సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి

మాజీ రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - 2019
ముందు పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి
తరువాత మూలే సుధీర్‌ రెడ్డి
నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 4 జులై 1958
జమ్మలమడుగు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్ట్, తెలుగుదేశం పార్టీ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుబ్బరామిరెడ్డి, వెంకట సుబ్బమ్మ
జీవిత భాగస్వామి అరుణమ్మ
సంతానం సుధీర్‌రెడ్డి, దీప్తి
నివాసం జమ్మలమడుగు

చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయంగా నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 నుండి 2019 వరకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఆదినారాయణ రెడ్డి 4 జులై 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, జమ్మలమడుగులో సుబ్బరామిరెడ్డి, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కాన్పూరు యూనివర్సిటీ నుండి 1980లో ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జమ్మలమడుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] ఆయన తరువాత టీడీపీలో చేరి 2017 నుండి 2019 వరకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా పని చేశాడు.[3][4] ఆదినారాయణ రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5] ఆయన 22 అక్టోబర్ 2019న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6]

ఆదినారాయణ రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై,[7] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[8][9][10]

మూలాలు

[మార్చు]
  1. Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. Sakshi (9 October 2013). "నేడు వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆది". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  3. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  4. Andhrajyothy (16 September 2017). "ఆక్వాతో రూ.13 వేల కోట్ల ఆదాయం: మంత్రి ఆదినారాయణ రెడ్డి". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  5. Sakshi (26 May 2019). "'ఆది' నుంచి పార్టీ అంతం వరకూ..." Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  6. Sakshi (22 October 2019). "కమలం గూటికి.. ఆదినారాయణరెడ్డి". Archived from the original on 2019-10-22. Retrieved 10 December 2021.
  7. Election Commision of India (4 June 2024). "AP Assembly Election Results 2024 - Jammalamadugu". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  8. Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  9. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  10. Eenadu (13 November 2024). "విధేయతకు అందలం". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.