కె.నాగేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొఫెసర్ కె. నాగేశ్వర్
Prof.K.Nageshwar.jpg
కె నాగేశ్వర్
జననంమంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం
ఇతర పేర్లుకె. నాగేశ్వర్
ప్రసిద్ధిపాత్రికేయుడు
రాజకీయ పార్టీఇండిపెండెంట్
భార్య / భర్తకె. శ్రీలక్ష్మి
పిల్లలురాహుల్ సాంకృత్, అమర్త్య.
తండ్రిసదాశివరావు
తల్లిఅనసూయ

ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసరు. వివిధ మాధ్యమాల ద్వారా రాజకీయ సామాజిక అంశాలు, సమకాలీన సమస్యలపై విశ్లేషణలు చేస్తుంటాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతను సదాశివరావు, అనసూయ దంపతులకు మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలో ఏదులాపురం గ్రామంలో జన్మించాడు. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి సైన్సు గ్రాడ్యుయేట్ గా తన కెరియర్ ప్రారంభించిన డాక్టర్ కె. నాగేశ్వర్, జర్నలిజంలో పిజి, రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ సాధించాడు. జాతీయ స్థాయిలో జర్నలిజంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాడు. 1994లో జర్నలిజంలో యుజీసి కెరీర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇతని భార్య పేరు కె. శ్రీలక్ష్మి.[1]

పాత్రికేయరంగం[మార్చు]

నాగేశ్వర్ "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "టైమ్స్ ఆఫ్ ఇండియా" లలో పనిచేశాడు. గత మూడు దశాబ్దాలుగా "హిందూ", "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ద పయనీర్", " ది ఎకనమిక్ టైమ్స్", "ఫ్రంట్ లైన్" వంటి పత్రికలలో వ్యాసాలను ప్రచురించాడు. సి.ఎన్.ఎన్. ఐబిఎన్, ఎన్డిటీవి, టైమ్స్ నౌ, స్టార్ టీవి, జీ న్యూస్, ఆజ్ తక్ మొదలైన ఛానెల్స్ లో ప్రాంతీయ అభివృద్ధిపై వ్యాఖ్యానించాడు. ఇతను "ఎనాలిసిస్ " పేరుతో తెలుగు సామాజిక రాజకీయ అంశాలపై విశ్లేషణలను అందజేసే పత్రికను అనేక సంవత్సరాలపాటు నడిపాడు. ఈ 10టీవి తెలుగు న్యూస్ ఛానల్ కు ఛైర్మన్ గా పనిచేశాడు. ది హన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రికకు ప్రధాన సంపాదకునిగా, హెచ్.ఎం. టివిలో ఎడిటర్ గా పనిచేశాడు.

ఉపాధ్యాయరంగం[మార్చు]

జాతీయ పోలీస్ అకాడమీ, ది నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, డాక్టర్ ఎంసిఆర్ మానవ వనరుల అభివృద్ధి, అనేక జర్నలిజం పాఠశాలలో ఆయన అతిథి అధ్యాపకునిగా పనిచేశారు. బిర్లా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిఐటిఎస్, హైదరాబాదు) లో విజిటింగ్ ప్రోఫెసర్ గా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం శాఖ అధిపతిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పాలక మండలికి కూడా సేవలు అందించాడు.

ఇతర వివరాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అటవీ, పర్యావరణ, వన్యప్రాణిలో లెజిస్లేటివ్ కమిటీకి తన సేవలు అందిచాడు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, తెలంగాణ (19 January 2020). "మూడు నెలల్లో...ఆంగ్లాన్ని జయించాను". వీరా కోగటం. మూలం నుండి 6 ఫిబ్రవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 8 February 2020. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]