ఆంధ్రజనత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రజనత
రకంప్రతి దినం దినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంజనత ట్రస్ట్
ప్రచురణకర్తసీత యుధ్‌వీర్
సంపాదకులుకె.ఎస్.సుబ్రహ్మణ్యం
స్థాపించినది1956, హైదరాబాదు
కేంద్రంహైదరాబాదు
Circulation4000

బూర్గుల రామకృష్ణారావు, వి.బి.రాజు, జనార్దనరావు దేశాయి మొదలైనవారు విశాల రాష్ట్రాన్ని కోరే వర్గం గొంతు వినిపించడానికి ఆంధ్రజనత అనే పత్రికను స్థాపించారు. హైదరబాదు నుండి వెలువడిన ఈ దినపత్రిక 1956లో ప్రారంభమైనది. ముకరంజాహీ రోడ్డులోని మిలాప్ ప్రెస్‌లో ఈ పత్రిక ముద్రించబడేది. ఈ పత్రిక కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు.[1] అజంతా, జి.ఎస్.వరదాచారి ఈ పత్రికకు సహాయ సంపాదకులుగా ఉండేవారు. కాజ రాధాకృష్ణశాస్త్రి, బి.నాగేశ్వరరావు, తురగా కృష్ణమోహనరావు, బుద్ధవరపు విశ్వేశ్వరరావు, కె.ఎల్.సింహా, ఎ.ఎల్.నరసింహారావు, ఉషశ్రీ, పొత్తూరి వెంకటేశ్వర రావు మొదలైన వారు ఈ పత్రికలో పనిచేశారు.[2] ఈ పత్రికలో వార్తలతో పాటు సంపాదకీయం, వారఫలాలు, ఆకాశావాణి హైదరాబాదు కేంద్రం కార్యక్రమ వివరాలు, ధరవరలు మొదలైనవి ప్రకటించబడేవి. వివిధ రకాల ప్రకటనలు అంటే సినిమా ప్రకటనలు, ట్రావెల్ సర్వీసు ప్రకటనలు, టెండరు నోటీసులు, కోర్టు నోటీసులు మొదలైనవి ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను 1965లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొనుగోలు చేసింది. పండితారాధ్యుల నాగేశ్వరరావు 1965, వేటూరి సుందరరామమూర్తి 1967-68, జి.సి.కొండయ్య 1968-70, భాట్టం శ్రీరామమూర్తి1970-72, ఎ.చక్రపాణి 1972, కాట్రగడ్డ రాజగోపాలరావు 1972-73లలో ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ఈ పత్రిక సుమారు 20 సంవత్సరాలు నడిచింది.

విశాలాంధ్ర ఉద్యమంలో ఈ పత్రిక చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించింది. వేర్పాటువాదులు దాడులు జరిపినప్పుడుగాని, తన అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా చెప్పే విషయంలోగాని ఈ పత్రిక ధైర్యసాహసాలతో వ్యవహరించింది. ఆ కాలంలో ఈ పత్రిక నాలుగువేల సర్క్యులేషన్‌ను అధిగమించింది.

మూలాలు[మార్చు]

  1. కె.ఎస్., సుబ్రహ్మణ్యం (1958-03-01). "ఆంధ్రజనత". ఆంధ్రజనత. No. 231. Archived from the original on 2016-03-05. Retrieved 17 January 2015.
  2. పొత్తూరి వెంకటేశ్వర రావు (2004-08-01). ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ. pp. 389–390.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రజనత&oldid=3899219" నుండి వెలికితీశారు