలు, ప్రచురణలు[మార్చు]

వుజిసిక్ మొదటి పుస్తకం "లైఫ్ వితౌట్ లిమిట్స్" రాండం హౌస్ ద్వారా 2010లో ప్రచురితమైనది. ఇది 30 భాషలలో అనువాదమయింది. [23]

మూలాలు[మార్చు]

 1. "Overcoming hopelessness" లో వీడియో
 2. Vujicic, Nick. "Nick Vujicic: Spreading Hope Worldwide". Nickvujicic.com. Retrieved 9 March 2016.
 3. "Life Without Limbs: About Nick Vujicic". Retrieved 28 September 2009. Cite web requires |website= (help)
 4. Born without arms and legs at BBC; published 23 February 2011; retrieved 18 November 2015.
 5. "Nick Vujicic – The Man Who Has Inspired Millions - World Top Updates". Worldtopupdates.com. 26 May 2017. Retrieved 28 June 2017.
 6. Z. Lazarević. "Roditelji Nika Vujičića u Beogradu: Drago nam je što smo u zemlji naših predaka". Blic.rs. Retrieved 30 August 2017.
 7. Vujicic, Nick. "A Life of Value," Life Without Limits, Doubleday, 2010.
 8. "Nick Vijucic - Attitude is Altitude". Attitude is Altitude. మూలం నుండి 16 March 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 11 March 2016. Cite uses deprecated parameter |deadurl= (help)
 9. Herald, University (19 August 2016). "Nick Vujicic On Hopelessness And His Childhood – Part 1". Retrieved 4 October 2016. Cite web requires |website= (help)
 10. Riley, Jennifer (30 March 2008). "Limbless Evangelist Preaches Joy in Christ". Christian Post Reporter. మూలం నుండి 28 July 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 28 September 2009. Cite uses deprecated parameter |deadurl= (help)
 11. "Life Without Limbs:About Us". Cite web requires |website= (help)
 12. "Nick Vijucic - Attitude is Altitude". Attitude is Altitude. Retrieved 9 March 2016.
 13. "Butterfly Circus Wins The Doorpost Film Project's $100,000 First Prize". 168project.blogspot.com. Retrieved 24 October 2013.
 14. "2010 Method Fest, Independent Film Festival, Calabasas, California". Methodfest.com. Retrieved 27 October 2014. Cite web requires |website= (help)
 15. ""Something More" from Something More - Single by Nick Vujicic on iTunes". 7 December 2010. Cite web requires |website= (help)
 16. Attitude Is Altitude (22 August 2011). "Nick Vujicic - "Something More" Music Video" – వయా YouTube. Cite web requires |website= (help)
 17. "How Nick Vujicic Met His Wife? What Qualities Attracted Him to Kanae Miyahara?". christianpost.com. 12 February 2012. మూలం నుండి 22 ఆగస్టు 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 30 August 2017.
 18. "Nick Vujicic Biography -Motivational Speaker Without Limbs". Insbright. 3 January 2016. Retrieved 22 December 2017.
 19. "Motivational Speaker Nick Vujicic Waited Until Marriage". waitingtillmarriage.org. Retrieved 22 December 2017.
 20. "Motivational Speaker, Nick Vujicic Born Without Limbs Welcomes Twin Girls With Wife". National Helm. 21 December 2017. Retrieved 22 December 2017.
 21. Herald, The Gospel (21 December 2017). "Limbless Evangelist Nick Vujicic Announces Birth of Twin Daughters Ahead of Christmas: 'Thank You God!'". Breaking Christian News: World, Business, and More. Retrieved 22 December 2017.
 22. "Nick Vujicic shares family's excitement in awaiting arrival of second son". Christiantoday.com. Retrieved 8 March 2016.
 23. Muteshi, Musabi. "Being someone else's miracle: Rwanda's story". The New Times Rwanda. Retrieved 8 March 2016.