Jump to content

సమాచార, పౌర సంబంధాల శాఖ (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి

సమాచార, పౌర సంబంధాల శాఖ [1] ప్రజలకు, ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక వివరాలను తెలియచేయటానికి బహుముఖ మాధ్యామాల ద్వారా కృషిచేస్తుంది. అంతేకాకుండా ప్రజల స్పందనలను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి కృషి చేస్తుంది.

విధులు

[మార్చు]

1. ప్రభుత్వ కార్యకలాపాలను మాధ్యమలలో ప్రచారం చేయటం. దీనికొరకు ప్రెస్ యాత్రలు, ప్రకటనలజారీ, ప్రదర్శనల ఏర్పాటు, ఆట, పాట కార్యక్రమాలు, ఛాయాచిత్ర, చలనచిత్ర సేవలు అందిస్తుంది. అంతేకాక ఏ.పి జర్నల్ అనే పత్రిక నిర్వహణ, మాధ్యమాల సమాచార గమనింపు, విశ్లేషణ వ్యవస్థ, శిక్షణ, సామాజిక రేడియో, టెలివిజన్ పరికరాల నిర్వహణ, సమావేశాలకు దృశ్యశ్రవణ వ్యవస్థల ఏర్పాటు, ఎలెక్ట్రానిక్ వార్తల నమోదు, విశ్లేషణ, శాఖపర కంప్యూటర్, వెబ్ సేవల నిర్వహణ

2. ప్రజలకు ప్రభుత్వ సేవల గురించి తెలపడం

3. సామాజిక దుర్మార్గాలైన అంటరానితనం, వరకట్నం, బాల్యవివాహాలు, జోగిని, వెట్టిచాకిరీ, బాల్యశ్రమ, బాణామతి మొదలైనవాటిగురించి ప్రచారం.

ప్రెస్ అకాడమీ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ [2] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మకంగా ఏర్పడిన వెంటనే మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్థాపించబడింది.

వనరులు

[మార్చు]
  1. "సమాచార, పౌర సంబంధాల శాఖ జాలస్థలి". Retrieved 2020-01-13.
  2. "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ". Archived from the original on 2017-05-20. Retrieved 2020-01-13.