ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ప్రెస్ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ (మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్) [2] గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ గా మార్చారు.
2020 నవంబరు 8న నాడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యాడు. [3] 2021 నవంబరు 7తో ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంలో మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. [4]
చరిత్ర[మార్చు]
1992 లో నల్గొండ జిల్లా సూర్యపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏర్పాటుకు తీర్మానం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తీర్మానాన్ని అంగీకరించాడు.సియాసత్ సంపాదకుడు అబిద్ ఆలీ ఖాన్ నాయకత్వంలో ఏర్పాటైన జట్టు పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక ప్రెస్ అకాడమీల పనితీరుని పరిశీలించి ఇచ్చిన నివేదిక అధారంగా 1996 మార్చి 19 న కె. శ్రీనివాసరెడ్డి ప్రెస్ అధ్యక్షునిగా తొలి పాలకమండలి సమావేశం జరిగింది. అకాడమీ 1996 జులై 20 న లాంఛనంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. 1996 ఫిభ్రవరి 22 నుండి 1998 ఫిభ్రవరి 21వరకు కె.శ్రీనివాసరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా భాధ్యతలు నిర్వహించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు పొందుతున్నా, ఛైర్మన్ నియమాకం మినహా స్వయంపాలక సంస్థగా తీర్చిదిద్దాడు. 1999 ఫిభ్రవరి 12 నుండి 2002 మే 2 వరకు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించాడు. ఈయన హయాంలో పాత పత్రికల డిజిటలీకరణ జరిగింది.[5].
కొన్ని పుస్తకాలు[మార్చు]
ఇది అవిభక్త ప్రెస్ అకాడమి ప్రచురించిన పుస్తకాలు.[6],
- గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
- విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
- పత్రికా భాష
- విలేఖరి వ్యక్తిత్వ వికాసం
- కంప్యూటరే ఇక కలం కాగితం - పొత్తూరి వెంకటేశ్వరరావు
- ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
- జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
- విలేఖరి- చట్టాలు
- తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు, 2004
- సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
- పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు -చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 [7]
ఇవీచూడండి[మార్చు]
వనరులు[మార్చు]
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ". Archived from the original on 2017-05-20. Retrieved 2010-09-30.
- ↑ "MEDIA ACADEMY OF TELANGANA STATE website". Retrieved 2021-01-05.
- ↑ వన్ ఇండియా. 2020-11-08 https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-journalist-devireddy-srinath-reddy-appointed-ap-press-academy-chairman-orders-issued-by-the-256873.html. Retrieved 2021-01-24.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ "ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి పదవీకాలం పొడిగింపు". andhrajyothy. Retrieved 2022-01-29.
- ↑ గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 134.
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు". Archived from the original on 2010-09-20. Retrieved 2010-09-30.
- ↑ పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004
బయటి లింకులు[మార్చు]
- "Telugu Library ఖాతాలో పాత పత్రికలు (ఆర్కైవ్.ఆర్గ్) లో 4165 పత్రికలు". Retrieved 2021-01-24.