పెనుమర్తి విశ్వనాథశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుమర్తి విశ్వనాథశాస్త్రి

పెనుమర్తి విశ్వనాథశాస్త్రి టూకీగా పి. వి. శాస్త్రి (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) తెలుగు వచన కవి. ఇతను అజంతా అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు.[1]

జీవిత విషయాలు

[మార్చు]

ఇతను పశ్చిమ గోదావరి జిల్లా కేశనకుర్రు గ్రామంలో జన్మించాడు. నర్సాపురంలో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యాడు. మద్రాసు, హైదరాబాద్ నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశాడు. ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.

అవార్డులు

[మార్చు]

"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన ఇతని కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

మరణం

[మార్చు]

వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించాడు.

మూలాలు

[మార్చు]
  1. అజంతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 7-8.