ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ , ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఫోటో
Incumbent
చంద్రబాబునాయుడు

since 12 జూన్ 2024 (2024-06-12)
విధంగౌరవనీయులైన, ముఖ్యమంత్రి వర్యులు
స్థితిప్రభుత్వ అధినేత
Abbreviationసీఎం
సభ్యుడుఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
మంత్రిమండలి
అధికారిక నివాసంఅమరావతి, ఆంధ్రప్రదేశ్
స్థానంఆంధ్రప్రదేశ్ సచివాలయం, అమరావతి, ఆంధ్రప్రదేశ్
నియామకంఆంధ్రప్రదేశ్ గవర్నరు
కాల వ్యవధిశాసనసభ విశ్వాసం ఉన్నంతకాలం
ఐదు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్
నిర్మాణం1 నవంబరు 1956; 67 సంవత్సరాల క్రితం (1956-11-01)
2 జూన్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-06-02)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలిని, ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు.ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఎన్నిపర్యాయాలైనా ముఖ్యమంత్రిగా ఎంపిక కావటానికి ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు.[1]

1953 నుండి 2019 వరకు 19 మంది ముఖ్యమంత్రులు ఆ పదవిలో పనిచేసారు. వారిలో ఎక్కువ మంది భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి)కి చెందినవారు. 1953లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) నుండి టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐ.ఎన్.సి నుండి నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుండి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్. చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాలకు పైగా అనేక పర్యాయాలు పదవిలో కొనసాగారు. అయితే టిడిపి నుండి నాదెండ్ల భాస్కరరావు అతి తక్కువ పదవీకాలం (31 రోజులు) పనిచేసాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి అయ్యాడు. అలాగే నాల్గవ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి. వి. నరసింహారావు తరువాత కాలంలో ప్రధాన మంత్రిగా పనిచేసాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్. టి. రామారావు రాష్ట్రానికి కాంగ్రెస్‌యేతర మొదటి ముఖ్యమంత్రి. ఇటీవల 2014లో ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

ముఖ్యమంత్రుల జాబితా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.

పూర్వ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులు (1953-1956)

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు[2] 1953 అక్టోబరు 1 1954 నవంబరు 15 1 సంవత్సరం, 45 రోజులు
రాష్ట్రపతి పాలన 1954 నవంబరు 15 1955 మార్చి 28 133 రోజులు
2 బెజవాడ గోపాలరెడ్డి [3] 1955 మార్చి 28 1956 నవంబరు 1 1 సంవత్సరం, 218 రోజులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు.[4]

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి 1956 నవంబరు 1 1960 జనవరి 11 3 సంవత్సరాలు, 71 రోజులు కాంగ్రెస్
2 దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 1962 మార్చి 12 2 సంవత్సరాలు, 60 రోజులు కాంగ్రెస్
(1) నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 1 సంవత్సరం, 337 రోజులు కాంగ్రెస్
3 కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబరు 30 7 సంవత్సరాలు, 244 రోజులు కాంగ్రెస్
4 పి.వి.నరసింహారావు 1971 సెప్టెంబరు 30 1973 జనవరి 10 1 సంవత్సరం, 72 రోజులు కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 1973 డిసెంబరు 10 334 రోజులు
5 జలగం వెంగళరావు 1973 డిసెంబరు 10 1978 మార్చి 6 4 సంవత్సరాలు, 86 రోజులు కాంగ్రెస్
6 మర్రి చెన్నారెడ్డి
1978 మార్చి 6 1980 అక్టోబరు 11 2 సంవత్సరాలు, 219 రోజులు కాంగ్రెస్
7 టంగుటూరి అంజయ్య 1980 అక్టోబరు 11 1982 ఫిబ్రవరి 24 1 సంవత్సరం, 136 రోజులు కాంగ్రెస్
8 భవనం వెంకట్రామ రెడ్డి
1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 208 రోజులు కాంగ్రెస్
9 కోట్ల విజయభాస్కరరెడ్డి 1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 111 రోజులు కాంగ్రెస్
10 నందమూరి తారక రామారావు 1983 జనవరి 9 1984 ఆగష్టు 16 1 సంవత్సరం, 220 రోజులు తె.దే.పా
11 నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగష్టు 16 1984 సెప్టెంబరు 16 31 రోజులు కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు 1984 సెప్టెంబరు16 1985 మార్చి 9 174 రోజులు తె.దే.పా
(10) నందమూరి తారక రామారావు 1985 మార్చి 9 1989 డిసెంబరు 2 4 సంవత్సరాలు, 269 రోజులు తె.దే.పా
11 మర్రి చెన్నారెడ్డి
1989 డిసెంబరు 3 1990 డిసెంబరు 17 1 సంవత్సరం, 14 రోజులు కాంగ్రెస్
12 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి 1990 డిసెంబరు 17 1992 అక్టోబరు 9 1 సంవత్సరం, 297 రోజులు కాంగ్రెస్
(9) కోట్ల విజయభాస్కరరెడ్డి 1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 2 సంవత్సరాలు, 64 రోజులు కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు 1994 డిసెంబరు 12 1995 సెప్టెంబరు 1 263 రోజులు తె.దే.పా
13 నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబరు 1 2004 మే 14 8 సంవత్సరాలు, 256 రోజులు తె.దే.పా
14 వై.యస్.రాజశేఖరరెడ్డి 2004 మే 14 2009 సెప్టెంబరు 2 5 సంవత్సరాలు, 111 రోజులు కాంగ్రెస్
15 కొణిజేటి రోశయ్య 2009 సెప్టెంబరు 3 2010 నవంబరు 24 1 సంవత్సరం, 83 రోజులు కాంగ్రెస్
16 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబరు 25 2014 ఫిబ్రవరి 28 3 సంవత్సరాలు, 96 రోజులు కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన 2014 మార్చి 1 2014 జూన్ 7 99 రోజులు

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు (2014 నుండి)

ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి రాజకీయ పార్టీ
1 నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 8 2019 మే 30 4 సంవత్సరాలు, 356 రోజులు తె.దే.పా
2 వై.యస్ జగన్ మోహన్ రెడ్డి 2019 మే 30 2024 జూన్ 11 5 సంవత్సరాలు, 12 రోజులు వై.కా.పా
3 నారా చంద్రబాబునాయుడు 2024 జూన్ 12 ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తె.దే.పా

ఇవీ చూడండి

మూలాలు

  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Andhra Pradesh as well.
  2. "Tanguturi Prakasam Pantulu remembered". The Hindu (in Indian English). Special Correspondent. 2020-08-24. ISSN 0971-751X. Retrieved 2021-05-11.{{cite news}}: CS1 maint: others (link)
  3. "Bezawada Gopala Reddy | Indian Politician | Nellore Chief Minister". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places. 2014-07-22. Retrieved 2021-05-11.
  4. "లిస్ట్ ఆఫ్ ఛీఫ్ మినిస్టర్స్". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 2020-03-26. Retrieved 2021-05-07.

బయటి లింకులు