Jump to content

పొత్తూరి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
పొత్తూరి వెంకటేశ్వరరావు
పొత్తూరి వెంకటేశ్వరరావు
జననం(1934-02-08)1934 ఫిబ్రవరి 8
గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం2020- మార్చి-5
వృత్తిపాత్రికేయుడు,,రచయిత

పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగు పాత్రికేయుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా పలు హోదాలలో పనిచేశాడు. ఆంధ్రభూమి పత్రికతో ఆతనికి అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించాడు. ఉద్యోగరీత్యా అనేక పదవులను పోషించాడు. హైద్రాబాదు, విజయనగర్ కాలనీ, పి ఎస్ నగర్లో స్థిరపడ్డారు.ఇతని తండ్రి పేరు వెంకట సుబ్బయ్య తల్లి పేరు పన్నగేంగ్రమ్మ [1]

క్యాన్సర్‌తో 2020, మార్చి 5న ఉదయం తన నివాసంలో కన్నుమూశాడు[2]

వృత్తి జీవితం

[మార్చు]

1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు, వార్త లలో పనిచేశాడు.

రచనలు

[మార్చు]

ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహనీయులు, పత్రికా విలువలు, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయం మొదలైన వివిధ అంశాలపై రచనాలు చేశాడు. ఈయన రచనలలో కొన్ని వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు, పారమార్థిక పదకోశం . విధి నా సారథి అనేపేరుతో తన ఆత్మకథని వ్రాశాడు.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పరిణతవాణి 6వ సంపుటి. పొత్తూరి వెంకటేశ్వర రావు (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 8.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత". www.andhrajyothy.com. Retrieved 2020-03-05.[permanent dead link]
  3. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  4. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.

వెలుపలి లంకెలు

[మార్చు]