వై.యస్.అవినాష్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.ఎస్.అవినాష్ రెడ్డి
వై.యస్.అవినాష్‌రెడ్డి


భారత పార్లమెంటు సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
నియోజకవర్గం కడప లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-08-27) 1984 ఆగస్టు 27 (వయసు 40)
పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వై.ఎస్.సమత
సంతానం 1
నివాసం పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగు (బి.టెక్) , వోర్సెస్టర్ విశ్వవిద్యాలయం (ఎం.బి.ఎ)
మతం క్రిస్టియన్

వై.యస్.అవినాష్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకైనాడు. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 భారత సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వై.యస్.అవినాష్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డిపై 1,90,323 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి పై 380,726 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వై.యస్.అవినాష్‌రెడ్డి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డిపై 62,695 ఓట్ల మెజార్టీతో గెలిచి మూడోసారి వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 March 2019). "దశాబ్దాల చరిత్ర.. వైఎస్‌ కుటుంబ ఘనత." Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kadapa". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  3. The Hindu (4 June 2024). "Y.S. Avinash Reddy retains Kadapa Lok Sabha constituency" (in Indian English). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.